చింతూరు: తూర్పుగోదావరి జిల్లా చింతూరు మండలం దొంగల జగ్గారం ప్రాంతంలో మావోల కదలికలు పెరిగిపోతున్నాయి. శుక్రవారం రాత్రి ఆ ప్రాంతంలో సంచరించిన మావోలు సమీప ప్రాంతాలకు చెందిన ముగ్గురు పాస్టర్లను అపహరించుకువెళ్లినట్టు తెలుస్తోంది. దీంతో వారి కుటుంబ సభ్యులు ఆవేదన చెందుతున్నారు. అయితే ఈ ఘటనపై పోలీసులు ధ్రువీకరించలేదు. ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.