పశ్చిమ బెంగాల్: పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా ఓ మంచి కానుకను పంపించారు. 600 కేజీల మామిడి పండ్లను కానుకగా బహుకరించారు. హిమాసాగర్, లంగ్రా రకాలకు చెందిన మామిడి పండ్లను కానుకగా పంపించినట్లు అధికారులు తెలిపారు. గత ఏడాది కూడా ఇలాంటి బహుమతినే ఇచ్చినట్లు బంగ్లాదేశ్ డిప్యూటీ హైకమిషనర్ గుర్తుచేశారు. దౌత్య సంబంధాల్లో భాగంగానే ఈ మేరకు కానుకలు పంపినట్లు స్పష్టం చేశారు.
మమతా బెనర్జీతో పాటు ఈశాన్య రాష్ట్రాలకు చెందిన సీఎంలకు కూడా షేక్ హసీనా బహుమతిగా మామిడి పండ్లను పంపించారు. గత ఏడాది ప్రధాని నరేంద్ర మోదీ, మమతా బెనర్జీ, త్రిపుర, అసోం సీఎంలకు కానుకగా మామిడి పండ్లను బహుకరించారు.
Comments
Please login to add a commentAdd a comment