సాక్షి, వైఎస్సార్ జిల్లా: దువ్వూరు మండలం ఎర్రబల్లి వద్ద పొలం వివాదం ఘటనలో అక్బర్ బాషా కుటుంబ సభ్యుల సెల్ఫీ వీడియోలపై సీఎంవో స్పందించింది. అక్బర్ బాషా ఆవేదనపై సీఎం కార్యాలయం స్పందిస్తూ.. అక్బర్ బాషా ఇంటికి వెళ్లి విచారణ చేపట్టాలని ఎస్పీని ఆదేశించింది. అక్బర్ బాషా కుటుంబ సభ్యులతో పోలీసు అధికారులు మాట్లాడారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని పోలీసులు హామీ ఇచ్చారు.
ఘటనపై సమగ్ర విచారణ: ఎస్పీ అన్బురాజన్
అక్బర్ బాషా కుటుంబం.. ఎస్పీ అన్బురాజన్‌ను కలిసింది. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, అక్బర్ బాషా ఆత్మహత్యాయత్నం వీడియో వైరల్ కావడంతో వెంటనే స్పందించామన్నారు. చాగలమర్రి దువ్వూరు పోలీసుల సహకారంత కాపాడగలిగామన్నారు. ఘటనపై సమగ్ర విచారణ చేస్తున్నామని.. అదనపు ఎస్పీ దేవప్రసాద్ నేతృత్వంలో విచారణ చేపట్టామని ఎస్పీ తెలిపారు. రెండు రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించామని పేర్కొన్నారు. విచారణ జరిగే వరకు సీఐ కొండారెడ్డిని విధుల నుంచి తప్పిస్తున్నామని ఎస్పీ తెలిపారు. సీఐ, ఇతర పోలీసుల తప్పు ఉంటే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ అన్బురాజన్ స్పష్టం చేశారు. అక్బర్ బాషా కుటుంబ సభ్యులకు పూర్తిస్థాయి భద్రత కల్పిస్తామని ఎస్పీ పేర్కొన్నారు.
ఇవీ చదవండి:
ఏపీ ఫైబర్ గ్రిడ్ కుంభకోణం: 19 మందిపై ఎఫ్‌ఐఆర్
ఢిల్లీలో భారీ వర్షం.. 18 ఏళ్ల తర్వాత తొలిసారి
Comments
Please login to add a commentAdd a comment