బాలీవుడ్ దివంగత నటుడు దిలీప్ కుమార్ పాత ఇంటిని తక్కువ ధరకు కొట్టేద్దామని పాకిస్తాన్ ప్రభుత్వం ప్లాన్లు వేస్తోంది. పాకిస్తాన్‌లోని ఖైబర్ పక్తున్‌క్వా ప్రాంతంలో దాదాపు రూ.25 కోట్లు పలికే ఆయన ఇంటిని రూ.80.56 లక్షలు మాత్రమే ఇస్తామని తెలిపింది. దీనిపై దిలీప్ కుమార్ భవనాన్ని గతంలో కొనుగోలు చేసిన యజమాని హజీ లాల్ మహ్మద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను 15 ఏళ్ల కిందటే రూ.51 లక్షలకు కొనుగోలు చేస్తే.. ఇంత దారుణంగా తక్కువ ధరకు ఎలా కోట్ చేస్తారని ప్రశ్నించారు. పాకిస్తాన్ ప్రభుత్వం ఇస్తానన్న ధర అన్యాయమని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ చెప్తున్న మొత్తానికి భవనానిన అమ్మే ప్రసక్తే లేదని ఆయన తేల్చి చెప్పారు. 101 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ పురాతన భవనానికి హెరిటేజ్ కట్టడంగా ప్రకటించారు. దీంతో ఆ ఇంటిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడానికి సిద్ధమైంది. ఇక చర్చల దశలో ఉన్న ఈ భవనం అమ్మకంపై తుది నిర్ణయం ఇంకా ఖరారు కాలేదు.
Comments
Please login to add a commentAdd a comment