ఎన్‌కౌంటర్‌: ఐదుగురు మావోయిస్టుల మృతి | five maoists died in encounter at jharkhand | Sakshi
Sakshi News home page

ఎన్‌కౌంటర్‌: ఐదుగురు మావోయిస్టుల మృతి

Published Wed, Apr 4 2018 2:01 PM | Last Updated on Tue, Jun 4 2019 6:41 PM

five maoists died in encounter at jharkhand - Sakshi

రాంచీ : జార్ఖండ్‌లోని లతేహర్ జిల్లాలో బుధవారం ఎదురుకాల్పులు జరిగాయి. సెరెన్‌దాగ్ అటవీ ప్రాంతంలో పోలీసులు, సీఆర్పీఎఫ్ బలగాలు సంయుక్తంగా కూంబింగ్ నిర్వహిస్తుండగా మావోయిస్టులు తారసపడ్డారు. దీంతో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య హోరాహోరీగా కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఐదుగురు మావోయిస్టులు హతమయ్యారు. ఘటనాస్థలి నుంచి మావోయిస్టుల మృతదేహాలతో పాటు ఏకే 47 రైఫిల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. కూంబింగ్ కొనసాగుతున్నట్టు ఉన్నతాధికారులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement