న్యూఢిల్లీ: 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లను పొట్టన పెట్టుకున్న 2019 పుల్వామా ఉగ్ర దాడిపై అనుమానాలు నానాటికీ బలపడుతున్నాయని కాంగ్రెస్ పేర్కొంది. ఉగ్రదాడి ముప్పుందని తెలిసి కూడా జవాన్లను విమానంలో కాకుండా రోడ్డు మార్గాన ఎందుకు పంపాల్సి వచ్చిందో మోదీ సర్కారు చెప్పి తీరాలని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ డిమాండ్ చేశారు.
‘‘పుల్వామా దాడిపై నాటి జమ్మూ కశ్మీర్ గవర్నర్ సత్యపాల్ మాలిక్ బయట పెట్టిన విషయాలు షాకింగ్‌గా ఉన్నాయి. జైషే ముప్పును, ఏకంగా 11 నిఘా హెచ్చరికలను ఎందుకు విస్మరించారు? ఉగ్రవాదులకు 300 కిలోల ఆర్డీఎక్స్ ఎలా వచ్చింది? ఉగ్ర దాడిపై విచారణ ఎంతదాకా వచ్చింది? బాధ్యులను గుర్తించారా?’’ అని ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment