
చేతికి వల చుట్టుకుపోయిన రాంబాబు మృతదేహాన్ని తీసుకొస్తున్న స్థానికులు
ఇల్లెందు: చెరువులో చేపలు వేటాడితేనే అతని కుటుంబానికి ఉపాధి. కానీ చేపల వేటకు ఉపయోగించే వలే ఆయన ప్రాణం తీసింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండలం మాణిక్యారం పంచాయతీ పరిధి ఎల్లాపురానికి చెందిన పూనెం రాంబాబు మరికొందరితో కలిసి శుక్రవారం స్థానిక చెరువులో చేపల వేటకు వెళ్లాడు. చేపలను కట్టపైకి చేర్చాక వలను మరో ఒడ్డున ఉన్న సహచరులకు ఇచ్చేందుకు చెరువులో ఈదుతూ బయల్దేరాడు.
లోతు ఎక్కువగా ఉన్న ప్రదేశంలోకి వెళ్లాక రాంబాబు వద్ద ఉన్న వల అతని కాలి బొటన వేలితోపాటు చేయి, తలకు చుట్టుకుని బిగుసుకుపోయింది. దీంతో ఊపిరాడక నీటిలో మునిగి ప్రాణాలొదిలాడు. ఎంతకూ రాంబాబు రాకపోవడంతో ఆయన వెంట వెళ్లిన వారు శుక్రవారం రాత్రి వరకు వెతికినా ఆచూకీ దొరకలేదు. శనివారం ఉదయం చుట్టుపక్కల గ్రామాల మత్స్యకారులు వంద మంది చెరువులోకి దిగి గాలిం చగా.. లోతట్టు ప్రదేశంలో మృతదేహం లభించింది. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించగా అంత్యక్రియలు నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment