హసీనాతో మమతా భేటీ | Mamata invites Bangladesh PM to visit West Bengal | Sakshi
Sakshi News home page

హసీనాతో మమతా భేటీ

Published Sat, Feb 21 2015 9:55 PM | Last Updated on Sun, Apr 7 2019 4:37 PM

హసీనాతో మమతా భేటీ - Sakshi

హసీనాతో మమతా భేటీ

ఢాకా: బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాతో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ శనివారం ఆ దేశ రాజధాని ఢాకాలో సమావేశమయ్యారు.  దాదాపు 30 నిముషాలు పాటు సాగిన ఆ భేటీలో తీస్తా నదీ జలాలు, సరిహద్దుల ఒప్పందం తదితర పలు అంశాలు ఈ సందర్బంగా ఇరువురి మధ్య చర్చకు వచ్చినట్లు సమాచారం.

పశ్చిమ బెంగాల్ రాష్ట్రాన్ని సందర్శించాలని హసీనాను కోరగా... అందుకు ఆమె సానుకూలంగా స్పందించారని మమతా శనివారం ట్విట్ చేశారు. మూడు రోజుల పర్యటన నిమిత్తం మమతా బెనర్జీ గురువారం బంగ్లాదేశ్ వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే నితీష్ కుమార్ బీహార్ ముఖ్యమంత్రిగా ఆదివారం ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మమతా బెనర్జీ హాజరుకానున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement