
మావోయిస్టులు పేల్చేసిన కల్వర్టు
సాక్షి, భద్రాద్రి : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడ్డారు. జిల్లాలోని తాలిపేరు ప్రాజెక్టు సమీపంలోని రోటింత వాగుపై నిర్మించిన లెవల్ చప్టా (కల్వర్టు)ను మావోయిస్టులు పేల్చేశారు. ఎస్సీ, ఎస్టీ చట్టంపై సుప్రీం కోర్టు విధించిన తీర్పును వ్యతిరేకిస్తూ బుధవారం నిరసన దినంగా ప్రకటించాలని మావోయిస్టులు మంగళవారం లేఖను విడుదల చేశారు. ఈ క్రమంలోనే కల్వర్టును ధ్వంసం చేశారు. భారీ మందు పాతర వినియోగించడంతో కల్వర్టు పూర్తిగా ధ్వంసమైంది. ఈ ఘటనతో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి.