
సాక్షి, సిద్ధిపేట : తెలంగాణ సీఎంవో కార్యాలయ ఉద్యోగి పేరుతో అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న మోసగాడు రాయబండి సూర్యప్రకాశ్‌ను టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయం ఉద్యోగిగా చెలమణి అవుతూ అతగాడు ప్రభుత్వ ఉద్యోగుల నుంచి అందినకాడికి దోచుకుంటున్నాడు. మీడియా సమావేశాలు, అన్నదానాల పేరుతో భారీగా డబ్బులు వసూలు చేసేవాడు. అలాగే సిద్ధిపేట సబ్ రిజిస్ట్రార్‌ను రూ.50వేలు ఇవ్వాలంటూ ఫోన్‌లో బెదిరింపులకు పాల్పడ్డాడు.సదరు వ్యక్తిపై అనుమానం వచ్చిన సబ్ రిజిస్ట్రార్ పోలీసులకు ఫిర్యాదు చేయడంత అసలు విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు కేసు నమోదు చేసి, నిందితుడిని కోర్టులో హాజరు పరిచారు. ఇప్పటికే సూర్యప్రకాశ్‌పై 11 కేసులు ఉన్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment