Sealed
-
మూడు రోజుల పాటు భారత్- నేపాల్ సరిహద్దు మూసివేత!
2024 లోక్‌సభ ఎన్నికల మూడో దశ నేపధ్యంలో బీహార్‌కు ఆనుకుని ఉన్న నేపాల్ సరిహద్దును 72 గంటల పాటు మూసివేశారు. సరిహద్దు ప్రాంతాలైన మధుబని, ఖుటోనా, జయనగర్ నుంచి నేపాల్ మీదుగా వాహనాల రాకపోకలపై నిషేధం విధించారు. 7వ తేదీన బీహార్‌లో ఎన్నికలు జరగనున్నాయి.మీడియాకు అందిన సమాచారం ప్రకారం ఖుటోనా, లద్నియా, పరిసర రాష్ట్రాలు, జిల్లాలు, దేశ సరిహద్దులతో సహా మధుబని లోఖా, లాల్మునియన్, జైనగర్, ఝంఝర్పూర్లలో భద్రతా బలగాలను పెద్ద సంఖ్యలో మోహరించారు. ఇదేవిధంగా లోక్‌సభ నియోజకవర్గాల్లో పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడంతో పాటు ఆయా చోట్ల భారీగా భద్రతా బలగాలను మోహరించారు. వృద్ధ ఓటర్లు పోలింగ్ కేంద్రానికి చేరుకునేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. బీహార్‌లోని ఈ ప్రాంతంలో భిన్నమైన రాజకీయ వాతావరణం కనిపిస్తుంది. మధుబని లోక్‌సభ స్థానానికి మే 20న ఎన్నికలు జరగనుండగా, అభ్యర్థుల ప్రచారం ముమ్మరంగా కొనసాగుతోంది. -
కోలీవుడ్‌లో షాక్: ప్రముఖ నటుడి ఇంటికి సీల్..
సాక్షి, తమిళసినిమా: నటుడు మన్సూర్ అలీఖాన్ ఇంటికి చెన్నై నగర కార్పొరేషన్ అధికారులు సీలు వేశారు. సంచలన నటుడు, నిర్మాత, రాజకీయవాది మన్సూర్ అలీఖాన్‌కు స్థానిక చూలైమేడులో ఇల్లు ఉంది. అందులోనే ఆయన తన కుటుంబ సభ్యులతో కలసి నివసిస్తున్నారు. అయితే ఆయన ప్రభుత్వానికి చెందిన 2,400 గజాల పొరంబోకు స్థలాన్ని ఆక్రమించుకుని ఇంటిని నిర్మించినట్లు ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. ఈ విషయమై చెన్నై నగర కార్పొరేషన్ అధికారులు ఆయనకు నోటీసులు జారీ చేశారు. ఈ వ్యవహారంలో తనను మోసం చేసి పొరంబోకు స్థలాన్ని విక్రయించిన వారిపై చర్యలు తీసుకోవాలని మన్సూర్ అలీఖాన్ 2019లో కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఆ పిటిషన్‌ను తాజాగా కోర్టు కొట్టి వేసింది. దీంతో శనివారం అధికారులు మన్సూర్ అలీఖాన్ ఇంటికి సీల్ వేశారు. వ్యవహారం ఇప్పుడు కోలీవుడ్‌లో కలకలం రేకెత్తిస్తోంది. చదవండి: Telangana Devudu: వెండితెరపై సీఎం కేసీఆర్ బయోపిక్.. తెలంగాణ దేవుడుగా శ్రీకాంత్ -
28 అనుమానాస్పద మరణాలు.. గ్రామం సీజ్
చండీగఢ్: హరియాణాలోని రోహ్తక్ జిల్లా టిటోలి గ్రామంలో 28 అనుమానాస్పద మరణాలు సంభవించడంతో జిల్లా యంత్రాంగం గ్రామాన్ని సీజ్ చేసింది. పొరుగు గ్రామాల్లో వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండటానికి బుధవారం మొత్తం గ్రామాన్ని కంటైన్మెంట్ జోన్‌గా ప్రకటించారు అధికారులు. గ్రామంలో ఇద్దరు యువకులతో సహా రెండు డజన్ల మంది మరణించారు. వీరిలో యువకులకు మరణించడానికి ముందు రెండు రోజుల పాటు జ్వరం వచ్చినట్లు నివేదికలు సూచిస్తున్నాయి. ఇంత భారీ ఎత్తున మరణాలు సంభవించడంతో గ్రామస్తులు ఆందోళనకు గురయ్యారు. కోవిడ్ వల్లనే వీరంతా మరణించినట్లు అధికారులు భావిస్తున్నారు. టిటోలి గ్రామాన్ని కంటెమెంట్ జోన్‌గా ప్రకటించిన తరువాత, జిల్లా యంత్రాంగం గ్రామంలోకి ఎవరిని అనుమతించడం లేదు.. ఊరి వారిని బయటకు వెళ్లనివ్వడం లేదు. గ్రామ సరిహద్దులో పోలీసులను మోహరించారు. బుధవారం 80 నమునాలను పరీక్షించగా.. వీరిలో 21 మందికి పాజిటివ్‌గా తేలింది.గ్రామంలో 25 శాతం మందికి కోవిడ్ సోకినట్లు అధికారులు తెలిపారు. చదవండి: కరోనాపై కేంద్ర ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు -
షాపింగ్ తంటా : ప్రముఖ షోరూం మూత
సాక్షి, చెన్నై: పండుగ సీజన్ రావడంతో దేశంలోని చాలా ప్రాంతాల్లో షాపింగ్ సందడి నెలకొంది. ముఖ్యంగా కరోనా వైరస్, లాక్ డౌన్ ఆంక్షలతో గత ఏడు నెలలుగా ఇంటికి పరిమితమైన ప్రజలు షాపింగ్ కోసం భారీ సంఖ్యలో షోరూంలకు క్యూ కడుతున్నారు. ఇదే చెన్నైలోని ఒక దిగ్గజ బట్టల దుకాణానికి షాక్ ఇచ్చింది. కోవిడ్-19 నిబంధనలను భారీగా ఉల్లంఘించారని ఆరోపిస్తూ చెన్నైలోని ప్రసిద్ధ కుమరన్ సిల్క్స్ను మంగళవారం గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ (జిసిసి) మూసివేసింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. (ఎడతెగని దగ్గు, శ్రీమతికి గోల్డెన్ చాన్స్ మిస్) షోరూమ్ లోపల, వెలుపల ఎలాంటి భౌతిక దూరం పాటించకుండా, ఫేస్ మాస్క్‌లు ధరించకుండా వందలాది మంది జనం గుమిగూడిన నేపథ్యంలో దానికి సీల్ వేశామని గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ ప్రకటించింది. ప్రజలు భద్రతా ప్రోటోకాల్‌ను ఖచ్చితంగా పాటించాలని జీసీసీ ఒక ట్వీట్లో పేర్కొంది. నిబంధనలు ఉల్లంఘించడం చాలా ప్రమాదకరం, బాధాకరమని జీసీసీ కమిషనర్ జీ ప్రకాష్ వ్యాఖ్యానించారు. ఒకేసారి 500 లేదా వెయ్యి మంది కస్టమర్లను అనుమతించమని, వీరిని దుకాణాదారులే నియంత్రించాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఇది ఇలా ఉంటే ఈ ఉల్లంఘనలు ప్రతి దుకాణంలో జరుగుతున్నాయి... ఈ ఒక్కదాన్ని మాత్రమే ఎందుకు టార్గెట్ చేస్తున్నారని స్థానికులు విమర్శిస్తున్నారు. ఇది పండుగ కాలం కనుక షాపింగ్ చేయాలనుకుంటున్నారని గీతా పద్మనాభన్ ఆగ్రహం వ్యక్తం చేయడం విశేషం. Kumaran Silks in Chennai sealed after video of crowding and lack of physical distancing emerges. @chennaicorp @thenewsminute pic.twitter.com/qIM9HyUxSv — priyankathirumurthy (@priyankathiru) October 20, 2020 A shop in Tnagar has been #locked and #sealed today, since they allowed overcrowding & didn’t follow the COVID-19 safety protocols. Other such shops, which don’t follow the protocols shall be sealed too. Shop owners & public are requested to strictly follow safety protocols.#GCC pic.twitter.com/MncKIWxfIG — Greater Chennai Corporation (@chennaicorp) October 20, 2020 -
ఉస్మానియా పాత భవనానికి సీల్
-
ఉస్మానియా పాత భవనానికి సీల్
సాక్షి, హైదరాబాద్ : నగరంలోని ఉస్మానియా ఆస్పత్రి పాత భవనానికి వెంటనే ఖాళీ చేయాలని డీఎంఈ రమేష్‌రెడ్డి ఆదేశించారు. శిథిలావస్థకు చేరిన పాత భవనానికి తాళం వేసి సీల్ వేయాలన్నారు. ఓల్డ్ బ్లాక్‌లోని డిపార్ట్మెంట్లను వేరేచోటకి మార్చాలని ఆదేశాలు జారీచేశారు. దీంతో పాత భవనంలోని పేషెంట్లను పక్క భవనంలోకి తరలించనున్నారు. (కరోనాతో బాలల హక్కుల సంఘం నేత మృతి) కాగా, ఇటీవల కురిసిన వర్షానికి ఆస్పత్రిలోకి పెద్ద ఎత్తున నీరు చేరడంతో పేషెంట్లు, వైద్యులు తీవ్రంగా ఇబ్బంది ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. దీంతో మూడు రోజులుగా ఉస్మానియా ఆసుపత్రిని కూల్చివేసి కొత్త భవనాన్ని నిర్మించాలని వైద్యులు, సిబ్బంది ఆందోళన చేపట్టారు. ఈ నేపథ్యంలో పాత భవనాన్ని సీల్ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది.(మూసీ నది బ్రిడ్జిపై ప్రమాదం.. మృతులు రైల్వే ఉద్యోగులు) -
ఆరోగ్యశాఖ కార్యాలయంలో కరోనా
ఘజియాబాద్ : ఎన్ని చర్యలు తీసుకుంటున్నా భారత్‌లో కరోనా విలయతాండవం చేస్తోంది. రోజురోజుకూ పెరుగుతున్న కేసుల సంఖ్య ఆందోళకనకరంగా మారింది. ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్ ఆరోగ్యశాఖ కార్యాలయంలోనే శనివారం ఇద్దరు ఉద్యోగులకు కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయ్యింది. దీంతో 48 గంటలపాటు కార్యాలయాన్ని తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ప్రపంచం మొత్తం పెను ప్రమాదంలో ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించిన సంగతి తెలిసిందే. (ఢిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యేంద్రకు ప్లాస్మా థెరఫీ ) కరోనా వ్యాక్సిన్‌ను కనిపెట్టడం అసాధ్యం కానప్పటికీ అదో కష్టతరమైన ప్రయాణమని డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ గేబ్రియేసన్ అన్నారు. భారత్‌లోనూ కరోనా కల్లోలం సృష్టిస్తోంది. గత 24 గంటల్లోనే 14,516 కొత్త కరోనా కేసులు నమోదైనట్లు శనివారం విడుదల చేసిన హెల్త్ బులిటెన్‌లో కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. దేశంలో తొలి కరోనా కేసు నమోదైనప్పటి నుంచి ఈ స్థాయిలో కేసులు నమోదుకావడం ఇదే తొలిసారి.దీంతో దేశంలో కరోనా కేసుల సంఖ్య నాలుగు లక్షలకు చేరువలో ఉంది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు నమోదైన దేశాల్లో అమెరికా, బ్రెజిల్,రష్యా తర్వాతి స్థానంలో భారత్ ఉంది. (చైనా వస్తువులను బహిష్కరించండి: శివరాజ్ సింగ్ చౌహాన్ ) -
బీఎస్ఎఫ్ ప్రధాన కార్యాలయం మూసివేత
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఈ నేపథ్యంలో బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్) ప్రధాన కార్యాలయంలోని రెండు అంతస్తులను బీఎస్ఎఫ్ అధికారులు సోమవారం సీల్ చేశారు. బీఎస్ఎఫ్ సిబ్బందికి కరోనా వైరస్ పాజిటివ్‌గా రావటంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. మొత్తం ఎనిమిది అంతస్తులు ఉన్న ఈ భవనం లోధి రహదారిలోని సీజీఓ కాంప్లెక్స్‌లో ఉంది. ఇక బీఎస్ఎఫ్ కార్యాలయ భవనానికి శానిటైజేషన్ పనులు చేస్తున్నామని అధికారులు తెలిపారు. కరోనా పాజిటివ్ వచ్చిన సిబ్బందితో కాంటాక్టు అయిన వారిని ట్రేస్ చేస్తున్నామని బీఎస్ఎఫ్ అధికారులు పేర్కొన్నారు. (అస్సాంలో వెలుగుచూసిన స్పానిష్ ఫ్లూ) ఇక 126 బెటాలియన్‌కి చెందని 25 మంది బీఎస్ఎఫ్ భద్రతా సిబ్బందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. ఇప్పటివరకు మొత్తం 56 మంది బీఎస్ఎఫ్ జవాన్లకు కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా అందరికీ నెగటివ్ వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఇందులో త్రిపుర రాష్ట్రానికి చెందన వారు 14 మంది, ఢిల్లీకి చెందిన వారు 43 మంది జవాన్లు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. మే 3న ఇద్దరు సీఆర్పీఎఫ్ జవాన్లకు కరోనా పాజిటివ్ రావటంతో సీఆర్పీఎఫ్ ప్రధాన కార్యాలయాన్నిమూసివేసిన విషయం తెలిసిందే. ఇప్పటివకు సీఆర్పీఎఫ్లో 137 పాజిటివ్ కేసులు ఉండగా, ఒకరు మృతి చెందారు. మరో వైపు సీఐఎస్ఎఫ్లో కూడా తొమ్మిది కరోనా వైరస్ పాజిటివ్ కేసులు ఉన్నాయి. -
ముంబై వొఖార్డ్ ఆసుపత్రి సీజ్
ముంబై: ముంబై సెంట్రల్‌లోని వొఖార్డ్ ఆసుపత్రికి చెందిన ముగ్గురు వైద్యులు, 26 మంది నర్సులు, పారామెడికల్ సిబ్బందికి కరోనా పాజిటివ్ రావడంతో ఆసుపత్రిలో వైద్యసేవలను నిలిపివేశారు. వీరికి వైరస్ సోకిందనే విషయాన్ని విచారిస్తున్నట్టు ఆయన వెల్లడించారు. ఆసుపత్రిలో ఉన్న వారందరినీ క్వారంటైన్లో ఉంచారు. ముంబైలో సోమవారం నాటికి 490 పైగా కోవిడ్ కేసులు నమోదుకాగా 34 మంది మరణించారు. -
మసీదుకు సీల్ వేసిన ఢిల్లీ అధికారులు
-
నిజాముద్దీన్‌లోని మర్కజ్ మసీదు మూసివేత
సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీలోని నిజాముద్దీన్ ప్రాంతంలో గల మర్కజ్ మసీదు దేశ వ్యాప్తంగా కలకలం సృష్టిస్తోంది. మర్కజ్లో ఈ నెల నిర్వహించిన మతపరమైన ప్రార్థనాల్లో పాల్గొన్న వారికి కరోనా వైరస్ సోకడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ నేపథ్యంలోనే మసీదును అధికారులు మూసివేశారు. ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘించి, నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆదేశాల మేరకు మసీదుకు సీల్ వేశారు. అలాగే మర్కజ్లో ప్రార్థనలు నిర్వహించిన మతపెద్దలపై పోలీసు కేసు నమోదు చేయాలని సీఎం ఆదేశించారు. ఈ నేపథ్యంలో మర్కజ్ ప్రాంతంలో పెద్ద ఎత్తున బందోబస్త్‌ను ఏర్పాటు చేశారు. డ్రోన్ కెమెరాలతో అక్కడి పరిస్థితిని అధికారులు సమీక్షిస్తున్నారు. (తెలంగాణలో కరోనా కల్లోలం) కాగా మర్కజ్ ప్రార్థనలకు ఇండోనేషియా, థాయ్‌లాండ్, నేపాల్, మలేషియా, సౌదీ అరేబియా వంటి దేశాలకు చెందిన దాదాపు 280 మంది హాజరయ్యారు. దీంతో ఆ ప్రార్థనలో పాల్గొన్న వారికి వైరస్ సోకే అవకాశం ఉందని ఢిల్లీ వైద్యులు భావిస్తున్నారు. మరోవైపు దేశంలోని వివిధ ప్రాంతాల్లో వెలుగుచూసిన కరోనా మూలాలు ఢిల్లీలోనే ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఆ సమావేశానికి వెళ్లి వచ్చిన వారిపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ఈ నెల 13 నుంచి 15 వరకు మర్కజ్లో మతపరమైన ప్రార్థనల్లో పాల్గొన్న వారిలో కొందరికి కరోనా వైరస్ సోకిన విషయం తెలిసిందే. దీనిలో తెలంగాణకు చెందిన ఆరుగురు, కశ్మీర్‌కు చెందిన ఒకరు మరణించడంతో ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. మరోవైపు ప్రార్థనల్లో పాల్గొన్న 1200 మందికిపైగా కరోనా అనుమానితులను అధికారులు క్వారెంటైన్‌ను తరలించారు. వీరిలో ఇప్పటి వరకు 24 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. మిగిలిన వారందరికీ వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. అయితే వీరిలో పెద్ద ఎత్తున కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యే అవకాశం ఉన్నట్లు వైద్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు మర్కజ్ ప్రార్థనల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరూ విధిగా తమ సమాచారాన్ని అధికారులకు అందించాలని ప్రభుత్వ కోరుతోంది. ఇక ఢిల్లీ ప్రార్థనలకు వెళ్లిన వారి కోసం అధికారులు జల్లెడపడుతున్నారు. -
మెగా స్కాం: పీఎన్బీకి మరో షాక్
సాక్షి,ముంబై: భారీ కుంభకోణంతో మల్లగుల్లాలుపడుతున్న పంజాబ్ నేషనల్ బ్యాంకుకు దర్యాప్తు సంస్థ సీబీఐ షాక్ ఇచ్చింది. వేలకోట్ల రూపాయల మెగా స్కాంలో సీబీఐ విచారణ నేపథ్యంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. మోసపూరిత లావాదేవీలుచోటు చేసుకున్న ముంబై బ్రాడీ హౌస్ బ్రాంచుకు సీబీఐ తాళం వేసింది. తదుపరి ఆదేశాలు వరకు అధికారులకు కార్యాలయంలోకి ప్రవేశం లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు పీఎన్బీ ముంబై బ్రాంచ్ కార్యాలయం ఎదుట నోటీసులు అతికించింది. మరోవైపు దేశంలో అతిపెద్ద బ్యాంకు కుంభకోణంలో పీఎన్బీ మాజీ డిప్యూటీ జనరల్ మేనేజర్ గోకుల్‌నాథ్ శెట్టి, సింగిల్ విండో క్లర్క్ మనోజ్ కరత్‌లను శనివారం సీబీఐ అరెస్ట్ చేయగా స్పెషల్ కోర్టు వీరిని 14 రోజుల పోలీస్ కస్టడీకి తరలించింది. ఈ విచారణలో నిందితులు భారీ కమిషన్లకు బ్యాంకు సంబంధించిన కీలక పాస్‌వర్డ్‌లను నీరవ్‌మోదీ బృందానికి చేరవేసినట్టు అంగీకరించారు. -
సీలు భద్రం..మందు మాయం
పెద్దపల్లి : ఫుల్‌బాటిల్ సీలు భద్రంగా ఉండగానే లోపల మద్యం మాయవుతోంది. ఇదేదో విఠలాచార్య సినిమాలో సన్నివేశం కాదు. పెద్దపల్లి ప్రాంతంలోని వైన్సుల్లో జరుగుతున్న దందా. సీల్ ఉన్న బాటిల్లోని మందును మాయం చేసి అందులో నీళ్లు నింపుతూ కల్తీ చేస్తున్నారు. ఎన్ఫోర్స్మెంట్ దాడుల్లో ఈ విషయం వెల్లడైంది. పట్టణానికి చిందం రమేశ్, ఆవునూరి రమేశ్ అనే యువకులు సీసాకు సీల్ ఉండగానే చాకచక్యంగా తొలగించడంలో నేర్పరులు. వీరి నేర్పరితనాన్ని మద్యం దుకాణాల యజమానులు తమ కల్తీ దందాకు ఉపయోగించుకుంటున్నారు. పెద్దపల్లి బస్టాండ్ సమీపంలోని వైష్ణవి 123 నంబర్ గల మద్యం దుకాణం వెనకాల శనివారం వేకువజామున ఈ ఇద్దరు యువకులు మద్యం బాటిళ్ల మూతలు చాకచక్యంగా తీస్తున్నారు. ఒక్కో బాటిల్లోంచి 25 శాతం మద్యం తీస్తూ అక్కడే బకెట్లలో ఉన్న నీళ్లను నింపుతూ మళ్లీ యథావిధిగా మూత బిగిస్తున్నారు. అదే సమయంలో కరీంనగర్‌కు చెందిన ఎన్ఫోర్స్మెంట్ ఎస్సై పి.వెంకట్ తన బృందంతో దాడి చేశారు. రూ.15 వేల విలువైన మద్యం సీసాలు, నీళ్ల బకెట్లు, సేకరించిన మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్నారు. మద్యం దుకాణాన్ని సీజ్ చేసి యజమాని మహేశ్‌పై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ‘ఎక్సైజ్’పై అనుమానాలు పెద్దపల్లిలో చాలాకాలంగా మద్యం కల్తీ అవుతోందని మద్యప్రాన ప్రియులు గగ్గోలు పెడుతున్నప్పటికీ స్థానికంగా ఎలాంటి ఆధారాలు చిక్కకపోవడంతో ఎవరికి వారే మిన్నకుంటున్నారు. వేలాది రూపాయలు వెచ్చించి మద్యం కొనుక్కుంటున్న పలువురు కల్తీ అవుతోందని వైన్‌షాప్ నిర్వాహకులతో గొడవకు దిగిన సందర్భాలున్నాయి. అక్రమ దందాను స్థానిక ఎక్సైజ్ అధికారులు చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. దీంతో ఆధారాల కోసం పట్టణంలో మద్యం వ్యాపారులపై నిఘా వేసినవారే స్థానిక అధికారులను నమ్మకుండా ఎన్ఫోర్స్మెంట్కు ఉప్పందించినట్లు సమాచారం. దీంతో ఎన్ఫోర్స్మెంట్ సిబ్బంది రంగంలోకి దిగి మద్యం కల్తీ చేస్తున్నవారిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. కాగా, పట్టుకున్న బాటిళ్లు ఖరీదైనవి కాకపోవడం అనుమానాలకు తావిస్తోంది. దాడుల్లో ఆఫీసర్స్ చాయిస్, ఎంసీ బాటిళ్లు లభ్యమైనట్లు అధికారులు ప్రకటించారు. పెద్దగా ఖరీదు కాని ఈ మద్యాన్ని కల్తీ చేస్తే ఒరిగేదేమి ఉంటుందని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఎక్సైజ్ అధికారులే వ్యూహాత్మకంగా వ్యవహరించి కేసు ప్రాధాన్యతను తగ్గించే దిశగా చవక మద్యం బాటిళ్లను కల్తీ చేస్తున్నట్లుగా చూపించినట్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. స్టాక్ దిగిన రాత్రే మూతలు మాయం మద్యం దుకాణాల్లోకి స్టాక్ దిగిన రాత్రే మూత ల తొలగింపు నిపుణులు అక్కడకు చేరుకుని మూతలు తొలగించి ఒక్కో బాటిల్లో పావలా వంతు మద్యం తీసి నీళ్లెక్కిస్తున్నారు. ఇలా యజమానులు ఒక్కో బాటిల్‌పై రూ.200 చొప్పున అదనపు లాభం గడిస్తున్నారు. గతేడాది శాంతినగర్ సమీపంలోని మద్యం దుకాణంలో ఖరీదైన మద్యం బాటిళ్లలో రంగునీళ్ల గుడుంబా కలిపి సీల్ వేస్తుండగా ఎక్సైజ్ అధికారులు వలపన్ని పట్టుకోగా, సదరు షాప్ లెసైన్సును రద్దు చేసి నిర్వాహకులపై కేసు నమోదు చేశారు. అంతకుముందు బ్రాహ్మణపల్లిలో నకిలీ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. పెద్దపల్లి ప్రాంతంలో మద్యం కల్తీపై మద్యపాన ప్రియులు ఆందోళన చెందుతున్నారు.