సాక్షి, విజయవాడ: కువైట్ ఎంబసీ పునరావాస కేంద్రంలో చిక్కుకున్న పశ్చిమగోదావరి మహిళల కష్టాలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కార్యాలయం స్పందించింది. తమ దీనావస్థను తెలియజేస్తూ.. బాధిత మహిళలు విడుదల చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో మంగళవారం సీఎంఓ కార్యాలయం ఆదేశాలతో ’దిశా’ స్పెషల్ ఆఫీసర్ దీపికా పాటిల్, పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ నవదీప్ సింగ్ రంగంలోకి దిగారు. బాధితుల కుటుంబ సభ్యుల నుంచి వివరాలు సేకరించారు.
కువైట్ ఎంబసీతో సంప్రదింపులు జరుపుతున్నామని తెలిపారు. నలుగురు బాధిత మహిళలకు విముక్తి కల్పించి, దుబాయ్ నుంచి వారి స్వగ్రామాలకు తీసుకురావడానికి చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. సీఎంఓ స్పందనపై బాధిత మహిళల కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.( ఇక్కడ చదవండి: జగనన్నా.. మమ్మల్ని మీరే కాపాడాలి! )
Comments
Please login to add a commentAdd a comment