సాక్షి, హైదరాబాద్: బూటకపు ఎన్నికలను బహిష్కరించాలని భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) తెలంగాణ రాష్ట్ర కమిటీ ప్రజలకు పిలుపునిచ్చింది. ఈ మేరకు రాష్ట్ర కమిటీ కార్యదర్శి హరిభూషణ్ బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. నాలుగేళ్ల టీఆర్‌ఎస్ పాలనలో ప్రభుత్వం ప్రజలకు చేసిన వాగ్దానాలను నెరవేర్చకపోగా, ప్రజలకు వ్యతిరేకం గా పాలన సాగిందన్నారు. తెలంగాణ ఉద్యమ ఫలితాలను కేసీఆర్ వ్యక్తిగత ప్రయోజనాలకు వాడుకుని మోసం చేశారని తెలిపారు. ప్రజాద్రోహిగా, నియంతగా పరిపాలించిన కేసీఆర్ పాలనపట్ల ప్రజల్లో ఆగ్రహం పెల్లుబుకుతోందన్నారు. ఆ ఆగ్రహం సంఘటితం కాకముందే వీలైనంత త్వరగా బయటపడాలని కేసీఆర్ ఎత్తుగడ వేశారని ఆరోపించారు. లోక్‌సభ ఎన్నికలతోపాటే అసెంబ్లీ ఎన్నికలు జరిగితే ఓడిపోతామని ఊహించారన్నారు. కేసీఆర్ ముందుగానే ప్రధాని మోదీని, ఎన్నికల కమిషన్‌ను కలిసి అసెంబ్లీ రద్దుకు సిద్ధపడ్డారన్నారు. 25 లక్షల మం దితో గొప్పసభ నిర్వహించాలని భావించి ఘోరంగా విఫలమయ్యారన్నారు.
మొదటి నుంచీ అధికారాన్ని సుస్థిరం చేసుకోవడానికి ఇతర పార్టీలలోని ఎమ్మెల్యే, ఎంపీలకు పదవులు, డబ్బు ఆశ చూపించి ఫిరాయింపులు ప్రోత్సహించి ప్రతిపక్షాలను బలహీన పరిచారని ఆరోపించారు. ప్రపంచ బ్యాంకు సూచనల మేరకు బంగారు తెలంగాణ సాధన లక్ష్యం అని ప్రకటించారన్నారు. తెలంగాణలో 4 వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారన్నారు. కేసీఆర్ కేంద్రమంత్రిగా ఉన్నప్పుడు సహార, ఈఎస్‌ఐ వంటి స్కాము ల్లో నిందితుడని ఘాటుగా విమర్శించారు. షాబుద్దీన్ కేసులో అమిత్‌షా వ్యవహారం బయటకు రాకుండా, రామేశ్వర్‌రావుకు నయీం వల్ల సమస్యలు రాకుండా హత్య చేసి ఎన్‌కౌంటర్ కట్టుకథ అల్లారని ఆరో పించారు. సీపీఎం దళితుల ఓట్లు సంపాదించడానికి గద్దర్ వంటి వాళ్లతో బహుజన లెఫ్ట్ ఫ్రంట్‌ను ఏర్పా టు చేసి అధికారంలో వాటా కోసం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ కూటమితో కలిసి చివరికి చేరాల్సిన చోటుకే చేరారని విమర్శించారు. బీజేపీ, కాంగ్రెస్, టీడీపీ, టీఆర్‌ఎస్ దోపిడీ వర్గ పార్టీలేనని, సీపీఐ, సీపీఎంల రివిజనిస్టు విధానాలను బహిష్కరించాలని కోరారు. ధర్నా చౌక్‌ను పునరుద్ధరిం చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment