
మాటలు రావడం లేదు: సీఎం
కోల్ కతా: జమ్మూకశ్మీర్ లోని యూరి సైనిక స్థావరంపై ఉగ్రవాదులు దాడికి పాల్పడడాన్ని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్రంగా ఖండించారు. ముష్కరుల దాడిలో వీర మరణం పొందిన సైనికులకు ప్రగాఢ సంతాపం ప్రకటించారు. తమ రాష్ట్రానికి చెందిన బిశ్వజిత్ గొరాయ్, గంగాధర్ దులాయ్ అనే సైనికులు అమరుడయ్యారని తెలిపారు.
‘యూరి ఉగ్రదాడిలో 17 మంది సైనికులు వీర మరణం పొందారు. ఈ బాధను వెల్లడించడానికి మాటలు రావడం లేదు. అమరజవాన్లను జోహార్లు. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి’ అని మమతా బెనర్జీ ట్వీట్ చేశారు. అమరవీరుల త్యాగాన్ని జాతి స్మరించుకుంటోందని పేర్కొన్నారు. హౌరా జిల్లాలోని జమునాబాలియా గంగాధర్ స్వస్థలం. బిశ్వజిత్.. 24 పరణాల జిల్లాలోని గంగాసాగర్ ప్రాంతానికి చెందిన వారు.
No words can take away the pain of the 17 families who lost their loved ones in #Uri. India's brave soldiers, salutes.
— Mamata Banerjee (@MamataOfficial) 19 September 2016