dictator rule
-
Donald Trump: మళ్లీ ఎన్నికైతే నియంతలా పరిపాలిస్తా
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడిగా తాను మళ్లీ ఎన్నికైతే ఒక నియంత తరహాలో పరిపాలన సాగిస్తానని మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ నేత డొనాల్డ్ ట్రంప్ అన్నారు. తాజాగా ఆయన మాట్లాడుతూ.. తనకు రెండు లక్ష్యాలు ఉన్నాయని, వాటిని నెరవేర్చవడానికి అవసరమైతే నియంతలా మారుతానని స్పష్టం చేశారు. మెక్సికో సరిహద్దు నుంచి నుంచి అమెరికాలోకి చొరబాట్లను అరికట్టడం, ఎనర్జీ ప్రాజెక్టులకు ప్రోత్సాహం ఇవ్వడం తన లక్ష్యాలు అని వివరించారు. తనపై తప్పుడు ప్రచారం సాగిస్తూ ఎన్నికల్లో గెలిచేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ట్రంప్ మండిపడ్డారు. ఒకవేళ తనపై అక్రమ కేసులు నమోదు చేసి, విచారణ చేపడితే అమెరికా మొత్తం స్తంభించిపోతుందని తేల్చిచెప్పారు. తనను నియంతగా చిత్రీకరించి, ఎన్నికల్లో లబ్ధి పొందడానికి కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. అధ్యక్షుడిగా అధికారంలో తాను యుద్ధాలు చేయలేదని, విదేశాల్లో ఉన్న అమెరికా దళాలను వెనక్కి రప్పించానని గుర్తుచేశారు. జో బైడెన్ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత ఇతర దేశాల్లో యుద్ధాలు జరుగుతున్నాయని చెప్పారు. ఈ యుద్ధాల నుంచి రాజకీయంగా లాభం పొందాలని బైడెన్ ఎత్తుగడలు వేస్తున్నారని ట్రంప్ ధ్వజమెత్తారు. -
లోక్‌సభ ఎన్నికలు ముందస్తుగానే రావొచ్చు: మమతా బెనర్జీ
కోల్‌కతా: దేశంలో బీజేపీ వరుసగా మూడోసారి అధికారంలోకి వస్తే నియంతృత్వమే రాజ్యమేలుతుందని, అరాచకం తప్పదని తృణమూల్ కాంగ్రెŠ పారీ్ట(టీఎంసీ) అధినేత, పశి్చమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చెప్పారు. బీజేపీ దేశంలో మతాల మధ్య, కులాల మధ్య శత్రుత్వాన్ని పెంచిందని మమత మండిపడ్డారు. బీజేపీ గనుక మళ్లీ గెలిస్తే ప్రజల నడుమ విద్వేషాలు మరింత రగులుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. బెంగాల్లో మూడు దశాబ్దాల కమ్యూనిస్టుల పాలనను అంతం చేశానని, వచ్చే ఎన్నికల్లో బీజేపీని సైతం మట్టికరిపిస్తానని చెప్పారు. వచ్చే ఏడాది జరగాల్సిన లోక్‌సభ ఎన్నికలు ఈ ఏడాది డిసెంబర్లోనే జరిగే అవకాశం ఉందని ఆమె తెలిపారు. డిసెంబర్లో ఎన్నికలకు బీజేపీ మొగ్గు చూపుతున్నట్లు చెప్పారు. ఒకవేళ అది సాధ్యం కాకపోతే వచ్చే ఏడాది జనవరిలో ఎన్నికలు జరిగే అవకాశం ఉందన్నారు. ఎన్నికల ప్రచారం కోసం బీజేపీ నాయకులు ఇప్పటికే దేశంలోని అన్ని హెలికాప్టర్లను బుక్ చేసుకున్నారని వెల్లడించారు. ఇతర పారీ్టలకు హెలికాప్టర్లు లభించకూడదన్నదే బీజేపీ ఎత్తుగడ అని విమర్శించారు. సోమవారం కోల్‌కతాలో టీఎంసీ యువజన విభాగం ర్యాలీలో మమతా బెనర్జీ ప్రసంగించారు. -
బూటకపు ఎన్నికలను బహిష్కరించండి
సాక్షి, హైదరాబాద్: బూటకపు ఎన్నికలను బహిష్కరించాలని భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) తెలంగాణ రాష్ట్ర కమిటీ ప్రజలకు పిలుపునిచ్చింది. ఈ మేరకు రాష్ట్ర కమిటీ కార్యదర్శి హరిభూషణ్ బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. నాలుగేళ్ల టీఆర్ఎస్ పాలనలో ప్రభుత్వం ప్రజలకు చేసిన వాగ్దానాలను నెరవేర్చకపోగా, ప్రజలకు వ్యతిరేకం గా పాలన సాగిందన్నారు. తెలంగాణ ఉద్యమ ఫలితాలను కేసీఆర్ వ్యక్తిగత ప్రయోజనాలకు వాడుకుని మోసం చేశారని తెలిపారు. ప్రజాద్రోహిగా, నియంతగా పరిపాలించిన కేసీఆర్ పాలనపట్ల ప్రజల్లో ఆగ్రహం పెల్లుబుకుతోందన్నారు. ఆ ఆగ్రహం సంఘటితం కాకముందే వీలైనంత త్వరగా బయటపడాలని కేసీఆర్ ఎత్తుగడ వేశారని ఆరోపించారు. లోక్‌సభ ఎన్నికలతోపాటే అసెంబ్లీ ఎన్నికలు జరిగితే ఓడిపోతామని ఊహించారన్నారు. కేసీఆర్ ముందుగానే ప్రధాని మోదీని, ఎన్నికల కమిషన్‌ను కలిసి అసెంబ్లీ రద్దుకు సిద్ధపడ్డారన్నారు. 25 లక్షల మం దితో గొప్పసభ నిర్వహించాలని భావించి ఘోరంగా విఫలమయ్యారన్నారు. మొదటి నుంచీ అధికారాన్ని సుస్థిరం చేసుకోవడానికి ఇతర పార్టీలలోని ఎమ్మెల్యే, ఎంపీలకు పదవులు, డబ్బు ఆశ చూపించి ఫిరాయింపులు ప్రోత్సహించి ప్రతిపక్షాలను బలహీన పరిచారని ఆరోపించారు. ప్రపంచ బ్యాంకు సూచనల మేరకు బంగారు తెలంగాణ సాధన లక్ష్యం అని ప్రకటించారన్నారు. తెలంగాణలో 4 వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారన్నారు. కేసీఆర్ కేంద్రమంత్రిగా ఉన్నప్పుడు సహార, ఈఎస్ఐ వంటి స్కాము ల్లో నిందితుడని ఘాటుగా విమర్శించారు. షాబుద్దీన్ కేసులో అమిత్‌షా వ్యవహారం బయటకు రాకుండా, రామేశ్వర్‌రావుకు నయీం వల్ల సమస్యలు రాకుండా హత్య చేసి ఎన్కౌంటర్ కట్టుకథ అల్లారని ఆరో పించారు. సీపీఎం దళితుల ఓట్లు సంపాదించడానికి గద్దర్ వంటి వాళ్లతో బహుజన లెఫ్ట్ ఫ్రంట్‌ను ఏర్పా టు చేసి అధికారంలో వాటా కోసం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ కూటమితో కలిసి చివరికి చేరాల్సిన చోటుకే చేరారని విమర్శించారు. బీజేపీ, కాంగ్రెస్, టీడీపీ, టీఆర్ఎస్ దోపిడీ వర్గ పార్టీలేనని, సీపీఐ, సీపీఎంల రివిజనిస్టు విధానాలను బహిష్కరించాలని కోరారు. ధర్నా చౌక్‌ను పునరుద్ధరిం చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. -
రాష్ట్రంలో నియంత పాలన
కందుకూరు: రాష్ట్రంలో దొరల, నియంత పాలన కొనసాగుతుందని.. బహుజనులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని బహుజన లెఫ్ట్ ఫ్రంట్(బీఎల్ఎఫ్) రాష్ట్ర చైర్మన్ నల్లా సూర్యప్రకాష్ విమర్శించారు. గురువారం మండల కేంద్రంలోని ముదిరాజ్ భవన్లో డి.రాంచందర్ అధ్యక్షతన మహేశ్వరం నియోజకవర్గం సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు ప్రత్యామ్నాయంగా తెలంగాణలో బహుజన లెఫ్ట్ ఫ్రంట్ ఏర్పడిందన్నారు. సామాజిక న్యాయం జరగకుండా రాష్ట్రంలో సమగ్ర అభివృద్ధి సాధ్యం కాదన్నారు. 93 శాతం ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఎంబీసీ, మైనార్టీలు సామాజికంగా, రాజకీయంగా ఆర్థికంగా అణచివేయబడ్డారన్నారు. తరతరాలుగా దోపిడీకి గురవుతూ, రాజ్యాధికారానికి దూరంగా ఉంటూ 7 శాతం ఉన్న అగ్రవర్ణాల చేతిలో కీలుబొమ్మలుగా మారుతున్నారన్నారు. పేద, బడుగు, బలహీన వర్గాలకు బీఎల్ఎఫ్తోనే న్యాయం జరుగుతుందన్నారు. అందరూ ఏకమై బీఎల్ఎఫ్ కిందకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో రాష్ట్ర బీఎల్ఎఫ్ నాయకులు మన్నారం నాగరాజు, జి.రమేష్, జిల్లా బాధ్యులు భూపాల్, వైఎస్సార్సీపీ నాయకుడు వెంకటప్రసాద్, సీపీఎం నాయకులు బి.దత్తునాయక్, ఎ.రవికుమార్, ఎ.కుమార్, బి.శ్రీనివాస్, కేవీపీఎస్ జిల్లా అధ్యక్షుడు అశోక్, పూలగాజుల జంగయ్య, ఎమ్పార్పీఎస్ నాయకులు పి.సంజీవ, ఎం.నర్సింహ, రమేష్, యాద య్య, యాదగిరిచారి, శ్రీనివాస్ పాల్గొన్నారు. డివిజన్ కమిటీ ఎన్నిక... ఈ సందర్భంగా బీఎల్ఎఫ్ డివిజన్ కమిటీని ఎన్నుకుని ప్రకటించారు. కన్వీనర్‌గా డి.రాంచందర్, సభ్యులుగా ఎ.రవికుమార్, ఎ.కుమార్, ఎం.యాదయ్య, బి.శ్రీనివాస్, యాదగిరిచారి, ఎం.శ్రీనివాస్, సంధ్య, పి.సంజీవ, ఎం.నర్సింహా, వి.శంకర్, గురవయ్య, రమేష్, పి.జంగయ్య లను ఎన్నుకున్నారు. -
తెలంగాణలో నియంత పాలన!
* కేసీఆర్ తీరుపై మావోయిస్టు ప్రధాన కార్యదర్శి గణపతి ఆగ్రహం * ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ ప్రకటన విడుదల * ప్రభుత్వ విధానాలపై తిరగబడితే ఉక్కుపాదం మోపుతున్నారు * విద్యుత్ సరిగా ఇవ్వకపోవడంతో 400 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు * వారి కుటుంబాలకు పది లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలి * ప్రజా ఉద్యమాలను అణచడానికే పోలీసులకు కోట్లలో నిధులు * వరవరరావు ఇంటిపై దాడిని ఖండిస్తున్నట్లు ప్రకటనలో వెల్లడి సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో నియంత పాలన కొనసాగుతోందని తాము బలంగా నమ్ముతున్నామని మావోయిస్టు ప్రధాన కార్యదర్శి గణపతి విమర్శించారు. కేసీఆర్ ప్రభుత్వం ప్రజలను నిర్బంధంలో ఉంచుతోందని ఆరోపించారు. రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వ పనితీరు, రైతుల ఆత్మహత్యలు తదితర అంశాలపై గణపతి గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. ‘సాక్షి’కి అందిన ఆ ప్రకటనలోని వివరాలు.. ‘‘మావోయిస్టు పార్టీ ఎజెండానే తమ ఎజెండా అని, అధికారంలోకి వస్తే దళితుడే సీఎం అన్న మాటను పెక్కన పెట్టిన కేసీఆర్ ప్రభుత్వం ప్రజలను నిర్బంధంలో ఉంచుతోంది. ప్రభుత్వ విధానాలపై తిరగబడే సామాన్య ప్రజలపై, మీడియాపై ఉక్కుపాదం మోపుతోంది. ప్రజల నిరసనను, ప్రజా ఉద్యమాలను అణచివేయడానికి పోలీసుస్టేషన్ల ఆధునీకరణ పేర రూ. 343 కోట్లు విడుదల చేశారు. మావోయిస్టులతో ప్రాణహాని ఉందని మంత్రులకు రూ. 100 కోట్లతో బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు కొనుగోలు చేస్తున్నారు. కేసీఆర్ అధికారంలోకి వచ్చాక రైతులకు సరిపడా కరెంటు సరఫరా చేయక రాష్ట్రవ్యాప్తంగా 400 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. తెలంగాణలో జరుగుతున్న రైతుల ఆత్మహత్యలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి. ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు రూ. 10 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలి. రాష్ట్రంలోని అన్ని జిల్లాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించి.. విత్తనాలు, పురుగుల మందులు ఉచితంగా అందించాలి. మావోయిస్టులకు భయపడి ఛత్తీస్‌గఢ్ నుంచి తెలంగాణకు విద్యుత్ టవర్లు నిర్మించేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదంటూ అసత్య ప్రచారం జరుగుతోంది. ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో ఉన్న గిరిజన ప్రాంతాల్లో నిత్యం పోలీసులతో ప్రభుత్వం దాడులు చేయిస్తోంది. ఇందులో భాగంగానే విరసం నాయకుడు వరవరరావు ఇంటిపై గిరిజనుల పేరుతో పోలీసులతో దాడిచేయించినట్లు భావిస్తున్నాం. ఈ చర్యను ఖండిస్తున్నాం. కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో మైనింగ్ మాఫియా రెచ్చిపోతోంది. సీమాంధ్ర పెట్టుబడిదారులకు వత్తాసు పలుకుతూ టీఆర్ఎస్ నేతలు గ్రానైట్ వ్యాపారంలో మునిగి తేలుతున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల్లో బహుళ జాతి కంపెనీలు రియల్ ఎస్టేట్, చిట్ఫండ్తో పాటు రకరకాల పెట్టుబడులతో ప్రజలను మోసం చేసేందుకు యత్నిస్తున్నాయి. ఇప్పటికైనా కేసీఆర్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని డిమాండ్ చేస్తున్నాం..’’ అని మావోయిస్టు ప్రధాన కార్యద ర్శి గణపతి, సీపీఐ(ఎంఎల్)-నక్సల్బరి కార్యద ర్శి అజిత్ ఆప్రకటనలో పేర్కొన్నారు.