![Lok sabha elections 2024: West Bengal CM Mamata Banerjee accuses BJP of not following Moral Code of Conduct - Sakshi](/styles/webp/s3/article_images/2024/04/5/mamatha-benargee.jpg.webp?itok=ppgAVcFl)
కూచ్‌బెహార్/మాల్‌బజార్: ఎన్నికల ప్రవర్తనా నియమావళిని బీజేపీ పాటించడం లేదని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు. విష పూరిత పామునయినా నమ్మొచ్చేమోగానీ, కాషాయదళాన్ని మాత్రం విశ్వసించరాదన్నారు. ఆవాస్ యోజన కింద పేర్లు నమోదు చేసుకోవాలని కేంద్రం కోరితే గుడ్డిగా నమ్మొద్దని ప్రజలను కోరారు.
బీజేపీ దేశాన్ని నాశనం చేస్తోందని మండిపడ్డారు. బీజేపీకి ఒకే దేశం, ఒకే పార్టీ సిద్ధాంతంపై మాత్రమే నమ్మకం ఉందని వ్యాఖ్యానించారు. దర్యాప్తు సంస్థలతోపాటు బీఎస్‌ఎఫ్, సీఐఎస్‌ఎఫ్‌లు కూడా కేంద్ర ప్రభుత్వ కనుసన్నల్లోనే పనిచేస్తున్నాయని ఆరోపించారు. ఇటువంటి వాటికి తాము తలొంచబోమని తెగేసి చెప్పారు. అన్ని పార్టీలనూ సమానంగా చూడాలని ఈసీని కోరతామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment