మాట్లాడుతున్న నల్లా సూర్యప్రకాష్
కందుకూరు: రాష్ట్రంలో దొరల, నియంత పాలన కొనసాగుతుందని.. బహుజనులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని బహుజన లెఫ్ట్ ఫ్రంట్(బీఎల్‌ఎఫ్) రాష్ట్ర చైర్మన్ నల్లా సూర్యప్రకాష్ విమర్శించారు. గురువారం మండల కేంద్రంలోని ముదిరాజ్ భవన్‌లో డి.రాంచందర్ అధ్యక్షతన మహేశ్వరం నియోజకవర్గం సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. టీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు ప్రత్యామ్నాయంగా తెలంగాణలో బహుజన లెఫ్ట్ ఫ్రంట్ ఏర్పడిందన్నారు. సామాజిక న్యాయం జరగకుండా రాష్ట్రంలో సమగ్ర అభివృద్ధి సాధ్యం కాదన్నారు. 93 శాతం ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఎంబీసీ, మైనార్టీలు సామాజికంగా, రాజకీయంగా ఆర్థికంగా అణచివేయబడ్డారన్నారు.
తరతరాలుగా దోపిడీకి గురవుతూ, రాజ్యాధికారానికి దూరంగా ఉంటూ 7 శాతం ఉన్న అగ్రవర్ణాల చేతిలో కీలుబొమ్మలుగా మారుతున్నారన్నారు. పేద, బడుగు, బలహీన వర్గాలకు బీఎల్‌ఎఫ్‌తోనే న్యాయం జరుగుతుందన్నారు.
అందరూ ఏకమై బీఎల్‌ఎఫ్ కిందకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో రాష్ట్ర బీఎల్‌ఎఫ్ నాయకులు మన్నారం నాగరాజు, జి.రమేష్, జిల్లా బాధ్యులు భూపాల్, వైఎస్సార్‌సీపీ నాయకుడు వెంకటప్రసాద్, సీపీఎం నాయకులు బి.దత్తునాయక్, ఎ.రవికుమార్, ఎ.కుమార్, బి.శ్రీనివాస్, కేవీపీఎస్ జిల్లా అధ్యక్షుడు అశోక్, పూలగాజుల జంగయ్య, ఎమ్పార్పీఎస్ నాయకులు పి.సంజీవ, ఎం.నర్సింహ, రమేష్, యాద య్య, యాదగిరిచారి, శ్రీనివాస్ పాల్గొన్నారు.
డివిజన్ కమిటీ ఎన్నిక...
ఈ సందర్భంగా బీఎల్‌ఎఫ్ డివిజన్ కమిటీని ఎన్నుకుని ప్రకటించారు. కన్వీనర్‌గా డి.రాంచందర్, సభ్యులుగా ఎ.రవికుమార్, ఎ.కుమార్, ఎం.యాదయ్య, బి.శ్రీనివాస్, యాదగిరిచారి, ఎం.శ్రీనివాస్, సంధ్య, పి.సంజీవ, ఎం.నర్సింహా, వి.శంకర్, గురవయ్య, రమేష్, పి.జంగయ్య లను ఎన్నుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment