సాక్షి, హైదరాబాద్: దేశంలో విద్వేషాన్ని పారద్రోలి ప్రేమాభిమానాలు పెంపొందించడమే భారత్ జోడో యాత్ర లక్ష్యమన్నారు కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ. యాత్రలో భాగంగా ముత్తంగి కార్నర్ వద్ద నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. దేశంలో బీజేపీ విద్వేషాన్ని సృష్టిస్తోందని, ప్రజల్ని భయాందోళనలకు గురి చేసి దేశాన్నీ అమ్మేసే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వ రంగ సంస్థలు ఎవరి సొత్తు కాదని, అవి దేశ ప్రజల సొత్త అని వెల్లడించారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేయనీయబోమని భరోసా ఇచ్చారు.
‘ప్రతీ రాష్ట్రంలో భారత్ జోడో యాత్రపై ప్రజలు తమ అభిమానాన్ని చూపుతున్నారు. 25కి.మీ నడిచినా అలసట మాకు ఎవరికి రాదు. ప్రజల ప్రేమాభిమానాలు మాకు అలసట అనేది లేకుండా చేస్తున్నాయి. దేశంలో విద్వేషాన్ని పారద్రోలి ప్రేమాభిమానాలు పెంపొందించడమే యాత్ర లక్ష్యం. దేశంలో బీజేపీ విద్వేషాన్ని సృష్టించి, ప్రజల్ని భయాందోళనకు గురి చేసి దేశాన్నీ అమ్మేసే కుట్ర చేస్తోంది. భారత్ డైనమిక్స్ దేశ రక్షణ కోసం క్షిపణులను తయారు చేస్తోంది. బీహెచ్‌ఈఎస్, బీజీఎల్ సంస్థలను ప్రైవేటీకరిస్తామని ఉద్యోగులను భయపెడుతున్నారు. ప్రభుత్వ సంస్థలు భారత దేశ మూలధనం. బీజేపీ ప్రజల ఆస్తులను తమ వ్యాపార మిత్రులకు కట్టబెట్టాలని చూస్తోంది. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేయనీయం. ఇందుకోసం ఉద్యోగులు, ప్రజల పక్షాన కాంగ్రెస్ పోరాడుతుంది. ’అని పేర్కొన్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ.
బీజేపీ, టీఆర్ఎస్ ఒకటే..
దేశంలో, రాష్ట్రంలో యువకులకు చదువుకు తగిన ఉద్యోగాలు లభించడం లేదన్నారు రాహుల్. ఇంజనీరింగ్ చదివిన వారు కూలీలుగా పని చేస్తున్నారని గుర్తు చేశారు. నరేంద్ర మోదీ దేశ ఆర్థక వ్యవస్థకు వెన్నెముక లేకుండా చేశారని దుయ్యబట్టారు. ‘నల్లధనాన్ని వెనక్కు తెస్తానన్న మోదీ.. నోట్ల రద్దు చేశారు. జీఎస్టీ పేరుతో చిన్న, మధ్య తరహా పరిశ్రమలను రోడ్డున పడేశారు. అక్కడ మోదీ చేసిందే ఇక్కడ కేసీఆర్ చేస్తున్నారు. తెలంగాణలో భూములు ఏమయ్యాయి? ధరణి పోర్టల్‌లో మొదటి స్థానంలో కేసీఆర్ ఉన్నారు. బీజేపీ, టీఆర్ఎస్ కలిసి పని చేస్తున్నాయి. ఢిల్లీలో మోదీకి కేసీఆర్, తెలంగాణలో కేసీఆర్‌కు మోదీ సహకారం ఇచ్చుకుంటున్నారు. ప్రజల్లో భయాన్ని పారద్రోలేందుకే భారత్ జోడో యాత్ర. కేసీఆర్ కమీషన్ల సొమ్మును తన కుటుంబ సభ్యులకు కట్టబెడుతున్నాడు.
ఇదీ చదవండి: Bharat Jodo Yatra: సుప్రభాత్‌లో తేనీటి రుచి.. థ్యాంక్స్ భట్టీజీ..
Comments
Please login to add a commentAdd a comment