బీజేపీ నాపై దుష్ప్రచారం చేయిస్తోంది | Mamata: BJP spreading canards that I eat beef | Sakshi
Sakshi News home page

బీజేపీ నాపై దుష్ప్రచారం చేయిస్తోంది

Published Fri, Apr 21 2017 6:33 PM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM

బీజేపీ నాపై దుష్ప్రచారం చేయిస్తోంది - Sakshi

బీజేపీ నాపై దుష్ప్రచారం చేయిస్తోంది

కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మరోసారి బీజేపీపై తీవ్ర విమర్శలు చేశారు. తన ప్రతిష్టను దెబ్బతీసేందుకు బీజేపీ కోట్లాది రూపాయలు వెచ్చించి సోషల్‌ మీడియాలో దుష్ప్రచారం చేయిస్తోందని ఆమె ఆరోపించారు.

తృణమూల్‌ కాంగ్రెస్‌ సంస్థాగత ఎన్నికల సందర్భంగా మమత మాట్లాడుతూ.. తన నకిలీ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారని, తన వ్యాఖ్యలను వక్రీకరిస్తున్నారని, మనమందరం కలసి వీటిని ఎదుర్కోవాలని అన్నారు. తాను గొడ్డు మాంస తింటున్నానని బీజేపీ వాళ్లు అసత్య ప్రచారం చేస్తున్నారని మమత చెప్పారు. ఏం తినాలన్నది తన ఇష్టమని, బీజేపీ నాయకులు కోట్లాది రూపాయలు వెచ్చించి సోషల్ మీడియా ద్వారా అసత్య ప్రచారం చేయిస్తున్నారన్నారు. తాను పూరి, ఢిల్లీ ఎక్కడికి వెళ్లినా తనను అడ్డుకునేందుకు బీజేపీ నాయకులు తమ కార్యకర్తలను పంపిస్తున్నారని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement