విద్వేష బీజేపీ: రాహుల్‌ | Rahul Gandhi Said BJP Spreading Hatred Among The People Of Country | Sakshi
Sakshi News home page

దేశ ప్రజల్లో బీజేపీ విద్వేషాన్ని వ్యాపింపజేస్తోంది: రాహుల్‌

Published Wed, Sep 21 2022 7:03 AM | Last Updated on Wed, Sep 21 2022 7:03 AM

Rahul Gandhi Said BJP Spreading Hatred Among The People Of Country - Sakshi

అలప్పుజలో రాహుల్‌ను కలిసిన యాసిడ్‌ బాధితురాలు

కొచ్చి: దేశ ప్రజల్లో బీజేపీ విద్వేషాన్ని వ్యాపింపజేస్తోందని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ మండిపడ్డారు. ‘‘ఇలాంటి అవకాశం కోసం విదేశీ శక్తులు ఎదురు చూస్తున్నాయి. వేలాది కిలోమీటర్ల భారత భూభాగాన్ని మొదటిసారిగా చైనీయులు ఆక్రమించుకున్నారు. భారత సైన్యం కూడా ఈ విషయాన్ని ఒప్పుకుంది. ప్రధాని మోదీ మాత్రం దీన్ని బహిరంగంగానే ఖండిస్తున్నారు’’ అంటూ మండిపడ్డారు.

భారత్‌ జోడో యాత్రలో భాగంగా కేరళలోని ఎర్నాకులం జిల్లా కొచ్చిలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు రాహుల్‌ గాంధీ. మంగళవారం ఉదయం 13వ రోజు యాత్రను అలప్పుజ జిల్లా చెర్తాలా నుంచి ప్రారంభించారు. దారి పొడవునా ప్రజలను పలకరిస్తూ సాగారు.

ఇదీ చదవండి: రాహుల్ గాంధీ షాకింగ్ నిర్ణయం.. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో పోటీకి దూరం!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement