
రంగారెడ్డి, సాక్షి: పేదలకు ఇచ్చిన భూములను ఆక్రమించిన రామోజీ ఫిల్మ్ సిటీ(Ramoji Film City) యాజమాన్యానికి అల్టిమేటం జారీ అయ్యింది. వైఎస్సార్ హయాంలో ప్రభుత్వం ఇచ్చిన భూముల్ని ఆర్‌ఎఫ్‌సీ యాజమాన్యం తమ గుప్పిటే ఉంచుకుంది. అయితే.. తమ భూములు తమకు ఇవ్వకపోతే ఫిల్మ్ సిటీని ముస్తామని పేద లబ్ధిదారులు హెచ్చరించారు.
తాజాగా.. సీపీఎం ఆధ్వర్యంలో లబ్ధిదారులు రంగారెడ్డి కలెక్టరేట్(Rangareddy Collectorate) ఎదుట ఆందోళన చేపట్టారు. ఈ నేపథ్యంతో.. నేడు చర్చల కోసం ఇరు వర్గాలను ఆర్డీవో ఆహ్వానించారు. అయితే.. చర్చలకు రాకుండా ఆర్‌ఎఫ్‌సీ యాజమాన్యం డుమ్మా కొట్టింది. ఈ పరిణామంతో బాధితులు మరోసారి ఆందోళకు దిగారు.
ఈ పరిణామాన్ని ఆర్డీవో తీవ్రంగా పరిగణించారు. గురువారం చర్చలకు ఖచ్చితంగా రావాల్సిందేనంటూ ఆర్‌ఎఫ్‌సీ యాజమాన్యానికి ఆదేశాలు జారీ చేశారాయన. మరోవైపు.. ప్రత్యామ్నాయ భూములు ఇస్తామని RFC యాజమాన్యం లిఖిత పూర్వకంగా హామీ ఇచ్చిందని, ఏడాది కాలంగా సమస్య పరిష్కారం చేయకుండా సాగదీస్తోందని బాధితులు వాపోతున్నారు. రేపు చర్చల్లో పాల్గొని తమ స్థలాలను చూపించకపోతే గనుక.. రామోజీ ఫిల్మ్ సిటీని ముట్టడిస్తామన్న సీపీఎం(CPM) నేతలు, లబ్ది దారులు హెచ్చరికలు జారీ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment