Heritage buildings
-
వారసత్వ కట్టడాలకు తెలంగాణ పెట్టింది పేరు: రేవంత్‌రెడ్డి
గోల్కొండ (హైదరాబాద్): వారసత్వ కట్టడాలకు, శతాబ్దాల సంస్కృతికి తెలంగాణ పెట్టింది పేరని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన గోల్కొండ కోట సమీపంలోని కుతుబ్షాహి సమాధుల ప్రాంగణంలో పునరుద్ధరణ ప్రాజెక్టు ముగింపు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఇతర అధికారులతో కలసి మొక్కలు నాటారు. అనంతరం మాట్లాడుతూ.. శాతవాహనులు, కాకతీయులు, కుతుబ్‌షాహీలు పాలించిన ఈ ప్రాంతం మతసామరస్యానికి ప్రతీకగా నిలిచిందని అన్నారు.రామప్ప దేవాలయానికి యునెస్కో గుర్తింపు రావడం సంతోషకరమన్నారు. మరిన్ని చారిత్రక కట్టడాలను పునరుద్ధరించి యునెస్కో గుర్తింపు వచ్చేలా కృషి చేస్తామన్నారు. ఆఘాఖాన్ ట్రస్ట్ ఫర్ కల్చర్ సంస్థ 106 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ ప్రాంగణాన్ని అద్భుతంగా తీర్చిదిద్దిందని తెలిపారు. ముందు ముందుకూడా చారిత్రక కట్టడాల పునరుద్ధరణ పనుల్లో ఆఘాఖాన్ ట్రస్టు ఫర్ కల్చర్ సంస్థ సేవలను ఉపయోగించుకుంటామని వెల్లడించారు. తెలంగాణలో పర్యాటక రంగానికి పెద్దపీట వేస్తున్నామని దీని ఫలితంగా రాష్ట్రానికి పర్యాటకుల సంఖ్య పెరిగిందని చెప్పారు.మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పర్యాటక రంగం అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయన్నారు. అనంతరం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ మాట్లాడుతూ తాను విద్యారి్థగా ఉన్న సమయంలో కుతుబ్‌షాహీ సమాధుల వద్దకు స్కూల్ నుంచి విజ్ఞాన, విహార యాత్రకు వచ్చేవారమని గుర్తుచేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్స్ రహీమ్ ఆఘాఖాన్, కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్, రాష్ట్ర పర్యాటక శాఖ ముఖ్యకార్యదర్శి వాణిప్రసాద్, అధికారులు పాల్గొన్నారు. -
వారసత్వ సంపదతో మెరుగైన ప్రపంచం
న్యూఢిల్లీ: పూర్వీకుల నుంచి వచ్చిన ఘనమైన వారసత్వం అనేది కేవలం ఒక చరిత్ర కాదని, అదొక శాస్త్రం, వివిధ వర్గాల ప్రజలను కలిపే వారధి అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. మరింత మెరుగైన ప్రపంచాన్ని సృష్టించడానికి వారసత్వ సంపదను ఉపయోగించుకోవాలని సూచించారు. శనివారం ఢిల్లీలోని భారత్ మండపంలో 46వ వరల్డ్ హెరిటేజ్ కమిటీ(డబ్ల్యూహెచ్‌సీ) సదస్సు ప్రారం¿ోత్సవంలో మోదీ ప్రసంగించారు. చరిత్రాత్మక కట్టడాలు వారసత్వంగా వస్తుంటాయని, వాటిని చూసినప్పుడు అప్పటి కాలంలోకి వెళ్తామని ఉద్ఘాటించారు. ఉత్తరాఖండ్‌లోని కేదార్నాథ్ ఆలయం, తమిళనాడులోని బృహదీశ్వరాలయం ఘనమైన వారసత్వానికి ప్రతీక అని కొనియాడారు. ప్రపంచంలో అత్యంత ప్రాచీన నాగరికతను నిలయమైన మన దేశంలో ఈ సదస్సు జరుగుతుండడం ఆనందంగా ఉందన్నారు. యునెస్కో ఆధ్వర్యంలో జరుగుతున్న డబ్ల్యూహెచ్‌సీ సదస్సుకు భారత్ తొలిసారిగా ఆతిథ్యం ఇస్తోంది. ఈ నెల 31 దాకా ఈ సదస్సు జరుగనుంది. యునెస్కో డైరెక్టర్ జనరల్ ఆడ్రీ అజౌలే, కేంద్ర మంత్రులు ఎస్.జైశంకర్, గజేంద్రసింగ్ షెకావత్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
ప్రకాశం బ్యారేజ్‌కు 2023లో ప్రపంచ స్థాయి గుర్తింపు
సాక్షి,విజయవాడ: దక్షిణ భారత దేశంలోని పలు కట్టడాలు, ప్రదేశాలు 2023 సంవత్సరంలో ప్రపంచ సాంస్కృతిక, వారసత్వ సంపదగా గుర్తింపు పొందాయి. వీటిలో ఆంధ్రప్రదేశ్ విజయవాడలోని ప్రకాశం బ్యారేజ్ ఒకటి. ది ఇంటర్నేషనల్ కమిషన్ ఆఫ్ ఇరిగేషన్ అండ్ డ్రైనేజి(ఐసీఐడీ)ప్రకాశం బ్యారేజ్‌ను 2023లో ప్రపంచ వారసత్వ ఇరిగేషన్ నిర్మాణంగా ప్రకటించింది. విశాఖపట్నంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఐసీఐడీ అధ్యక్షుడు వరల్డ్ హెరిటేజ్ ఇరిగేషన్ స్ట్రక్చర్(డబ్ల్యూహెచ్‌ఐఎస్) అవార్డును ఆంధ్రప్రదేశ్‌కు అందించారు.ఇప్పటివరకు భారత దేశానికి 14 డబ్ల్యూహెచ్‌ఐఎస్ అవార్డులు రాగా వీటిలో ఆంధ్రప్రదేశ్‌ను నాలుగు అవార్డులు వరించాయి. The International Commission of Irrigation and Drainage (ICID) declared Prakasam Barrage as a World Heritage Irrigation Structure (WHIS).https://t.co/LincAyRUL8 pic.twitter.com/xaU8ldtEkM — South First (@TheSouthfirst) December 30, 2023 ఇదీచదవండి..జగన్ పదునైన ప్రశ్నలు..ఇంకేం ఇద్దరు గప్‌చుప్ -
వారసత్వ కట్టడంగా ధవళేశ్వరం బ్యారేజ్
సాక్షి, అమరావతి/సత్తెనపల్లి/ధవళేశ్వరం: గోదావరి డెల్టాను 160 ఏళ్లుగా సస్యశ్యామలం చేస్తూ.. భారతదేశపు ధాన్యాగారంగా నిలిపిన ధవళేశ్వరం బ్యారేజ్ (సర్ ఆర్ధర్ కాటన్ ఆనకట్ట) మణిహారంలో మరో కలికితురాయి చేరింది. ప్రపంచ సాగునీటి వారసత్వ కట్టడంగా బ్యారేజ్‌ను ఐసీఐడీ(ఇంటర్నేషనల్ కమిషన్ ఆన్ ఇరిగేషన్ అండ్ డ్రైనేజ్) గుర్తించింది. చదవండి: డాక్టరమ్మ గొప్ప మనస్సు.. రూ.20 కోట్ల భారీ విరాళం ఇందుకు సంబంధించిన గుర్తింపు పత్రాన్ని ఆ్రస్టేలియాలోని అడిలైడ్‌లో జరుగుతున్న ఐసీఐడీ 24వ కాంగ్రెస్‌లో గురువారం రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు, వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డిలకు ఆ సంస్థ చైర్మన్ ప్రొ.ఆర్. రగబ్ రగబ్ అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ వర్సిటీ వీసీ విష్ణువర్థన్‌రెడ్డి, వ్యవసాయ శాస్త్రవేత్తలు, నీటిపారుదలరంగ నిపుణులు, అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ పాల్గొన్నారు. దీంతో ధవళేశ్వరం బ్యారేజ్‌కు అసలైన గుర్తింపు దక్కినట్లయిందని నిపు ణులు హర్షం వ్యక్తంచేస్తున్నారు. దేశంలో నాలుగు కట్టడాలకు గుర్తింపు పురాతన కాలం నుంచి ఆయకట్టుకు సాగునీరు, ప్రజలకు తాగునీరు అందిస్తున్న కట్టడాలను ప్రపంచ వారసత్వ సాగునీటి కట్టడాలుగా ఐసీఐడీ గుర్తిస్తోంది. ఈసారి అడిలైడ్‌లో జరుగుతున్న 24వ కాంగ్రెస్‌లో ప్రపంచవ్యాప్తంగా 22 ప్రాజెక్టులను గుర్తించగా.. ఇందులో దేశంలోని నాలుగు ప్రాజెక్టులకు స్థానం దక్కింది. వీటిలో రాష్ట్రంలో ధవళేశ్వరం బ్యారేజ్, తమిళనాడులోని లోయర్ ఆనకట్ట, ఒడిశాలోని బైతరణి, రుషికుల్య ప్రాజెక్టులున్నాయి. ఇక 2019లో ఇండోనేషియాలో జరిగిన 23వ కాంగ్రెస్‌లో రాష్ట్రంలోని కేసీ (కర్నూల్–కడప) కెనాల్ (కర్నూల్ జిల్లా), కంబం చెరువు (ప్రకాశం జిల్లా), పోరుమామిళ్ల చెరువు (వైఎస్సార్ జిల్లా)లను ప్రపంచ సాగునీటి వారసత్వ కట్టడాలుగా ఐసీఐడీ గుర్తించింది. ధవళేశ్వరం బ్యారేజ్‌కు అసలైన గుర్తింపు గోదావరి డెల్టాకు 160 ఏళ్లుగా సాగు, తాగునీరు అందిస్తూ దేశ ధాన్యాగారంగా గోదావరి డెల్టా భాసిల్లడానికి కారణమైన ధవళేశ్వరం బ్యారేజ్‌ను మంత్రి అంబటి రాంబాబు, కార్యదర్శి శశిభూషణ్‌కుమార్, ఈఎన్సీ సి. నారాయణరెడ్డిల సూచనల మేరకు ప్రపంచ సాగునీటి వారసత్వ కట్టడంగా గుర్తించాలని ఐసీఐడీకి పంపాం. ప్రపంచ వ్యాప్తంగా జరిగిన పోటీలో ధవళేశ్వరం బ్యారేజ్‌ను ఐసీఐడీ ఎంపిక చేసింది. దీంతో ధవళేశ్వరం బ్యారేజ్‌కు అసలైన గుర్తింపు లభించింది. శతాబ్దాల క్రితం రాజులు నిరి్మంచిన చెరువులు, ఆనకట్టలు ఇప్పటికీ చెక్కుచెదరకుండా.. ఆయకట్టుకు సాగునీరు, తాగునీరు అందిస్తున్నాయి. అందులో పెద్దతిప్పసముద్రం, వ్యాసరాయసముద్రం, రంగరాయ సముద్రం, బుక్కపట్నం, రాయల చెరువులు ప్రధానమైనవి. వాటికి కూడా ప్రపంచ వారసత్వ సాగునీటి కట్టడాలుగా గుర్తింపు తేవడానికి ప్రయత్నిస్తాం. – వాసుదేవరెడ్డి, డీఈ, జలవనరుల శాఖ -
వందేళ్లు దాటినా చెక్కు చెదరని భవనాలు
పెనుకొండ: ఆంగ్లేయుల కాలంలో పెనుకొండలో నిర్మించిన కట్టడాలు వందేళ్లు దాటినా నేటికీ చెక్కు చెదరలేదు. గాలి, వెలుతురు, ఆహ్లాదకర వాతావరణం కలిగిన ఈ భవనాలు ప్రస్తుతం ప్రభుత్వ కార్యాలయాల భవనాలుగా సేవలందిస్తున్నాయి. కింది భాగం నుంచి రాయి, పై కప్పు భాగంలో పెంకులు, విశాలమైన కిటికీలు, తలుపులతో కూడిన భవనాలు చూడముచ్చటగా ఉన్నాయి. పెనుకొండలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రస్తుత సబ్ కలెక్టర్ కార్యాలయం, కోర్టు భవనం, ఆర్డబ్ల్యూఎస్, సబ్‌ట్రెజరీ, తహసీల్దార్ కార్యాలయం, సబ్ రిజి్రస్టార్ కార్యాలయం, సబ్‌కలెక్టర్ బంగ్లా, ఎక్సైజ్ కార్యాలయం, బాలికల ఉన్నత పాఠశాల, సబ్‌జైల్, ప్రభుత్వ జూనియర్ కళాశాల, ఆర్అండ్బీ భవనాలు తదితర కట్టడాలన్నీ ఆంగ్లేయుల హయాంలో నిర్మించినవే. పశు సంవర్ధక కార్యాలయం -
భాగ్యనగర చరిత్రకు చెదలు.. పట్టించుకోని అధికారులు
సాక్షి, చార్మినార్( హైదరాబాద్): పాతబస్తీలోని హెరిటేజ్ కట్టడాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. ఏళ్ల తరబడి ఎలాంటి మరమ్మతులకు నోచుకోవడం లేదు. పురాతన కట్టడాల పరిరక్షణను సంబందిత అధికారులు పట్టించుకోవడం లేదని పాతబస్తీ ప్రజలంటున్నారు. ► గతేడాది జోరుగా కురిసిన భారీ వర్షాలకు నిజాం పాలకుల నివాస గృహమైన చౌమహల్లా ప్యాలెస్ ప్రహరీ గోడ కిటికి కూలిపోయింది. ►అసఫ్ జాహీల రాచరిక పాలనకు పాతబస్తీలోని చౌమహల్లా ప్యాలెస్ నిలువుటద్దంగా నిలుస్తుంది. ► అలాగే ఆరో నిజాం మహబూబ్ అలీ పాషా సతీమణి సర్దార్ బేగం చార్మినార్‌లోని సర్దార్ మహాల్ భవనంలో నివాసముండేది. ► నిజాం కాలం నుంచి అందుబాటులో ఉన్న ఈ భవనం ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకుంది. ► శాలిబండలోని క్లాక్ టవర్, సిటీ కాలేజీ భవనాలు ఏళ్ల తరబడి ఎలాంటి మరమ్మతులు చేపట్టకపోవడంతో శిథిలావస్థకు చేరుకున్నాయి. ►శాలిబండ క్లాక్ టవర్‌ను అనుకొని ప్రైవేట్ వ్యాపార సముదాయాలు కొనసాగుతున్నాయి. ► దీని మరమ్మతు పనులు గతంలో ప్రారంభమైనప్పటికీ..నిధుల కొరత కారణంగా నిలిచిపోయాయి. ► సిటీ కాలేజీ భవనం కప్పు పూర్తిగా శిథిలాస్థకు చేరుకోవడంతో వర్షా కాలంలో వరద నీరు గదుల్లోకి చేరుకుంటోందని సంబంధిత అధికారులు,విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏడాది గడిచిపోయినా మరమ్మతులకు నోచుకోని చౌమహల్లా ప్యాలెస్.... యూరోఫియన్ శైలిలో నిర్మించిన శ్వేతసౌథం చౌమహల్లా ప్యాలెస్‌లోగతేడాది జూన్ 27న కిల్వత్ క్రీడా మైదానం వైపు ఉన్న ప్రహరీ పైభాగంలోని కిటికి దిమ్మె కూలి కింద పడింది. మరమ్మతు పనుల కోసం ఏర్పాటు చేసిన సపోర్టుగా ఇనుప రాడ్లు తప్ప.. ఎలాంటి మరమ్మతు పనులు ప్రారంభం కాలేదు. ఆనాటి హెరిటేజ్ కట్టడానికి ఎలాంటి నష్టం వాటిల్లకుండా వెంటనే మరమ్మతు పనులు చేపట్టాల్సి ఉన్నప్పటికీ..ఆ దిశలో పనులు జరగడం లేదు. నిజాం ప్రభువుల నివాస గృహం.. నిజాం ప్రభువుల నివాస గృహంగా ఉండేది. ► దాదాపు 2.90 లక్షల గజాల విస్తీర్ణంలో విశాలమైన ప్రాంగణంలో నిర్మించారు. ► ఆనాటి కాలంలో విద్యుత్ లైట్లు లేని కారణంగా ప్యాలెస్‌లో వెలుగుల కోసం షాండిలియర్లను ఏర్పాటుచేశారు. ► వీటిలో పొగరాని కొవ్వత్తులు, మైనపు ఒత్తులు ఏర్పాటుచేసేవారు. ►ప్రస్తుతం విద్యుత్ దీపాలు ఉండడంతో షాండిలియర్లు దేదీప్యమానంగా వెలుగుతూ చౌమహల్లా ప్యాలెస్‌కు మరింత శోభను తీసుకువస్తున్నాయి. ►1915లో చౌమహల్లా ప్యాలెస్ ప్రధాన గేట్ వద్ద అతిపెద్ద గడియారం ఏర్పాటు చేశారు. ► విదేశాల నుంచి వచ్చే అతిథులందరికీ చౌమహల్లా ప్యాలెస్‌లో ఆతిథ్య మిచ్చేవారు. శిథిలావస్థకు చేరిన సర్దార్ మహల్... జీహెచ్ఎంసీ చార్మినార్ జోన్ (సర్దార్ మహల్) భవన సముదాయం శిథి శిథిలావస్థకు చేరింది. శిథిలావస్థకు చేరిన ఈ భవనానికి మరమ్మత్తులు చేయడం లేదు. భవనంలోని నిజాం కాలం నాటి చెక్క మెట్లు విరిగిపోయాయి. ప్రస్తుతం ఈ విరిగిపోయిన మెట్లపై నుంచే ప్రజలు, సిబ్బంది రాకపోకలు సాగిస్తున్నారు. ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని బిక్కుబిక్కుమంటూ వెళుతున్నారు. -
గోల్కొండ, కుతుబ్‌షాహీ పరిరక్షణలో నిర్లక్ష్యమా?
సాక్షి, హైదరాబాద్: ప్రతిష్టాత్మక చారిత్రక కట్టడాలు గోల్కొండ కోట, కుతుబ్‌షాహీ టూంబ్స్ పరిరక్షణలో ఆర్కియాలజీ, పర్యాటకశాఖలు నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. రాత్రయితే ఒక్కలైటు ఉండడం లేదని, పర్యాటకుల టికెట్ల ద్వారా వచ్చిన డబ్బుతో ఏం చేస్తున్నారని నిలదీసింది. చారిత్రక కట్టడాల నిర్వహణ, పరిరక్షణకు ఎటువంటి ప్రణాళికలు రూపొందించారో తెలియజేయాలని, అలాగే బడ్జెట్ కేటాయింపులు తదితర వివరాలు సమర్పించాలని ఆదేశించింది. తదుపరి విచారణకు కేంద్ర ఆర్కియాలజీ విభాగం డైరెక్టర్ జనరల్, రాష్ట్ర పర్యాటకశాఖ ముఖ్య కార్యదర్శి వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలని మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. ఈమేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లి, జస్టిస్ బి.విజయసేన్‌రెడ్డిలతో కూడిన ధర్మా సనం మంగళవారం ఆదేశించింది. గోల్కొండ కోట, కుతుబ్‌షాహీ టూంబ్స్ పరిరక్షణలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, దీంతో ఈ రెండు చారిత్రక కట్టడాలు శిథిలావస్థకు చేరుకుంటున్నాయంటూ పత్రికల్లో వచ్చిన కథనాలను ధర్మాసనం సుమోటోగా విచారణకు స్వీకరించింది. ‘ఈ రెండు చారిత్రక కట్టడాల పరిరక్షణలో అధికారులు నిర్లక్ష్యంగా, బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారు. రాత్రయితే ఒక్కలైటూ కనిపించడం లేదు. మట్టిగోడలు కూలిపోతున్నాయి’అని ధర్మాసనం ఘాటుగా వ్యాఖ్యానించింది. ఈనెల 7న కేంద్ర ఆర్కియాలజీ విభాగం డైరెక్టర్ జనరల్, రాష్ట్ర పర్యాటకశాఖ ముఖ్య కార్యదర్శి వ్యక్తిగతంగా హాజరుకావాలని ఆదేశించింది. గో మహాగర్జనకు హైకోర్టు అనుమతి కవాడిగూడ: హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియం లో ఏప్రిల్ 1న జరగనున్న గో మహాగర్జనకు హై కోర్టు అనుమతిచ్చిందని యుగ తులసి ఫౌండేషన్ చైర్మన్, టీటీడీ పాలక మండలి సభ్యుడు కొలిశెట్టి శివకుమార్ తెలిపారు. మంగళవారం ఆయన ఎన్టీఆర్ స్టేడియంలో విలేకరులతో మాట్లాడుతూ.. గో హత్యలు నిషేధించాలని, కబేళాలు మూసివేయాలని, గోవులను జాతీయ ప్రాణిగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ తాము పిలుపునిచ్చిన గో మహాగర్జనకు ప్రభు త్వం అడ్డుపడిందన్నారు. ఈ గర్జనలో రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏమైనా ప్రకటనలు వస్తాయన్న ఉద్దేశంతో అనుమతి నిరాకరించిందన్నారు. వెంటనే తాము హైకోర్టును ఆశ్రయించగా అనుమతి వచ్చిందన్నారు. -
‘ఉస్మానియా’ను ఏం చేస్తారు?
సాక్షి, హైదరాబాద్: ఉస్మానియా ఆసుపత్రికి మరమ్మతులు చేస్తారా? లేక నూతన భవనాలను నిర్మిస్తారా? ఉన్నత స్థాయిలో నిర్ణయం తీసుకుని తెలపాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. దాదాపు ఆరేళ్లు గడిచినా ఈ వ్యవహారంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోకపోవడం శోచనీయమని పేర్కొంది. ప్రభుత్వం తీసుకునే నిర్ణయానికి సంబంధించిన పూర్తి వివరాలను 4 వారాల్లో సమర్పించాలని, ఉస్మానియా ఆసుపత్రి స్థలంతో పాటు భవనాలకు సంబంధించిన సైట్ ప్లాన్, గూగుల్ మ్యాప్ తదితర వివరాలతో నివేదిక సమర్పించాలని స్పష్టం చేసింది. చారిత్రక కట్టడమైన ఉస్మానియా ఆసుపత్రిని కూల్చకుండా ఆదేశించాలంటూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యాన్ని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమాకోహ్లీ, జస్టిస్ బి.విజయసేన్‌రెడ్డితో కూడిన ధర్మాసనం గురువారం మరోసారి విచారించింది. ఉస్మానియా ఆసుపత్రి భవనానికి మరమ్మతులు చేయాలా లేదా భవనాలు కూల్చేసి కొత్త భవనాలు నిర్మించాలా అన్న దానిపై ప్రభుత్వ నిర్ణయం తీసుకోవాల్సి ఉందని అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ నివేదించారు. ఈ పిల్ 2015లో దాఖలైందని, ఆరేళ్లయినా నిర్ణయం తీసుకోవడంలో ప్రభుత్వం ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడమేంటని ధర్మాసనం ప్రశ్నించింది. గత విచారణ సందర్భంగా సైట్‌మ్యాప్, గూగుల్ మ్యాప్‌లను సమర్పించాలని ఆదేశించినా ఎందుకు ఇవ్వలేదంటూ అసహనం వ్యక్తం చేసింది. చారిత్రక భవనాలను హెరిటేజ్ భవనాల జాబితా నుంచి తొలగించి వాటిని కూల్చేసేందుకు ప్రభుత్వం జీవో–183 జారీ చేసిందని, ఈ జీవో చట్ట విరుద్ధమని ఇటీవల ఎర్రమంజిల్ భవనాల పరిరక్షణలో భాగంగా ఇచ్చిన తీర్పులో హైకోర్టు స్పష్టం చేసిందని పిటిషనర్ తరఫు సీనియర్ న్యాయవాది ఎస్.సత్యంరెడ్డి వాదనలు వినిపించారు. హెరిటేజ్ భవనాలను కూల్చే అధికారం ప్రభుత్వానికి లేదని నివేదించారు. ఈ మేరకు స్పందించిన ధర్మాసనం పూర్తి వివరాలతో నివేదిక సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ విచారణను ఏప్రిల్ 22కు వాయిదా వేసింది. -
దిలీప్ కుమార్ ఇంటిని దక్కించుకునేందుకు పాక్ ప్లాన్!
బాలీవుడ్ దివంగత నటుడు దిలీప్ కుమార్ పాత ఇంటిని తక్కువ ధరకు కొట్టేద్దామని పాకిస్తాన్ ప్రభుత్వం ప్లాన్లు వేస్తోంది. పాకిస్తాన్‌లోని ఖైబర్ పక్తున్‌క్వా ప్రాంతంలో దాదాపు రూ.25 కోట్లు పలికే ఆయన ఇంటిని రూ.80.56 లక్షలు మాత్రమే ఇస్తామని తెలిపింది. దీనిపై దిలీప్ కుమార్ భవనాన్ని గతంలో కొనుగోలు చేసిన యజమాని హజీ లాల్ మహ్మద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను 15 ఏళ్ల కిందటే రూ.51 లక్షలకు కొనుగోలు చేస్తే.. ఇంత దారుణంగా తక్కువ ధరకు ఎలా కోట్ చేస్తారని ప్రశ్నించారు. పాకిస్తాన్ ప్రభుత్వం ఇస్తానన్న ధర అన్యాయమని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ చెప్తున్న మొత్తానికి భవనానిన అమ్మే ప్రసక్తే లేదని ఆయన తేల్చి చెప్పారు. 101 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ పురాతన భవనానికి హెరిటేజ్ కట్టడంగా ప్రకటించారు. దీంతో ఆ ఇంటిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడానికి సిద్ధమైంది. ఇక చర్చల దశలో ఉన్న ఈ భవనం అమ్మకంపై తుది నిర్ణయం ఇంకా ఖరారు కాలేదు. -
ఉస్మానియాలో హెరిటేజ్ భవనాలున్నాయా?
సాక్షి, హైదరాబాద్: ఉస్మానియా ఆసుపత్రి ఆవరణలో హెరిటేజ్ భవనాలు ఏమైనా ఉన్నాయా? ఉంటే వాటి వివరాలను సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఉస్మానియా ఆసుపత్రిలోని పాత భవనం ప్రమాదకరంగా ఉందని, దాన్ని కూల్చి నూతన భవనాన్ని నిర్మించేలా ఆదేశాలు జారీ చేయాలంటూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యాన్ని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ బి.విజయసేన్‌రెడ్డిల ధర్మాసనం గురువారం మరోసారి విచారించింది. పాత భవనాన్ని వెంటనే ఖాళీ చేసి రోగులను నూతన భవనంలోకి మార్చాలని ప్రభుత్వం ఆదేశించిందని, ఈ మేరకు జారీ చేసిన మెమోను ధర్మాసనానికి ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది సంజీవ్‌కుమార్ సమర్పించారు. కొన్ని భవనాలు మాత్రమే హెరిటేజ్ భవనాల కేటగిరీ కిందకి వస్తాయని వాటిని వదిలేసి గతేడాది ఆగస్టు నుంచి ఇతర భవనాలకు మరమ్మతులు (రెనోవేషన్) చేస్తున్నామని తెలిపారు. 2019 జూలైలో ఉస్మానియా ఆసుపత్రిని ప్రత్యేక బృందం సందర్శించి నివేదిక ఇచ్చిందని, దాన్ని ధర్మాసనం పరిశీలన కోసం సమర్పించామని వెల్లడించారు. ‘హెరిటేజ్ భవనం కూల్చరాదని ఒకరు, ప్రమాదకరంగా ఉన్న ఈ భవనాన్ని కూల్చి నూతన భవనాన్ని నిర్మించాలని మరొకరు పిటిషన్ దాఖలు చేశారు. హెరిటేజ్ భవనమా.. కాదా? ఎంత భాగం హెరిటేజ్ కేటగిరీ కిందకు వస్తుంది? ఇవేవీ తెలియజేయకుండా నిర్మాణాలు చేపట్టడం సరికాదు. ఈ రెండు పిటిషన్లను కలిపి విచారిస్తాం. ప్రస్తుతం అక్కడ చేపడుతున్న నిర్మాణాలకు సంబంధించి పూర్తి వివరాలు సమర్పించండి’ అని ధర్మాసనం ఆదేశిస్తూ తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది. -
ఉస్మానియా పాత భవనానికి సీల్
-
ఉస్మానియా పాత భవనానికి సీల్
సాక్షి, హైదరాబాద్ : నగరంలోని ఉస్మానియా ఆస్పత్రి పాత భవనానికి వెంటనే ఖాళీ చేయాలని డీఎంఈ రమేష్‌రెడ్డి ఆదేశించారు. శిథిలావస్థకు చేరిన పాత భవనానికి తాళం వేసి సీల్ వేయాలన్నారు. ఓల్డ్ బ్లాక్‌లోని డిపార్ట్మెంట్లను వేరేచోటకి మార్చాలని ఆదేశాలు జారీచేశారు. దీంతో పాత భవనంలోని పేషెంట్లను పక్క భవనంలోకి తరలించనున్నారు. (కరోనాతో బాలల హక్కుల సంఘం నేత మృతి) కాగా, ఇటీవల కురిసిన వర్షానికి ఆస్పత్రిలోకి పెద్ద ఎత్తున నీరు చేరడంతో పేషెంట్లు, వైద్యులు తీవ్రంగా ఇబ్బంది ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. దీంతో మూడు రోజులుగా ఉస్మానియా ఆసుపత్రిని కూల్చివేసి కొత్త భవనాన్ని నిర్మించాలని వైద్యులు, సిబ్బంది ఆందోళన చేపట్టారు. ఈ నేపథ్యంలో పాత భవనాన్ని సీల్ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది.(మూసీ నది బ్రిడ్జిపై ప్రమాదం.. మృతులు రైల్వే ఉద్యోగులు) -
వారసత్వ కట్టడాల పరిరక్షణపై సుప్రీం నోటీసులు
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రంలో పురాతన, వారసత్వ, సాంస్కృతిక సంపద జాబితాలోని కట్టడాలను పరిరక్షించాలన్న పిటిషన్‌పై సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీచేసింది. పిటిషనర్ పాశం యాదగిరి తరఫున సీనియర్ న్యాయవాది నిరూప్‌రెడ్డి వాదనలు వినిపించారు. గతంలో ఆయా కట్టడాలు హెరిటేజ్ యాక్ట్‌లో ఉండేవని, 132 కట్టడాలను వారసత్వ జాబితా నుంచి తొలగించారని, ఆ భవనాలు మున్సిపాలిటీల పరిధిలో ఉన్నందున ఆయా భవనాలకు రక్షణ లేదని నివేదించారు. పిటిషన్‌పై అభిప్రాయం కోరుతూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్.ఎ.బాబ్డే నేతృత్వంలోని ధర్మాసనం రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీచేసింది. -
వారసత్వ నిర్మాణాల పునరుద్ధరణకు చర్యలు
రాంగోపాల్‌పేట్: హైదరాబాద్‌లోని వారసత్వ నిర్మాణాల పునరుద్ధరణకు తగిన మాస్టర్ ప్లాన్ అవసరమని, దీనికి గానూ ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్ కుమార్ వెల్లడించారు. సోమవారం బేగంపేట్‌లోని మెట్రో భవన్లో సాంస్కృతిక వారసత్వ పరిరక్షణను అర్థం చేసుకోవడం అనే అంశంపై మున్సిపల్ పరిపాలన శాఖ సహకారంతో యునెస్కో, ఆగా ఖాన్ ట్రస్టు ఆధ్వర్యంలో సదస్సు జరిగింది. ఇది రెండు రోజులపాటు కొనసాగనుంది. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన అర్వింద్ మాట్లాడుతూ.. వారసత్వ నిర్మాణాల పరిరక్షణ, పునరుద్ధరణకు ప్రణాళికాబద్ధమైన విధానం అవసరమన్నారు. హైదరాబాద్‌లో 26 హెరిటేజ్ నిర్మాణాలను పునరుద్ధరించాల్సిన అవసరం ఉందన్నారు. చార్మినార్,లాడ్‌బజార్, మక్కా మసీద్, సర్దార్ మహల్, చౌమహుల్లా ప్యాలస్ తదితర ప్రాంతాలను కలుపుతూ ప్రత్యేక ‘టూరిస్ట్ వాక్ వే’ను రూపొందించే యోచన ఉందన్నారు. సృజనాత్మకత, పచ్చటి నగరాల నిర్మాణం తదితర అంశాలపై ఢిల్లీలోని యునెస్కోకు చెం దిన సాంస్కృతిక విభాగం ప్రతిని«ధి జునీహాన్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అందించారు. ఈ కార్యక్రమంలో ఆగాఖాన్ ట్రస్టుకు చెందిన ప్రశాంత్ బెనర్జీ, పరిరక్షణ ఆర్కిటెక్ట్ పరోమిత దేసార్కర్ తదితరులు పాల్గొన్నారు. -
ఆ ఒక్క సమాధి కూల్చితే చాలూ!
సాక్షి, న్యూఢిల్లీ : తాజ్ మహల్ వివాదం పచ్చిగా ఉండగానే.. ఇప్పుడు తెరపైకి మరో వ్యవహారం తెరపైకి వచ్చింది. దేశ రాజధానిలోని హుమయున్ సమాధిని కూల్చివేయాలంటూ ఉత్తర ప్రదేశ్ షియా వక్ఫ్ బోర్డు ప్రధాని నరేంద్ర మోదీకి ఓ లేఖ రాసింది. తద్వారా ముస్లింలకు పెద్ద సమస్య తీరుతుందని ఆయన అంటున్నారు. ఈ మేరకు బోర్డు చైర్మన్ వసీమ్ రిజ్వీ లేఖలోని విషయాలను గురువారం మీడియాకు తెలియజేశారు. హుమయున్ సమాధిని కూల్చివేయాల్సిందే. ప్రస్తుతం దేశంలో ముస్లింలు చనిపోతే వారిని ఖననం చేసేందుకు స్థలం లేకుండా పోయింది. ఇప్పుడు హుమాయున్ సమాధి ఉన్న ప్రాంతాన్ని గనుక అప్పగిస్తే స్మశానం(ఖబరిస్థాన్) లోటు తీరుతుంది. మరో వందేళ్లదాకా ముస్లిం జనాభా కోసం స్మశాన వాటిక నిర్మించాల్సిన అవసరం లేదు. అని రిజ్వీ అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చిన చట్టాల మూలంగా కొత్త సమాధులు నిర్మించటం సాధ్యమయ్యే పని కాదని.. అందుకే హుమయూన్ సమాధి కూల్చివేతకు తమకెలాంటి అభ్యంతరం లేదని ఆయన అన్నారు. అయినా చనిపోయాక రాజు.. పేద తేడా ఏంటి? ఇప్పుడు ఆ సమాధిని ఇలా ఉపయోగించటం వల్ల ఆయన చేసిన పాపాల్లో కాస్తైన ప్రాయశ్చిత్తం దక్కుతుందేమో అని రిజ్వీ చెప్పారు. అభివృద్ధి కోసం ఖర్చు చేయాలే తప్ప.. దేశ సంపదను కొల్లగొట్టి.. ప్రజలను హింసించిన ఇలాంటి వారి సమాధులపై కాదని అన్నారు. ఇక తాజ్ వ్యవహారంపై స్పందిస్తూ... దానిని సమాధిగా ఎవరూ చూడరని.. ఓ అందమైన ప్రపంచ వింతగానే భావిస్తారని ఆయన అన్నారు. మొఘల్ చక్రవర్తి అయిన హుమాయూన్ సమాధి 30 ఎకరాల ప్రాంతంలో విస్తరించి ఉండగా.. మొత్తం 200 ఎకరాలకు పైగానే ఆ కాంప్లెక్స్ విస్తరించి ఉంది. దాదాపు రూ.300 కోట్ల వ్యయంతో ‘ఆగాఖాన్ ట్రస్ట్ ఫర్ కల్చర్’ అభివృద్ధి పనులను నిర్వహిస్తోంది. అయితే జాతీయ వారసత్వ సంపద జాబితాలో ఉన్న దీనిని తొలగించి కూల్చివేయాలని ఇప్పుడు షియా బోర్డే లేఖ రాయటం చర్చనీయాంశంగా మారింది. -
చారిత్రక వైభవం కళావిహీనం
శిథిలమవుతున్న వారసత్వ భవనాలు కాపాడుకోవాలంటున్న నిపుణులు ఒక మట్టికోట మహానగరమైంది. నాలుగు వందల ఏళ్ల ప్రస్థానంలో ఎన్నో అద్భుతమైన కట్టడాలు. మరెన్నో కళాత్మక, సృజనాత్మక నిర్మాణాలు కాలగమనానికి తార్కాణాలుగా నిలిచాయి. హైదరాబాద్ చారిత్రక సౌందర్యాన్ని రెట్టింపు చేశాయి. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఇండో అరబిక్, ఇండో యూరోపియన్, ఇండో సర్‌సానిక్ శిల్ప రీతుల్లో గొప్ప భవనాలు వెలిశాయి. అప్పట్లో నిజాం నవాబులు కట్టించిన ప్యాలెస్ నుంచి.. బడి, మసీదు, ఆసుపత్రి, ఏదైనా సరే అద్భుత కళాఖండాలై విలసిల్లాయి. అలాంటి ఘన చరితకు నిదర్శనమైన సౌధరాజాలపై ఇప్పుడు నీలి నీడలు కమ్ముకుంటున్నాయి. శతాబ్ద కాలానికి చేరువైన ఉస్మానియా ఆసుపత్రి మూడు దశాబ్దాలకు పైగా ఎలాంటి ఆలనా, పాలనకు నోచుకోక శిథిలావస్థకు చేరుకుంది. ఇలాగే నగరంలోని అనేక వారసత్వ భవనాలు అలాంటి స్థితికి చేరువయ్యాయి. దేవిడీలు, ప్యాలెస్‌లు, మహళ్లు, పరిపాలన భవనాలు, నివాస సముదాయాలు, ఆసుపత్రులు, విద్యా మందిరాలు వంటి చారిత్రక, వారసత్వ కట్టడాలను పరిరక్షించుకోవలసిన తరుణం ఇది. దీనిపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం. - సాక్షి,సిటీబ్యూరో వెలుగు జిలుగుల వైభవాలు.. కేంద్ర, రాష్ట్ర పురావస్తు శాఖలు భాగ్యనగరంలో గుర్తించిన చారిత్రక కట్టడాలతో పాటు హైదరాబాద్ మెట్రోపాలిటన్ అథారిటీ సుమారు 170 భవనాలను చారిత్రక, వారసత్వ నిర్మాణాలుగా గుర్తించింది.వాటిలో కొన్ని బాగానే ఉన్నా, మరికొన్ని పెచ్చులు ఊడిపోతూ శిథిలమవుతున్నాయి. ఈ దశలోనే వాటిని పరిరక్షించుకోకపోతే మరికొన్నేళ్లలో పూర్తిగా శిథిలం కావచ్చు. ఉస్మాన్ అలీఖాన్ 1919 నుంచి 1925 మధ్య కాలంలో మూసీనది ఒడ్డున పటిష్టమైన భవనాలను కట్టించారు. పటిష్టమైన డంగు సున్నంతో, ఎంతో కళాత్మకంగా చెక్కిన రాళ్లతో నిర్మించిన నిలువెత్తు కట్టడాలివి. హైకోర్టు, సిటీ కాలేజ్, ఉస్మానియా ఆసుపత్రి వంటి పెద్ద భవనాలు అలా ఏర్పాటైనవే. ఈ భవనాలన్నీ చారిత్రక సౌందర్యాన్ని సంతరించుకున్నవే. పెద్ద పెద్ద మినార్లు, అందమైన ఆనియన్ డోమ్‌లు, గుమ్మటాలు, గోడలపై అదంగా చెక్కిన లతలు హైదరాబాద్ అందాన్ని ఇనుమడింపజేశాయి. ఒకనాటి ‘న్యూ జెనీవా’ నేటి మహబూబియా పాఠశాల నిజాం నవాబు మహబూబ్ అలీఖాన్ బాలికల కోసం ఒక పాఠశాల ఉండాలని సూచించారు. ఆయన ఆదేశాల మేరకు గన్‌ఫౌండ్రిలో పూర్తిగా రాయి ఉపయోగించి ఓ భవనం నిర్మితమైంది. ఇది 1907లో అందుబాటులోకి వచ్చింది. ఇండో యురోపియన్ శైలిలో ఇది నిర్మితమైంది. మొదట్లో ఈ పాఠశాలకు ‘న్యూ జెనివా’ అని నామకరణం చేశారు. తన పేరు పెట్టేందుకు నిజాం అంగీకరించడంతో ఆ తరువాత ‘మహబూబియా’ పాఠశాలగా మారింది. ప్రస్తుతం శిథిలమవుతున్న ఈ భవనంలో కొన్ని తరగతి గదులను ఖాళీ చేశారు. అక్కడక్కడ రాళ్లు కూలిపోయాయి. గోడలు కూలిపోతున్నాయి. నాటి ప్యాట్రిక్ రెసిడెన్సీ.. నేటి కోఠి ఉమెన్స్ కాలేజీ ఇప్పటి ‘కోఠి ఉమెన్స్ కాలేజీ’ ఒకప్పటి బ్రిటిష్ రెసిడెంట్ కిర్క్ ప్యాట్రిక్ నివాసం. మూసీనదికి ఉత్తరాన 34 ఎకరాల క్షేత్రంలో కట్టించిన అద్భుతమైన భవనం. ైహైదరాబాద్ మధ్య యుగ సంస్కృతిపై ఆధునిక పాశ్చ్యాత్య రీతిని ప్రతిబింబించిన కట్టడం ఇది. పలాడియన్ జార్జియన్ నిర్మాణ శైలిలో నిర్మితమైంది. ఎంతో హుందాగా కనిపించే ఈ భవనం పైకప్పు శిథిలమైంది. ఇండో సర్‌సానిక్ శైలిలో సిటీ కాలేజ్.. మహబూబ్ అలీఖాన్ హయాం (1865)లో కట్టించిన ‘దార్-ఉల్-ఉలుమ్’ మదరస్సా (పాఠశాల) ఉస్మాన్ అలీఖాన్ కాలంలో 1924 నాటికి సిటీ హైస్కూల్‌గా మారింది. ఆ తరువాత ‘సిటీ కాలేజ్’గా అభివృద్ధి చెందింది. సుమారు 12 ఎకరాల విస్తీర్ణంలో సువిశాలమైన తరగతి గదులు, వరండాలు, నిలువెత్తు ఆర్చ్‌లు, ఆనియన్ డోమ్లతో అద్భుత నిర్మాణం ఈ భవనం. ఎండాకాలంలోనూ చల్లగా ఉండే ఈ భవనం ఇండో సర్‌సానిక్ వాస్తుశైలిలో రూపుదిద్దుకుంది. అప్పట్లో దీనికి రూ. 8 లక్షలు ఖర్చయినట్లు అంచనా. ఈ భవనం ఇప్పుడు రంగు వెలసి కళావిహీనంగా మారింది. పైకప్పులో వర్షపు నీరు చేరుతోంది. పెచ్చులూడుతోంది. గోడలకు నిమ్ము చేరి కూలిపోయే స్థితికి చేరుకున్నాయి. ‘ఫిస్తోంజీ అండ్ కంపెనీ బిల్డింగ్’ నేటి ఈఎన్టీ ఆసుపత్రి కోఠి బ్యాంక్ స్ట్రీట్‌లో ఎంతో అందంగా కనిపించే ప్రస్తుత ఈఎన్టీ ఆసుపత్రి ఇండో యురోపియన్ శైలికి నిలువుటద్దం. హైదరాబాద్ నగరానికి పరిచయమైన పాత తరం పార్శీల్లో ఫిస్తోంజీ కుటుంబం ఒకటి. ఫిస్తోంజీ, విక్కాజీ ఇద్దరు సోదరులు బ్యాంకింగ్ వ్యాపారంతో పాటు, వస్త్ర వ్యాపారాలు చేసేవారు. వారు కట్టించిన భవనమే ‘ఫిస్తోంజీ అండ్ కంపెనీ బిల్డింగ్’. ఇప్పటి ఈఎన్టీ ఆసుపత్రి. అప్పట్లో అది ఒక బ్యాంకింగ్ కంపెనీ. 1839-1845 ప్రాంతంలో బీదర్ రాజ్య ఆదాయ వ్యవహారాలను పర్యవేక్షించేది. భవనంలోని అనేక నిర్మాణాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. గోడలు కూలిపోతున్న పరిస్థితి. పైకప్పు పెచ్చులూడిపోతోంది. బయటి గోడల్లో రావి మొక్కలు పైకి లేచాయి. ఇంకా మరెన్నో... నగరంలో ఉన్న చారిత్రక భవనాల్లో ఇవి కొన్ని మాత్రమే. ఇంకా ఎన్నో చారిత్రక కట్టడాలు శిథిలావస్థలో ఉన్నాయి. వాటిలో నిజామియా ఆబ్జర్వేటరీ, చెత్తాబజార్లోని దివాన్ దేవిడీ, చార్‌కమాన్, ఆలియాబాద్ సరాయి, అత్తాపూర్‌లోని ముష్క్ మహల్, ఝామ్సింగ్ ప్రాంతంలోని ఝాంసింగ్ టెంపుల్ గేటు, కింగ్‌కోఠి ఆసుపత్రి, మలక్‌పేట్‌లోని మహబూబ్ మాన్షన్, సరూర్‌నగర్‌లోని విక్టోరియా మెమోరియల్ అనాథాశ్రమం, మొహంజాహీ మార్కెట్, మహల్ వనపర్తి, మోతిగల్లీలోని ఇవాన్-ఈ-అలీ, మహబూబ్ చౌక్‌లోని హోమియోపతిక్ హాస్పిటల్, సనత్‌నగర్‌లోని ఫకృల్ముల్క్ టూంబ్, బహదూర్‌పురాలోని కిషన్‌బాగ్ టెంపుల్, ఆదర్శనగర్ రిట్జ్ హోటల్, శాలిబండ శామ్రాజ్ భవనం గేటు, రాజ్‌భవన్ రోడ్డులోని నర్సింగ్ కాలేజ్, లక్డీకాపూల్ ఆస్మాన్ మహల్, పబ్లిక్‌గార్డెన్ మినీ బాలభవన్, గ్రీన్లాండ్స్ గెస్ట్‌హౌస్, బోయిగూడ కమాన్, నాంపల్లి సరాయ్, పాన్‌మండి గోడీకాఖబర్ తదితర భవనాలు శిథిలమవుతున్న జాబితాలో ఉన్నట్లు ఆర్కిటెక్ట్ నిపుణులు, చారిత్రక ప్రియులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.