surya prakash
-
ఎన్నికల ఫలితాలపై పిల్లి సూర్యప్రకాష్ రియాక్షన్
-
బాబు, పవన్ కు ఊహించని షాక్..
-
జనసేనకు షాకిచ్చిన హరిరామజోగయ్య కుమారుడు సూర్యప్రకాష్.. వైఎస్సార్సీపీలో చేరిక
-
వైఎస్ఆర్ సీపీలోకి హరిరామజోగయ్య కొడుకు చేగొండి సూర్య ప్రకాష్
-
పవన్ అసమర్థుడు.. జగన్ గట్స్ ఉన్న లీడర్
సాక్షి, గుంటూరు: జనసేనకు భారీ షాక్ తగిలింది. ఆ పార్టీని వీడిన చేగొండి సూర్యప్రకాష్ వైఎస్సార్సీపీలో చేరారు. శుక్రవారం సాయంత్రం తాడేపల్లిలోని సీఎం కార్యాలయానికి వచ్చిన ఆయన.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో వైఎస్సార్సీపీ కండువా కప్పుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జనసేనాని తీరును ఎండగట్టారు. పార్టీ నేతలతో కూడా మాట్లాడే టైం లేదా?.. కనీసం పార్టీ బూత్ కమిటీలను ఏర్పాటు చేయలేరా? అని పవన్‌ను ప్రశ్నించారు సూర్యప్రకాశ్. ‘‘జనసేనలో నేను పని చేసిన ఈ ఆరేళ్లలో అరగంట మాత్రమే నాతో పవన్ మాట్లాడారు. పార్టీని బలోపేతం చేసే ప్రయత్నం ఏమాత్రం చేయకపోగా.. చంద్రబాబును సీఎంను చేయాలనే ఆరాటపడ్డారు. సామాజిక న్యాయం గురించి పవన్‌కు ఏమాత్రం తెలియదు. జనసేనలో మాట్లాడే స్వేచ్ఛ ఉండదు’’ అని సూర్యప్రకాష్ అన్నారు. .. పవన్ కల్యాణ్‌ని నమ్మి గతంలో జనసేనలో చేరాను. పవన్ బడుగు, బలహీన వర్గాలకు దగ్గరగా ఉంటారనుకున్నా. ఏ ఆశలతో వెళ్లానో ఆ ఆశలన్నీ నీరు గార్చారు. పైకి కనిపించే పవన్ వేరు, తెర వెనుక వేరే. నేతలకు కూడా పవన్ విలువ ఇవ్వరు. చంద్రబాబునో, లోకేష్‌నో సీఎం చేయటానికే పవన్ పనిచేస్తున్నారు. అంతేతప్ప పార్టీ అభివృద్ధి కోసం పని చేయలేదు. పార్టీని నమ్ముకున్న వారంతా పవన్‌ని నమ్మి మోసపోయారు. ఇంట్లోకి కూడా కనీసం ఆహ్వానించరు. సినిమా హాల్లో టికెట్ కొనుక్కున్నట్టు ఇంటి బయట నిలబడాలి. పీఏసీ సభ్యుడిగా ఉన్నా.. స్వేచ్ఛగా మాట్లాడే అవకాశం ఏనాడూ నాకు ఇవ్వలేదు. ఆయన నాదెండ్ల మనోహర్ చెప్పే మాటలు తప్ప ఎవరి మాటలూ వినరు. సలహాలు సూచనలు ఇవ్వొద్దనే నాయకుడ్ని పవన్నే చూశా. ఇలాంటి వ్యక్తి పార్టీని నడిపేకంటే క్లోజ్ చేసి ఇంట్లో కూర్చుంటే మంచిది. అవసరం ఉన్నంతసేపు హరిరామజోగయ్యని వాడుకున్నారు. టీడీపీతో పొత్తు పెట్టుకున్నాక జోగయ్యను ఎందుకు వదిలేశారు?. ఏం లబ్ది చేకూరటం వలన చంద్రబాబు పంచన చేరారు?.. .. సలహాలు ఇచ్చేవారిని వైఎస్సార్సీపీ కోవర్టులంటూ పవన్ బహిరంగంగా అన్నారని.. ఏం ఆశించి పార్టీ పెట్టారో పవన్‌కే క్లారిటీ లేదని అన్నారు. వచ్చే ఎన్నికలలో ప్రజలు తగిన గుణపాఠం చెప్తారు. మనసు చంపుకుని ఆ పార్టీలో ఉండలేక.. ఇవాళే పార్టీ ప్రాథమిక సభ్యత్వాన్ని.. పదవికి రాజీనామా ఈ ఉదయమే పంపించానని చెప్పారాయన. బేషరతుగా వైఎస్సార్సీపీలో చేరానని చెప్పారాయన. ‘‘ఆ పార్టీలో ఉండటం మనసొప్పక జనసేన నుండి బయటకు వచ్చాను. జగన్ గట్స్ ఉన్న లీడర్. అలాంటి నాయకుని వెనుక నడవాలని అనుకుంటున్నా. ఏమీ ఆశించకుండా పార్టీలో జాయిన్ అయ్యాను. క్రమశిక్షణ గల నేతగా వైఎస్సార్సీపీ కోసం పని చేస్తానని.. ఇక నుంచి నా ప్రయాణం వైఎస్ జగన్మోహన్రెడ్డి వెంటే అని సూర్యప్రకాశ్ చెప్పారు. మాజీ ఎంపీ, కాపు సంక్షేమ సంఘం అధ్యక్షుడు హరిరామ జోగయ్య కుమారుడే ఈ సూర్య ప్రకాష్. జనసేనలో గత కొన్నేళ్లుగా కీలక నేతగా వ్యవహరిస్తూ వచ్చారాయన. ఇక.. పొత్తులో భాగంగా జనసేన తరఫున 24 సీట్లు దక్కించుకున్న పవన్‌పై హరిరామ జోగయ్య తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్న సంగతి తెలిసిందే. -
నాపై చేసిన ఆరోపణలు అవాస్తవం: నిట్ డైరెక్టర్
సాక్షి, అమరావతి : మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు తనపై చేసిన వ్యాఖ్యలు అవాస్తవమని తాడేపల్లిగూడెం నిట్ డైరెక్టర్ ప్రొఫెసర్ సి. సూర్య ప్రకాష్ రావు స్పష్టం చేశారు. యూట్యూబ్‌లో వచ్చిన ఫేక్ వీడియో ఆధారంగా పీహెచ్డీ పట్టాలకు అయిదు లక్షలు డిమాండ్ చేసినట్లు, లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆదివారం పైడికొండల మాణిక్యాల రావు ఆరోపణలు చేశారు. సోమవారం తాడేపల్లిగూడెంలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఎన్ఐటీ)లో విలేకరుల సమావేశంలో ఈ విషయంపై సూర్యప్రకాశ్ మాట్లాడుతూ..తమ వాళ్లకు ఉద్యోగాలు, కాంట్రాక్టులు ఇవ్వడం లేదనే దురుద్ధేశంతోని తనను ఉద్యోగం నుంచి తప్పించడానికి బురద చల్లుతున్నారని మండిపడ్డారు. ఓ వీడియోను పూర్తిగా ట్యాపింగ్ చేసి, మాటలను ఎడిట్ చేసి యూట్యూబ్‌లో పెట్టారని విమర్శించారు. ఎవరో చెప్పిన మాటలను, ఎడిట్ చేసిన వీడియోలను నమ్మి మాజీ మంత్రి పైడి కొండల ఇలా ఆరోపణలు చేయడం దారుణమన్నారు. మీమీద విమర్శలు వస్తున్నాయని తనను పిలిచి అడిగి ఉంటే బాగుండేదన్నారు. ఒకవేళ తన మీద వచ్చిన ఆరోపణలు వాస్తవమని తేలితే పదవి నుంచి వైదులుగుతానని పేర్కొన్నారు. ఈ ఘటనపై వెంటనే చర్యలు తీసుకోవాలని హెచ్ఆర్డీకి లేఖ రాశానని తెలిపారు. స్టేట్ ఫోరెన్సిక్ ల్యాబ్‌కు ఈ వీడియో పంపిస్తున్నట్లు, దీనిపై సైబర్ కక్రైం కేసు పెట్టనున్నట్లు వెల్లడించారు -
సీఎంవో కార్యాలయ ఉద్యోగి అంటూ వసూళ్లు..
సాక్షి, సిద్ధిపేట : తెలంగాణ సీఎంవో కార్యాలయ ఉద్యోగి పేరుతో అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న మోసగాడు రాయబండి సూర్యప్రకాశ్‌ను టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయం ఉద్యోగిగా చెలమణి అవుతూ అతగాడు ప్రభుత్వ ఉద్యోగుల నుంచి అందినకాడికి దోచుకుంటున్నాడు. మీడియా సమావేశాలు, అన్నదానాల పేరుతో భారీగా డబ్బులు వసూలు చేసేవాడు. అలాగే సిద్ధిపేట సబ్ రిజిస్ట్రార్‌ను రూ.50వేలు ఇవ్వాలంటూ ఫోన్లో బెదిరింపులకు పాల్పడ్డాడు.సదరు వ్యక్తిపై అనుమానం వచ్చిన సబ్ రిజిస్ట్రార్ పోలీసులకు ఫిర్యాదు చేయడంత అసలు విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు కేసు నమోదు చేసి, నిందితుడిని కోర్టులో హాజరు పరిచారు. ఇప్పటికే సూర్యప్రకాశ్‌పై 11 కేసులు ఉన్నట్లు సమాచారం. -
ప్రముఖ చిత్రకారుడు సూర్యప్రకాష్ కన్నుమూత
సాక్షి, హైదరాబాద్: ఎండిపోయిన ఆకుల్లో జీవం చూశాడు. ఆ జీవమే ఆయనకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చిపెట్టింది. లలిత కళా అకాడమీ పురస్కారం కూడా అందుకునేలా చేసింది. విలక్షణమైన శైలితో ఆధునిక చిత్రకళను సమున్నతంగా ఆవిష్కరించిన ప్రముఖ చిత్రకారుడు సూర్యప్రకాష్ (80) హైదరాబాద్‌లోని ఆయన స్వగృహంలో కన్నుమూశారు. బుధవారం ఉదయం ఆయనకు గుండెపోటు రావడంతో వెంటనే ఆస్పత్రికి తరలించినప్పటికీ ఫలితం లేకుండా పోయిందని కుటుంబసభ్యులు తెలిపారు. ఆయనకు భార్య, కూతురు ఉన్నారు. కూతురు చాలా రోజుల క్రితమే చనిపోయారు. బుధవారం సాయంత్రం ఫిల్మ్‌నగర్‌లోని మహాప్రస్థానంలో ఆయన అంత్యక్రియలు నిర్వహించారు. ప్రముఖ చిత్రకారులు లక్ష్మాగౌడ్, తోట వైకుం ఠం, లక్ష్మణ్ ఏలే, ఎల్వీప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ చైర్మన్ గుళ్లపల్లి ఎన్ రావు, డాక్టర్ రమేశ్ ప్రసాద్, పలువురు వైద్యులు, చిత్రకారులు అంత్యక్రియల్లో పాల్గొని నివా ళులర్పించారు. చిత్రకళా రంగంలో అపారమైన అనుభవం ఉన్న ఆయన ఎంతోమందికి మార్గదర్శకులు గా నిలిచారని వారు కొనియాడారు. ఆయన మరణం చిత్రకళా రంగానికి తీరని లోటని అన్నారు. ఖమ్మం జిల్లా మధిరలో పుట్టి పెరిగిన ఆయన హైదరాబాద్‌లో స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారు. సీసీఎంబీతో మొదలు.. మొదట సీసీఎంబీకి రెసిడెన్షియల్ ఆర్టిస్టుగా పని చేశారు. ఎన్నో అపురూప చిత్రకళా ఖండాలను గీయడంతోపాటు ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. ఆ తర్వాత ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రిలో రెసిడెంట్ ఆర్టిస్టుగా చేరారు. ప్రముఖ చిత్రకారులు లక్ష్మాగౌడ్, తోట వైకుంఠ, దేవరాజ్‌లకు ఆయన సీనియర్. జేఎన్టీయూలో చదువుకునే రోజుల్లో హైదరాబాద్‌లోని ఇరుకు గల్లీలను వాస్తవిక ధోరణిలో చిత్రీకరించే వారు. చదువు పూర్తయ్యాక అప్రెంటిస్ కోసం ఢిల్లీలో ఉండే ప్రముఖ చిత్రకారుడు శ్రీరాం కుమార్ వద్దకు వెళ్లారు. ఆయన వద్ద శిష్యరికంతో తనలో దాగి ఉన్న అసలు సిసలు చిత్ర జగత్తు వెలుగులోకి వచ్చింది. ఆ రోజుల్లోనే పనికిరాని వస్తువులు, పారవేసిన చెత్త చెదారం నుంచి కళా సృజన చేశారు. ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చాక తనని ఆటోమొబైల్ స్క్రాప్ ఎంతగా ఆకర్షించిందంటే.. అదే తనకు దేశవ్యాప్తంగా గుర్తింపును తెచ్చి పెట్టింది. లలిత కళా అకాడమీ పురస్కారం అందుకునేలా చేసింది. అవశేషం, శిథిలం అనేవి సహజ ఉనికి అన్న భావన ఆయనలో స్థిరపడటం, అక్కడి నుంచి ఆయన స్థిరంగా తనను తాను అన్వేషించుకుని పోయేలా చేసింది. ఆటోమొబైల్ స్క్రాప్ తర్వాత ఆయనను వడలి పోయినవి, రాలిపోయిన ఆకులు ఎంతగానో ఆకర్షించాయి. వాటిని ‘డెడ్ లీవ్స్’అని అన్నప్పటికీ, ఆయనకు అవి మృత ప్రాయం కాదు. మృత్యువు కానే కాదు. ‘మృత్యువు కూడా విశ్వంలో ఒక జీవితమే’అని చెప్పేవారు. సీఎం కేసీఆర్ సంతాపం... చిత్రకారుడు సూర్యప్రకాశ్ మరణం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు సంతాపం వ్యక్తం చేశారు. తెలంగాణ చిత్రకళకు అంతర్జాతీయ స్థాయి ఖ్యాతిని తెచ్చి పెట్టిన చిత్రకారుడిగా సూర్యప్రకాశ్ చరిత్రలో నిలిచిపోతారని అన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. -
కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం
మేడ్చల్ జిల్లా: మేడ్చల్ పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్న సూర్యప్రకాశ్ అనే వ్యక్తి తన ఇంట్లో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఇటీవల సాధారణ బదిలీలో భాగంగా షామీర్పేట్ పోలీస్‌స్టేషన్ నుంచి మేడ్చల్ పోలీస్‌స్టేషన్‌కు బదిలీ అయ్యాడు. గత మూడు రోజులుగా విధులకు గైర్హాజరయ్యాడు. ఈ రోజు(శుక్రవారం) ఉదయం ఇంట్లో ఎవరూ లేని విషయం గమనించి ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించాడు. సరైన సమయంలో కుటుంబసభ్యులు గమనించడంతో వెంటనే సుచిత్ర సెంటర్లోని రష్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం కానిస్టేబుల్ పరిస్థితి నిలకడగా ఉంది. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. ఈ సంఘటనపై మాట్లాడటానికి పోలీసు అధికారులు నిరాకరించారు. -
సూర్య ది గ్రేట్
బుచ్చిరెడ్డిపాళెం : మల్లి మస్తాన్‌బాబు స్ఫూర్తితో పర్వతారోహణపై ఆసక్తి పెంచుకున్నాడు. ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. రెనాక్ పర్వతారోహణతో ముందుకు సాగాడు. సెట్నల్ ఆధ్వర్యంలో మిషన్ ఎవరెస్ట్‌కు జిల్లా నుంచి ఎంపికయ్యాడు. ఎవరెస్ట్ శిఖరాన్ని దిగ్విజయంగా అధిరోహించడం ద్వారా జిల్లా, రాష్ట్ర ఖ్యాతిని ప్రపంచానికి చాటాడు. అతడే బుచ్చిరెడ్డిపాళెం మండల పెనుబల్లికి చెందిన కోరికల వెంకట సూర్యప్రకాష్. నేడు స్వగ్రామానికి వస్తున్న సందర్భంగా ప్రత్యేక కథనం. బుచ్చిరెడ్డిపాళెం మండలం పెనుబల్లికి చెందిన కోరికల శ్రీనివాసులు, ఆదిశేషమ్మ దంపతుల రెండో సంతానం కోరికల వెంకట సూర్యప్రకాష్. శ్రీనివాసులు కోవూరు సహకార చక్కెర కర్మాగారంలో కూలీ కాగా, ఆదిశేషమ్మ అంగన్వాడీ కార్యకర్తగా పనిచేస్తోంది. కృష్ణచైతన్య కళాశాలలో ఎమ్మెస్సీ చదువుతున్న సూర్యప్రకాష్ చిన్నపట్నుంచి ఆటల్లో ముందుండేవాడు. కబడ్డీ, క్రికెట్లో జిల్లాస్థాయిల్లో సత్తా చాటాడు. మల్లి మస్తాన్‌బాబు స్ఫూర్తితో.. సంగం మండలం గాంధీజనసంఘం గ్రామానికి చెందిన దివంగత పర్వతారోహకుడు మల్లి మస్తాన్‌బాబు స్ఫూర్తితో సూర్యప్రకాష్ పర్వతారోహణపై ఆసక్తి పెంచుకున్నాడు. మల్లి మస్తాన్బాబులా దేశానికి మంచి పేరు తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. మల్లి మస్తాన్‌బాబు మృతితో కలత చెందిన సూర్యప్రకాష్ ఎలాగైనా పర్వతారోహణ చేయాలని నిర్ణయించుకున్నాడు. అనుకున్నదే తడువుగా పట్టుదల వదలకుండా నరసింహకొండపై 2015లో తరచూ ట్రెక్కింగ్, రాక్ క్లైంబింగ్ చేసేవాడు. జిల్లా యువజనుల శాఖ ఆధ్వర్యంలో 2016లో మిషన్ ఎవరెస్ట్‌కు ఎంపికయ్యాడు. అయితే తల్లిదండ్రులు వద్దనడంతో వచ్చేశాడు. అంతటితో ఆగక విజయవాడలోని సీబీఆర్ స్పోర్ట్స్ అకాడమీలో ట్రెక్కింగ్, రాక్ క్లైంబింగ్లో శిక్షణ పొందాడు. 2017లో నిమాస్లో బేసిక్ మౌంట్‌నీరింగ్ నేర్చుకున్నాడు. 2017 సెట్నల్ ఆధ్వర్యంలో మిషన్ ఎవరెస్ట్‌కు ఎంపికయ్యాడు. నేడు స్వగ్రామానికి రాక ఎవరెస్ట్ పర్వతారోహణ చేసిన సూర్యప్రకాష్ విజయవాడలోని శిక్షణ కేంద్రం నుంచి బయల్దేరి మంగళవారం ఉదయం నెల్లూరు చేరుకుంటారు. నెల్లూరులో సూర్యప్రకాష్‌ను కలెక్టర్ రేవు ముత్యాలరాజు సన్మానించనున్నారు. అనంతరం బుచ్చిరెడ్డిపాళేనికి బయల్దేరి వస్తారు. బుచ్చిస్పోర్ట్స్ క్లబ్ ఆధ్వర్యంలో అంబేడ్కర్ విగ్రహం వద్ద విద్యార్థుల సాదర స్వాగతం పలకనున్నారు. అనంతరం ర్యాలీగా డీఎల్ఎన్ఆర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో జరిగే సన్మాన కార్యక్రమంలో పాల్గొంటాడు. అధిరోహించిన పర్వతాలు ♦ 2017 మార్చి–ఏప్రిల్‌లో ఇండియా–చైనా బోర్డర్లోని మేరాతాంగ్ పర్వతాన్ని అధిరోహించాడు. ♦ 2017 ఆగస్టు 15న ఆఫ్రికా ఖండంలోని అతి పెద్దదైన కిలీమంజారో పర్వతాన్ని 5,895 మీటర్ల ఎత్తు ఎక్కి తన సత్తా చాటాడు. ♦ 2017 డిసెంబర్లో సిక్కిం హిమాలయాల్లోని రెనాక్ పర్వతారోహణ చేశాడు. ♦ 2018 జనవరిలో కాశ్మీర్ పెహల్లాం వద్ద ఉన్న తులియాన్ పర్వతాన్ని, ఫిబ్రవరిలో లడక్ ప్రాంతంలోని ఆర్ఆర్ పర్వతాన్ని అధిరోహించాడు. -
రాష్ట్రంలో నియంత పాలన
కందుకూరు: రాష్ట్రంలో దొరల, నియంత పాలన కొనసాగుతుందని.. బహుజనులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని బహుజన లెఫ్ట్ ఫ్రంట్(బీఎల్ఎఫ్) రాష్ట్ర చైర్మన్ నల్లా సూర్యప్రకాష్ విమర్శించారు. గురువారం మండల కేంద్రంలోని ముదిరాజ్ భవన్లో డి.రాంచందర్ అధ్యక్షతన మహేశ్వరం నియోజకవర్గం సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు ప్రత్యామ్నాయంగా తెలంగాణలో బహుజన లెఫ్ట్ ఫ్రంట్ ఏర్పడిందన్నారు. సామాజిక న్యాయం జరగకుండా రాష్ట్రంలో సమగ్ర అభివృద్ధి సాధ్యం కాదన్నారు. 93 శాతం ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఎంబీసీ, మైనార్టీలు సామాజికంగా, రాజకీయంగా ఆర్థికంగా అణచివేయబడ్డారన్నారు. తరతరాలుగా దోపిడీకి గురవుతూ, రాజ్యాధికారానికి దూరంగా ఉంటూ 7 శాతం ఉన్న అగ్రవర్ణాల చేతిలో కీలుబొమ్మలుగా మారుతున్నారన్నారు. పేద, బడుగు, బలహీన వర్గాలకు బీఎల్ఎఫ్తోనే న్యాయం జరుగుతుందన్నారు. అందరూ ఏకమై బీఎల్ఎఫ్ కిందకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో రాష్ట్ర బీఎల్ఎఫ్ నాయకులు మన్నారం నాగరాజు, జి.రమేష్, జిల్లా బాధ్యులు భూపాల్, వైఎస్సార్సీపీ నాయకుడు వెంకటప్రసాద్, సీపీఎం నాయకులు బి.దత్తునాయక్, ఎ.రవికుమార్, ఎ.కుమార్, బి.శ్రీనివాస్, కేవీపీఎస్ జిల్లా అధ్యక్షుడు అశోక్, పూలగాజుల జంగయ్య, ఎమ్పార్పీఎస్ నాయకులు పి.సంజీవ, ఎం.నర్సింహ, రమేష్, యాద య్య, యాదగిరిచారి, శ్రీనివాస్ పాల్గొన్నారు. డివిజన్ కమిటీ ఎన్నిక... ఈ సందర్భంగా బీఎల్ఎఫ్ డివిజన్ కమిటీని ఎన్నుకుని ప్రకటించారు. కన్వీనర్‌గా డి.రాంచందర్, సభ్యులుగా ఎ.రవికుమార్, ఎ.కుమార్, ఎం.యాదయ్య, బి.శ్రీనివాస్, యాదగిరిచారి, ఎం.శ్రీనివాస్, సంధ్య, పి.సంజీవ, ఎం.నర్సింహా, వి.శంకర్, గురవయ్య, రమేష్, పి.జంగయ్య లను ఎన్నుకున్నారు. -
ఎవరెస్ట్‌ను అధిరోహించేందుకు పయనమైన యువకిరణం
-
ప్రసార భారతిని ఎంపీలే మరిచిపోయారు!
సాక్షి, న్యూఢిల్లీ : ఆకాశవాణి, దూరదర్శన్‌లను నిర్వహిస్తున్న ప్రసార భారతి చైర్మన్, సీనియర్ జర్నలిస్ట్ ఏ. సూర్య ప్రకాష్ ‘వివేకానంద ఇంటర్నేషనల్ ఫౌండేషన్’కు చెందిన వారు. ఫౌండేషన్ నిర్వాహకులకు ఆర్ఎస్ఎస్, బీజేపీలకు సన్నిహిత సంబంధాలున్న విషయం తెల్సిందే. సహజంగానే తనకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంతో సైద్ధాంతిక అనుబంధం ఉంటుందని కూడా సూర్య ప్రకాష్ ఇటీవల ‘హిందూ’ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. స్వయం ప్రతిపత్తి కలిగిన ప్రసార భారతి కేంద్ర సమాచార, ప్రసారాల శాఖ పరిధిలోకి వస్తోంది. ఈ శాఖకు ప్రాతినిధ్యం వహిస్తున్న స్మృతి ఇరానీకి అధికార దర్పం కాస్త ఎక్కువే. వీరిరువురి గురించి తెలిసిన ఎవరికైనా ప్రసార భారతికి ఎంత స్వయం ప్రతిపత్తి ఉంటుందో, అది ఎంత తటస్థంగా వ్యవహరిస్తుందో ఇట్టే తెలిసిపోతుంది. ప్రసార భారతి చైర్మన్ సూర్య ప్రకాష్‌కు, స్మృతి ఇరానీలకు ఈ మధ్య బొత్తిగా పడటం లేదు. విధానపరంగా ఎంతమాత్రం కాదు. ప్రసార భారతి బోర్డు నియామకాల విషయంలో గొడవ. బోర్డులో ఖాళీగా ఉన్న ఓ ఐఏఎస్, ఇద్దరు సీనియర్ పాత్రికేయులను నియమించాలని స్మృతి ఇరానీ సిఫార్సు చేయగా, ఆ సిఫార్సులను సూర్య ప్రకాష్ చెత్తబుట్టలో పడేశారు. ఆ పోస్టులను అలాగే ఖాళీగా ఉంచుతున్నారు. ఆ పోస్టుల్లోని సీనియర్ పాత్రికేయులు చూసుకోవాల్సిన అసైన్మెంట్ను 2.9 కోట్లకు ఓ ప్రైవేటు సంస్థకు అప్పగించారు. దీంతో కోపం వచ్చిన కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ప్రసార భారత సిబ్బందికి జనవరి, ఫిబ్రవరి నెలలకు జీతాలుగా ఇవ్వాల్సిన నిధులను నిలిపివేశారు. అయినప్పటికీ సూర్య ప్రకాష్ లొంగకుండా ఆపద్ధర్మ నిధి నుంచి సిబ్బందికి రెండు నెలల జీతాలను చెల్లించారు. ప్రసార భారతి (బ్రాడ్‌క్యాస్టింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) చట్టం కింద 1977లో స్వయం ప్రతిపత్తిని కల్పించారు. దానికి ఎంత స్వయం ప్రతిపత్తి ఎంతుందో మనందరికి తెల్సిందే. స్వాతంత్య్ర దినోత్సవం నాడు కేరళ ముఖ్యమంత్రి చేసిన ప్రసంగాన్ని ప్రసారం చేయడానికి తిరస్కరించిన విషయమూ తెల్సిందే. ప్రైవేటు టీవీ చానళ్లు వెల్లువెత్తుతున్న నేటి రోజుల్లో పబ్లిక్ బ్రాడ్ క్యాస్టింగ్ సర్వీసు ఎంతైనా అవసరం. అయితే ఈ పబ్లిక్ సర్వీసు కాస్త స్టేట్ సర్వీసుగా మారిపోయి ఆకాశవాణి, దూరదర్శన్లు ప్రభుత్వానికి బాకాలుగా మారిపోయాయి. ప్రసార భారతి చట్టంలోని 13వ సెక్షన్ ప్రకారం 22 మంది పార్లమెంట్ సభ్యుల కమిటీ ఆకాశవాణి, దూరదర్శన్ల కార్యకలాపాలను చూసుకోవాల్సి ఉంది. చట్టం వచ్చి ఇన్నేళ్లు అవుతున్న ఒక్క ప్రతిపక్ష పార్లమెంట్ సభ్యుడు కూడా పార్లమెంట్ కమిటీ కోసం డిమాండ్ చేయక పోవడం ఆశ్చర్యంగా ఉంది. రాజ్యసభ టీవీ ఎంపీల కమిటీ ఆధ్యర్యంలో నడుస్తోంది. దానికి ప్రతిపక్ష కాంగ్రెస్ ఎంపీ చైర్మన్‌గా ఉన్నారు. అలాంటప్పుడైనా ప్రసార భారతీ కమిటీ గురించి గుర్తుకు రావాలి. ప్రసార భారతి చైర్మన్, మంత్రి స్మతి ఇరానీ గొడవ పడుతున్న ఈ సమయంలోనైనా పార్లమెంట్ కమిటీని ఏర్పాటు చేయడం మంచిది. -
స్వాతి హత్య వెనుక ముగ్గురున్నారా?
చెన్నై: తమిళనాడులో సంచలనం సృష్టించిన ఇన్ఫోసిస్ ఉద్యోగిని స్వాతి హత్య కేసులో ప్రధాన నిందితుడు రామ్ కుమార్ ని అరెస్టు చేసి కేసు అంతు తేల్చామని పోలీసులు చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తుండగా.. అసలైన ప్రశ్నలు వాటి వెనుక అనుమానాలు మాత్రమే అలాగే ఉండిపోయాయి. ఆ ప్రశ్నలకు పోలీసులు కూడా సమాధానాలు చెప్పకుండా దాట వేస్తున్నారు. మీడియా అడుగుతున్న ప్రశ్నలు, ప్రత్యక్ష సాక్షి, నిందితుడి వాంగ్మూలం ప్రకారం ఈ కేసులో ముగ్గురు వ్యక్తులకు ఈ కేసులో భాగస్వామ్యం ఉందా అనే అనుమానం కలుగుతోంది. తనకు 50 గజాల దూరంలోనే స్వాతి హత్య జరిగిందని, తాను ప్రత్యక్షంగా ఆ వ్యక్తిని చూశానని సెల్వం అనే ఓ ప్రొఫెసర్ వాంగ్మూలం ఇచ్చాడు. అయితే, ఆరోజు స్వాతిని చెంపదెబ్బ కొట్టిన వ్యక్తిని చూశానని, అతడు.. ప్రస్తుతం అరెస్టు అయిన వ్యక్తి ఒకటి కాదని అన్నారు. అయితే, మరి చెంపదెబ్బ కొట్టిన వ్యక్తి ఎవరు? అనే ప్రశ్నకు పోలీసుల వద్ద సమాధానం లేదు. స్పందించేందుకు నిరాకరించారు. అలాగే, రామ్ కుమార్ తోపాటు రూమ్ మేట్ గా ఉన్న ఓ సంస్థ సెక్యూరిటీ గార్డు నటేశాన్ కనిపించకుండా పోయాడు. దీనిపై ప్రశ్నించగా అతడు పరారీలో ఉన్నట్లు చెప్తున్నారు. అయితే, పోలీసుల అదుపులోనే ఉన్నట్లు, ఈ హత్య కేసులో అతడే ప్రధాన సాక్షి అని తెలుస్తోంది. ఒక వేళ నటేశాన్ కు ఈ హత్య విషయం ముందే తెలియకుంటే పోలీసులకు ఆ సమాచారం ఎందుకు ఇవ్వలేదని, నిందితుడి కోసం తొలుత పోలీసులు గడపగడప తిరిగి అడిగినా ఎందుకు అతడు వివరాలు అందించలేదని మరో ప్రశ్న తలెత్తుతోంది. సూర్య ప్రకాశ్ అనే వ్యక్తి ద్వారా స్వాతి తనకు పరిచయం అయిందని, తన కోసం సూర్య ప్రకాశ్ మధ్యవర్తిగా ఉన్నాడని పోలీసులకు చెప్పాడు. అయితే, వాస్తవానికి రామ్ కుమార్ ప్రెండ్స్ లిస్ట్ లో సూర్య ప్రకాశ్ అనే వ్యక్తి లేడు. అసలు ఇంతకీ ఆ సూర్య ప్రకాశ్ అనే వ్యక్తి ఎవరు? అతడు అసలు ఉన్నాడా లేడా అనే విషయం పోలీసులు ఎందుకు విచారణ చేయడం లేదని మరి కొన్ని ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మొత్తానికి స్వాతి హత్య చిక్కుముడులు ఇంకా వీడనట్లేనని చెప్పవచ్చు. -
ఏసీబీ వలలో మున్సిపల్ అధికారి
విశాఖపట్టణం: ఇంటి నంబరు కేటాయించేందుకు లంచం తీసుకుంటూ మున్సిపల్ అధికారి ఏసీబీకి చిక్కాడు. విశాఖ నగరం కంచరపాలేనికి చెందిన వెంకట బాలసూర్యప్రకాశ్ కొత్తగా ఇల్లు కట్టుకున్నాడు. ఆ ఇంటికి నంబరు కేటాయించాలంటూ అధికారులకు దరఖాస్తు చేసుకున్నాడు. ఇందుకోసం ట్యాక్స్ కలెక్టర్ జి.కోటేశ్వరరావు రూ.6,500 డిమాండ్ చేశాడు. నాలుగు రోజుల క్రితం సూర్యప్రకాశ్ రూ.4 వేలు ఇచ్చారు. మిగతా రూ.2,500 ఇచ్చే క్రమంలో ఆయన ఏసీబీ అధికారులకు సమాచారం అందించాడు. గురువారం సాయంత్రం కోటేశ్వరరావుకు ఆయన కార్యాలయంలో డబ్బు అందజేస్తుండగా ఏసీబీ డీఎస్పీ కె.రామకృష్ణ ప్రసాద్ నేతృత్వంలోని అధికారులు వలపన్ని పట్టుకున్నారు. -
ఈ పాలనలో ప్రజలు నష్టపోతున్నారు
సాక్షి ప్రతినిధి, వరంగల్: తెలంగాణలో కేసీఆర్, ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబునాయుడు పాలనలతో తెలుగు రాష్ట్రాల ప్రజలు అన్ని విధాలుగా నష్టపోతున్నారని వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ధ్వజమెత్తారు. ఇద్దరు ముఖ్యమంత్రుల పాలనను చూస్తున్న ప్రజలు దివంగత మహానేత వైఎస్.రాజశేఖరరెడ్డి తరహా పాలన కావాలని కోరుకుంటున్నారని అన్నారు. వరంగల్ లోక్‌సభ ఉపఎన్నికలో వైఎస్సార్ సీపీ అభ్యర్థి నల్లా సూర్యప్రకాష్ నామినేషన్ దాఖలు సందర్భంగా బుధవారం హన్మకొండలో జరిగిన ర్యాలీలో పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడారు. ‘వైఎస్ రాజశేఖరరెడ్డి పాలనలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలతో తెలుగు ప్రజలు సంతోషంగా ఉన్నారు. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల పాలనతో విగిసిపోయిన ప్రజలు వైఎస్ పాలనను కోరుకుంటున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు అనేక హామీలు ఇచ్చింది. వాటిలో ఏ ఒక్కటీ నెరవేర్చలేదు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ జరగనన్ని రైతు ఆత్మహత్యలు తెలంగాణలో జరిగాయి. ఏపీ సీఎం చంద్రబాబు పాలనలో ఇదే పరిస్థితి ఉంది. వైఎస్సాఆర్ మరణం తర్వాత ఆయన ప్రవేశపెట్టిన పథకాలను కాంగ్రెస్ తుంగలో తొక్కింది. వరంగల్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలను చిత్తుగా ఓడించాలి. వైఎస్సార్ సీపీ అభ్యర్థి నల్లా సూర్యప్రకాశ్‌ను గెలిపించాలి’ అని అన్నారు. వైఎస్సార్ సీపీ ఎంపీ అభ్యర్థి నల్లా సూర్యప్రకాష్ మాట్లాడుతూ... తెలంగాణ ప్రజలు వైఎస్ సంక్షేమ పథకాలను గుర్తు చేసుకుంటున్నారని అన్నారు. వైఎస్సార్ ఆశయ సాధన కోసం ప్రజలకు చక్కటి పాలన అందించేందుకు వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా తనను బలపరచాలని ప్రజలను కోరారు. వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు జెన్నారెడ్డి మహేందర్‌రెడ్డి ఆధ్యర్యంలో జరిగిన ఈ ర్యాలీలో పార్టీ ప్రధాన కార్యదర్శులు పాయం వెంకటేశ్వర్లు, గట్టు శ్రీకాంత్‌రెడ్డి, కిష్టారెడ్డి, కె.శివకుమార్, మతిన్ ముదాదిన్, ముఖ్య అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి, నేతలు బీష్వ రవీందర్, జి.నాగిరెడ్డి, నిరంజన్‌రెడ్డి, బి.శ్రీనివాస్‌రావు, సింగి రెడ్డి భాస్కర్‌రెడ్డి, వీఎల్ఎన్.రెడ్డి, జైరాజ్, సిద్ధార్థరెడ్డి, ప్రఫుల్లారెడ్డి, సురేశ్‌రెడ్డి, సాయినాథ్‌రెడ్డి పాల్గొన్నారు. -
రేపు నల్లా సూర్యప్రకాశ్ నామినేషన్
వరంగల్: వరంగల్ ఉప ఎన్నికల నేపథ్యంలో బుధవారం ఉదయం 11 గంటలకు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి నల్లా సూర్యప్రకాశ్ నామినేషన్ వేయనున్నారు. ఈ సందర్భంగా కాజీపేట నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ ఏర్పాటు చేయనున్నారు. ఈ ర్యాలీలో తెలంగాణ రాష్ట్ర పార్టీ అధ్యక్షులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శివకుమార్, గట్టు శ్రీకాంత్ రెడ్డి, బిశ్వా రవీందర్, శ్యామ్‌సుందర్ రెడ్డి, గున్నా నాగిరెడ్డి తదితరులు పాల్గొననున్నారు. -
సీఎం కాన్వాయ్‌ను అనుసరిస్తూ గాయపడ్డ వ్యక్తి పరిస్థితి విషమం
హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ కాన్వాయ్‌లో గాయపడ్డ ప్రకాశ్ పరిస్థితి విషమంగా ఉంది. అతను ప్రస్తుతం ప్రయివేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. నిన్న వనస్థలిపురం వద్ద సీఎం కాన్వాయ్ ఢీకొనటంతో ప్రకాశ్‌కు తీవ్ర గాయాలు అయ్యాయి. వివరాల్లోకి వెళితే హయత్‌నగర్ పద్మావతి కాలనీలో నివాసముండే మైలపల్లి శ్రీనివాస్, వనస్థలిపురం బీఎన్‌రెడ్డి నగర్‌కు చెందిన సూర్య ప్రకాశ్‌లు బైక్‌పై హయత్‌నగర్ నుంచి వనస్థలిపురం వైపు వస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కాన్వాయ్‌ను వెంబడించారు. వనస్థలిపురం లెజెండ్ ఆసుపత్రి వద్ద ఎస్ఐ దేవేందర్ బైకును ఆపడానికి ప్రయత్నించిగా, వారు వాహనాన్ని నిలపకుండా వేగంగా వెళ్లి సీఎం కాన్వాయ్‌తో వెళ్తున్న వనస్థలిపురం ఏసీపీ వాహనాన్ని ఢీకొట్టారు. ఈ ఘటనలో సూర్య ప్రకాశ్ రెండుకాళ్లు విరిగిపోగా, శ్రీనివాస్ తలకు తీవ్రగాయాలయ్యాయి. వారిని పోలీసులు ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. సీఎం కాన్వాయ్‌ను ఫాలో అవుతూ బైక్‌ను వేగంగా నడిపిన శ్రీనివాస్‌పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
వెనిస్ ఇన్ హైదరాబాద్
ప్రముఖ ఆర్టిస్టు సూర్యప్రకాష్ కుంచె నుంచి జాలువారిన రమణీయ చిత్రాల ఎగ్జిబిషన్ ‘వెనిస్ ఇన్ హైదరాబాద్’ విశేషంగా ఆకట్టుకుంటోంది. హైటెక్‌సిటీ హోటల్ ట్రైడెంట్లోని కళాకృతి ఆర్ట్ గ్యాలరీలో ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శన శుక్రవారం ప్రారంభమైంది. ఈ నెల 27 వరకు ఎగ్జిబిషన్ కొనసాగుతుంది. సాక్షి, సిటీప్లస్ -
హాట్ సీట్
సాక్షి, ఏలూరు : తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఈపీడీసీఎల్)లో పర్యవేక్షక ఇంజినీర్ (ఎస్ఈ) పోస్టుకు చాలా గిరాకీ ఉంటుంది. అందులోనూ ఆపరేషన్స్ ఎస్ఈ పోస్టుకు పోటీ అంతాఇంతా కాదు. తామనుకున్న స్థానం దక్కించుకోవడానికి అవసరమైన అన్ని ప్రయత్నాలు చేయడంలో ఈ సంస్థలోని అధికారులు ఎప్పుడూ ముందుంటారు. తమ ప్రయత్నం ఫలించేం దుకు ఎంత దూరమైనా వెళతారు.. ఏమైనా చేస్తారు. ఇప్పుడు ఏలూరు సర్కిల్ ఆపరేషన్స్ ఎస్ఈ పోస్టు విషయంలో అదే జరుగుతోంది. ప్రస్తుత ఎస్ఈ టీవీ సూర్యప్రకాష్‌ను బదిలీ చేస్తూ ఆదివారం రాత్రి ఆ సంస్థ సీఎండీ ఎంవీ శేఖగిరిబాబు ఉత్తర్వులు జారీచేశారు. సోమవారం ఉదయం 10 గంటలకు ఎస్ఈగా సత్యనారాయణరెడ్డి (ప్రస్తుతం విశాఖపట్నం ఆపరేషన్స్ ఎస్ఈగా ఉన్నారు) విధుల్లో చేరతారని చెప్పారు. దీంతో సూర్యపకాష్ తాను బదిలీ అయిన విశాఖపట్నంలోని కార్పొరేట్ కార్యాలయానికి అసెస్మెంట్స్ ఎస్ఈగా వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఇంతలో ఏమైందో ఏమో.. అప్పుడే రిలీవ్ కావద్దని, తదుపరి ఆదేశాలు వచ్చేంతవ రకూ వేచి ఉండాలని సీఎండీ నుంచి ఆదేశాలొచ్చాయి. చివరి నిమిషంలో ఎస్ఈ బదిలీకి బ్రేక్ పడటం చర్చనీయాంశమైంది. ఈ పోస్టులోకి వచ్చేందుకు విశాఖపట్నంలోని ఈపీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయం నుంచి పలువురు ఉన్నతాధికారులు ప్రయత్నాలు చేస్తుండటమే ఈ మార్పులకు కారణంగా తెలుస్తోంది. సూర్యప్రకాష్ ఇక్కడ ఎస్ఈగా బాధ్యతలు చేపట్టి రెండున్నరేళ్లు పూర్తయ్యింది. ఎన్నికల ముందే ఆయన బదిలీ అవుతారని అంతా ఊహించారు. కానీ కాలేదు. ఆయన కుటుంబ సభ్యులు విశాఖలోనే ఉండటంతో ఎప్పటినుంచో సూర్యప్రకాష్ తనను అక్కడికి బదిలీ చేయాల్సిందిగా సీఎండీని కోరుతున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుత బదిలీ జరిగిం ది. ఆయన స్థానంలో ఎస్ఈగా వచ్చేందుకు ముగ్గురు అధికారులు తీవ్రంగా పోటీపడుతున్నారు. ప్రజాప్రతినిధుల ద్వారా ఉన్నతాధికారులపై వత్తిడి తెస్తున్నారు. వారిలో గతంలో తాడేపల్లిగూడెం, రాజమండ్రి, శ్రీకాకుళం ప్రాంతాల్లో వివిధ హోదాల్లో పనిచేసిన శరత్‌కుమార్ ప్రస్తుతం విశాఖపట్నంలోని కార్పొరేట్ కార్యాలయంలో వాణిజ్య విభాగం జనరల్ మేనేజర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయన స్వస్థలం పశ్చిమగోదావరి జిల్లా కావడంతో ఇక్కడ ఎస్ఈ పోస్టు తనకు ఇవ్వాల్సిం దిగా సీఎండీకి విజ్ఞప్తి చేశారు. అంతేకాకుండా రాష్టానికి చెందిన ఓ మహిళా మంత్రి ద్వారా సీఎండీకి సిఫార్సు చేయించుకుంటున్నారు. శరత్‌కుమార్ విజ్ఞప్తి చేసిన మాట వాస్తవమేనని కొద్దిరోజుల క్రితం సీఎండీ సైతం అంగీకరించారు. శరత్‌కుమార్‌తోపాటు మరో అధికారి ఎం.సత్యనారాయణమూర్తి కూడా ఏలూరు ఎస్ఈ పోస్టు కావాలంటున్నారు. ప్రస్తుతం కార్పొరేట్ కార్యాలయంలో డీఈగా ఉన్న మూర్తికి పదోన్నతి కల్పించి విశాఖపట్నం ఎస్ఈగా నియమించారు. అయితే, ఆయన ఏలూరు వచ్చేందుకే మక్కువ చూపిస్తున్నారు. దానికోసం తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఓ మంత్రి ద్వారా సీఎండీపై వత్తిడి తెస్తున్నట్లు సమాచారం. ఇక సూర్యప్రకాష్ స్థానంలో నియమితులైన సత్యనారాయణరెడ్డి కూడా జిల్లాకు చెందిన ఓ ఎంపీ సహకారంతోనే ఇక్కడి పోస్టును దక్కించుకున్నట్లు చెబుతున్నారు. చివరి నిమిషంలో బదిలీ నిలిచిపోవడంతో ఆయన మరోసారి ఆ ఎంపీని ప్రసన్నం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ముంపు మండలాల్లో సమస్యలను పరిష్కరించండి మహాప్రభో కుక్కునూరు : పోలవరం ప్రాజెక్టు ముంపు మండలాల సమస్యలను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని, వెంటనే సమస్యలను పరిష్కరిం చాలని సీపీఐ(ఎంఎల్) డివిజన్ కమిటీ సభ్యుడు ఎస్కె.గౌస్ సోమవారం డిమాండ్ చేశారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పేరుతో ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్‌కు బదలాయించి తెలంగాణ ప్రభుత్వం చేతులు దులుపుకుందని విమర్శించారు. ఈ మండలాలలో రేషన్ పంపిణీ, రుణమాఫీ, ఇందిరమ్మ ఇళ్ల బిల్లులు ఏ ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ఇక్కడి ప్రజలు అవస్థలు పడుతున్నారన్నారు. గోదావరి జిల్లాల అధికారులు ఈ సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఆర్ఐ, వీఆర్వోల సస్పెన్షన్ కొవ్వూరు: ఈ నెల 25న ఓ రైతు నుంచి రూ.3 వేలులంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన రెవెన్యూ ఇన్స్పెక్టర్ కె.నల్లరాజు, వీఆర్వో దుర్గారావులను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ఆదేశాలు ఇచ్చినట్టు తహసిల్దార్ జి.కనకరాజు సోమవారం తెలి పారు. వేములూరుకు చెందిన సున్నం వీర ెంకట సుబ్రహ్మణ్యాచార్యులు అనే రైతు నుంచి రూ.3 వేలు లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు ఆర్ఐ, వీఆర్వో, రిటైర్డ్ వీఆర్వోలు పట్టుబడిన విషయం తెలిసిందే. -
స్వయం సహాయక సంఘాలకు రూ. వెయ్యి కోట్లు
ఏలూరు, న్యూస్‌లైన్: జిల్లాలో స్వయం సహాయక సంఘాలకు రూ.వెయ్యి కోట్ల రుణాలందించాలని లక్ష్యంగా నిర్ణయించామని కలెక్టర్ సిద్ధార్థజైన్ తెలిపారు. స్థానిక కలెక్టరేట్లో వివిధ శాఖల పనితీరు, ఎంపీ లాడ్స్ వినియోగంపై అధికారులతో ఆయన శుక్రవారం సమీక్షించారు. పట్టణ ప్రాంతాల్లో వచ్చే మార్చిలోగా రూ.87 కోట్లు, పల్లెల్లో రూ.913 కోట్లు రుణాలను అందించి మహిళల ఆర్థిక పురోభివృద్ధికి బ్యాంకులు దోహదపడాలన్నారు. జిల్లాలో మైనార్టీ కార్పొరేషన్ యూనిట్ల స్థాపనను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ఇందిరాగాంధీ మాతృత్వ సహయోగ యోజన కింద ఇచ్చే లబ్ధిని ఈ నెలాఖరు నాటికి ఇవ్వాలన్నారు. భూగర్భజలశాఖ ఆధ్వర్యంలో ఎస్సీ, ఎస్టీ రైతులకు బోర్లు మంజూరు చేయాలని, వ్యవసాయ విద్యుత్ కనె క్షన్లు జారీలో జాప్యం లేకుండా చూడాలని ట్రాన్స్‌కో ఎస్ఈ సూర్యప్రకాష్‌ను ఆదేశించారు. ఆసుపత్రుల్లోనే కాన్పులు జరిగేలా, కుటుంబ నియంత్రణ లక్ష్యాలను అధిగమించేందుకు సత్వరం చర్యలు తీసుకోవాలని వైద్యారోగ్యశాఖ అధికారులను ఆదేశించారు. ఎంపీ లాడ్స్ పనుల్లో జాప్యాన్ని సహించను పార్లమెంటు నియోజకవర్గ అభివృద్ధి నిధులతో చేపట్టే పనుల్లో జాప్యాన్ని సహించేది లేదని కలెక్టర్ సిద్ధార్థజైన్ చెప్పారు. స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో శుక్రవారం రాత్రి ఎంపీలాడ్స్ పనుల ప్రగతి తీరును ఆయన సమీక్షించారు. అపరిష్కృతంగా ఉన్న పనులను 2014 జనవరి, 31 నాటికి పూర్తిచేయాలని ఆదేశించారు. వీఆర్ఏలకు రెండు నెలల అడ్వాన్స్ సమైక్యాంధ్ర ఉద్యమంలో పాల్గొన్న వీఆర్ఏలకు ప్రభుత్వం రెండు నెలలకు రూ.7 వేలు ప్రత్యేక అడ్వాన్స్ ఇవ్వాలని ఆదేశించిందని, తహసిల్దార్లు ఆ మొత్తాలను వారికందేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సిద్ధార్థజైన్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. భవన నిర్మాణ కార్మికులకు కొత్త బీమా పథకం ఏలూరు (ఫైర్‌స్టేషన్ సెంటర్ ) : భవన నిర్మాణ కార్మికులుగా నమోదైన వారికి ప్రస్తుతం అమలవుతున్న ఆమ్ ఆద్మీ బీమా యోజన, జనశ్రీ బీమా యోజనతో పాటు మరోక సంక్షేమ పథకం కూడా ప్రభుత్వం అమలు చేస్తుందని కలెక్టర్ సిద్ధార్థజైన్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. పనిచేసే ప్రదేశంలో కాని ఇతర ప్రదేశాలలో గాని, నిర్మాణ సమయంలో గాయపడి ఆ గాయాలతో మరణించిన కార్మికుని కుటుంబానికి రూ.2 లక్షలు ఆర్థిక సహాయం అందుతుందన్నారు. శాశ్వత వికలాంగత్వానికి గురైన కార్మికునికి కూడా రూ. 2 లక్షల వరకు సహాయం అందుతుందని తెలిపారు. 120 గ్రామాల్లో 12 వేల మరుగుదొడ్లు ఏలూరు : జిల్లాలో పల్లెనిద్ర-ప్రగతిబాట పేరిట 120 గ్రామాల్లో 12 వేల వ్యక్తిగత మరుగుదొడ్లను 2014 సంక్రాంతి నాటికి పూర్తి చేయాలని కలెక్టర్ సిద్ధార్థజైన్ లక్ష్యంగా నిర్ణయించారని డ్వామా పీడీ ఎన్. రామచంద్రారెడ్డి తెలిపారు. వీటి నిర్మాణానికి అధికారులు కృషి చేయాలని కోరారన్నారు. -
22న జెడ్పీలో సమీక్ష సమావేశం
కర్నూలు(అర్బన్),న్యూస్‌లైన్: జిల్లా కలెక్టర్ సుదర్శన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఈ నెల 22వ తేదీన ఈఓఆర్డీ, ఎంపీడీఓ, ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లాపరిషత్ సీఈఓ సూర్యప్రకాష్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. జెడ్పీ సమావేశ భవనంలో ఉదయం 10.30 గంటలకు సమావేశం ఉంటుందన్నారు. కొత్తగా ఎన్నికైన సర్పంచులకు శిక్షణ, గుర్తించిన జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలల్లో బాలికలకు విశ్రాంతి గదులు, ప్రహరీల నిర్మాణం, ప్రతి సోమవారం గ్రీవెన్స్ డే నిర్వహణ, తాగునీటి సమస్యల పరిష్కారం, బోర్ల నిర్వహణ, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం, 2014-15 మండల పరిషత్ బడ్జెట్ రూపకల్పన తదితర అంశాలపై చర్చ ఉంటుందన్నారు. జిల్లాలోని అన్ని మండలాల ఎంపీడీఓలు, ఈఓఆర్డీలు, ఆర్డబ్ల్యూఎస్ ఈఈ, డీఈఈ, ఏఈ, ఏఈఈలంతా హాజరు కావాలని సూర్యప్రకాష్ కోరారు.