Bangladesh PM
-
సీఎం మమతా బెనర్జీకి బంగ్లాదేశ్ సూపర్ కానుక..!
పశ్చిమ బెంగాల్: పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా ఓ మంచి కానుకను పంపించారు. 600 కేజీల మామిడి పండ్లను కానుకగా బహుకరించారు. హిమాసాగర్, లంగ్రా రకాలకు చెందిన మామిడి పండ్లను కానుకగా పంపించినట్లు అధికారులు తెలిపారు. గత ఏడాది కూడా ఇలాంటి బహుమతినే ఇచ్చినట్లు బంగ్లాదేశ్ డిప్యూటీ హైకమిషనర్ గుర్తుచేశారు. దౌత్య సంబంధాల్లో భాగంగానే ఈ మేరకు కానుకలు పంపినట్లు స్పష్టం చేశారు. మమతా బెనర్జీతో పాటు ఈశాన్య రాష్ట్రాలకు చెందిన సీఎంలకు కూడా షేక్ హసీనా బహుమతిగా మామిడి పండ్లను పంపించారు. గత ఏడాది ప్రధాని నరేంద్ర మోదీ, మమతా బెనర్జీ, త్రిపుర, అసోం సీఎంలకు కానుకగా మామిడి పండ్లను బహుకరించారు. ఇదీ చదవండి:‘220 నెలల్లో 225 కుంభకోణాలు.. అది బీజేపి ఘనత’ -
బంగ్లా ప్రధానిగా హసీనా ప్రమాణం
ఢాకా: నాలుగోసారి బంగ్లాదేశ్ ప్రధానమంత్రిగా ఎన్నికైన ఆవామీ లీగ్ అధినేత షేక్ హసీనా సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. బంగ్లా అధ్యక్షుడు మహ్మద్ అబ్దుల్ హమీద్ హసీనాతో బంగాభవన్‌లో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం 24 మంది కేబినెట్ మంత్రులుగా, 19 సహాయ మంత్రు లుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈసారి కేబినెట్లో 31 మంది కొత్తవారికి అవకాశం కల్పించారు. ఆవామీ లీగ్‌తో జతకట్టిన కూటమి పార్టీలకు చెందిన మాజీ మంత్రులకు స్థానం కల్పించలేదు. ఆవామీ లీగ్‌కు చెందిన వారిని మాత్రమే మంత్రులుగా ఎంపిక చేశారు. వరుసగా మూడుసార్లు, మొత్తంగా 4సార్లు బంగ్లాకు ప్రధానిగా ఎన్నికై హసీనా రికార్డు సృష్టించారు. 1996, 2008, 2014వ సంవత్సరాల్లో ఆమె ప్రధానిగా ఎన్నికయ్యారు. ఇటీవల జరిగిన బంగ్లాదేశ్ 11వ పార్లమెంటు ఎన్నికల్లో హసీనా నేతృత్వంలోని మహాకూటమి ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో మహాకూటమి 96% సీట్లను సాధించింది. ఈ ఎన్నికల్లో గెలిచేందుకు రిగ్గింగ్‌కు పాల్పడ్డారని, ఓటర్లను భయపెట్టి హింసకు పాల్పడ్డారని ప్రతిపక్షాలు చేసిన ఆరోపణలను హసీనా ఖండించారు. ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీ వారిపై దాడులకు పాల్పడటం, హింస చెలరేగడంపై ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తంచేసింది. -
బ్రిటన్ ఎంపీ వీసా రద్దు
న్యూఢిల్లీ: బ్రిటన్ ఎంపీ, బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలేదా జియా లాయర్ అయిన లార్డ్ అలెగ్జాండర్ కార్లైల్ వీసాను భారతప్రభుత్వం రద్దు చేసింది. మీడియా సమావేశం ద్వారా భారత్–బంగ్లా సంబంధాల్లో సమస్యలను సృష్టించాలని చూస్తున్నారనే కారణాలతో గత రాత్రి బ్రిటన్ నుంచి ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకున్న కార్లైల్‌ను వెనక్కి పంపించింది. ‘కార్లైల్ మీడియా సమావేశంలో మాట్లాడటం వీసా నిబంధనలకు విరుద్ధం. రాజకీయ కార్యకలాపాలకు పాల్పడే వారికి ఏ దేశమూ వీసా ఇవ్వదు. ఆయనకు జారీ చేసిన బిజినెస్ వీసాతో మీడియా సమావేశం నిర్వహించరాదు. మూడో దేశానికి సంబంధించిన వ్యవహారాలపై మాట్లాడేందుకు ఓ విదేశీయుడిని భారత్ ఎలా అనుమతిస్తుంది?’ అని విదేశాంగ శాఖ అధికారులు పేర్కొన్నారు. -
బంగ్లాలో ప్రభుత్వ కొలువుల్లో రిజర్వేషన్లు రద్దు
ఢాకా: ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ విధానాన్ని రద్దు చేస్తున్నట్లు బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా ప్రకటించారు. రిజర్వేషన్ విధానంలో సంస్కరణలు తేవాలంటూ విద్యార్థులు, నిరుద్యోగులు చేపట్టిన ఆందోళనలు నాలుగో రోజుకు చేరుకున్నాయి. బుధవారం ఢాకా ఆందోళనలతో అట్టుడికింది. ఈ నేపథ్యంలోనే ప్రధాని పార్లమెంట్లో ఈమేరకు ప్రకటన చేశారు. డిమాండ్లను పరిశీలిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిన తర్వాత కూడా ఆందోళనలు కొనసాగించటం తగదన్నారు. ఢాకా వర్సిటీ వైస్ఛాన్సెలర్పై దాడిని ఆమె ఖండించారు. ప్రస్తుతం ఉన్న రిజర్వేషన్ విధానం ప్రకారం.. 56% ప్రభుత్వ ఉద్యోగాలను స్వాతంత్య్ర సమర యోధుల పిల్లలు, మహిళలు, మైనారిటీలు, వికలాంగులు, వెనుకబడిన జిల్లాల వారికి కేటాయిస్తున్నారు. -
హసీనాతో మమతా భేటీ
ఢాకా: బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాతో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ శనివారం ఆ దేశ రాజధాని ఢాకాలో సమావేశమయ్యారు. దాదాపు 30 నిముషాలు పాటు సాగిన ఆ భేటీలో తీస్తా నదీ జలాలు, సరిహద్దుల ఒప్పందం తదితర పలు అంశాలు ఈ సందర్బంగా ఇరువురి మధ్య చర్చకు వచ్చినట్లు సమాచారం. పశ్చిమ బెంగాల్ రాష్ట్రాన్ని సందర్శించాలని హసీనాను కోరగా... అందుకు ఆమె సానుకూలంగా స్పందించారని మమతా శనివారం ట్విట్ చేశారు. మూడు రోజుల పర్యటన నిమిత్తం మమతా బెనర్జీ గురువారం బంగ్లాదేశ్ వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే నితీష్ కుమార్ బీహార్ ముఖ్యమంత్రిగా ఆదివారం ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మమతా బెనర్జీ హాజరుకానున్నారు.