CMO office
-
తెలంగాణ రాష్ట్ర గేయం రెండు వెర్షన్లు
సాక్షి, హైదరాబాద్: ‘జయ జయహే తెలంగాణ’ గేయం రెండు వెర్షన్లను తెలంగాణ రాష్ట్ర గీతంగా ఆమోదించినట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి ప్రకటించారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి దశాబ్దం పూర్తి అవుతున్న సందర్భంగా జూన్ 2న ముగింపు వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఈ వేడుకల్లోనే ‘జయ జయహే తెలంగాణ’ గీతాన్ని జాతికి అంకితం చేస్తామని చెప్పారు. ఉద్యమ కాలంలో అందరినీ ఉర్రూతలూగించి తెలంగాణ ఖ్యాతిని చాటిన ఈ గీతాన్నిఅందరి ఆమోదంతో, భవిష్యత్తులో తరతరాలు పాడుకునేలా రాష్ట్ర గీతంగా ఆమోదించినట్లు వెల్లడించారు. తెలంగాణ కవి, రచయిత అందెశ్రీ 20 ఏళ్ల క్రితం రాసిన ఈ గీతాన్ని యథాతథంగా అమోదించామన్నారు. ఆస్కార్ అవార్డు గ్రహీత ఎం.ఎం.కీరవాణి సంగీతంతో పాటు స్వరాలు కూర్చినట్లు తెలిపారు. ఈ మేరకు సీఎంఓ కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. గురువారం సాయంత్రం సచివాలయంలో అధికార, మిత్రపక్ష పార్టీల నేతలతో సమావేశమైన సీఎం.. తెలంగాణ రాష్ట్ర గీతంతో పాటు రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ముగింపు వేడుకల నిర్వహణపై చర్చించారు. ఈ సమావేశంలో అందెశ్రీ, కీరవాణితో పాటు శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్, మంత్రులు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, దామోదర రాజనర్సింహ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు, సీతక్క, కొండా సురేఖ, మాజీ మంత్రి జానారెడ్డి, టీజేఎస్ అధినేత ప్రొఫెసర్ కోదండరాం, సీపీఐ ఎమ్మెల్యే కూనమనేని సాంబశివరావు, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంతో పాటు తెలంగాణ బిల్లును ఆమోదించినప్పుడు పార్లమెంటులో ఉన్న మాజీ ఎంపీలు, ఉద్యమంలో క్రియాశీల పాత్ర పోషించిన పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు. 2.30 నిమిషాల్లో మూడు చరణాలు జయ జయహే తెలంగాణ గీతాన్ని 2.30 నిమిషాల నిడివితో ఒక వెర్షన్‌గా, 13.30 నిమిషాల పూర్తి నిడివితో మరో వెర్షన్‌గా రూపొందించారు. రెండున్నర నిమిషాల వెర్షన్ ప్రభుత్వ కార్యక్రమాల్లో ఆలపించేందుకు వీలుగా మూడు చరణాలతో ఉంటుందని సీఎం ప్రకటించారు. ఈ రెండింటినీ రాష్ట్ర గీతంగానే పరిగణిస్తామని స్పష్టం చేశారు. కేబినేట్లో తీసుకున్న నిర్ణయం మేరకే రాష్ట్ర గీతాన్ని ఆమోదించటం జరిగిందని తెలిపారు. తెలంగాణ ప్రతిష్ట ఇనుమడించేలా కార్యాచరణ ‘రాష్ట్ర అధికారిక చిహ్నం, తెలంగాణ తల్లి విగ్రహం రూపురేఖలు మార్చాలనే నిర్ణయం కూడా జరిగింది. కొత్త అధికారిక చిహ్నానికి సంబంధించి ఇప్పటికే రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల కళాకారుల నుంచి దాదాపు 500 నమూనాలు అందాయి. ఇవన్నీ ఇంకా చర్చల దశలోనే ఉన్నాయి. తుది రూపమేదీ ఖరారు కాలేదు. తెలంగాణ తల్లి విగ్రహానికి సంబంధించి కూడా తుది నిర్ణయం జరగలేదు. కళాకారులు వివిధ నమూనాలు తయారు చేస్తున్నారు. కొత్త చిహ్నం, తెలంగాణ తల్లి విగ్రహాలకు సంబంధించి అపోహాలు, తప్పుడు ప్రచారాలకు తావు లేకుండా అసెంబ్లీలో చర్చించి నిర్ణయం తీసుకుంటాం. అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేలా తెలంగాణ ప్రతిష్టను ఇనుమడించేలా, భావితరాలకు స్ఫూర్తిదాయకంగా ఉండేలా మా కార్యాచరణ ఉంటుంది..’ అని రేవంత్ చెప్పారు. ఈ సందర్భంగా కీరవాణి సంగీత సారథ్యంలోని యువ గాయనీ గాయకుల బృందం ఆలపించిన రాష్ట్ర గేయం అందరినీ అలరించింది. ఇలావుండగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం రూపొందించిన తెలంగాణ తల్లి విగ్రహం ధనవంతుల విగ్రహంలా ఉందంటూ.. తెలంగాణ కష్టజీవుల బతుకు పోరాటం ఉట్టిపడేలా కొత్త తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపొందించాలనే నిర్ణయం తీసుకున్నట్టుగా సీఎం చెప్పినట్లు తెలిసింది. టీఎస్‌కు బదులు టీజీ తెలంగాణ పునర్నిర్మాణంలో భాగంగా తమ ప్రభుత్వం పలు కార్యక్రమాలు చేపట్టిందని, అందులో భాగంగానే రాష్ట్రానికి సంబంధించిన సంక్షిప్త రూపం టీఎస్‌ను టీజీగా మార్చినట్లు ఈ సమావేశంలో సీఎం తెలిపారు. ‘వాహనాల రిజి్రస్టేషన్ నంబర్లకు సంబంధించి, అలాగే అన్ని ప్రభుత్వ సంస్థల విషయంలో కూడా టీఎస్‌ను టీజీగా మార్పు చేశాం..’ అని చెప్పారు. -
హైదరాబాద్ సీఎంఓ కార్యాలయంలో కేటుగాడు అరెస్ట్
-
విద్వేషాలు రెచ్చగొట్టేలా అంకబాబు దుష్ప్రచారం: సీఐడీ కీలక వ్యాఖ్యలు
సాక్షి,అమరావతి/నగరంపాలెం(గుంటూరువెస్ట్): ముఖ్యమంత్రి కార్యాలయ ప్రతిష్టకు ఉద్దేశపూర్వకంగా భంగం కలిగిస్తూ, సమాజంలో విద్వేషాలు రగిలించేలా తప్పుడు ప్రచారం చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినందునే కొల్లు అంకబాబును అరెస్టు చేశామని సీఐడీ విభాగం తెలిపింది. తాము ఇచ్చిన 41ఏ సీఆర్పీసీ నోటీసులను తీసుకునేందుకు తిరస్కరించడంతో పాటు తన మొబైల్ ఫోన్లోని ఆధారాలను ధ్వంసం చేసేందుకు ప్రయత్నించడంతో ఆయన్ను అరెస్టు చేయాల్సి వచ్చిందని శుక్రవారం సీఐడీ ఓ ప్రకటనలో వెల్లడించింది. గతంలో ఈనాడు, ఉదయం పత్రికలు, హెచ్ఎంటీవీలలో జర్నలిస్టుగా చేసిన అంకబాబు ప్రస్తుతం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉన్నారని చెప్పింది. ‘సీఎంవోలోని ఓ కీలక అధికారి భార్య దుబాయి నుంచి అక్రమంగా బంగారం తీసుకువస్తూ గన్నవరం విమానాశ్రయంలో పట్టుబడినట్టు, ఆమెతో పాటు ఎయిర్ ఇండియా సిబ్బందిని కస్టమ్స్ అధికారులు విచారిస్తున్నట్లు’ ఓ అవాస్తవ పోస్టును అంకబాబు ఈనెల 9న సోషల్ మీడియాలో పోస్టు చేశారని సీఐడీ అధికారులు తెలిపారు. వాస్తవానికి విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు జప్తు చేసిన బంగారంతో సీఎంవో అధికారులకు ఎలాంటి సంబంధంలేదని తెలిపింది. అంకబాబు ఉద్దేశపూర్వకంగానే సీఎంవో ప్రతిష్ట దెబ్బతీసేందుకు, సమాజంలో వర్గవిద్వేషాలు సృష్టించేందుకే ఈ విధంగా తప్పుడు ప్రచారం చేసినట్టు తమ దర్యాప్తులో వెల్లడైందని సీఐడీ విభాగం వివరించింది. అంతేకాకుండా ఈ దుష్ప్రచార పోస్టులను వైరల్ చేయడంలో ఆయన సూపర్ స్ప్రెడర్గా వ్యవహరించినట్లు సీఐడీ దర్యాప్తులో వెల్లడైంది. ఈ ఫేక్ పోస్టులపై సీఐడీ అధికారులు పలువురిని విచారించినపుడు ఈ విషయం వెలుగుచూసింది. వారందరి మొబైల్ఫోన్లకు కూడా ఆ ఫేక్ పోస్టు అంకబాబు మొబైల్ ఫోన్ నుంచే వచి్చనట్లు నిర్ధారణ అయ్యింది. వివిధ వాట్సాప్ గ్రూపులు, ఇతర సోషల్ మీడియా మాధ్యమాల్లో కూడా సీఎంవోపై దుష్ప్రచారం వెనుక అంకబాబే కీలకపాత్ర పోషించారని సీఐడీ విభాగం ఆధారాలు సేకరించింది. వీటి ఆధారంగానే కొన్ని టెలివిజన్ చానళ్లలో కూడా ఈ దుష్ప్రచారాన్ని వ్యాప్తిలోకి తెచ్చారు. తద్వారా వివిధ మాధ్యమాల ద్వారా ఒకే సమయంలో పెద్దఎత్తున దుష్ప్రచారం చేసేలా అంకబాబు వ్యవహరించారన్నది స్పష్టమైంది. దాంతో ఆయన్ని విజయవాడలో గురువారం రాత్రి అదుపులోకి తీసుకుని అతని మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నామని, అందులోనుంచి పంపిన పోస్టుల వివరాలు సేకరించామని చెప్పింది. ఆర్థిక నేరాలకు సంబంధించి అంకబాబుపై గతంలో కృష్ణా, పశి్చమ గోదావరి, శ్రీకాకుళం, కర్నూలు జిల్లాల్లో 20 వరకు కేసులు నమోదయ్యాయని కూడా సీఐడీ విభాగం వెల్లడించింది. కొన్ని మనీ సర్క్యులేషన్ స్కీముల పేరిట కూడా ఆయన మోసాలకు పాల్పడ్డారని సీఐడీ గుర్తించింది. గుంటూరులో విచారణ అంకబాబును సీఐడీ గుంటూరు ప్రాంతీయ కార్యాలయానికి తరలించి, శుక్రవారం సుదీర్ఘంగా విచారించారు. ఆయనపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అంకబాబుని వైద్య పరీక్షలు నిమిత్తం గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. ప్రాథమిక వైద్య పరీక్షలు తదుపరి ఎక్సైజ్ కోర్టులో హాజరు పరచగా, బెయిల్ మంజూరు చేశారు. అంకబాబుని అరెస్ట్ చేయడంతో టీడీపీ నాయకులు సీఐడీ ప్రాంతీయ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. అంకబాబు అరెస్టు సరికాదు: చంద్రబాబు సాక్షి, అమరావతి: సీనియర్ జర్నలిస్ట్ అంకబాబు అరెస్ట్ సరికాదని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు హైదరాబాద్ నుంచి శుక్రవారం డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డికి లేఖ రాశారు. విజయవాడలో అంకబాబు అరెస్టు అక్రమమని, వెంటనే విడుదల చేయాలని కోరారు. వాట్సాప్ పోస్ట్ పేరుతో అరెస్టు చేయడం దారుణమన్నారు. సుప్రీంకోర్టు నిబంధనలకు విరుద్ధంగా పోలీసులు వ్యవహరించారని విమర్శించారు. టీడీపీ నాయకులు, క్రియాశీల కార్యకర్తలతో మొదలైన అక్రమ అరెస్టులు.. ఇప్పుడు ప్రశ్నించే గొంతుకలు, రాజధాని ఉద్యమకారుల వరకు వచ్చాయని తెలిపారు. -
కొత్త మంత్రులకు సీఎంఓ నుంచి ఫోన్
-
పొలం వివాదం: సెల్ఫీ వీడియోలపై స్పందించిన సీఎంవో
సాక్షి, వైఎస్సార్ జిల్లా: దువ్వూరు మండలం ఎర్రబల్లి వద్ద పొలం వివాదం ఘటనలో అక్బర్ బాషా కుటుంబ సభ్యుల సెల్ఫీ వీడియోలపై సీఎంవో స్పందించింది. అక్బర్ బాషా ఆవేదనపై సీఎం కార్యాలయం స్పందిస్తూ.. అక్బర్ బాషా ఇంటికి వెళ్లి విచారణ చేపట్టాలని ఎస్పీని ఆదేశించింది. అక్బర్ బాషా కుటుంబ సభ్యులతో పోలీసు అధికారులు మాట్లాడారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని పోలీసులు హామీ ఇచ్చారు. ఘటనపై సమగ్ర విచారణ: ఎస్పీ అన్బురాజన్ అక్బర్ బాషా కుటుంబం.. ఎస్పీ అన్బురాజన్‌ను కలిసింది. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, అక్బర్ బాషా ఆత్మహత్యాయత్నం వీడియో వైరల్ కావడంతో వెంటనే స్పందించామన్నారు. చాగలమర్రి దువ్వూరు పోలీసుల సహకారంత కాపాడగలిగామన్నారు. ఘటనపై సమగ్ర విచారణ చేస్తున్నామని.. అదనపు ఎస్పీ దేవప్రసాద్ నేతృత్వంలో విచారణ చేపట్టామని ఎస్పీ తెలిపారు. రెండు రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించామని పేర్కొన్నారు. విచారణ జరిగే వరకు సీఐ కొండారెడ్డిని విధుల నుంచి తప్పిస్తున్నామని ఎస్పీ తెలిపారు. సీఐ, ఇతర పోలీసుల తప్పు ఉంటే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ అన్బురాజన్ స్పష్టం చేశారు. అక్బర్ బాషా కుటుంబ సభ్యులకు పూర్తిస్థాయి భద్రత కల్పిస్తామని ఎస్పీ పేర్కొన్నారు. ఇవీ చదవండి: ఏపీ ఫైబర్ గ్రిడ్ కుంభకోణం: 19 మందిపై ఎఫ్ఐఆర్ ఢిల్లీలో భారీ వర్షం.. 18 ఏళ్ల తర్వాత తొలిసారి -
ట్విట్టర్, ఫేస్‌బుక్‌లలో.. కేసీఆర్ కార్యాలయం నెం.1
సాక్షి, హైదరాబాద్: సామాజిక మాధ్యమ వేదికల ద్వారా ప్రజలకు చేరువ కావడంలో తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంవో) హవా కొనసాగుతోంది. 2020 ఏప్రిల్ 1 నుంచి 2021 మార్చి 31 మధ్య సేకరించిన గణాంకాల ప్రకారం ట్విట్టర్ ఖాతాలో ఎక్కువ మంది ఫాలోవర్స్ (ప్రతి వెయ్యి జనాభాకు ఉన్న ఫాలోవర్ల ప్రాతిపదికన) కలిగి ఉన్న జాబితాలో కేసీఆర్ కార్యాలయం దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. ఫాలోవర్స్‌పరంగా గతేడాది మిలియన్ (పది లక్షలు) మైలు రాయిని దాటిన తెలంగాణ సీఎంఓ ట్విట్టర్ ఖాతాను ప్రస్తుతం 11.61 లక్షల మంది అనుసరిస్తున్నారు. రాష్ట్రంలోని 3.5 కోట్ల జనాభాకుగాను ప్రతి వెయ్యి మందిలో 33.18 మంది తెలంగాణ సీఎంవో ట్విట్టర్ ఖాతాను ఫాలో అవుతున్నారు. (చదవండి: తెలంగాణలో లాక్డౌన్ పూర్తిగా ఎత్తివేత) అలాగే రెండో స్థానంలో హరియాణా సీఎంవో (ప్రతి వెయ్యి జనాభాకు 31.58 మంది) ఉండగా, మూడో స్థానంలో మహారాష్ట్ర సీఎంవో (ప్రతి వెయ్యి జనాభాకు 24.9 మంది), నాలుగో స్థానంలో ఒడిశా సీఎంవో (ప్రతి వెయ్యి జనాభాకు 21.49 మంది), ఐదో స్థానంలో మధ్యప్రదేశ్ సీఎంవో (ప్రతి వెయ్యి జనాభాకు 20.88 మంది) ఖాతాలు ఉన్నాయి. మరో ప్రముఖ సామాజిక మాధ్యమ వేదిక ఫేస్‌బుక్‌లోనూ ఇదే ప్రాతిపదికన ఎక్కువ మంది ఫాలోవర్స్‌ను కలిగి ఉన్న సీఎంవోల జాబితాలో తెలంగాణ సీఎంవో మూడో స్థానంలో కొనసాగుతోంది. ఫేస్బుక్లో తొలి స్థానంలో నిలిచిన రాజస్తాన్ సీఎంఓ ఖాతాను 26.81 లక్షల మంది (ప్రతి వెయ్యి జనాభాకు 38.83 మంది) అనుసరిస్తుండగా తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయం ఖాతాను 8.43 లక్షల మంది (ప్రతి వెయ్యి జనాభాకు 24.1 మంది) ఫాలో అవుతున్నారు. కార్యక్రమాలన్నీ సామాజిక మాధ్యమాల్లో... సీఎం కేసీఆర్ సారథ్యంలో జరిగే కేబినెట్ సమావేశాలు, ప్రభుత్వ కార్యకలాపాలకు సంబంధించిన సమీక్షలు, పర్యటనలకు సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు డిజిటల్ మీడియా వింగ్ సీఎంఓ ఖాతా ద్వారా సామాజిక మాధ్యమాల్లో షేర్ చేస్తూ ఉంటుంది. పండుగల సందర్భంగా శుభాకాంక్షలు, ప్రముఖుల మరణాలపట్ల సంతాపాల వంటి ప్రకటనలనూ సోషల్ మీడియా ద్వారా చేరవేస్తోంది. కరోనా లాక్డౌన్ నిర్ణయాలు, బాధితులకు చికిత్స, కోవిడ్ కిట్లు, ఔషధాల పంపిణీ వంటి అనేక అంశా లపై సామాజిక మాధ్యమాల వేదికగా కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాతో పోలిస్తే సీఎంఓ సోషల్ మీడియా ఖాతాల ద్వారా శరవేగంగా సమాచారం వ్యాప్తి చెందుతోందని డిజిటిల్ మీడియా వింగ్ అధికారులు చెబుతున్నారు. రీ ట్వీట్లు, షేర్ చేయడం ద్వారా క్షణాల్లో వేలాది మందికి సమాచారం చేరుతుండటంతో సీఎంవో సామాజిక మాధ్యమాల ఖాతాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. గతేడాది మార్చి నుంచి కరోనా లాక్డౌన్, ఇతర నిబంధనల వల్ల సీఎం కేసీఆర్ ప్రజల మధ్య ఎక్కువగా తిరిగే అవకాశం లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో ప్రజలు, ప్రభుత్వ విభాగాలు, పెట్టుబడులతో వచ్చే వారు, ప్రభుత్వ సేవలు, సమాచారంపట్ల ఆసక్తి ఉన్న వారు సీఎంవో సామాజిక మాధ్యమాల ఖాతాలను ఎక్కువగా అనుసరిస్తున్నారు. 2020–21లో ముఖ్యమంత్రి కేసీఆర్, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కె. తారక రామారావు సోషల్ మీడియా ఖాతాలకు 20 కోట్లకుపైగా హిట్స్ వచ్చాయి. ప్రభుత్వ కార్యకలాపాల సమాచారం కోసం సీఎంవో, వివిధ సమస్యల పరిష్కారం కోరుతూ కేటీఆర్ సోషల్ మీడియా ఖాతాలకు హిట్స్ వచ్చాయి. సీఎం చరిష్మా వల్లే.. ముఖ్యమంత్రి కేసీఆర్ చరిష్మా, ప్రభుత్వ నిర్ణయాలు, పథకాల మూలంగా ఎక్కువ మంది సీఎంఓ సోషల్ మీడియా ఖాతాలను సందర్శిస్తున్నారు. ప్రస్తుతం ట్విట్టర్, ఫేస్బుక్లో ఉన్న ఖాతాలతోపాటు తాజాగా ఇన్‌స్ట్రాగామ్ ఖాతా కూడా ప్రారంభించాం. యూట్యూబ్ ద్వారా కూడా సీఎంఓ కార్యకలాపాలను ఎప్పటికప్పుడు ప్రజలకు చేరవేస్తున్నాం. ప్రభుత్వ విభాగాల సోషల్ మీడియా ఖాతాలకు కూడా మంచి ఆదరణ లభిస్తోంది. కోవిడ్ సమాచారాన్ని రాష్ట్ర ప్రజలకు చేరవేసేందుకు గత ఏడాది ఏప్రిల్‌లో డిజిటల్ మీడియా వింగ్ రూపొందించిన కోవిడ్ పోర్టల్‌కు ఇప్పటి వరకు 13 కోట్ల హిట్స్ వచ్చాయి. – దిలీప్ కొణతం, డైరెక్టర్, డిజిటల్ మీడియా వింగ్ -
సీఎంవోకు లైక్ కొట్టారు..
సాక్షి, హైదరాబాద్: సామాజిక మాధ్యమంలో తెలంగాణ ప్రభుత్వం దూసుకెళ్తోంది. ప్రజలతో మమేకమయ్యేందుకు ఫేస్బుక్, ట్విట్టర్, యూట్యూబ్ వంటి సామాజిక మాధ్యమాలను ఎంచుకుంటోంది. ఇందుకు ఐటీ శాఖకు అనుబంధంగా డిజిటల్ మీడియా విభాగాన్ని కూడా ఏర్పాటు చేసింది. ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ (ఐసీటీ) విప్లవాన్ని ఉపయోగించుకుని ఫొటోలు, వీడియోలు, ఇతర సమాచారాన్ని ప్రజలకు చేరవేయడంపై దృష్టి సారించింది. ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంవో)తో పాటు మంత్రులు, ప్రభుత్వ విభాగాలు, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ వంటి ప్రతిష్టాత్మక కార్యక్రమాల వివరాలను ప్రజలకు చేరవేస్తోంది. సీఎం కేసీఆర్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పాల్గొనే కార్యక్రమాలను ఫేస్బుక్, ట్విట్టర్, యూట్యూబ్ ద్వారా రాష్ట్ర డిజిటల్ మీడియా విభాగం ప్రత్యక్ష ప్రసారం చేస్తోంది. ఇప్పటివరకు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌కు సంబంధించి సుమారు 120 కార్యక్రమాలను సోషల్ మీడియా ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేశారు. డిజిటల్ మీడియాతో చేరువ.. దేశ జనాభాలో సుమారు 60 కోట్ల మంది ఇంటర్నెట్ను ఉపయోగిస్తుండగా, 45 కోట్ల మంది చేతుల్లో స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. సంప్రదాయ ప్రచార, ప్రసార సాధనాలు పత్రికలు, రేడియో, టీవీ మాధ్యమాలతో పోలిస్తే సామాజిక మాధ్యమాల్లో సమాచారం విభిన్నంగా ఉంటోంది. దీంతో వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ వైపు మొగ్గు చూపేవారి సంఖ్య పెరుగుతోంది. ఈ నేపథ్యంలో పౌర సమాజంతో పాటు సంస్థలు, సంఘాలు, వ్యక్తులకు మరింత చేరువయ్యేందుకు తెలంగాణ డిజిటల్ మీడియా విభాగం ప్రయత్నం చేస్తోంది. సోషల్ మీడియాలో వచ్చే ఆధునిక ప్లాట్‌ఫామ్స్, సాంకేతికత, ప్రభుత్వ పథకాలు, ఇతర అంశాల మీద వలంటీర్లకు శిక్షణ కోసం వర్క్‌షాప్‌లు, శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఫేస్బుక్, ట్విట్టర్, యూట్యూబ్‌లో సీఎంవో, ఐటీ మంత్రి ఖాతాలను డిజిటల్ మీడియా విభాగం నిర్వహిస్తోంది. (చదవండి: నగరం నలువైపులా ఐటీ!) ఫేస్బుక్లో సీఎంవో టాప్! దేశంలో ఫేస్బుక్ వినియోగిస్తున్న సీఎంవోల జాబితాలో తెలంగాణ మూడో స్థానంలో ఉండగా, ఫేస్బుక్ ’లైక్స్’లో మాత్రం అగ్రస్థానంలో ఉంది. ట్విట్టర్లో తెలంగాణ సీఎంవో ఫాలోవర్స్ సంఖ్య 2015–16లో 2,60,673 మంది ఉండగా, ఈ ఏడాది సెప్టెంబర్ 23 నాటికి 10,06,682కు చేరింది. అదే సమయంలో ఫేస్‌బుక్‌లోనూ 4,20,360 నుంచి 8,37,008కి చేరుకుంది. -
పింఛన్ల పంపిణీ ఇక మూడురోజులు
సాక్షి, అమరావతి: పింఛనుదారులందరికీ ప్రతినెలా డబ్బు అందించటమే లక్ష్యంగా ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంది. ఏ ఒక్క లబ్ధిదారు పింఛను అందక ఇబ్బంది పడకూడదని.. మూడురోజులపాటు పింఛన్లు పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి కార్యాలయం ఆదేశించింది. ఈ నిర్ణయం డిసెంబర్ నుంచే అమలుకానుంది. డిసెంబర్ పింఛన్లను 1, 2, 3 తేదీల్లో వలంటీర్లు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పంపిణీ చేయనున్నారు. ఉద్యోగులకు ఒకటో తేదీ వేతనాలు అందినట్లే అవ్వాతాతలకు ప్రతినెలా ఒకటో తేదీనే పింఛను డబ్బులు అందజేయాలన్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో అధికారులు ఈ ఏడాది జూలై నెల నుంచి పింఛన్ల పంపిణీని ఒకటో తేదీకే పరిమితం చేశారు. గిరిజన ప్రాంతాలు వంటి మారుమాల ప్రాంతాల్లో రెండురోజుల పాటు పంపిణీకి వీలు కల్పించారు. వలంటీర్లు పంపిణీ చేసేందుకు వెళ్లినప్పుడు ఊళ్లో లేకపోవడం వంటి కారణాలతో ఆ రోజు తీసుకోలేకపోయినవారికి తరువాత నెలలో బకాయితో సహా చెల్లిస్తున్నారు. లబ్ధిదారులెవరూ ఈ విధంగా ఇబ్బంది పడకూడదని, అందరికీ పింఛను అందేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. దీంతో డిసెంబర్ నుంచి ప్రతినెలా ఒకటి, రెండు, మూడు తేదీల్లో పింఛన్లు పంపిణీ చేయాలని నిర్ణయించారు. దీంతో అందరికీ పింఛను అందే అవకాశం ఉంది. ఏవైనా కారణాల వల్ల ఈ మూడు రోజుల్లో కూడా తీసుకోలేకపోయినవారికి ఆయా వార్డు, గ్రామ సచివాలయాల్లో ఇచ్చే ఏర్పాట్లు చేసేందుకు అధికారులు పరిశీలిస్తున్నారు. డిసెంబర్లో 61.69 లక్షల మందికి పంపిణీ డిసెంబర్ ఒకటి నుంచి మూడురోజులు 61,69,832 మందికి పింఛన్లు పంపిణీ చేయనున్నారు. ఇందుకోసం ప్రభుత్వం విడుదల చేసిన రూ.1,510.90 కోట్లను రాష్ట్రంలోని అన్ని వార్డు, గ్రామ సచివాలయ కార్యదర్శుల ఖాతాల్లో సోమవారం జమచేశారు. వరుసగా మూడునెలలు పింఛను తీసుకోని వారికి నిబంధనల ప్రకారం పింఛను తాత్కాలికంగా నిలిపేసి, మళ్లీ పరిశీలన అనంతరమే కొనసాగించాల్సి ఉంది. అలాంటి వారికీ ఊరట కలిగిస్తూ.. వరుసగా మూడునెలలు పింఛను తీసుకోని 7,462 మందికి మూడునెలల బకాయిలతో కలిపి ఈనెల డబ్బులను పంపిణీ చేయనున్నారు. . -
సమావేశాలను రద్దు చేసుకున్న రాజస్తాన్ సీఎం
జైపూర్ : రాజస్తాన్ ముఖ్యమంత్రి కార్యాలయంలో కరోనా కలకలం రేగింది. దీంతో ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోత్ స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు. సీఎంవో కార్యాలయంలో పనిచేస్తున్న 9మంది ఉద్యోగులు, తన నివాసంలోని ఓ సిబ్బందికి కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో ముందుజాగ్రత్త చర్యగా షెడ్యూల్ ప్రకారం జరగాల్సిన కార్యక్రమాలు, సమావేశాలను ముఖ్యమంత్రి రద్దు చేసుకున్నట్లు సీఎంవో కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. తనను కలవడానికి ఎవరూ రావద్దొంటూ సీఎం తెలిపారు. రాష్ర్టంలో ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 75,303కు చేరగా 24 గంటల్లోనే 610కు పైగా కరోనా కేసులు నమదయ్యాయి. Breaking News: Rajasthan Chief minister Ashok Gehlot cancels all meetings and interactions after 10 persons from the CMO and CMR tested positive for coronavirus.@sangpran @ashokgehlot51 — Free Press Journal (@fpjindia) August 28, 2020 -
సీఎం వైఎస్ జగన్ శ్రీశైలం పర్యటన రద్దు
సాక్షి, అమరావతి : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శ్రీశైలం పర్యటనను రద్దుచేసుకున్నట్లుగా శుక్రవారం సీఎంఓ అధికారులు వెల్లడించారు. వరుసగా రెండో ఏడాది శ్రీశైలంలోకి వరదనీరు భారీగా వస్తున్న నేపథ్యంలో రాయలసీమ సహా వివిధ ప్రాజెక్టులకు తాగు, సాగునీటి అవసరాలకు నీటి తరలింపు సహా, ప్రాజెక్టు వద్ద పరిస్థితులను సమీక్షించేందుకు, అక్కడ పూజలు నిర్వహించేందుకు ఇవాళ (శుక్రవారం) ముఖ్యమంత్రి శ్రీశైలం వెళ్లాల్సి ఉంది. అయితే శ్రీశైలం ప్రాజెక్టుకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర పరిధిలో ఉన్న ఎడమగట్టు భూగర్భ జల విద్యుత్ కేంద్రంలో గత రాత్రి అగ్నిప్రమాదం సంభవించిన విషయాన్ని సీఎంఓ అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. (ప్రమాదంపై సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి) జల విద్యుత్ కేంద్రంలో చిక్కుకుపోయిన వారిని రక్షించడానికి సహాయ కార్యక్రమాలు కొనసాగుతున్నాయని సీఎంకు వివరించారు. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో అక్కడకు వెళ్లి పూజలు నిర్వహించండం, సమీక్షా సమావేశాలు నిర్వహించడం సబబుకాదని ముఖ్యమంత్రి అధికారులతో అన్నారు. తెలంగాణ విద్యుత్ కేంద్రంలో జరిగిన ప్రమాదం పట్ల సీఎం దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చిక్కుకుపోయిన వారు సురక్షితంగా బయటపడాలని ఆకాంక్షించారు. ఏపీ ప్రభుత్వం నుంచి, యంత్రాంగం నుంచి ఎలాంటి సహాయం కోరినా వెంటనే వారికి అందించాలని సీఎం ఆదేశాలు జారీచేశారు. ఈ నేపత్యంలో శ్రీశైలం పర్యటనను రద్దుచేయాల్సిందిగా ఆదేశాలు ఇచ్చారు. దీంతో ఇవ్వాళ్టి సీఎం శ్రీశైలం పర్యటనను రద్దుచేస్తున్నట్టుగా సీఎం అధికారులు వెల్లడించారు. (శ్రీశైలం విద్యుత్ కేంద్రంలో భారీ అగ్ని ప్రమాదం..) -
హోం క్వారంటైన్లో నాగాలాండ్ సీఎం
కోహిమా : నాగాలాండ్ ముఖ్యమంత్రి కార్యాలయంలో కరోనా కలకలం రేగింది. ముఖ్యమంత్రి కార్యాలయంలో పనిచేసే నలుగురు సిబ్బందికి కరోనా సోకడంతో సీఎం నీఫియు రియో హోం క్వారంటైన్లోకి వెళ్లారు. ముందుజాగ్రత్త చర్యగా ముఖ్యమంత్రితోపాటు సీఎం కార్యాలయ అధికారులు హోం క్వారంటైన్ లోకి వెళ్లామని నాగాలాండ్ సీఎంవో ట్వీట్ చేసింది. కార్యాలయన్ని శానిటైజ్ చేసి 48 గంటల పాటు మూసివేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ముందు జాగ్రత్త చర్యగా హోం క్వారంటైన్లో ఉన్న సీఎం ఇంటినుంచే పనిచేయనున్నట్లు సమాచారం. ముఖ్యమంత్రితో పాటు కార్యాలయంలోని సిబ్బంది, అధికారులు సహా మొత్తం 53 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. రాష్ర్టంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1566కు చేరిందని ఆరోగ్యశాఖ మంత్రి ఎస్ పంగ్న్యు వెల్లడించారు. ఇప్పటికే 625 మంది కోవిడ్ నుంచి కోలుకొనగా ప్రస్తుతం 936 కరోనా యాక్టివ్ కేసులున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో రికవరీ రేటు 39.9 శాతంగా ఉందన్న మంత్రి కిఫిరే జిల్లాలో ఇప్పటివరకు ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదని అన్నారు. (ఎమ్మెల్యేకు తప్పిన పెను ప్రమాదం) Few persons in the Chief Minister’s Residential Complex have tested positive for COVID-19. All SOPs are being implemented. The complex is being sanitized and the residential office closed for 48hrs. The normal functioning of the CMO is continuing following all guidelines. — CMO Nagaland (@CmoNagaland) July 30, 2020 -
ఆరోగ్యశాఖ కార్యాలయంలో కరోనా
ఘజియాబాద్ : ఎన్ని చర్యలు తీసుకుంటున్నా భారత్‌లో కరోనా విలయతాండవం చేస్తోంది. రోజురోజుకూ పెరుగుతున్న కేసుల సంఖ్య ఆందోళకనకరంగా మారింది. ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్ ఆరోగ్యశాఖ కార్యాలయంలోనే శనివారం ఇద్దరు ఉద్యోగులకు కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయ్యింది. దీంతో 48 గంటలపాటు కార్యాలయాన్ని తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ప్రపంచం మొత్తం పెను ప్రమాదంలో ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించిన సంగతి తెలిసిందే. (ఢిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యేంద్రకు ప్లాస్మా థెరఫీ ) కరోనా వ్యాక్సిన్‌ను కనిపెట్టడం అసాధ్యం కానప్పటికీ అదో కష్టతరమైన ప్రయాణమని డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ గేబ్రియేసన్ అన్నారు. భారత్‌లోనూ కరోనా కల్లోలం సృష్టిస్తోంది. గత 24 గంటల్లోనే 14,516 కొత్త కరోనా కేసులు నమోదైనట్లు శనివారం విడుదల చేసిన హెల్త్ బులిటెన్‌లో కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. దేశంలో తొలి కరోనా కేసు నమోదైనప్పటి నుంచి ఈ స్థాయిలో కేసులు నమోదుకావడం ఇదే తొలిసారి.దీంతో దేశంలో కరోనా కేసుల సంఖ్య నాలుగు లక్షలకు చేరువలో ఉంది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు నమోదైన దేశాల్లో అమెరికా, బ్రెజిల్,రష్యా తర్వాతి స్థానంలో భారత్ ఉంది. (చైనా వస్తువులను బహిష్కరించండి: శివరాజ్ సింగ్ చౌహాన్ ) -
కరోనా సాయంగా 50 లక్షల ఎంపీ ల్యాడ్స్
సాక్షి, హైదరాబాద్: కరోనా మహమ్మారిని తరిమి కొట్టేందుకుగాను ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ. 50 లక్షల ఎంపీ ల్యాడ్స్ నిధులను భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రకటించారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ట్విట్టర్ ద్వారా సీఎంవోకు సమాచారం అందజేశారు. కరోనాను రాష్ట్రం నుంచి తరిమికొట్టాలంటే ఆసుపత్రుల్లో మౌలిక వసతులు పెంచాలని, మాస్కులు, శానిటైజర్లు అందుబాటులోకి తీసుకురావాలని ట్వీట్ చేశారు. తాను ఇస్తున్న ఎంపీ ల్యాడ్స్‌ను ఆసుపత్రుల్లో సౌకర్యాలు మెరుగుపర్చడంతో పాటు మాస్కులు, శానిటైజర్ల కొనుగోలుకు ఉపయోగించాలని కోరారు. పరిస్థితి తీవ్రంగా ఉన్నందున ప్రభుత్వం మరింత దూకుడుతో నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. ప్రజలంతా సామాజిక దూరాన్ని విధిగా పాటించి కరోనాను రాష్ట్రం నుంచి తరిమికొట్టాలని కోమటిరెడ్డి పిలుపునిచ్చారు. వారిని ఇళ్లకు చేర్చండి కాశీ యాత్రకు వెళ్లి అక్కడే చిక్కుకుపోయిన తెలుగు ప్రజలను వారి స్వస్థలాలకు చేర్చాలని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కోరారు. ఈ మేరకు ఆయన శుక్రవారం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డికి ఫోన్ చేసి మాట్లాడారు. కాశీలో దాదాపు వెయ్యి మంది తెలుగు ప్రజలు చిక్కుకున్నారని, వారిలో తన నియోజకవర్గ పరిధిలోని బి.పోచంపల్లి మండలం దేశ్‌ముఖ్ గ్రామానికి చెందిన 35 మంది ఉన్నారని తెలిపారు. ఇందుకు స్పందించిన కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అక్కడి జిల్లా కలెక్టర్‌తో మాట్లాడి వారిని స్వస్థలాలకు పంపేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్టు కోమటిరెడ్డి కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. -
ఏపీ సీఎంఓ స్పందనపై బాధిత కుటుంబాలు హర్షం
-
ఏపీ సీఎంఓ స్పందనపై బాధిత కుటుంబాలు హర్షం
సాక్షి, విజయవాడ: కువైట్ ఎంబసీ పునరావాస కేంద్రంలో చిక్కుకున్న పశ్చిమగోదావరి మహిళల కష్టాలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కార్యాలయం స్పందించింది. తమ దీనావస్థను తెలియజేస్తూ.. బాధిత మహిళలు విడుదల చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో మంగళవారం సీఎంఓ కార్యాలయం ఆదేశాలతో ’దిశా’ స్పెషల్ ఆఫీసర్ దీపికా పాటిల్, పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ నవదీప్ సింగ్ రంగంలోకి దిగారు. బాధితుల కుటుంబ సభ్యుల నుంచి వివరాలు సేకరించారు. కువైట్ ఎంబసీతో సంప్రదింపులు జరుపుతున్నామని తెలిపారు. నలుగురు బాధిత మహిళలకు విముక్తి కల్పించి, దుబాయ్ నుంచి వారి స్వగ్రామాలకు తీసుకురావడానికి చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. సీఎంఓ స్పందనపై బాధిత మహిళల కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.( ఇక్కడ చదవండి: జగనన్నా.. మమ్మల్ని మీరే కాపాడాలి! ) -
సీఎంవో కార్యాలయ ఉద్యోగి అంటూ వసూళ్లు..
సాక్షి, సిద్ధిపేట : తెలంగాణ సీఎంవో కార్యాలయ ఉద్యోగి పేరుతో అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న మోసగాడు రాయబండి సూర్యప్రకాశ్‌ను టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయం ఉద్యోగిగా చెలమణి అవుతూ అతగాడు ప్రభుత్వ ఉద్యోగుల నుంచి అందినకాడికి దోచుకుంటున్నాడు. మీడియా సమావేశాలు, అన్నదానాల పేరుతో భారీగా డబ్బులు వసూలు చేసేవాడు. అలాగే సిద్ధిపేట సబ్ రిజిస్ట్రార్‌ను రూ.50వేలు ఇవ్వాలంటూ ఫోన్లో బెదిరింపులకు పాల్పడ్డాడు.సదరు వ్యక్తిపై అనుమానం వచ్చిన సబ్ రిజిస్ట్రార్ పోలీసులకు ఫిర్యాదు చేయడంత అసలు విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు కేసు నమోదు చేసి, నిందితుడిని కోర్టులో హాజరు పరిచారు. ఇప్పటికే సూర్యప్రకాశ్‌పై 11 కేసులు ఉన్నట్లు సమాచారం. -
ముఖ్యమంత్రి అదనపు కార్యదర్శిగా ధనుంజయ్ రెడ్డి
-
ఏపీ సీఎం కార్యాలయంలో అధికారుల బదిలీ
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి కార్యాలయంలోని ఉన్నతాధికారుల బదిలీలు షురూ అయ్యాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి బాధ్యతలు స్వీకరించిన అనంతరం సీఎంవో అధికారులపై బదిలీ వేటు పడింది. గత సీఎంకు ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న సతీష్ చంద్ర, ముఖ్య కార్యదర్శి సాయి ప్రసాద్, సీఎం కార్యదర్శిలు గిరిజా శంకర్, రాజమౌళిని బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.. వీరంతా సాధారణ పరిపాలనా శాఖకు రిపోర్టు చేయాలని ఆదేశాలు వెలువడ్డాయి. ఒకేసారి నలుగురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. మరోవైపు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అదనపు కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారి ధనుంజయ్ రెడ్డి నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన ఆంధ్రప్రదేశ్ టూరిజం అభివృద్ధి కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి : ముఖ్యమంత్రి అదనపు కార్యదర్శిగా ధనుంజయ్ రెడ్డి -
ప్రతిపక్షంపై రియల్ టైమ్ నిఘా
సాక్షి, అమరావతి: ఎన్నికల వేళ సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్‌ల అధికార దుర్వినియోగం పతాక స్థాయికి చేరింది. ప్రజలకు సత్వరమే సేవలందించే పేరిట ఏర్పాటు చేసిన రియల్ టైమ్ గవర్నెన్స్‌ను తమ స్వప్రయోజనాలకోసం వినియోగించుకుంటున్నారు. దీన్ని ప్రతిపక్షానికి చెందిన నేతల కార్యకలాపాలపై నిఘా పెట్టేందుకు ఉపయోగిస్తున్నారు. సీఎం చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్‌ల మౌఖిక ఆదేశాలతో ఈ తంతు సాగుతోంది. సీఎం కార్యాలయ అధికారులు, రియల్‌టైమ్ గవర్నెన్స్ అధికారి ఎ.బాబు పూర్తిస్థాయిలో ‘పచ్చ’పార్టీ నేతలుగా మారిపోయి.. అధికార దుర్వినియోగానికి దిగారు. ఈ క్రమంలో ప్రతిపక్ష నేతలపై రియల్ టైమ్ నిఘా ఏర్పాటు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రదేశాల్లో ఏర్పాటు చేసిన 20 వేలకుపైగా సీసీ కెమేరాలను రియల్‌టైమ్ గవర్నెన్స్‌కు అనుసంధానం చేశారు. వీటిలో 6,459 సీసీ కెమేరాల ద్వారా రియల్‌టైమ్ గవర్నెన్స్ ప్రత్యక్ష ప్రసారం ఉంది. వీటిని సీఎం కార్యాలయ అధికారులతోపాటు రియల్ టైమ్ గవర్నెన్స్ కార్యాలయంలో ఎ.బాబు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ప్రతిపక్ష నేతల ప్రచార కార్యకలాపాలు ఏ రీతిలో సాగుతున్నాయి.. ఎవరితో ఎవరు మాట్లాడుతున్నారు.. ఇత్యాది వివరాలను పర్యవేక్షించడమేగాక వెంటనే ఈ విషయాలను ఎప్పటికప్పుడు సీఎంకు, ఆయన కుమారుడు లోకేశ్‌కు తెలియజేస్తున్నారు. వారిచ్చిన వివరాల ఆధారంగా సీఎం, ఆయన కుమారుడు లోకేష్ ప్రతి చర్యలను చేపడుతున్నారు. ఆయా నియోజక వర్గాల్లో స్థానిక నేతలతో సంప్రదింపులకోసం కొంతమందిని ప్రత్యేకంగా పంపిస్తున్నారు. అధికారపార్టీ సేవలో ఆర్టీజీఎస్.. ప్రజలకు సత్వరమే సేవలందించే పేరిట ఏర్పాటైన ఆర్టీజీఎస్ సీఎం చంద్రబాబు, అధికార పార్టీ సేవలో తరిస్తోంది. ఏయే నియోజకవర్గాల ప్రజల్లో అధికార పార్టీ పట్ల, అభ్యర్థుల పట్ల వ్యతిరేకత ఏ స్థాయిలో ఉందో ఆర్టీజీఎస్ ద్వారా ఎ.బాబు, సీఎంవో అధికారులు సేకరిస్తూ వాటిని సీఎంకు, లోకేశ్‌కు సూచిస్తుండడం గమనార్హం. మరోవైపు రియల్ టైమ్ గవర్నెన్స్ నుంచి లబ్ధిదారులకు ఫోన్లు చేస్తూ వారి అభిప్రాయాల్ని తెలుసుకుంటున్నారు. ఇందుకోసం 2 వేలమందితో ప్రైవేట్ సైన్యాన్ని రెండేళ్లక్రితమే నియమించుకున్నారు. ఆ సైన్యాన్ని ఇప్పుడు అధికార దుర్వినియోగం ద్వారా పార్టీ ప్రయోజనాలకోసం సీఎం, ఆయన కుమారుడు వినియోగించుకుంటున్నారని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఎన్నికల నియమావళి ఉల్లంఘనే.. ప్రతిపక్ష నేతలతోపాటు వైఎస్సార్సీపీ అభ్యర్థుల కదలికలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడం.. ఆ విషయాల్ని అధికారపార్టీకి చేరవేయడం ద్వారా మేలు చేయడానికి రియల్‌టైమ్ గవర్నెన్స్‌ను దుర్వినియోగం చేస్తున్నారని సచివాలయ వర్గాలు సైతం పేర్కొంటున్నాయి. ప్రభుత్వ వ్యవస్థను ఇలా ఒక పార్టీ ప్రయోజనాలకోసం దుర్వినియోగం చేయడమంటే ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించడమేనని ఆ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇది తీవ్రమైన చర్యగా, అధికార దుర్వినియోగంగా పరిగణించాల్సి ఉంటుందని ఉన్నతాధికారి ఒకరు పేర్కొనడం గమనార్హం. ఇప్పటికే ప్రజాసాధికార సర్వే ద్వారా రాష్ట్రంలోని కుటుంబాలకు సంబంధించి వ్యక్తిగత సమాచారాన్ని సేకరించిన ఆర్టీజీఎస్ ఇటీవల ఆ వివరాల్ని టీడీపీ కోసం రూపొందించిన సేవా మిత్ర యాప్‌కు ఐటీగ్రిడ్స్ కంపెనీ ద్వారా ఏ.బాబు చేరవేసిన విషయం వీడియో సాక్షిగా వెల్లడవడం తెలిసిందే. ఇప్పుడు అధికారపార్టీ ప్రయోజనాల కోసం ఆర్టీజీఎస్ను పూర్థిస్థాయిలో దుర్వినియోగం చేస్తుండడం బహిర్గతమైన నేపథ్యంలో ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు ఈ వ్యవస్థ మొత్తాన్ని కేంద్ర ఎన్నికల సంఘం తమ అధీనంలోకి తీసుకోవడం మంచిదని అధికార వర్గాలే పేర్కొంటుండడం గమనార్హం. -
తొలిరోజు ‘ఆపద్ధర్మం’సాధారణం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ రద్దయిన నేపథ్యంలో కొలువుదీరిన ఆపద్ధర్మ ప్రభుత్వం తొలిరోజు సాధారణంగా పూర్తయ్యింది. సచివాలయం, ముఖ్యమంత్రి కార్యాలయ వ్యవహారాలు అన్ని ఎప్పటిలాగే సాగాయి. ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్.. హుస్నాబాద్‌లో టీఆర్ఎస్ బహిరంగ సభకు వెళ్లారు. దీంతో ముఖ్యమంత్రి కార్యాలయం అధికారిక కార్యక్రమాలేవి జరగలేదు. సీఎంవో అధికారులకు ప్రస్తుతం ప్రగతిభవన్‌లో, సచివాలయంలోని సీ బ్లాక్‌లో రెండు చోట్ల కార్యాలయాలు ఉన్నాయి. ఆయా రోజుల్లో ఉండే సమీక్షలు, సమావేశాల ప్రకారం వీరు ప్రగతిభవన్‌కు, సచివాలయంలోని సీఎంవోకు వెళ్తుంటారు. ఆపద్ధర్మ ప్రభుత్వం తొలిరోజు సీఎంవో అధికారులు అందరూ సచివాలయానికే వచ్చారు. సచివాలయం సీ బ్లాక్‌లో ముఖ్యమంత్రి కార్యాలయ అధికారుల చాంబర్లు, పేషీలో అవసరమైన మార్పులను గురువారమే పూర్తి చేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె.జోషి ఎప్పటిలాగే ఉదయమే సచివాలయా నికి చేరుకున్నారు. ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్‌శర్మ, సీఎంవో ముఖ్య కార్యదర్శులు నర్సింగ్‌రావు, ఎ.శాంతికుమారి, కార్యదర్శి భూపాల్‌రెడ్డి సచివాలయానికి వచ్చారు. అన్ని శాఖల్లోనూ యథావిధిగా కార్యకలాపాలు జరిగాయి. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో మొత్తం 32 శాఖలు ఉండగా.. తొలిరోజు 10 శాఖలు మాత్రమే ఉత్తర్వులను జారీ చేశాయి. శుక్రవారం జారీ అయిన 21 జీవోల్లో కీలకమైన నిర్ణయాలేవి లేవు. సాధారణ పరిపాలన శాఖ ఐఏఎస్ అధికారి జోత్య బుద్ధ ప్రకాశ్‌ను బదిలీ చేస్తూ.. అలాగే రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ వేతనం ఖరారుపైనా పంచాయతీరాజ్ శాఖ ఉత్తర్వులు ఇచ్చాయి. ఇవి మినహా కీలకమైన అంశాలకు సంబంధించిన నిర్ణయాల ఉత్తర్వులు ఏవీ జరగలేదు. -
పోలీస్ శాఖలో కొత్త లొల్లి!
- ఇన్స్పెక్టర్లుగా పదోన్నతి కల్పించాలని ఎస్ఐల మొర - గతేడాదే అర్హత సాధించిన 2007 బ్యాచ్ ఎస్ఐలు సాక్షి, హైదరాబాద్: పోలీస్ శాఖలో కొత్త లొల్లి మొదలైంది. ఆయా స్థాయిల్లోని పదోన్నతుల వ్యవహారం పీటముడిలాగా తయారైంది. అన్ని స్థాయిల్లోని పదోన్నతుల ప్రక్రియ స్తంభించిపోయే పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే ఇన్స్పెక్టర్ల నుంచి డీఎస్పీ పదోన్నతులు, డీఎస్పీ నుంచి అదనపు ఎస్పీ పదోన్నతులు, నాన్‌క్యాడర్ ఎస్పీ పదోన్నతులు కల్పించడానికి సీఎంవో కార్యాలయం బ్రేక్ వేసింది. తాజాగా ఎస్ఐలు పదోన్న తుల కోసం అభ్యర్థిస్తున్నారు. 8 ఏళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న 2007 డైరెక్ట్ రిక్రూట్ సబ్ ఇన్స్పెక్టర్లు తమను ఇన్స్పెక్టర్లుగా పదోన్నతులు కల్పించాలని ఒత్తిడి పెంచడం ప్రారంభించారు. దీంతో ఏం చేయాలో పాలుపోని పరిస్థితి ఉన్నతాధికారులకు ఎదురైంది. కొత్త రాష్ట్రం.. ఆపై నూతన జిల్లాలు.. వీటికి తగ్గట్టు కొత్త పోస్టులు.. ‘అన్నీ బాగానే ఉన్నాయి. కానీ అల్లుడి నోట్లోనే శని’అన్నట్టుగా ఉంది పోలీస్ శాఖ పరిస్థితి. సీనియారిటీ వ్యవహారంపై ఎటూ తేలకపోవడంతో డీజీపీ కార్యాలయం ఇన్స్పెక్టర్ నుంచి డీఎస్పీ పదోన్నతులు ఆపేసింది. ప్రస్తుతం 208 మంది ఇన్స్పెక్టర్లు డీఎస్పీ పదోన్నతుల కోసం వేచిచూస్తున్నారు. ఈ ఇన్స్పెక్టర్లకు డీఎస్పీ పదోన్నతులు కల్పిస్తేనే 2007 బ్యాచ్ ఎస్ఐలకు ఇన్స్పెక్టర్లుగా పదోన్నతి కల్పించేందుకు ఖాళీలు ఏర్పడుతాయి. ఇప్పుడున్న పరిస్థితులను బట్టి అలా సాధ్యమయ్యే అవకాశం కనిపించడం లేదు. ఇన్స్పెక్టర్ల సీనియారిటీ జాబితా జీవో నంబర్ 54పై అన్ని రేంజ్‌ల అధికారులు సంతకాలు పెట్టడం అంత సులభంగా జరిగేటట్టు లేదు. ఇది జరగకపోతే 2007 బ్యాచ్ ఎస్ఐల పరిస్థితి కూడా వెయిటింగ్‌లోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పటికే ఏడాది ఆలస్యం... 2007 ఎస్ఐ శిక్షణ కాలం ఏడాది తీసివేసినా గతేడాది ప్యానల్ ఇయర్‌కే ఇన్స్పెక్టర్ పదోన్నతికి అర్హత సాధించారు. ఇలా పదోన్నతి పొందాల్సిన ఎస్ఐలు హైదరాబాద్ సిటీ, వరంగల్ రేంజ్లో 200 మంది వరకు ఉంటారు. ఏడాది గడిచినా సీనియారిటీ జాబితాపై ఏం తేలకపోవడంతో ఇక తాము కూడా ఒత్తిడి పెంచాల్సిందేనని నిర్ణయానికి వచ్చారు. ఇప్పటికే ఈ వ్యవహారంపై మూడు సార్లు డీజీపీ అనురాగ్ శర్మకు మొరపెట్టుకున్నారు. డీఎస్పీ పదోన్నతుల ప్రక్రియ పూర్తికాగానే కల్పిస్తామని ఆయన భరోసా ఇచ్చారు. అయితే ఈ భరోసా ఎప్పుడు తీరుతుందా అని వేచిచూస్తున్నారు.