కోల్‌కతా: దేశంలో బీజేపీ వరుసగా మూడోసారి అధికారంలోకి వస్తే నియంతృత్వమే రాజ్యమేలుతుందని, అరాచకం తప్పదని తృణమూల్ కాంగ్రెŠ పారీ్ట(టీఎంసీ) అధినేత, పశి్చమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చెప్పారు. బీజేపీ దేశంలో మతాల మధ్య, కులాల మధ్య శత్రుత్వాన్ని పెంచిందని మమత మండిపడ్డారు. బీజేపీ గనుక మళ్లీ గెలిస్తే ప్రజల నడుమ విద్వేషాలు మరింత రగులుతాయని ఆందోళన వ్యక్తం చేశారు.
బెంగాల్‌లో మూడు దశాబ్దాల కమ్యూనిస్టుల పాలనను అంతం చేశానని, వచ్చే ఎన్నికల్లో బీజేపీని సైతం మట్టికరిపిస్తానని చెప్పారు. వచ్చే ఏడాది జరగాల్సిన లోక్‌సభ ఎన్నికలు ఈ ఏడాది డిసెంబర్‌లోనే జరిగే అవకాశం ఉందని ఆమె తెలిపారు. డిసెంబర్‌లో ఎన్నికలకు బీజేపీ మొగ్గు చూపుతున్నట్లు చెప్పారు. ఒకవేళ అది సాధ్యం కాకపోతే వచ్చే ఏడాది జనవరిలో ఎన్నికలు జరిగే అవకాశం ఉందన్నారు.
ఎన్నికల ప్రచారం కోసం బీజేపీ నాయకులు ఇప్పటికే దేశంలోని అన్ని హెలికాప్టర్లను బుక్ చేసుకున్నారని వెల్లడించారు. ఇతర పారీ్టలకు హెలికాప్టర్లు లభించకూడదన్నదే బీజేపీ ఎత్తుగడ అని విమర్శించారు. సోమవారం కోల్‌కతాలో టీఎంసీ యువజన విభాగం ర్యాలీలో మమతా బెనర్జీ ప్రసంగించారు.
Comments
Please login to add a commentAdd a comment