Embassy-Kuwait
-
ఏపీ సీఎంఓ స్పందనపై బాధిత కుటుంబాలు హర్షం
-
ఏపీ సీఎంఓ స్పందనపై బాధిత కుటుంబాలు హర్షం
సాక్షి, విజయవాడ: కువైట్ ఎంబసీ పునరావాస కేంద్రంలో చిక్కుకున్న పశ్చిమగోదావరి మహిళల కష్టాలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కార్యాలయం స్పందించింది. తమ దీనావస్థను తెలియజేస్తూ.. బాధిత మహిళలు విడుదల చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీంతో మంగళవారం సీఎంఓ కార్యాలయం ఆదేశాలతో ’దిశా’ స్పెషల్ ఆఫీసర్ దీపికా పాటిల్, పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ నవదీప్ సింగ్ రంగంలోకి దిగారు. బాధితుల కుటుంబ సభ్యుల నుంచి వివరాలు సేకరించారు. కువైట్ ఎంబసీతో సంప్రదింపులు జరుపుతున్నామని తెలిపారు. నలుగురు బాధిత మహిళలకు విముక్తి కల్పించి, దుబాయ్ నుంచి వారి స్వగ్రామాలకు తీసుకురావడానికి చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. సీఎంఓ స్పందనపై బాధిత మహిళల కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.( ఇక్కడ చదవండి: జగనన్నా.. మమ్మల్ని మీరే కాపాడాలి! ) -
కువైట్ లో ఎగరనున్న భారత జెండా..
కువైట్ః భారత స్వాతంత్ర దినోత్సవానికి కువైట్ ఆహ్వానం పలికింది. ఇండియన్ ఎంబసీ ప్రాంగణంలో జరిగే వేడుకలకు ప్రజలంతా హాజరు కావాలని ఓ పత్రికా ప్రకటన ద్వారా తెలిపింది. 70వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా 2016 ఆగస్టు 15న జెండా వందనం కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపింది. కువైట్ లో ఆగస్టు 15న భారత త్రివర్ణ పతాకం రెపరెపలాడనుంది. 70వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఇండియన్ ఎంబసీ ప్రాంగణంలో జెండా వందనం కార్యక్రమం నిర్వహించనుంది. ఈ వేడుకలకు కువైట్ లోని భారతీయులంతా హాజరు కావాలని ఎంబసీ.. పత్రికా ప్రకటనద్వారా ఆహ్వానం పలికింది. జెండా వందనం అనంతరం భారత కువైట్ రాయబారి భారత రాష్ట్రపతి సందేశాన్ని చదివి వినిపిస్తారని, వేడుకల్లో భాగంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలతోపాటు, దేశభక్తి గీతాలాపన ఉంటుందని తెలిపింది. జెండావందనానికి హాజరైన అతిథులకు, ప్రజలకు అల్పాహార విందును కూడా ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటనలో వివరించింది. కువైట్ లోని భారతీయులందరూ ఈ వేడుకలకు హాజరు కావాలని ఎంబసీ సాదరంగా ఆహ్వానం పలుకుతోంది. ఉదయం 7.30 కల్లా రమ్మంటూ ఆహ్వాన పత్రంలో ప్రత్యేక సూచన కూడా ఇచ్చింది.