ఘజియాబాద్ : ఎన్ని చర్యలు తీసుకుంటున్నా భారత్‌లో కరోనా విలయతాండవం చేస్తోంది. రోజురోజుకూ పెరుగుతున్న కేసుల సంఖ్య ఆందోళకనకరంగా మారింది. ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్ ఆరోగ్యశాఖ కార్యాలయంలోనే శనివారం ఇద్దరు ఉద్యోగులకు కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయ్యింది. దీంతో 48 గంటలపాటు కార్యాలయాన్ని తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ప్రపంచం మొత్తం పెను ప్రమాదంలో ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించిన సంగతి తెలిసిందే. (ఢిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యేంద్రకు ప్లాస్మా థెరఫీ )
కరోనా వ్యాక్సిన్‌ను కనిపెట్టడం అసాధ్యం కానప్పటికీ అదో కష్టతరమైన ప్రయాణమని డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ గేబ్రియేసన్ అన్నారు. భారత్‌లోనూ కరోనా కల్లోలం సృష్టిస్తోంది. గత 24 గంటల్లోనే 14,516 కొత్త కరోనా కేసులు నమోదైనట్లు శనివారం విడుదల చేసిన హెల్త్ బులిటెన్‌లో కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. దేశంలో తొలి కరోనా కేసు నమోదైనప్పటి నుంచి ఈ స్థాయిలో కేసులు నమోదుకావడం ఇదే తొలిసారి.దీంతో దేశంలో కరోనా కేసుల సంఖ్య నాలుగు లక్షలకు చేరువలో ఉంది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు నమోదైన దేశాల్లో అమెరికా, బ్రెజిల్,రష్యా తర్వాతి స్థానంలో భారత్ ఉంది. (చైనా వస్తువులను బహిష్కరించండి: శివరాజ్ సింగ్ చౌహాన్ )
Comments
Please login to add a commentAdd a comment