
సాక్షి,భద్రాద్రి కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పోలిస్‌కానిస్టేబుల్ బుక్యా సాగర్ ఆత్మహత్యాయత్నం కలకలం రేపుతుంది.జిల్లాలోని బూర్గంపాడు పోలీస్ స్టేషన్‌లో బుక్యాసాగర్ విధులు నిర్వహించారు. అయితే గంజాయి కేసులో తనని బలిపశువుని చేశారని, చేయని నేరాన్ని తనపై మోపారని, నిందను భరించలేక పురుగులు మంది తాగి చనిపోతున్నట్లు సెల్ఫీ వీడియోలో వాపోయాడు కానిస్టేబుల్ బుక్యా సాగర్.
గతంలో బూర్గంపాడులో పనిచేసిన ఇద్దరు ఎస్ఐలు సంతోష్ ,రాజకుమార్,బీఆర్‌ఎస్ నాయకుడు నాని తనని బలిపశువుని చేశాడని వాపోయాడు. పురుగులు మందు తాగిన తర్వాత సెల్ఫీ వీడియోను కుటుంబ సభ్యులకు పంపాడు బుక్యాసాగర్. దీంతో అప్రమత్తమైన కుటుంబసభ్యులు సాగర్‌ను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు బాధిత కానిస్టేబుల్. ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment