hatred on india
-
లోక్‌సభ ఎన్నికలు ముందస్తుగానే రావొచ్చు: మమతా బెనర్జీ
కోల్‌కతా: దేశంలో బీజేపీ వరుసగా మూడోసారి అధికారంలోకి వస్తే నియంతృత్వమే రాజ్యమేలుతుందని, అరాచకం తప్పదని తృణమూల్ కాంగ్రెŠ పారీ్ట(టీఎంసీ) అధినేత, పశి్చమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చెప్పారు. బీజేపీ దేశంలో మతాల మధ్య, కులాల మధ్య శత్రుత్వాన్ని పెంచిందని మమత మండిపడ్డారు. బీజేపీ గనుక మళ్లీ గెలిస్తే ప్రజల నడుమ విద్వేషాలు మరింత రగులుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. బెంగాల్లో మూడు దశాబ్దాల కమ్యూనిస్టుల పాలనను అంతం చేశానని, వచ్చే ఎన్నికల్లో బీజేపీని సైతం మట్టికరిపిస్తానని చెప్పారు. వచ్చే ఏడాది జరగాల్సిన లోక్‌సభ ఎన్నికలు ఈ ఏడాది డిసెంబర్లోనే జరిగే అవకాశం ఉందని ఆమె తెలిపారు. డిసెంబర్లో ఎన్నికలకు బీజేపీ మొగ్గు చూపుతున్నట్లు చెప్పారు. ఒకవేళ అది సాధ్యం కాకపోతే వచ్చే ఏడాది జనవరిలో ఎన్నికలు జరిగే అవకాశం ఉందన్నారు. ఎన్నికల ప్రచారం కోసం బీజేపీ నాయకులు ఇప్పటికే దేశంలోని అన్ని హెలికాప్టర్లను బుక్ చేసుకున్నారని వెల్లడించారు. ఇతర పారీ్టలకు హెలికాప్టర్లు లభించకూడదన్నదే బీజేపీ ఎత్తుగడ అని విమర్శించారు. సోమవారం కోల్‌కతాలో టీఎంసీ యువజన విభాగం ర్యాలీలో మమతా బెనర్జీ ప్రసంగించారు. -
విద్వేష బీజేపీ: రాహుల్
కొచ్చి: దేశ ప్రజల్లో బీజేపీ విద్వేషాన్ని వ్యాపింపజేస్తోందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. ‘‘ఇలాంటి అవకాశం కోసం విదేశీ శక్తులు ఎదురు చూస్తున్నాయి. వేలాది కిలోమీటర్ల భారత భూభాగాన్ని మొదటిసారిగా చైనీయులు ఆక్రమించుకున్నారు. భారత సైన్యం కూడా ఈ విషయాన్ని ఒప్పుకుంది. ప్రధాని మోదీ మాత్రం దీన్ని బహిరంగంగానే ఖండిస్తున్నారు’’ అంటూ మండిపడ్డారు. భారత్ జోడో యాత్రలో భాగంగా కేరళలోని ఎర్నాకులం జిల్లా కొచ్చిలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు రాహుల్ గాంధీ. మంగళవారం ఉదయం 13వ రోజు యాత్రను అలప్పుజ జిల్లా చెర్తాలా నుంచి ప్రారంభించారు. దారి పొడవునా ప్రజలను పలకరిస్తూ సాగారు. ఇదీ చదవండి: రాహుల్ గాంధీ షాకింగ్ నిర్ణయం.. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో పోటీకి దూరం! -
భారతీయులమని చాటే సమయం ఇదే..
సాక్షి, న్యూఢిల్లీ : పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీ సోమవారం ఢిల్లీలోని రాజ్‌ఘాట్ వద్ద భారీ నిరసన కార్యక్రమం చేపడుతోంది. ఈ నిరసనలో పార్టీ చీఫ్ సోనియా గాంధీ, ఎంపీ రాహుల్ గాంధీ సహా పెద్దసంఖ్యలో పార్టీ నేతలు, ఎంపీలు పాల్గొంటారు. కాగా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని విద్యార్ధులు, యువతకు రాహుల్ పిలుపు ఇచ్చారు. యువతను ఉద్దేశించి రాహుల్ ప్రస్తావిస్తూ ‘ప్రియమైన విద్యార్ధులు, యువకులూ..మీరు కేవలం భారతీయులమని భావిస్తే సరిపోదు..ఇలాంటి సంక్షోభ సమయంలో మీరు భారతీయులుగా చాటుతూ విద్వేషంతో దేశాన్ని నాశనం చేసే శక్తులను అనుమతించరాద’ని పిలుపు ఇచ్చారు. మోదీ, షా ద్వయం దేశంపై చిమ్ముతున్న విద్వేష విషాన్ని నిరసిస్తూ తమతో కలిసిరావాలని కోరుతూ రాహుల్ ట్వీట్ చేశారు. -
ప్రధాని పర్యటన అబద్ధాలమయం
వయనాడ్ (కేరళ): గత లోక్‌సభ ఎన్నికల ప్రచారం సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగాలన్నీ అబద్ధాలు, విద్వేషం, విషపూరిత వ్యాఖ్యలతో నిండిపోయాయని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. దేశ ప్రజలను విడగొట్టాలనే ఉద్దేశంతో మోదీ విద్వేషపూరిత వ్యాఖ్యలు చేశారని అన్నారు. తమ పార్టీ మాత్రం ప్రేమ, నిజం, ఆప్యాయత వైపు నిలిచిందని పేర్కొన్నారు. వయనాడ్ లోక్‌సభ స్థానానికి ఎంపీగా తనను గెలిపినందుకు గానూ అక్కడి ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతూ రాహుల్ కేరళలో పర్యటిస్తున్నారు. దీనిలో భాగంగా శనివారం కల్పెట్టా, కంబలకాడు, పనమారమ్ ప్రాంతాల్లో పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి రాహుల్ మాట్లాడారు. అనంతరం పలు రోడ్‌షోలలో పాల్గొన్నారు. ‘మోదీ దగ్గర డబ్బు, మీడియా, ధనికులైన స్నేహితులు ఉండవచ్చు. కానీ దేశంలో బీజేపీ సృష్టించిన విద్వేషం, అసహనంపై కాంగ్రెస్ ఎప్పటికీ పోరాడుతూనే ఉంటుంది. ప్రేమ, ఆపాయ్యతతో వాటిని అధిగమిస్తుంది’అని రాహుల్ అన్నారు. వయనాడ్‌లో ఎన్నో సమస్యలు ఉన్నాయని.. అందరం కలిసికట్టుగా పరిష్కరించుకుందామని పిలుపునిచ్చారు. రాహుల్ రోడ్‌షోలకు ప్రజల నుంచి భారీ స్పందన వచ్చింది. -
మా స్కూలు మీద బాంబేశారు.. అందుకే కోపం
తాను చిన్నవయసులో ఉండి స్కూల్లో చదువుకుంటున్నప్పటి నుంచే భారతదేశం అంటే చాలా కోపమని పాక్ ఉగ్రవాది డేవిడ్ కోల్మన్ హెడ్లీ చెప్పాడు. 1971 డిసెంబర్ నెలలో తాను చదువుకునే స్కూలు మీద భారత విమానాలు బాంబులు వేశాయని, అందుకే ఆ దేశం మీద పగ తీర్చుకోవాలన్న ఉద్దేశంతో తాను లష్కర తాయిబా ఉగ్రవాద సంస్థలో చేరానని తెలిపాడు. అమెరికా జైల్లో ఉన్న హెడ్లీ.. వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ముంబై కోర్టు విచారణలో పాల్గొని ఈ విషయం వెల్లడించాడు. భారతదేశం అన్నా భారతీయులన్నా తనకు చిన్నతనం నుంచి విపరీతమైన ద్వేషం ఉందనని, వాళ్లకు వీలైనంత ఎక్కువ నష్టం కలిగించాలని అనుకునేవాడినని అన్నాడు. 1971 డిసెంబర్ 3 నుంచి 16వ తేదీ వరకు భారత్- పాకిస్థాన్‌ల మధ్య యుద్ధం జరిగింది. అప్పటికి హెడ్లీకి 11 సంవత్సరాలు. అప్పట్లో భారత విమానాలు చేసిన బాంబుదాడిలో అతడి స్కూలు పూర్తిగా పడిపోయింది. పాకిస్తానీ తండ్రికి, అమెరికన్ తల్లికి పుట్టిన హెడ్లీ.. 16 ఏళ్ల వయసు వచ్చేవరకు పాకిస్తాన్లో చదివి, తర్వాత అమెరికా వెళ్లిపోయాడు. 2002లో లష్కరే తాయిబాలో చేరినట్లు ముంబై కోర్టులో వెల్లడించాడు. 2009లో అతడిని అమెరికన్ పోలీసులు అరెస్టు చేశారు. లష్కరే తాయిబా గురించిన సమాచారం ఇస్తే మరణశిక్ష విధించబోమని అతడికి అమెరికా హామీ ఇచ్చింది. తర్వాత 35 సంవత్సరాల జైలుశిక్ష విధించింది.