
సుక్మా ఘటనపై రాజ్నాథ్ దిగ్ర్భాంతి
న్యూఢిల్లీ: ఛత్తీస్గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లాలో సీఆర్పీఎఫ్ జవాన్లపై మావోయిస్టులు దాడి ఘటనపై కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. మావోయిస్టుల దాడిలో 24మంది సీఆర్పీఎఫ్ జవాన్లు మృతి బాధాకరమని, మృతుల కుటుంబాలకు ఆయన సంతాపం తెలిపారు. ఈ మేరకు ఆయన ట్విట్ చేశారు. మరోవైపు ఛత్తీస్గఢ్ హోంమంత్రితో రాజ్నాథ్ ఫోన్లో మాట్లాడారు. పరిస్థితిని దగ్గరుండి సమీక్షించాలని ఆదేశాలు ఇచ్చారు.
Extremely pained to know about the killing of CRPF personnel in Sukma. My tributes to the martyrs and condolences to their families. 1/2
— Rajnath Singh (@rajnathsingh) 24 April 2017
సీఆర్పీఎఫ్ జవాన్లపై దాడి పిరికిపందల చర్య అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నామని, జవాన్ల త్యాగం వృథాగా పోనివ్వమని మోదీ పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు ప్రధాని సంతాపం తెలిపారు.
We are proud of the valour of our @crpfindia personnel. The sacrifice of the martyrs will not go in vain. Condolences to their families.
— Narendra Modi (@narendramodi) 24 April 2017
కాగా బుర్కాపాల్- చింతగుఫ ప్రాంతంలో సోమవారం మధ్యాహ్నం సీఆర్పీఎఫ్ జవాన్లపై మావోయిస్టులు ఆకస్మాత్తుగా రెండువైపులా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో అక్కడికక్కడే 26 మంది జవాన్లు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఆరుగురు సీఆర్పీఎఫ్ సిబ్బంది గాయపడ్డారు. దాడి ఘటనలో సుమారు 300మంది మావోయిస్టులు పాల్గొన్నారని గాయపడ్డ పీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ తెలిపారు. తాము 150 మందిమి ఉన్నామని, ఒక్కసారిగా తమపై దాడికి దిగారన్నారు. తాము కూడా ఎదురు దాడి చేశామని, మావోయిస్టులు కూడా గాయపడినట్లు తెలిపారు. కాగా ఓ కమాండర్ తో పాటు ఆరుగురు జావాన్ల జాడ తెలియాల్సి ఉంది.
ఇక దాడి ఘటన అనంతరం మావోయిస్టులు 30 వరకు ఆయుధాలను ఎత్తుకుపోయారు. సమాచారం అందుకున్న వెంటనే ఉన్నతాధికారులు ఈ ప్రాంతానికి వెంటనే హెలీకాప్టర్ ను పంపించి క్షతగాత్రులను రాయిపూర్లోని బాలాజీ, నారాయణ ఆస్పత్రులకు తరలించారు. మరోవైపు ఛత్తీస్ గఢ్ ముఖ్యమంత్రి రమణ్ సింగ్ అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి పరిస్థితిని సమీక్షిస్తున్నారు.