కోల్‌కతా: వివిధ సంక్షేమ పథకాలకు సంబంధించి కేంద్రప్రభుత్వం నుంచి పశి్చమబెంగాల్ రాష్ట్రానికి రావాల్సిన బకాయిలపై ఇక ఎవరినీ అడిగేదిలేదని, తామే చెల్లిస్తామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రకటించారు. కేంద్రం నుంచి రావాల్సిన బకాయిలపై కోల్‌కతాలో శుక్రవారం నుంచి 48 గంటల ధర్నాకు దిగిన మమత శనివారం మాట్లాడారు.
‘‘ ఇకపై మేం బీజేపీ ప్రభుత్వాన్ని దేహీ అని అడుక్కోవాలనుకోవట్లేదు. వాళ్ల భిక్ష మాకు అక్కర్లేదు. రాష్ట్రంలో ఉపాధి హామీ పనులు చేసి కేంద్రం నుంచి బకాయిల కోసం ఎదురుచూస్తున్న 21 లక్షల మంది కారి్మకుల ఖాతాలకు ఆ మొత్తాలను ఫిబ్రవరి 21కల్లా మా ప్రభుత్వమే చెల్లిస్తుంది. ఆవాస్ యోజన పథకంపైనా త్వరలో నిర్ణయం తీసుకుంటాం’’ అన్నారు.
ధర్నా వద్దే మమత రాత్రి బస
ధర్నాకు దిగిన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ శుక్రవారం రాత్రంతా ధర్నా స్థలి వద్దే గడిపారు. అక్కడే నిద్రించి ఉదయం మారి్నంగ్‌వాక్‌కు వెళ్లారు.
Comments
Please login to add a commentAdd a comment