ఫైల్ ఫొటో
సాక్షి, హైదరాబాద్ : నగరంలోని ఉస్మానియా ఆస్పత్రి పాత భవనానికి వెంటనే ఖాళీ చేయాలని డీఎంఈ రమేష్‌రెడ్డి ఆదేశించారు. శిథిలావస్థకు చేరిన పాత భవనానికి తాళం వేసి సీల్ వేయాలన్నారు. ఓల్డ్ బ్లాక్‌లోని డిపార్ట్‌మెంట్లను వేరేచోటకి మార్చాలని ఆదేశాలు జారీచేశారు. దీంతో పాత భవనంలోని పేషెంట్లను పక్క భవనంలోకి తరలించనున్నారు. (కరోనాతో బాలల హక్కుల సంఘం నేత మృతి)
కాగా, ఇటీవల కురిసిన వర్షానికి ఆస్పత్రిలోకి పెద్ద ఎత్తున నీరు చేరడంతో పేషెంట్లు, వైద్యులు తీవ్రంగా ఇబ్బంది ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. దీంతో మూడు రోజులుగా ఉస్మానియా ఆసుపత్రిని కూల్చివేసి కొత్త భవనాన్ని నిర్మించాలని వైద్యులు, సిబ్బంది ఆందోళన చేపట్టారు. ఈ నేపథ్యంలో పాత భవనాన్ని సీల్ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది.(మూసీ నది బ్రిడ్జిపై ప్రమాదం.. మృతులు రైల్వే ఉద్యోగులు)
Comments
Please login to add a commentAdd a comment