
రామోజీ ఫిలింసిటీలో ఉద్రిక్తత నెలకొంది. రామోజీరావు ఫిలింసిటీని సీపీఎం నేతలు ముట్టడించారు.
సాక్షి, హైదరాబాద్: రామోజీ ఫిలింసిటీలో ఉద్రిక్తత నెలకొంది. రామోజీరావు ఫిలింసిటీని సీపీఎం నేతలు ముట్టడించారు. రామోజీ ఫిలింసిటీ గేట్లు దూకి సీపీఎం నేతలు లోపలికి వెళ్లారు. పేదల భూములను ఫిలిం సిటీ యాజమాన్యం ఆక్రమించగా.. బాధితులతో కలిసి ఆక్రమిత స్థలంలో సీపీఎం నిరసన చేపట్టింది. ఈ క్రమంలో సీపీఎం నేతలకు, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పలువురు సీపీఎం నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. తోపులాటలో మహిళ స్పృహ తప్పిపోయింది.

కాగా, సీపీఎం ఇవాల ఛలో రామోజీ ఫిలిం సిటీకి పిలుపునిచ్చింది.. పేదలకు ఇచ్చిన భూములను రామోజీ ఫిల్మ్ సిటీ యాజమాన్యం ఆక్రమించింది. ప్రత్యామ్నాయ భూములు ఇస్తామని చెప్పి ఆర్‌ఎఫ్‌సీ యాజమాన్యం లిఖిత పూర్వకంగా హామీ ఇచ్చింది. ఏడాది కాలంగా సమస్య పరిష్కారం చేయకుండా ఆర్‌ఎఫ్‌సీ యాజమాన్యం సాగదీస్తోంది.

ఇటీవల కలెక్టరేట్ ముందు బాధితులతో కలిసి సీపీఎం ధర్నా కూడా నిర్వహించింది. ముడు దఫాలుగా ఫిలిం సిటీ యాజమాన్యంతో చర్చలు జరిపిన ఫలితం లేకపోవడంతో నేడు ఛలో ఫిలిం సిటీకి పిలుపునిచ్చింది. చర్చలు జరిపి తమకు ఇంటి స్థలాన్ని చూపించకపోతే ఫిలింసిటీని ముట్టడిస్తామని సీపీఎం నేతలు ముందే హెచ్చరించారు.
