West Bengal CM
-
డీవీసీతో సంబంధం తెంచేసుకుంటాం
కోల్‌కతా: దామోదర్ వ్యాలీ కార్పొరేషన్(డీవీసీ)తో తమ రాష్ట్రం అన్ని సంబంధాలను తెంచేసుకుంటుందని పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రధాని మోదీని హెచ్చరించారు. ఇటీవల రాష్ట్రంలోని దక్షిణ జిల్లాల్లో సంభవించిన ఆకస్మిక వరదలకు డీవీసీ ఏకపక్షంగా నీటిని విడుదల చేయడమే కారణమని ఆమె ఆరోపించారు. సీఎం మమత శుక్రవారం ఈ మేరకు ప్రధానికి నాలుగు పేజీల లేఖ రాశారు. రాష్ట్రంలోని చిన్న చిన్న నదులు ప్రమాదకర స్థాయి, అంతకు మించి ప్రవహిస్తున్న విషయం తెలుపుతూ తమ అధికారులు, నీటి విడుదలను వాయిదా వేయాలంటూ లేఖ రాసినా డీవీసీ పట్టించుకోలేదని మమత ఆరోపించారు. డీవీసీ నియంత్రణలో ఉన్న మైథోన్, పంచెట్ జలాశయాల నుంచి కొద్ది గంటల వ్యవధిలోనే ఏకంగా 5 లక్షల క్యూసెక్కుల నీటిని ఎలాంటి సమాచారం ఇవ్వకుండా, ఏకపక్షంగా విడుదల చేశారన్నారు. ఒక్కసారిగా భారీగా వరదలు చుట్టుముట్టడంతో పూర్బ వర్ధమాన్, పశ్చిమ బర్ధమాన్, బీర్భూమ్, బంకురా, హౌరా, హుగ్లీ, పూర్బ మేదినీపూర్, పశ్చిమ మేదినీపూర్ జిల్లాలకు చెందిన 50 లక్షల మంది ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని తెలిపారు. -
Mamata Banerjee: అబద్ధాల వ్యాప్తికి దేవుడు దూతను పంపుతాడా?
కోల్‌కతా: దేవుడు తనను పంపాడని ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలపై పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ తీవ్రంగా ధ్వజమెత్తారు. మథురాపూర్‌లో శుక్రవారం ఎన్నికల సభలో మాట్లాడుతూ ‘ఓటమి తప్పదనే భయంతో.. ఆ ఫోబియాలో బీజేపీ నాయకులు అర్థంపర్థం లేని మాటలు మాట్లాడుతున్నారని అన్నారు. ‘ఇప్పుడాయన తనను తాను దేవుడి బిడ్డగా, మనలాగా ఆయనకు తల్లిదండ్రులు లేరని, భగవంతుడు ఆయన్ను పంపాడని చెప్పుకుంటున్నారు. అల్లర్లను ప్రేరేపించడానికి, ప్రకటనల ద్వా రా అబద్ధాలు వ్యాప్తి చేయడానికి, జాతీయ పౌర పట్టిక (ఎన్ఆర్సీ) ద్వారా జనాన్ని జైళ్లో వేయడానికి దేవుడు ఎవరినైనా పంపుతాడా అని నేనడుగుతున్నాను. పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) ద్వారా హింసను ప్రోత్సహించడానికి, ఉపాధి హామీ పథకానికి నిధులు ఆపడానికి, పేదలకు ఇళ్ల నిర్మాణాన్ని అడ్డుకోవడానికి దేవుడు తన దూతను పంపుతాడా?’ అని మమత వ్యంగ్యంగా అన్నారు. పేదల ఖాతాల్లో రూ. 15 లక్షల చొప్పున జమచేస్తాననే హామీపై భగవంతుడు వెనక్కు తగ్గుతాడా అని ఎద్దేవా చేశారు. ప్రధాని మోదీ ఒక జాతీయ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇస్తూ.. మా అమ్మ బతికున్నంతవరకు నేను సాధారణంగా అందరిలాగే జని్మంచానని అనుకునేవాడిని. ఆమె మరణించాక నా అనుభవాలను పరికించి చూసుకుంటే.. నన్ను దేవుడు పంపాడని నేను నిశి్చతాభిప్రాయానికి వచ్చాను’ అని పే ర్కొన్నారు. ప్రధాని పేరెత్తకుండానే మమత ఆయన వ్యాఖ్యలపై ధ్వజమెత్తారు. -
బీజేపీకి అనుకూలంగా ఈసీ: మమత
కూచ్ బెహార్/అలీపూర్‌ద్వార్: ఎన్నికల కమిషన్(ఈసీ) కేంద్రంలోని బీజేపీకి అనుకూలంగా పనిచేస్తోందని పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ మరోసారి ఆరోపించారు. ముర్షిదాబాద్ డీఐజీని ఈసీ తొలగించడం వెనుక బీజేపీ హస్తముందన్నారు. ఎన్నికల వేళ ముర్షిదాబాద్, మాల్దాల్లో ఒక్క హింసాత్మక ఘటన జరిగినా ఈసీదే బాధ్యతని ఆమె హెచ్చరించారు. అవసరమైతే ఈసీ కార్యాలయం ఎదుట 55 రోజుల పాటు నిరశన దీక్ష చేపడతానని హెచ్చరించారు. గతంలో సింగూర్‌లో భూసేకరణకు వ్యతిరేకంగా రైతుల తరఫున 26 రోజుల పాటు నిరాహార దీక్ష చేపట్టిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ దర్యాప్తు విభాగాలను కేంద్రం టీఎంసీపైకి ఉసిగొల్పుతోందని పేర్కొన్నారు. ప్రతిపక్ష నేతలను జైలుకు పంపుతామంటూ బీజేపీ బెదిరిస్తోందంటూ ఆమె..‘ఎలా పోరాడాలో నాకు తెలుసు, నేనేమీ పిరికిదాన్ని కాదు’అని మమత వ్యాఖ్యానించారు. -
బీజేపీకి 200 సీట్లు కూడా రావు
జల్పాయ్గురి: సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి కనీసం 200 సీట్లు కూడా రావని పశ్చిమ బెంగాల్ సీఎం, టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీ స్పష్టం చేశారు. ప్రధాని మోదీ ఇస్తున్న గ్యారంటీలన్నీ బూటకమని కొట్టిపారేశారు. శనివారం జల్పాయ్గురిలో ఎన్నికల ప్రచార సభలో ఆమె ప్రసంగించారు. అంబేడ్కర్ రాసిన రాజ్యాంగాన్ని బీజేపీ ప్రభుత్వం ధ్వంసం చేసిందని మండిపడ్డారు. దేశాన్ని అమ్మేసే కుట్రలు సాగించారన్నారు. ప్రధాని మోదీ చెబుతున్న కల్ల»ొల్లి మాటలు నమ్మొద్దని ప్రజలను కోరారు. ఆయన ఇస్తున్న గ్యారంటీల వలలో పడొద్దని సూచించారు. బెంగాల్లో 2021లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 200కుపైగా సీట్లు గెలుచుకుంటామని బీజేపీ నేతలు గొప్పలు చెప్పారని, చివరకు 70 సీట్లే వచ్చాయని గుర్తుచేశారు. -
పామునైనా నమ్మగలం గానీ..: మమత
కూచ్‌బెహార్/మాల్బజార్: ఎన్నికల ప్రవర్తనా నియమావళిని బీజేపీ పాటించడం లేదని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు. విష పూరిత పామునయినా నమ్మొచ్చేమోగానీ, కాషాయదళాన్ని మాత్రం విశ్వసించరాదన్నారు. ఆవాస్ యోజన కింద పేర్లు నమోదు చేసుకోవాలని కేంద్రం కోరితే గుడ్డిగా నమ్మొద్దని ప్రజలను కోరారు. బీజేపీ దేశాన్ని నాశనం చేస్తోందని మండిపడ్డారు. బీజేపీకి ఒకే దేశం, ఒకే పార్టీ సిద్ధాంతంపై మాత్రమే నమ్మకం ఉందని వ్యాఖ్యానించారు. దర్యాప్తు సంస్థలతోపాటు బీఎస్ఎఫ్, సీఐఎస్ఎఫ్లు కూడా కేంద్ర ప్రభుత్వ కనుసన్నల్లోనే పనిచేస్తున్నాయని ఆరోపించారు. ఇటువంటి వాటికి తాము తలొంచబోమని తెగేసి చెప్పారు. అన్ని పార్టీలనూ సమానంగా చూడాలని ఈసీని కోరతామన్నారు. -
కేంద్రం బకాయిలను మేమే ఇస్తాం: మమత
కోల్‌కతా: వివిధ సంక్షేమ పథకాలకు సంబంధించి కేంద్రప్రభుత్వం నుంచి పశి్చమబెంగాల్ రాష్ట్రానికి రావాల్సిన బకాయిలపై ఇక ఎవరినీ అడిగేదిలేదని, తామే చెల్లిస్తామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రకటించారు. కేంద్రం నుంచి రావాల్సిన బకాయిలపై కోల్‌కతాలో శుక్రవారం నుంచి 48 గంటల ధర్నాకు దిగిన మమత శనివారం మాట్లాడారు. ‘‘ ఇకపై మేం బీజేపీ ప్రభుత్వాన్ని దేహీ అని అడుక్కోవాలనుకోవట్లేదు. వాళ్ల భిక్ష మాకు అక్కర్లేదు. రాష్ట్రంలో ఉపాధి హామీ పనులు చేసి కేంద్రం నుంచి బకాయిల కోసం ఎదురుచూస్తున్న 21 లక్షల మంది కారి్మకుల ఖాతాలకు ఆ మొత్తాలను ఫిబ్రవరి 21కల్లా మా ప్రభుత్వమే చెల్లిస్తుంది. ఆవాస్ యోజన పథకంపైనా త్వరలో నిర్ణయం తీసుకుంటాం’’ అన్నారు. ధర్నా వద్దే మమత రాత్రి బస ధర్నాకు దిగిన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ శుక్రవారం రాత్రంతా ధర్నా స్థలి వద్దే గడిపారు. అక్కడే నిద్రించి ఉదయం మారి్నంగ్‌వాక్‌కు వెళ్లారు. -
లోక్‌సభ ఎన్నికలు ముందస్తుగానే రావొచ్చు: మమతా బెనర్జీ
కోల్‌కతా: దేశంలో బీజేపీ వరుసగా మూడోసారి అధికారంలోకి వస్తే నియంతృత్వమే రాజ్యమేలుతుందని, అరాచకం తప్పదని తృణమూల్ కాంగ్రెŠ పారీ్ట(టీఎంసీ) అధినేత, పశి్చమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చెప్పారు. బీజేపీ దేశంలో మతాల మధ్య, కులాల మధ్య శత్రుత్వాన్ని పెంచిందని మమత మండిపడ్డారు. బీజేపీ గనుక మళ్లీ గెలిస్తే ప్రజల నడుమ విద్వేషాలు మరింత రగులుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. బెంగాల్లో మూడు దశాబ్దాల కమ్యూనిస్టుల పాలనను అంతం చేశానని, వచ్చే ఎన్నికల్లో బీజేపీని సైతం మట్టికరిపిస్తానని చెప్పారు. వచ్చే ఏడాది జరగాల్సిన లోక్‌సభ ఎన్నికలు ఈ ఏడాది డిసెంబర్లోనే జరిగే అవకాశం ఉందని ఆమె తెలిపారు. డిసెంబర్లో ఎన్నికలకు బీజేపీ మొగ్గు చూపుతున్నట్లు చెప్పారు. ఒకవేళ అది సాధ్యం కాకపోతే వచ్చే ఏడాది జనవరిలో ఎన్నికలు జరిగే అవకాశం ఉందన్నారు. ఎన్నికల ప్రచారం కోసం బీజేపీ నాయకులు ఇప్పటికే దేశంలోని అన్ని హెలికాప్టర్లను బుక్ చేసుకున్నారని వెల్లడించారు. ఇతర పారీ్టలకు హెలికాప్టర్లు లభించకూడదన్నదే బీజేపీ ఎత్తుగడ అని విమర్శించారు. సోమవారం కోల్‌కతాలో టీఎంసీ యువజన విభాగం ర్యాలీలో మమతా బెనర్జీ ప్రసంగించారు. -
మోదీ, దీదీ మధ్య 'మో-మో' ఒప్పందం.. కాంగ్రెస్ నేత కీలక వ్యాఖ్యలు..
న్యూఢిల్లీ: 2024 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి గట్టి పోటీ ఇవ్వాలని భావిస్తోంది కాంగ్రెస్. ఇందులో భాగంగానే ఆ పార్టీ నేత రాహుల్ గాంధీ ప్రతిష్టాత్మక భారత్ జోడో యాత్ర చేపట్టారు. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు దాదాపు 3500 కిలోమీటర్ల పాదయాత్ర చేస్తున్నారు. దీనికి ప్రజల నుంచి కూడా విశేష స్పందన వస్తోంది. ప్రతిపక్షాలకు చెందిన వివిధ రాజకీయ నాయకులు, ప్రముఖులు కూడా రాహుల్‌తో పాటు ఈ యాత్రలో పాల్గొన్నారు. అయితే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మాత్రం జోడో యాత్రపై ఇంతవరకు స్పందించలేదు. ఆ రాష్ట్రంలో రాహుల్ పాదయాత్ర జరిగినప్పుడు కూడా ఒక్క మాట కూడా మాట్లాడకుండా దూరంగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదరి మమతపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మోదీ ప్రభుత్వాన్ని గద్దే దించేందుకు విపక్షాలన్నీ ఎకమవ్వాలని చూస్తుంటే.. మమత మాత్రం నోరుమెదపడం లేదని విమర్శించారు. మోదీకి, దీదీకి మధ్య 'మో-మో' ఒప్పందం ఉందని, ప్రధానిని అప్సెట్ చేసేలా మమత ఏ పని చేయరని ఆరోపించారు. మోదీకి వత్తాసు.. శరద్ పవార్, కమల్ హాసన్ వంటి వారు భారత్ జోడో యాత్రకు మద్దతు తెలిపినా మమత మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడటం లేదని అధిర్ రంజన్ అన్నారు. బెంగాల్లో కాంగ్రెస్‌ను అంతమొందించాలని మోదీ అంటే.. దీదీ కూడా ఆయనకు వత్తాసు పలుకుతున్నారని ధ్వజమెత్తారు. 2024 ఎన్నికల్లో ప్రతిపక్షాలను ఏకం చేసి బీజేపీని ఎలాగైనా గద్దె దించాలని కాంగ్రెస్ వ్యూహాలు రచిస్తోంది. అయితే మమత బెనర్జీ కూడా ఇదే విషయమై ప్రతిపక్ష నాయకులను కలుస్తున్నారు. ప్రధాని మోదీకి ఎదురు నిలబడే సత్తా దీదీకి ఉందని నోబెల్ గ్రహీత అమర్త్య సేన్ కూడా వ్యాఖ్యానించారు. దీంతో విపక్షాలను ఆమె ముందుండి నడిపించాలని చూస్తున్నారని ప్రచారం జరుగుతోంది. మరోవైపు కాంగ్రెస్ ప్రధాని అభ్యర్థిగా ఇప్పటికే పలువురు నేతలు రాహుల్ గాంధీకి మద్దతు ప్రకటించారు. శివసేన(ఉద్ధవ్ వర్గం) ఎంపీ సంజయ్ రౌత్ కూడా ప్రజాభీష్టం మేరకు ప్రధాని పదవికి ఎవరైనా పోటీ చేయొచ్చని వ్యాఖ్యానించారు. చదవండి: షారుఖ్ ఖాన్ ఫోన్ చేసి బాధపడ్డారు: అసోం సీఎం -
వాళ్లకు మైండ్ పనిచేయట్లే.. వచ్చేవి బీజేపీ తిరస్కరణ ఎన్నికలే: మమత
కోల్‌కతా: 2024 పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వం ఓడిపోతుందని జోస్యం చెప్పారు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. ఆ పార్టీకి మెజారిటీ రాదన్నారు. కోల్‌కతాలో తృణమూల్ కాంగ్రెస్ నిర్వహించిన అమరవీరుల దినోత్సవం కార్యక్రమానికి హాజరైన ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలో అసమర్థ బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించి ప్రజా అనుకూల ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావాలని ఆకాక్షించారు . అందుకోసం వచ్చే పార్లమెంట్ ఎన్నికలు ‘బీజేపీ తిరస్కరణ ఎన్నికలు’ కావాలని పిలుపునిచ్చారు బీజేపీ ప్రభుత్వం నిత్యావసరాలపై కూడా జీఎస్టీ వసూలు చేయడంపై ధ్వజమెత్తారు మమత. బీజేపీకి బుర్ర పనిచేయడం లేదని, మరమరాలు, స్వీట్లు, లస్సీ, పెరుగు వంటి ఆహార పదార్థాలపై కూడా జీఎస్టీ బాదితే ప్రజలు ఏం తినాలని ప్రశ్నించారు. అనారోగ్యంతో ప్రజలు ఆస్పత్రిలో చేరినా దానికి కూడా డీఎస్టీ వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. కరోనా కారణంగా రెండేళ్ల పాటు అమరవీరుల దినోత్సవాన్ని టీఎంసీ నిర్వహించలేదు. మమత మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి ఈ కార్యక్రమం జరుగుతున్నందు వల్ల భారీగా ఏర్పాట్లు చేశారు. సభపైకి ఎల్పీజీ సిలిండర్‌ను తీసుకొచ్చి ఇంధన ధరలు భారీగా పెరిగాయని ఎన్డీఏ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు మమత. బ్యాంకులను ప్రైవేటుపరం చేయడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. బీజేపీ తమ క్యాడర్‌కు శిక్షణ ఇప్పించేందుకే అగ్నిపథ్ పథకాన్ని తీసుకొచ్చిందని తీవ్ర ఆరోపణలు చేశారు. మహారాష్ట్రలో ఉద్ధవ్ థాక్రే ప్రభుత్వాన్ని కూల్చి అధికారంలోకి వచ్చిన బీజేపినుద్దేశించి విమర్శలు గుప్పించారు మమత. 'వాళ్లు ముంబైని విడగొట్టామని భావిస్తున్నారు. తర్వాత ఛత్తీస్‌గఢ్‌ను పడగొడతారు. ఆ తర్వాత బెంగాల్ వస్తారు. ఇక్కడికి రావొద్దని నేను హెచ్చరిస్తున్నా. ఇక్కడ రాయల్ బెంగాల్ టైగర్ ఉంది' అన్నారు. చదవండి: ‘కాషాయం జెండా.. మనదే శివసేన’ -
కాంగ్రెస్‌తో లాభం లేదు: మమతా బెనర్జీ
కోల్‌కతా: కాంగ్రెస్‌ను పక్కనబెట్టి, ప్రాంతీయ పార్టీలతో కలిసి బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేస్తామని పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ అన్నారు. ప్రతిపక్ష కూటమి ఏర్పాటులో కాంగ్రెస్‌ను పక్కనబెడతామన్నారు. జీవం కోల్పోయిన ఆ పార్టీ కోసం వేచి చూడటంలో అర్థం లేదని వ్యాఖ్యానించారు. ‘బీజేపీకి వ్యతిరేకంగా పోరాడాలనుకుంటున్న రాజకీయ పార్టీలన్నీ కలిసి పనిచేయాలి. గతంలో కాంగ్రెస్ వ్యవస్థాగతంగా గెలవగలిగే స్థితిలో ఉండేది. ఆ పార్టీ ఇప్పుడు ప్రతి చోటా ఓటమి చవిచూస్తోంది. గెలుపుపై ఆ పార్టీ నేతలకు ఏమాత్రం ఆసక్తి లేనట్లు కనిపిస్తోంది. విశ్వసనీయత కోల్పోయిన ఆ పార్టీపై ఆధారపడటంలో అర్థం లేదు’అని తెలిపారు. బలంగా ఉన్న అనేక ప్రాంతీయ పార్టీలు కలిసి పనిచేస్తే మరింత శక్తివంతంగా మారవచ్చునని చెప్పారు. తాజాగా ఐదు రాష్ట్రాలకు జరిగిన ఎన్నికల్లో బీజేపీ యూపీ, ఉత్తరాఖండ్, మణిపూర్, గోవాల్లో మళ్లీ అధికారంలోకి రాగా, కాంగ్రెస్ పార్టీ పంజాబ్‌ను కోల్పోయిన విషయం తెలిసిందే. మమతా బెనర్జీ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత ఆధిర్ రంజన్ తీవ్రంగా స్పందించారు. ప్రధాని మోదీ కాంగ్రెస్ ముక్త్ భారత్‌ను కోరుతుండగా, మమతా బెనర్జీ కాంగ్రెస్ లేని ప్రతిపక్షాన్ని కావాలనుకుంటున్నారనీ, ఇద్దరికీ తేడా ఏమీ లేదని వ్యాఖ్యానించారు. ఓట్లు లూటీ చేసి బీజేపీ గెలిచింది యూపీ సహా నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ సాధించిన విజయం ప్రజా తీర్పుకి అద్దం పట్టడం లేదని మమతా బెనర్జీ అన్నారు. కాషాయ కూటమి ఎన్నికల యంత్రాంగాన్ని తమ గుప్పిట్లో ఉంచుకొని ఓట్లు వేయించుకుందని ఆరోపించారు. అందుకే సమాజ్‌వాదీ ఓడిందన్నారు. బీజేపీని ఓడించడానికి విపక్షాలన్నీ ఏకమవ్వాలని మరోసారి పిలుపునిచ్చారు. ‘‘ఏదో కొన్ని రాష్ట్రాల్లో నెగ్గామని బీజేపీ గొంతు పెంచొద్దు. ఈ విజయం ప్రజాతీర్పుకు నిదర్శనం కాదు. ఈ ఎన్నికల ప్రభావం సార్వత్రిక ఎన్నికలపై ఉండదు. బీజేపీ పగటి కలలు ఆపాలి’’ అన్నారు. -
తృణమూల్‌లో కాంగ్రెస్ విలీనం కావాల్సిందే: మమతా బెనర్జీ
-
ఉక్రెయిన్‌లో విద్యార్థులను పట్టించుకోవడం లేదు
వారణాసి: యుద్ధంతో అతలాకుతలమవుతున్న ఉక్రెయిన్‌లో భారతీయ విద్యార్థులు ప్రమాదంలో చిక్కుకుని ఉండగా ప్రధాని మోదీ మాత్రం ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో బిజీ అయిపోయారని పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ ధ్వజమెత్తారు. ఉక్రెయిన్‌లో మన విద్యార్థుల సంక్షేమాన్ని పట్టించుకోవడం మానేసిందని దుయ్యబట్టారు. గురువారం వారణాసిలో సమాజ్‌వాదీ(ఎస్పీ) పార్టీ తరఫున జరిగిన ఎన్నికల ర్యాలీలో మమత ప్రసంగించారు. ‘పుతిన్‌తో సత్సంబంధాలున్న మీకు, యుద్ధం వస్తుందని మూడు నెలలు ముందుగానే తెలిసినా, భారతీయులను ఉక్రెయిన్ నుంచి ఎందుకు వెనక్కి తీసుకు రాలేకపోయారు?’ అని ప్రధానిని ఆమె ప్రశ్నించారు. అక్కడ మన విద్యార్థులు బంకర్లలో ఉంటూ నీరు, ఆహారం దొరక్క అలమటిస్తుండగా ఎలాంటి సాయం అందించకుండా వెనక్కి రావాలంటే ఎలా సాధ్యమని ఆమె ప్రధానిని నిలదీశారు. కోవిడ్ సమయంలో దేశవ్యాప్త లాక్డౌన్ విధించి వలస కార్మికులను ప్రభుత్వం అత్యంత తీవ్ర ఇబ్బందులకు గురిచేసిందని ప్రధాని మోదీ ప్రభుత్వాన్ని ఆమె విమర్శించారు. -
మోదీ Vs దీదీ: ప్రధానిపై మమత అసహనం.. మళ్లీ రాజుకున్న రాజకీయ రగడ!
PM Modi Vs CM Mamata న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ప్రధాని నరేంద్ర మోదీల మధ్య వివాదం మళ్లీ రాజుకుంది. బుధవారం ప్రధాని మోదీతో జరిగిన డిజిటల్ మీటింగ్‌లో మాట్లాడేందుకు అవకాశం ఇవ్వకపోవడంతో దీదీ ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో రిషి అరవింద్ 150వ జయంతి సందర్భంగా శుక్రవారం జరగనున్న మీటింగ్‌కు హాజరు కావడం లేదని మమతా బెనర్జీ నేడు ప్రకటించారు. అమృత్ ఫెస్టివల్ ఆఫ్ ఇండిపెండెన్స్‌కు సంబంధించి ప్రధాని మోదీ అధ్యక్షతన ఏర్పాటు చేసిన వర్చువల్ సమావేశంలో మమతా బెనర్జీ కూడా హాజరయ్యారు. ఐతే సుమారు రెండు గంటల పాటు వేచి చూసినా ఆమెకు మాట్లాడే అవకాశం రాలేదు. దీనికి సంబంధించి స్పీకర్ల జాబితాలో మమత పేరును చేర్చలేదని రాష్ట్ర సచివాలయం చెబుతోంది. దీనిపై మమతా బెనర్జీ కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. గతంలోకూడా కరోనాకు సంబంధించి 10 రాష్ట్రాల సీఎంలతో నిర్వహించిన సమావేశంలో ఆమెకు మాట్లాడే అవకాశం లభించలేదు. ఐతే స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు అవుతున్న సందర్భంగా నబన్లోని రాష్ట్ర సచివాలయంలో ఈ రోజు (గురువారం) సీఎం మమతా బెనర్జీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా శుక్రవారం నాటి సమావేశంలో తాను పాల్గొనబోవడంలేదని తెలిపారు. అంతేకాకుండాప్రధాని మీటింగ్‌లో యోగేన్ చౌదరి, జై గోస్వామి మాట్లాడటానికి అనుమతించకపోవడాన్ని సీఎం మమతా తీవ్రంగా ఖండించారు. భారత స్వాతంత్య్ర 75వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రంలో జనవరి 26, ఆగస్టు 15 తేదీల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తెలిపారు. జనవరి 23 నుంచి జనవరి 30 వరకు వివిధ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఈ సమావేశంలో తెలిపారు. కాగా ఆధ్యాత్మిక గురువు రిషి అరవింద్ 150వ జయంతిని పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన 53 మంది సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటీలో లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, ఇద్దరు మాజీ ప్రధానులు మన్మోహన్ సింగ్, హెచ్డి దేవెగౌడ, మమతా బెనర్జీలతో సహా పలువురు కేబినెట్ మంత్రులు కూడా ఉన్నారు. ఈ కమిటీ సమావేశం శుక్రవారం జరగాల్సి ఉండగా, సీఎం మమతా బెనర్జీ ఈ సమావేశంలో పాల్గొనడం లేదని ఈ మేరకు ప్రకటించారు. చదవండి: ఐదేళ్లుగా ఈ హాస్పిటల్లో రోజూ 37 మంది శిశువుల మృతి.. అసలేం జరుగుతోందక్కడ? -
ప్రధానితో మమత భేటీ
న్యూఢిల్లీ: సరిహద్దు రాష్ట్రాల్లో బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్(బీఎస్ఎస్) అధికార పరిధి పెంపును బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తీవ్రంగా వ్యతిరేకించారు. బుధవారం ప్రధాని మోదీతో సమావేశం సందర్భంగా ఆమె ఈ విషయం ప్రస్తావించారు. అంతర్జాతీయ సరిహద్దు నుంచి 15 కిలోమీటర్లుగా ఉన్న బీఎస్ఎఫ్ పరిధిని 50 కి.మీ.లకు పెంచుతూ జారీ చేసిన ఉత్తర్వులను వెనక్కి తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. బీఎస్ఎఫ్కు మరిన్ని అధికారాలు కట్టబెడితే రాష్ట్ర పరిధిలో ఉన్న శాంతిభద్రతల విషయంలో ఘర్షణలకు దారితీయవచ్చని ఆమె వ్యాఖ్యానించారు. అకారణంగా దేశ సమాఖ్య వ్యవస్థకు భంగం కలిగించేందుకు యత్నించడం సరికాదని ప్రధానిని కోరినట్లు చెప్పారు. వచ్చే ఏడాదిలో కోల్‌కతాలో జరగనున్న గ్లోబల్ బిజినెస్ సమ్మిట్ ప్రారంభానికి ప్రధాని మోదీని ఆహ్వానించినట్లు ఆమె వెల్లడించారు. త్రిపురలో బీజేపీ శ్రేణులు టీఎంసీ కార్యకర్తలపై దాడులకు పాల్పడుతున్నట్లు అంశాన్ని కూడా ప్రస్తావించినట్లు చెప్పారు. సోనియాను కలవాలని నిబంధనేం లేదు కాంగ్రెస్ చీఫ్ సోనియాగాంధీతో సమావేశమయ్యారా అని మీడియా ప్రశ్నించగా ఆమె సుదీర్ఘ సమాధానమిచ్చారు. ‘ఈసారి ఢిల్లీ టూర్లో కేవలం ప్రధాని మోదీ అపాయింట్మెంట్ మాత్రమే తీసుకున్నా. పంజాబ్ ఎన్నికలపై పార్టీల నేతలంగా బిజీగా ఉన్నారు. పనికే మొదటి ప్రాధాన్యం. ఢిల్లీ వచ్చిన ప్రతిసారీ సోనియాను ఎందుకు కలవాలి? అదేమీ రాజ్యాంగ నిబంధన కాదు’ అని చెప్పారు. -
ప్రజాస్వామ్యానికి ప్రమాదకరంగా పెగాసస్
కోల్‌కతా/న్యూఢిల్లీ: పెగాసస్ స్పైవేర్ ప్రజాస్వామ్యానికి ప్రమాదకరంగా మారిందని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఈ దేశంలో సంక్షేమానికి బదులుగా నిఘా దేశంగా మార్చడానికి ప్రయత్నిస్తోందని దుయ్యబట్టారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో మోదీ ప్రభుత్వాన్ని గద్దె దింపేయాలని, ఇందుకోసం విపక్షాలు అన్నీ ఏకం కావాలని ఆమె పిలుపునిచ్చారు. అమరవీరుల స్మృత్యర్థం బుధవారం జరిగిన ఒక కార్యక్రమంలో ఆన్లైన్ ద్వారా పాల్గొన్న మమత రాజకీయ నాయకులు, సామాజిక కార్యకర్తలు, జర్నలిస్టులు, న్యాయమూర్తులు ఇలా అన్ని వర్గాలపైన కేంద్రం నిఘా పెట్టినందుకు సుప్రీంకోర్టు దీనిని సూమోటోగా తీసుకొని విచారించాలని డిమాండ్ చేశారు. పెట్రోల్, డీజిల్, ఇతర వస్తువులపై వేసిన పన్నుల్ని ఇలాంటి ప్రమాదకరమైన సాఫ్ట్వేర్ల కొనుగోలుపై కేంద్రం ఖర్చు చేస్తోందని మమత ధ్వజమెత్తారు. ‘ విపక్ష నేతలందరి ఫోన్ల సంభాషణలు రికార్డు అయిపోతూ ఉంటాయి. అందుకే నేను ఫోన్లో ఎన్సీపీ నేత పవార్, కాంగ్రెస్ నాయకుడు చిదంబరం, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడలేకపోతున్నాను. మా అందరి మీద ఇలా నిఘా పెట్టినంత మాత్రాన 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని ఎవరూ కాపాడలేరు’’ అని అన్నారు. స్వతంత్ర దర్యాప్తు జరపాలి: ఎడిటర్స్ గిల్డ్ ఫోన్ల ట్యాపింగ్ వ్యవహారంపై సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో వెంటనే సమగ్ర, స్వతంత్ర దర్యాప్తు జరిపించాలని ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా(ఈజీఐ) పేర్కొంది. ఈ మేరకు బుధవారం ట్విట్టర్లో ఒక ప్రకటన విడుదల చేసింది. సొంత పౌరుల ఫోన్లపై, వారి కదలికలపై భారత ప్రభుత్వ సంస్థలు దృష్టి పెట్టినట్లు అనుమానాలు వెల్లువెత్తుతున్నాయని పేర్కొంది. పాత్రికేయులపై సైతం నిఘా పెట్టడం అంటే అది పత్రికా స్వేచ్ఛపై దాడి చేయడమే అవుతుందని ఎడిటర్స్ గిల్డ్ స్పష్టం చేసింది. రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తూ, పత్రికా స్వేచ్ఛను హరించే యత్నాలు చేయడం దారుణమని విమర్శించింది. పత్రికా స్వేచ్ఛను ప్రభుత్వమే కాపాడకపోతే దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థ మనుగడ సాగించేదెలా? అని నిలదీసింది. ఎంక్వైరీ కమిటీలో జర్నలిస్టులకు, సామాజిక ఉద్యమకారులకు స్థానం కల్పించాలని సూచించింది. ఫోన్ ట్యాపింగ్‌పై 28న విచారణ..! పెగాసస్ ట్యాపింగ్‌పై కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ నేతృత్వంలోని పార్లమెంటరీ స్థాయీ సంఘం ఈ వ్యవహారంపై విచారణ జరిపేందుకు సన్నద్ధమయ్యింది. ఈ నెల 28న కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారులను ప్రశ్నించే అవకాశాలు ఉన్నట్లు తెలిసింది. కేంద్ర హోంశాఖ ఉన్నతాధికారులతోనూ మాట్లాడనున్నట్లు సమాచారం. ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీపై శశిథరూర్ నేతృత్వంలో ఏర్పాటైన 32 మంది సభ్యుల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ 28న సమావేశం కానుంది. ‘సిటిజెన్స్ డేటా సెక్యూరిటీ, ప్రైవసీ’ అజెండాతో భేటీ జరుగనుందని లోక్‌సభ సెక్రటేరియట్ వెల్లడించింది. ట్యాపింగ్‌పై విచారణకు రావాలని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ, హోంశాఖల ఉన్నతాధికారులకు స్టాండింగ్ కమిటీ ఆదేశాలు జారీ చేసినట్లు పేర్కొంది. నా ఫోన్‌కి ప్లాస్టర్ వేశా పెగాసస్ ప్రమాదకరమైనదన్న మమత... అందుకే తన ఫోన్ కెమెరాకు ప్లాస్టర్ వేశానంటూ దానిని చూపిస్తూ నిరసన వ్యక్తం చేశారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వానికి ప్లాస్టర్ వెయ్యాలి. లేదంటే దేశం సర్వనాశనమైపోతుంది’ అని మమత అన్నారు. ప్రజాస్వామ్యంలో న్యాయవ్యవస్థ, ఎన్నికల కమిషన్, మీడియా అత్యంత ముఖ్యమైనవని, పెగాసస్ వలలో ఈ మూడే చిక్కుకున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. జాతి ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని సుప్రీంకోర్టు ముందుకు వచ్చి సూమోటోగా విచారణ జరిపించాలని, దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని మమత అన్నారు. -
మూడోసారి బెంగాల్ పీఠంపై దీదీ
కోల్‌కతా: హోరాహోరీ అసెంబ్లీ ఎన్నికల పోరులో విజయఢంకా మోగించిన తృణమూల్ కాంగ్రెస్ చీఫ్ మమతా బెనర్జీ వరసగా మూడోసారి బెంగాల్ సీఎంగా ప్రమాణం చేశారు. బుధవారం కోల్‌కతాలోని రాజ్‌భవన్‌లో నిరాడంబరంగా జరిగిన ప్రమాణస్వీకార కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ జగ్దీప్ ధన్కర్ ఆమెతో సీఎంగా ప్రమాణంచేయించారు. మమత కేబినెట్లో కొత్త మంత్రులంతా 9వ తేదీన ప్రమాణం చేయను న్నారు. రాష్ట్రంలో ఎన్నికల ఫలితాల తర్వాత హింస చెలరేగడానికి కారకులైన వారిని వదిలిపెట్టేదిలేదని ఈ సందర్భంగా ఆమె ప్రతిజ్ఞ చేశారు. బెంగాల్లో కోవిడ్ కట్టడే తమ ప్రభుత్వ తొలి ప్రాధాన్యమని మమత స్పష్టంచేశారు. కాగా, సీఎంగా ప్రమాణంచేసిన మమత దీదీకి అభినందనలు అంటూ ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. దేశంలోని పౌరులందరికీ ఉచితంగా టీకా ఇవ్వాలని విజ్ఞప్తిచేస్తూ ప్రధాని మోదీకి మమత ఓ లేఖ రాశారు. అల్లర్లను చెల్లెలు మమత అదుపుచేయగలదు: గవర్నర్ ధన్కర్ ‘మూడోసారి సీఎం అయిన మమతకు ధన్య వాదాలు. అయితే, ప్రస్తుతం అల్లర్లు, హింసతో బెంగాల్ తీవ్ర సంక్షోభంలో ఉంది. ఈ హింసా త్మక ఘటనలకు నా సోదర సమానురాలైన మమతా బెనర్జీ అడ్డుకట్ట వేయగలదనే నమ్ముతున్నా. హింసకు గురౌతున్న మహిళలు, చిన్నారులను రక్షించి తక్షణమే శాంతిభద్రతలను ఆమె అదుపులోకి తెస్తారని భావిస్తున్నా’అని గవర్నర్ ధన్కర్ వ్యాఖ్యానించారు. -
నీతి ఆయోగ్ భేటీ వృథా
కోల్‌కతా: ప్రధాని మోదీ అధ్యక్షతన ఈనెల 15వ తేదీన జరగనున్న నీతి ఆయోగ్ సమావేశానికి హాజరయ్యేందుకు పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ నిరాకరించారు. తమ రాష్ట్ర అవసరాలకు మద్దతుగా నిలిచే ఆర్థిక అధికారాలు లేని నీతిఆయోగ్ వృథా అని పేర్కొన్నారు. ఈ మేరకు ఆమె ప్రధానికి లేఖ రాశారు. ‘రాష్ట్రాల ప్రణాళికలకు ఆర్థికంగా తోడ్పాటునందించే అధికారం లేని నీతి ఆయోగ్ సమావేశానికి వెళ్లడం దండగ. ముఖ్యమంత్రులకు మాట్లాడే అవకాశం ఇవ్వరు. ఈ వ్యవస్థ కంటే అంతర్ రాష్ట్ర కౌన్సిల్‌ను బలోపేతం చేయడం అవసరం. లేకుంటే రాష్ట్రాల మధ్య అసమతౌల్యాన్ని తగ్గించేలా నిధులు కేటాయించే అధికారాన్ని నీతి ఆయోగ్‌కు ఇవ్వాలి’అని ఆ లేఖలో పేర్కొన్నారు. ఎన్నికల కమిషనర్ల నియామకానికి కూడా సుప్రీంకోర్టులోని కొలీజియం వంటి వ్యవస్థ ఉండాలని మమతా బెనర్జీ డిమాండ్ చేశారు. ‘జడ్జీల ఎంపిక కోసం సుప్రీంకోర్టులో కొలీజియం ఉంటుంది. ఎన్నికల కమిషనర్ల నియామకం కోసం ఎన్నికల సంఘంలో కొలీజియం వంటి వ్యవస్థ ఉండాలి’ అని అన్నారు. -
మోదీకి మమత బెనర్జీ లేఖ
కోల్‌కతా: ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ లేఖ రాశారు. 15వ ఆర్థిక సంఘం కేంద్రానికి చేసిన సిఫారసులను వ్యతిరేకిస్తున్నట్లు ఆమె ఆ లేఖలో తెలిపారు. జనాభా అధారిత సంవత్సరంగా 1971 బదులు 2011 సంవత్సరంగా మార్చడం, దాని వల్ల కలిగే నష్టాల గురించి లేఖలో వివరించారు. 15వ ఆర్థిక సంఘం కొత్తగా చేసిన సిఫారసుల వల్ల రాష్ట్రాలకు నిధుల పంపకంలో తీవ్ర నష్టం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. 15 ఆర్థిక సంఘం సిఫారసులను వ్యతిరేకిస్తు మోదీకి లేఖ రాసిన మొదటి సీఎం మమతనే కావడం విశేషం. గత కొంతకాలంగా 15వ ఆర్థిక సంఘం కేంద్రానికి చేసిన సిఫారసులను రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నాయి. అయితే బహిరంగంగా ఏ రాష్ట్రం విమర్శించలేదు. కాగా జనాభా అధారిత సంవత్సరంగా 1971కి బదులుగా 2011ను ప్రతిపాదించడంతో తమ రాష్ట్రానికి 25,000 కోట్ల నుంచి 35,000 కోట్ల నష్టపోయే అవకాశం ఉందని లేఖలో పేర్కొన్నారు. సమాఖ్య విధానంలో రాష్ట్రాల అభిప్రాయం తెలుసుకోకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం సమాఖ్య విధానానికి విరుద్ధం అని మమత విమర్శించారు. గత ఐదేళ్లుగా 1971 జనాభా ఆధారంగానే రాష్ట్రంలో అనేక సామాజిక, కుటుంబ సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నట్లు ఆమె ఆ లేఖలో ప్రస్తావించారు. జనాభా ఆధారిత సంవత్సరాన్ని మార్చడంతో పశ్చిమ బెంగాల్ మాత్రమేకాక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, ఒడిశా లాంటి రాష్ట్రాలు అధికంగా నిధులు కోల్పోతున్నాయని లేఖలో వివరించారు. ఉత్తర భారతంలో ఉన్న రాష్ట్రాలు బిహార్, రాజస్తాన్, గుజరాత్, ఉత్తర ప్రదేశ్, మధ్యప్రదేశ్ లాంటి రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వం అధికంగా నిధులు మంజూరుచేస్తోందని, మిగిలిన రాష్ట్రాలకు కేంద్రం నిధుల కుదించడం అన్యాయమని విమర్శించారు. -
మమతా బెనర్జీపై బీజేపీ సీఎం తీవ్ర వ్యాఖ్యలు
అగర్తల: బీజేపీ-తృణమూల్ కాంగ్రెస్ పార్టీల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. త్రిపుర సీఎం విప్లవ్ కుమార్ దేవ్.. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆమెకు మతి చెడిందని.. పిచ్చాసుపత్రిలో చేరాలంటూ విప్లవ్ వ్యాఖ్యానించారు. ‘మమతా బెనర్జీకి మతి చెడినట్లుంది. ఆమె ఆస్పత్రిలో చేరి చికిత్స చేయించుకుంటే మంచిది. ఆమె మాటలు తెలివితక్కువగా ఉన్నాయి’అని విప్లవ్ పేర్కొన్నారు. అంతేకాదు గుళ్లూ, గోపురాలు సందర్శిస్తే ఆమె మానసిక స్థితి బాగుపడొచ్చని వ్యంగ్యంగా మాట్లాడారు. ఈ వ్యాఖ్యలపై టీఎంసీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. కాగా, త్రిపుర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఓ ఇంటర్యూలో మమతా బెనర్జీ మాట్లాడుతూ.. ‘బీజేపీవంటి జాతీయ పార్టీ త్రిపుర లాంటి చిన్న రాష్ట్రంలో విజయం సాధించడంలో గొప్పేముందని.. అవి మున్సిపల్ ఎన్నికలు’ అని పేర్కొన్నారు. దీంతో విప్లవ్ ఆమెకు కౌంటర్ ఇచ్చారు. కాగా, త్రిపురలో రెండున్నర దశాబ్దాల కమ్యూనిస్టుల పాలనకు తెరదించుతూ ఫిబ్రవరిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. 59 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో మొత్తం బీజేపీ 35 సీట్లను కైవసం చేసుకుంది. -
తొలి వార్షికోత్సవం : నా ట్విట్టర్ డీపీ అదే
కోల్కత్తా : పెద్ద నోట్ల రద్దు తొలి వార్షికోత్సవ సందర్భంగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తన ట్విట్టర్ అకౌంట్ డీపీని మార్చేశారు. తన ట్విట్టర్ డీపీ పూర్తిగా నల్లటి రంగును పెట్టుకున్నారు. నోట్ బ్యాన్‌కు వ్యతిరేకంగా ఆమె ఈ విధంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. '' నోట్ల రద్దు ఓ విపత్తులాంటిది. ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసిన ఈ స్కామ్(డీమానిటైజేషన్)కు వ్యతిరేకంగా నిరసన తెలుపుతూ.. నవంబర్ 8ని మేము బ్లాక్ డేగా పరిగణిస్తాం'' అని మమతా చెప్పారు. ప్రజలను తీవ్ర స్థాయిలో బాధపెట్టిన నోట్ల రద్దు, జీఎస్టీకి వ్యతిరేంగా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ వర్కర్లు ర్యాలీలు జరుపుతారని తెలిపారు. ప్రజలను వేధించిన జీఎస్టీ, అతిపెద్ద స్వార్థపరమైన పన్ను అని అభివర్ణించారు. ఉద్యోగాలను కొల్లగొట్టిందని, వ్యాపారాలను దెబ్బతీసిందని, ఆర్థిక వ్యవస్థకు నష్టం వాటిల్లేలా చేసిందని మండిపడ్డారు. జీఎస్టీ విషయంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని తీవ్రంగా విమర్శించారు. గతేడాది ప్రభుత్వం ప్రకటించిన నోట్ల రద్దును తీవ్ర స్థాయిలో వ్యతిరేకించిన వారిలో మమతా బెనర్జీ ఒకరు. బ్లాక్‌మనీకి వ్యతిరేకంగా ప్రధాని నరేంద్రమోదీ పాత రూ.1000, రూ.500 నోట్లను రద్దు చేసిన కొన్ని రోజుల్లోనే, దీనిపై అధ్యక్షుడికి ఓ మెమోరాండం సమర్పించారు. తర్వాత మోదీ ప్రభుత్వం తీసుకున్న అతిపెద్ద ఆర్థిక సంస్కరణ జీఎస్టీ అమలును కూడా ఆమె వ్యతిరేకించారు. దీని ఆవిష్కరణ సందర్భంగా పార్లమెంట్ సెంట్రల్ హాల్లో ఆ అర్థరాత్రి జరిగిన ఫంక్షన్‌కు మమతా బెనర్జీ పార్టీ బాయ్‌కాట్ చేసింది. -
మమత హత్యకు సహకరిస్తే ..
సాక్షి,కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ సీఎం, తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీని హత్య చేస్తే రూ 65 లక్షలిస్తామని ముర్షిదాబాద్ జిల్లా బెహ్రంపోర్లో 19 ఏళ్ల విద్యార్థికి వాట్సాప్ మెసేజ్ వచ్చింది. అమెరికాలోని ఫ్లోరిడాలో ఉంటున్న పాలిటెక్నిక్ విద్యార్థితో సంభాషించేందుకు ఉపయోగించే ఈ నెంబర్‌కు మెసేజ్ వచ్చింది. సోమవారం అర్థరాత్రి దాటిన తర్వాత నుంచి తనకు లాటిన్ అనే వ్యక్తి నుంచి మెసేజ్‌లు వస్తున్నాయని ఈ మెసేజ్‌లతో షాక్‌కు గురైన విద్యార్థి చెప్పారు. మెసేజ్‌లు పంపిన వ్యక్తి తనకు తాను ఓ ఉగ్రవాద సంస్థకు చెందిన వాడినని, భారత్‌లో భాగస్వామి కోసం చూస్తున్నామని చెప్పినట్టు విద్యార్థి తెలిపారు. వాట్సాప్ మెసేజ్లిలా... తాము చెప్పినట్టు చేస్తే లక్ష డాలర్లు ( రూ 65 లక్షలు) ఇస్తామని, మీకు ఎలాంటి ప్రమాదం ఉండదని గుర్తుతెలియని వ్యక్తి సదరు విద్యార్థికి పంపిన మెసేజ్‌ల్లో సంభాషించాడు.అయితే తనకు కొంత సమయం కావాలని విద్యార్థి కోరడంతో తొందరగా తమతో చేతులు కలపాలని, లేకుంటే వేరొకరిని ఎంపిక చేసుకుంటామని దుండగుడు తొందరపెట్టాడు. రూ 65 లక్షలను పోగొట్టుకోవద్దని ఒత్తిడి పెంచినట్టు సంభాషణల సారాంశంలో వెల్లడైంది. బాధిత విద్యార్థి నో థ్యాంక్స్ అని రిప్లై ఇవ్వగా మరికొద్ది సేపటికే మళ్లీ ఆన్‌లైన్‌లోకి వచ్చిన వ్యక్తి విద్యార్థిని లాసర్గా పేర్కొన్నాడు. రాత్రి 3.30 గంటలకు మళ్లీ లైన్లోకి వచ్చిన వ్యక్తి తాను త్వరలో భారత్ రానున్నట్టు చెప్పగా, తాను దేశాన్ని ప్రేమిస్తానని, దేశాన్ని విచ్ఛిన్నం చేయడం తనకు ఇష్టం లేదని విద్యార్థి తేల్చిచెప్పారు. అయితే తాము భారత్‌ను నాశనం చేయబోమని, కేవలం ఒకరిని చంపాలని మాత్రమే అనుకుంటున్నామని ఆ వ్యక్తి సంభాషించాడు. ఈ ఉదంతంపై పశ్చిమ బెంగాల్ సీఐడీ దర్యాప్తు జరుపుతోంది. -
నా నోరు ఎవరూ మూయించలేరు: సీఎం
ప్రస్తుతం దేశంలో ఉన్న అసహనం, విభజన రాజకీయాల మధ్య పశ్చిమబెంగాల్ మాత్రమే పోరాడి దేశాన్ని కాపాడగలదని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. బీజేపీ వాళ్లు తనను బెదిరించి, భయపెట్టి తన నోరు మూయించలేరని చెప్పారు. బిహార్, మహారాష్ట్ర లాంటివి భయపడి ఊరుకుంటాయేమో గానీ తాము మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ తమ పోరాటం ఆపేది లేదని చెప్పారు. కేవలం బెంగాల్ మాత్రమే ఈ మత రాజకీయాలపైన, అసహనంపైన పోరాడి దేశాన్ని కాపాడుతుందని బుద్ధపూర్ణిమ సందర్భంగా కోల్‌కతాలో జరిగిన ఓ కార్యక్రమంలో అన్నారు. దమ్ముంటే తనను జైల్లో పెట్టాలని, తాను జైలుకు వెళ్లినా సరే అక్కడినుంచి కూడా బీజేపీపై పోరాడతాను తప్ప తుదివరకు ఆపేది లేదని స్పష్టం చేశారు. 2002 నాటి గుజరాత్ అల్లర్ల పేరును ప్రస్తావించకుండానే ఆ ఘటనపైనా విమర్శలు చేశారు. తాను రాజకీయాల్లో ఉన్నాను కదా అని ఇతరులు ఏం తినాలో, ఏం తినకూడదో చెప్పే హక్కు ఉండదని, అసలైన మతం ఇది కాదని ఆమె అన్నారు. మతం మనకు రాజకీయాలు చేయమని గానీ, ప్రజలను చంపమని గానీ చెప్పదని.. మతం అంటే విశ్వాసం, శాంతి, ప్రేమ, సోదరభావం అని చెప్పారు. బీఫ్, గోవధ అంశాలపై రాజకీయాలు జరుగుతున్నాయని కూడా మమత విమర్శించారు. తనను కొంతమంది బీజేపీ నేతలు హిజ్రా అన్నారని.. అది సిగ్గుచేటని, తాను చెడ్డమనిషిని కావచ్చు గానీ, గౌరవప్రదమైన జీవితం గడిపే హక్కు తనకుందని చెప్పారు. -
ఢిల్లీ కోటలో పాగా వేస్తాం
కోల్‌కతా: తృణమూల్ కాంగ్రెస్‌ను బెదిరించాలని బీజేపీ ప్రయత్నిస్తోందని, బెంగాల్ ఎప్పుడూ ఇలాంటి వాటికి భయపడదని ఆ పార్టీ అధ్యక్షురాలు, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. టీఎంసీని చూసి బీజేపీ భయపడుతోందని, అందుకే ఇలాంటి వ్యూహం పాటిస్తోందని అన్నారు. తమకు ఎవరు సవాల్ చేసినా స్వీకరిస్తామని, ఎవరికీ బెదరబోమని, ఢిల్లీ కోటలో పాగా వేస్తామని మమత చెప్పారు. గురువారం బిర్పారలో జరిగిన బహిరంగ సభలో ఆమె పాల్గొన్నారు. పశ్చిమబెంగాల్లోని వెనుకబడిన ప్రాంతాల్లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పర్యటించడంపై మమత స్పందిస్తూ.. ఢిల్లీలో నుంచి వచ్చినవారు అబద్ధాలు చెబుతారని, వాళ్లు అధికారకాంక్షతో ఉన్నారని అన్నారు. బీజేపీ నాయకులు బెంగాల్లో అధికారంలోకి రావాలని చూస్తున్నారని, టీఎంసీ నేతలపై సీబీఐని ఉసిగొల్పుతున్నారని ఆరోపించారు. విదేశాల్లో దాచుకున్న నల్లధనాన్ని వెనక్కి రప్పిస్తామని 2014 ఎన్నికలపుడు బీజేపీ నేతలు హామీ ఇచ్చారని, మూడేళ్లయినా ఇప్పటికీ ఈ హామీని నిలబెట్టుకోలేదని మమత విమర్శించారు. -
బీజేపీ నాపై దుష్ప్రచారం చేయిస్తోంది
కోల్‌కతా: పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మరోసారి బీజేపీపై తీవ్ర విమర్శలు చేశారు. తన ప్రతిష్టను దెబ్బతీసేందుకు బీజేపీ కోట్లాది రూపాయలు వెచ్చించి సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేయిస్తోందని ఆమె ఆరోపించారు. తృణమూల్ కాంగ్రెస్ సంస్థాగత ఎన్నికల సందర్భంగా మమత మాట్లాడుతూ.. తన నకిలీ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారని, తన వ్యాఖ్యలను వక్రీకరిస్తున్నారని, మనమందరం కలసి వీటిని ఎదుర్కోవాలని అన్నారు. తాను గొడ్డు మాంస తింటున్నానని బీజేపీ వాళ్లు అసత్య ప్రచారం చేస్తున్నారని మమత చెప్పారు. ఏం తినాలన్నది తన ఇష్టమని, బీజేపీ నాయకులు కోట్లాది రూపాయలు వెచ్చించి సోషల్ మీడియా ద్వారా అసత్య ప్రచారం చేయిస్తున్నారన్నారు. తాను పూరి, ఢిల్లీ ఎక్కడికి వెళ్లినా తనను అడ్డుకునేందుకు బీజేపీ నాయకులు తమ కార్యకర్తలను పంపిస్తున్నారని చెప్పారు. -
బీజేపీతో మాకు ముప్పులేదు
భువనేశ్వర్: బీజేపీ నుంచి ప్రాంతీయ పార్టీలకు ముప్పు ఉందని తాను భావించడం లేదని టీఎంసీ అధినేత్రి, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. బీజేపీని ఎదుర్కొనే సత్తా ప్రాంతీయ పార్టీలకు ఉందని పేర్నొన్నారు. గురువారం భువనేశ్వర్ వచ్చిన మమత.. ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌తో సమావేశమయ్యారు. ఒడిశాలో బిజూ జనదళ్ అధికారంలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ రెండు రాష్ట్రాల్లో పాగా వేయాలని బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా వ్యూహాలు రచిస్తున్నారు. భువనేశ్వర్‌లో ఇటీవల బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఒడిశా, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రులు భేటీ కావడం ప్రాధాన్యం ఏర్పడింది. మమత, పట్నాయక్ ఇద్దరూ 15 నిమిషాలు సమావేశమయ్యారు. రాజకీయాల గురించి చర్చించలేదని, మర్యాదపూర్వకంగా పట్నాయక్‌ను కలిశానని మమత చెప్పినా.. బీజేపీకి వ్యతిరేకంగా ఓ కూటమిని ఏర్పాటు చేసే దిశగా మంతనాలు జరిపినట్టు భావిస్తున్నారు. ఈ సందర్బంగా మమత బీజేపీపై విమర్శలు చేశారు. బీజేపీ.. ప్రతిఒక్కరిని, ప్రజలను, రాజకీయ పార్టీలను కూడా విభజిస్తోందని ఆమె వ్యాఖ్యానించారు. కొన్ని చోట్ల ఎమ్మెల్యేలను, మంత్రులను కొనుగోలు చేస్తున్నారని ఆరోపించారు. 2019లో ఒడిశా, 2021లో పశ్చిమబెంగాల్ అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్నాయి.