breaking news
Khyber Pakhtunkhwa
-
pakistan: జనావాసాలపై వైమానిక దాడులు.. 24 మంది మృతి
ఖైబర్ పఖ్తుంఖ్వా: పాకిస్తాన్లో చోటుచేసుకున్న వైమానిక దాడులు అలజడులను సృష్టించాయి. ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లో జరిగిన విధ్వంసకర వైమానిక దాడిలో మహిళలు, పిల్లలతో సహా మొత్తం 24 మంది ప్రాణాలు కోల్పోయారని స్థానిక మీడియా వర్గాలు ధృవీకరించాయి. శిథిలాల కింద చాలామంది చిక్కుకున్నారని, వారిని కాపాడేందుకు, మృతదేహాలను వెలికితీసేందుకు రెస్క్యూ సిబ్బంది శ్రమిస్తున్నారని అధికారులు తెలిపారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నదని భావిస్తున్నారు.ఖైబర్ జిల్లాలోని తిరాను లక్ష్యంగా చేసుకుని జరిగిన ఈ దాడిలో పాకిస్తాన్ యుద్ధ విమానాలు నివాస ప్రాంతంలో బాంబులు వేసి, నిద్రపోతున్న వారిని పొట్టనపెట్టుకున్నాయి. దాడులలో గాయపడిన వారిలో మహిళలు, పిల్లలు అధికసంఖ్యలో ఉన్నారు. అందుబాటులో ఉన్న ఆస్పత్రులలో బాధితులకు చికిత్స అందిస్తున్నారు. అత్యవసర వైద్య సదుపాయాలు లేకపోవడంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నదని వైద్యులు చెబుతున్నారు. కాగా పాకిస్తాన్ ప్రభుత్వం, సైన్యం ఈ బాంబు దాడులపై ఇంకా ఎటువంటి ప్రకటన విడుదల చేయలేదు. -
‘లష్కరే’ కేంద్రం ధ్వంసం నిజమే!
ఇస్లామాబాద్: పహల్గాం ఉగ్రవాద దాడికి ప్రతీ కారంగా భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌తో పాకిస్తాన్‌కు చావుదెబ్బ తగిలింది. ఉగ్రవాద సంస్థలు కకావికలమయ్యాయి. తమకు జరిగిన నష్టంపై నోరువిప్పుతున్నాయి. భారత సైన్యం దాడులతో జైషే మొహమ్మద్ అధినేత మసూద్ అజార్ కుటుంబం ముక్కలైందని ఆ సంస్థ టాప్ కమాండర్ మసూద్ ఇల్యాస్ కశ్మీరీ ఇప్పటికే అంగీకరించాడు. వైమానిక దాడుల్లో బహవల్పూర్ స్థావరం దెబ్బతిన్నదని వెల్లడించాడు. పాకిస్తాన్‌లోని మరో ముష్కర ముఠా లష్కరే తోయిబా కమాండర్ ఖాసిం కూడా తాజాగా స్పందించాడు. ఆపరేషన్ సిందూర్ కారణంగా తమకు భారీ నష్టం వాటిల్లిందని, తమ ప్రధాన కేంద్రం ‘మర్కజ్ తయిబా’ ధ్వంసమైందని వెల్లడించాడు. మే 7న జరిగిన దాడుల్లో మురిద్కే పట్టణంలోని ఈ కేంద్రం నామరూపాల్లేకుండా పోవడంతో మళ్లీ నిర్మిస్తున్నట్లు చెప్పాడు. ధ్వంసమైన భవనం కంటే.. ఈసారి భగవంతుడి దయతో పెద్ద భవనం నిర్మిస్తున్నామని తెలియజేశాడు. మర్కజ్ తయిబా శిథిలాలపై నిలబడి ఖాసిం మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నిర్మాణంలో ఉన్న భవనం కూడా ఈ వీడియోలో కనిపిస్తోంది. పాక్ భూభాగంలో పంజాబ్ ప్రావిన్స్‌లోని షేక్‌పురా జిల్లాలో మురిద్కే పట్టణం ఉంది. మర్కజ్ తయిబాలో ముజాహిదీన్లు(ఉగ్రవాదులు), తలాబాలకు(విద్యార్థులు) శిక్షణ ఇస్తుంటారు. ప్రస్తుతం ఇక్కడ ఎలాంటి శిక్షణ ఇవ్వడం లేదని పాకిస్తాన్ అధికారులు చెబుతున్నారు. దౌరా–ఇ–సుఫాలో చేరండి మర్కజ్ తయిబాలో దౌరా–ఇ–సుఫాలో చేరాలంటూ పాకిస్తాన్ యువతకు లష్కరే తోయిబా ఖాసిం పిలుపునిస్తున్న మరో వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. దౌరా–ఇ–సుఫా అనేది ఉగ్రవాద శిక్షణ కార్యక్రమం. ఇక్కడ జిహాదీ శిక్షణలో భాగంగా మత విద్య కూడా బోధిస్తారు. తమ స్థావరం పునర్నిర్మాణానికి పాకిస్తాన్ ప్రభుత్వం, సైన్యం సహకరిస్తున్నాయని, నిధులు అందజేస్తున్నాయని లష్కరే తోయిబా డిప్యూటీ చీఫ్ సైఫుల్లా కసూరీ వెల్లడించడం గమనార్హం. లష్కరే తోయిబా ప్రధాన కేంద్రాన్ని మళ్లీ నిర్మిస్తున్నట్లు భారత నిఘా వర్గాలు సైతం ధ్రువీకరించాయి. 2026 ఫిబ్రవరి 5న జరిగే ‘కశ్మీర్ సంఘీభావ దినం’ నాటికి కొత్త భవన నిర్మాణాన్ని పూర్తి చేసి, లాంఛనంగా ప్రారంభించాలని లష్కరే తోయిబా ముఠా లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం. ఖైబర్ పఖ్తూంక్వాకు పాక్ ఉగ్రవాద సంస్థలు ఆపరేషన్ సిందూర్‌లో పాకిస్తాన్‌తోపాటు పాక్ ఆక్రమిత కశ్మీర్(పీఓకే)లో కనీసం తొమ్మిది ఉగ్రవాద స్థావరాలు నేలమట్టమయ్యాయి. ఈ నేపథ్యంలో సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లడంపై పాక్ ఉగ్రవాద సంస్థలు దృష్టిపెట్టాయి. తమ ప్రధాన కేంద్రాలను ఖైబర్ పఖ్తూంక్వా(పీకేపీ) ప్రావిన్స్‌కు తరలిస్తున్నారు. లష్కరే తోయిబా, హిజ్బుల్ ముజాహిదీన్లు ప్రస్తుతం ఇదే పనిలో నిమగ్నమైనట్లు సమాచారం. ఖైబర్ పఖ్తూంక్వా అనేది ఎత్తయిన కొండలతో నిండిన శత్రుదుర్భేద్య ప్రాంతం. అఫ్గానిస్తాన్‌కు సమీపంలో ఉండడం ఉగ్రవాదులకు అనుకూలించే అంశం. జిహాదీ శక్తులకు ఇది ప్రధాన అడ్డా. భారత సైన్యం వైమానిక, క్షిపణి దాడుల నుంచి తప్పించుకోవాలంటే ఖైబర్ పఖ్తూంక్వాకు తరలి వెళ్లడమే సరైన వ్యూహమని పాక్ ఉగ్రవాద సంస్థలు నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఇకపై అక్కడి నుంచే కార్యకలాపాలు కొనసాగించాలని తీర్మానించుకున్నట్లు సమాచారం. -
మ్యాచ్ జరుగుతుండగా ఉగ్రదాడి.. సౌతాఫ్రికా పర్యటనపై నీలినీడలు?
పాకిస్తాన్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లో ఉగ్రదాడి తీవ్ర కలకలం రేపింది. ఉగ్రవాదులు బజౌర్ జిల్లా ఖార్ తహసీల్‌లోని కౌసర్ క్రికెట్ గ్రౌండ్‌ను ఉగ్రవాదులు టార్గెట్ చేశారు. శనివారం కౌసర్ క్రికెట్ మైదానంలో మ్యాచ్ జరుగుతున్న సమయంలో భారీ పేలుడు సంభవించింది.ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారని స్థానిక పోలీసులు వెల్లడించారు. ఐఈడీని ఉపయోగించి పేలుడు జరిపారని బజౌర్ జిల్లా పోలీసు అధికారి వక్వాస్ రఫీక్వ్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. గాయపడిన వారిని జిల్లా ప్రధాన అస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు సదరు అధికారి తెలిపారు. ఇప్పటివరకు ఏ ఉగ్రవాది సంస్థ కూడా బాధ్యత వహిస్తున్నట్లు ప్రకటన చేయలేదు. అయితే ఉగ్రవాద కార్యకలాపాలకు వ్యతిరేకంగా భద్రతా దళాలు ప్రారంభించిన 'ఆపరేషన్ సర్బకాఫ్'కు ప్రతిస్పందనగా ఈ దాడి జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.స్వల్ప తొక్కిసలాట..ఈ పేలుడు తర్వాత క్రికెట్ ఆడుతున్న ఆటగాళ్లు, మైదానంలో ఉన్న వీక్షకులు భయంతో పరుగులు తీశారు. ఈ సందర్భంగా స్వల్ప తొక్కిసలాట చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ పేలుడు ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ఖైబర్ పఖ్తుంఖ్వాలో ఇటీవల కాలంలో ఈ తరహా సంఘటన జరగడం ఇది రెండో సారి. కొన్ని వారాల కిందట పోలీస్ స్టేషన్‌పై క్వాడ్‌కాప్టర్ ద్వారా దాడి జరిగింది. ఈ దాడిలో ఒక పోలీసు కానిస్టేబుల్ , పౌరుడు గాయపడ్డారు.సౌతాఫ్రికా పర్యటనపై నీలినీడలు?కాగా వచ్చే నెలలో సౌతాఫ్రికా క్రికెట్ జట్టు మల్టీ ఫార్మాట్ సిరీస్ కోసం పాకిస్తాన్లో పర్యటించనుంది. ప్రోటీస్ టూర్‌కు ముందు తమ దేశంలో ఇటువంటి ఉగ్రదాడులు జరుగుతుండడంతో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఆందోళన చెందతుంది. అయితే ఇప్పటికే సౌతాఫ్రికాకు చెందిన భద్రతా అధికారులు కొంత మంది పాక్‌లో పర్యటిస్తున్నట్లు తెలుస్తోంది. రాబోయే రోజుల్లో ఇటువంటి ఘటనలు పునరావృతం అయితే సౌతాఫ్రికా క్రికెట్ బోర్డు తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే అవకాశముంది. ఇటీవల కాలంలో పాక్ వేదికగా ఛాంపియన్స్ ట్రోఫీ-2025తో పాటు పలు ద్వైపాక్షిక సిరీస్‌లు కూడా జరిగాయి. -
Pakistan: ఖైబర్ పఖ్తున్ఖ్వా ముఖ్యమంత్రి అరెస్ట్
ఇస్లామాబాద్: పాకిస్తాన్లో అత్యంత సమస్యాత్మక ప్రావిన్స్‌గా మారిన ఖైబర్ పఖ్తున్ఖ్వా ముఖ్యమంత్రి అలీ అమీన్ గుండాపుర్ను పాకిస్తాన్ పోలీసులు అరెస్ట్ చేశారు. గుండాపుర్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పార్టీ పీటీఐ(పాకిస్తాన్ తెహ్రీక్ ఏ ఇన్సాఫ్)కి చెందిన నేత. ఆయన పార్టీ నిరసనల్లో పాల్గొంటున్న సందర్భంలో అరెస్టయ్యారు. అయితే ఆయన అరెస్ట్‌ను పాక్ ప్రభుత్వం ఇంకా ధృవీకరించలేదు.పాక్ ప్రభుత్వ తీరుకు నిరసనగా దేశంలో నిరసనలకు ఇమ్రాన్ ఖాన్ పిలుపునిచ్చారు. రావల్పిండిలోని అడియాలా జైలులో ఉంటూనే ఆయన ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఖాన్ పార్టీ చేపట్టిన నిరసనకారులకు గుండాపుర్ నాయకత్వం వహిస్తున్నారు. ఈ నేపధ్యంలో ఆయన రాజధాని ఇస్లామాబాద్‌కు చేరుకున్నారు. అక్కడి కేపీ హౌస్‌లో ఆయనను పోలీసులు అరెస్టు చేశారు. ఈ విషయాన్ని పీటీఐ తెలిపింది.‘పాక్ రేంజర్లు కేపీ హౌస్‌లోకి బలవంతంగా ప్రవేశించి ముఖ్యమంత్రి గుండాపుర్ను అరెస్టు చేసే ప్రయత్నంలో దూకుడు ప్రదర్శించారు. అధికార దుర్వినియోగం చేశారు. ఇది పాకిస్తాన్లో అమలవుతున్న చట్టవిరుద్ధమైన పరిస్థితిని ప్రతిబింబిస్తున్నది’ అంటూ పార్టీ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ఎక్స్'లో పోస్ట్ చేసింది. కాగా అక్రమ ఆయుధాలు, మద్యం రికవరీకి సంబంధించి ముఖ్యమంత్రిని కోర్టులో హాజరుపరచడానికి ఇస్లామాబాద్ కోర్టు ఆయనకు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.ఇది కూడా చదవండి: జావెలిన్ దిగిందా లేదా! -
Pakistan: ఖైబర్ పఖ్తున్ఖ్వాలో వరుస ఉగ్రదాడులు
పాకిస్తాన్లో వరుస ఉగ్రదాడులు చోటుచేసుకున్నాయి. వాయువ్య పాకిస్తాన్‌లోని పోలీస్ స్టేషన్‌పై ఉగ్రవాదులు జరిపిన దాడిలో స్టేషన్ ఇన్ఛార్జ్తో సహా ఇద్దరు పోలీసులు మరణించారు. ఖైబర్ పఖ్తున్ఖ్వా ప్రావిన్స్‌లోని లక్కీ మార్వాట్ జిల్లాలోగల బర్గాయ్ పోలీస్ స్టేషన్‌పై సాయుధ ఉగ్రవాదులు దాడి చేశారు.మీడియాకు పాక్ పోలీసులు అందించిన వివరాల ప్రకారం ఈ దాడిలో ఒక పోలీసు అక్కడికక్కడే మృతిచెందగా, గాయపడిన పోలీస్ స్టేషన్ ఇన్చార్జి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. వాయువ్య పాకిస్థాన్‌లో జరిగిన మరో దాడిలో, ఉగ్రవాదులు ఫ్రాంటియర్ కానిస్టేబులరీ వాహనాలను లక్ష్యంగా చేసుకున్నారు. ఈ దాడుల్లో ఇద్దరు సైనికులు మృతిచెందగా, మరో ముగ్గురు గాయపడ్డారు. ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లోని డేరా ఇస్మాయిల్ ఖాన్ జిల్లాలోని మద్ది ప్రాంతంలో భద్రతా బలగాల కాన్వాయ్‌పై ఉగ్రవాదులు మెరుపుదాడి చేశారు.ఈ దాడిలో ఇద్దరు జవాన్లు మృతి చెందగా, మరో ముగ్గురు జవాన్లు గాయపడ్డారు. వారు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇటీవల ఖైబర్ పఖ్తున్ఖ్వా ప్రావిన్స్‌లో భద్రతా దళాలు- ఉగ్రవాదుల మధ్య జరిగిన ఎన్కౌంటర్లో తెహ్రీక్-ఈ-తాలిబాన్ పాకిస్తాన్ (టీటీపీ)కి చెందిన ఏడుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. -
Pakistan: గిరిజన గ్రూపుల ఘర్షణ.. 36 మంది మృతి
ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్లో ప్రస్తుతం పరిస్థితులు మరింత ఘోరంగా తయారయ్యాయి. దేశంలోని ఖైబర్ పఖ్తున్ఖ్వా ప్రాంతంలో రెండు గిరిజన గ్రూపుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ హింసాకాండలో ఇప్పటివరకు 36 మంది మృతిచెందారని, వందలాది మంది గాయపడ్డారని తెలుస్తోంది. ఇరువర్గాల మధ్య భీకర ఘర్షణలు చోటు చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈ దాడుల్లో పాల్గొన్నవారు మారణాయుధాలు కూడా ఉపయోగించారని సమాచారం.పాకిస్తాన్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ఖైబర్ పఖ్తుంఖ్వాలోని కుర్రం జిల్లాలో ఒక భూమి స్వాధీనం కోసం రెండు గిరిజన గ్రూపుల మధ్య సాయుధ పోరాటం జరిగింది. ఈ సందర్భంగా చోటుచేసుకున్న హింసాయుతకాండలో 36 మంది మృతిచెందగా, 162 మంది గాయపడ్డారు. గ్రామంలో గతంలో కూడా వివిధ తెగలు, మత సమూహాల మధ్య ఘర్షణలు జరిగినట్లు అధికారులు తెలిపారు. తాజా ఘటన ఎగువ కుర్రం జిల్లా బొషెరా గ్రామంలో చోటుచేసుకుంది. -
దిలీప్ కుమార్ ఇంటిని దక్కించుకునేందుకు పాక్ ప్లాన్!
బాలీవుడ్ దివంగత నటుడు దిలీప్ కుమార్ పాత ఇంటిని తక్కువ ధరకు కొట్టేద్దామని పాకిస్తాన్ ప్రభుత్వం ప్లాన్లు వేస్తోంది. పాకిస్తాన్‌లోని ఖైబర్ పక్తున్‌క్వా ప్రాంతంలో దాదాపు రూ.25 కోట్లు పలికే ఆయన ఇంటిని రూ.80.56 లక్షలు మాత్రమే ఇస్తామని తెలిపింది. దీనిపై దిలీప్ కుమార్ భవనాన్ని గతంలో కొనుగోలు చేసిన యజమాని హజీ లాల్ మహ్మద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను 15 ఏళ్ల కిందటే రూ.51 లక్షలకు కొనుగోలు చేస్తే.. ఇంత దారుణంగా తక్కువ ధరకు ఎలా కోట్ చేస్తారని ప్రశ్నించారు. పాకిస్తాన్ ప్రభుత్వం ఇస్తానన్న ధర అన్యాయమని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ చెప్తున్న మొత్తానికి భవనానిన అమ్మే ప్రసక్తే లేదని ఆయన తేల్చి చెప్పారు. 101 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ పురాతన భవనానికి హెరిటేజ్ కట్టడంగా ప్రకటించారు. దీంతో ఆ ఇంటిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడానికి సిద్ధమైంది. ఇక చర్చల దశలో ఉన్న ఈ భవనం అమ్మకంపై తుది నిర్ణయం ఇంకా ఖరారు కాలేదు. -
పాక్.. విషం చిమ్మడం మానేసి..
న్యూఢిల్లీ: భారత అంతర్గత వ్యవహారాల గురించి పదే పదే మాట్లాడే పాకిస్తాన్.. ‘ఉగ్రవాదుల స్వర్గధామం’గా ఎందుకు పేరుపొందిందో ఆత్మపరిశీలన చేసుకోవాలని భారత్ హితవు పలికింది. ప్రపంచమంతా కరోనా మహమ్మారితో పోరాడుతుంటే దాయాది దేశం మాత్రం సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోందని మండిపడింది. తమ భూభాగం నుంచి ఉగ్రవాదులను వెళ్లగొట్టేలా అంతర్జాతీయ సమాజం పాక్‌కు పిలునివ్వాలని విజ్ఞప్తి చేసింది. ఐక్యరాజ్యసమితి నిర్వహిస్తున్న వర్చువల్ ‘కౌంటర్- టెర్రరిజం’ వీక్‌లో భాగంగా.. ‘‘ప్రపంచానికి శాపంగా పరిణమించిన ఉగ్రవాదం: మహమ్మారి విస్తరిస్తున్న కాలంలో పొంచి ఉన్న అతిపెద్ద ముప్పు, పెచ్చు మీరుతున్న తీవ్రవాదం మరియు విద్వేష ప్రసంగాలు, ట్రెండ్స్’’ అనే టాపిక్‌పై వెబినార్ నిర్వహించింది. ఇందులో భాగంగా భారత ప్రతినిధుల బృందానికి నేతృత్వం వహించిన మహవీర్ సింఘ్వీ భారత్‌పై అక్కసు వెళ్లగక్కుతున్న పాకిస్తాన్‌కు ఈ మేరకు గట్టి కౌంటర్ ఇచ్చారు.(పాకిస్తాన్‌కు బుద్ధి చెప్పేందుకు సర్వం సిద్ధం..) ‘‘పాకిస్తాన్ ఉగ్రవాదులకు స్వర్గధామం వంటిదని ప్రపంచ దేశాలు అంటున్నాయి. అందుకు తగినట్లుగా వారి భూభాగం నుంచి ఉగ్రవాదుల్ని ఏరివేసేలా చర్యలు తీసుకోవాలని ఒత్తిడి పెంచాలి. ప్రస్తుతం ప్రపంచమంతా మహమ్మారితో యుద్ధం చేస్తుంటే.. దురదృష్టవశాత్తూ పాక్ మాత్రం సీమాంతర ఉగ్రవాదాన్ని, టెర్రరిస్టులను పెంచి పోషించే పనిలో ఉంది. ఇందుకు తన సైన్యాన్ని ఉపయోగించుకుంటోంది. ఆర్థికంగా వారికి సహకరిస్తోంది. అంతేగాకుండా భారత్‌పై అసత్య, నిరాధార ఆరోపణలు చేస్తూ అంతర్గత వ్యవహారాల గురించి మాట్లాడుతోంది. తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తోంది’’ అని ఆయన మండిపడ్డారు. (పాక్ ఇప్పటికి ఉగ్రవాదులకు స్వర్గధామమే) విషం చిమ్మడం మానేసి.. అదే విధంగా.. భారత్‌లోని జమ్మూ కశ్మీర్ గురించి మాట్లాడుతున్న పాకిస్తాన్.. బలూచిస్థాన్, ఖైబర్ ఫంక్తువా సహా పాక్ ఆక్రమిత కశ్మీర్లో జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘన గురించి ఎందుకు నోరెత్తడం లేదని ప్రశ్నించారు. వివిధ మతాలు, సంస్కృతులు, ఆచారాలు పాటిస్తున్న మైనార్టీలపై ఎందుకు వివక్ష చూపుతోందని మహవీర్ ధ్వజమెత్తారు. భారత్ ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమని.. ఇక్కడ రాజ్యాంగం ప్రకారం అందరికీ అన్ని హక్కులు ఉంటాయని స్పష్టం చేశారు. అన్నిమతాల వారికి భారత్‌లో సముచిత స్థానం లభిస్తుందని.. దేశ రాష్ట్రపతి, ప్రధాని వంటి అత్యున్నత పదవుల్లో వారు పనిచేయడమే ఇందుకు నిదర్శనమన్నారు. కాబట్టి భారత్ వైపు వేళ్లు చూపుతూ... ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికైన ప్రజా ప్రతినిధులపై విషం చిమ్మడం మానేసి తమ దేశంలో ఏం జరుగుతుందో చూసుకుంటే బాగుంటుందని ఘాటుగా విమర్శించారు. (తీరు మారని పాక్.. అమెరికా ఫైర్!) ‘పాక్ ఆర్మీ ఆగడాల నుంచి రక్షించండి.. ప్లీజ్’ -
పాక్‌లో ఉగ్రవాద శిక్షణకు సకల సౌకర్యాలు
పాకిస్తాన్లో వేలాది మంది యువకులను బలవంతంగా ఉగ్రవాదులు 'డీరాడికలైజేషన్ క్యాంప్స్' కేంద్రాలకు తీసుకెళ్లి శిక్షణ ఇప్పిస్తున్నట్లు భారత ఇంటలిజెన్స్ ఏజెన్సీకి సమాచారం అందింది. ఈ వాదనలకు బలం చేకూరుస్తూ పాకిస్తాన్‌లోని పంజాబ్, బలూచిస్తాన్, ఖైబర్ పఖ్తున్ఖ్వా ప్రాంతాలలో డజనుకు పైగా కేంద్రాలను ఏర్పాటు చేసి 700 మందికి శిక్షణ అందించే విధంగా రూపొందించినట్లు ఉపగ్రహ చాయా చిత్రాల్లో స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వేలాది మంది యువకులకు శిక్షణ ఇస్తూనే వారి అవసరాల మేరకు అత్యున్నత మౌళిక సదుపాయాలతో నిర్మించినట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఇందులో ప్రార్థనలు చేసేందుకు మసీదు, స్పోర్ట్స్ కాంప్లెక్స్, విలాసవంతమైన గదులను ఏర్పాటు చేశారు. (కత్తెరించినా తెగని ఉక్కు కంచె ఏర్పాటు) ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం మేరకు శిక్షణ పొందుతున్న వారిలో 92శాతం 35 కన్నా తక్కువ వయసువారే కావడం, మరో 12 శాతం 18 ఏళ్ల కన్నా తక్కువ వయసు ఉన్నవారని తెలిసింది. పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుందనడానికి వారు శిక్షణ అందిస్తున్న హైటెక్ శిబిరాలే చెబుతున్నాయని ఇంటెలిజెన్స్ అధికారి తెలిపారు. జమ్మూ కాశ్మీర్, ఇతర సరిహద్దు ప్రాంతాల్లో ఉగ్రవాదుల చొరబాట్లను ఆపేందుకు ఉక్కు కంచె నిర్మాణాలు ఏర్పాటు చేస్తామని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ చేసిన వ్యాఖ్యల తర్వాత పాక్ డీరాడికలైజేషన్ శిబిరాలు చర్చనీయాంశంగా మారాయి. -
‘పిల్లి’మంత్రి ప్రెస్‌మీట్.. నవ్వలేక చచ్చిన నెటిజన్లు
న్యూఢిల్లీ: కిర్జిస్తాన్ బిష్కెక్లో జరిగిన ఎస్సీవో సదస్సు సందర్భంగా దౌత్యపరమైన మర్యాదలు పాటించకుండా పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ విమర్శల పాలైన సంగతి తెలిసిందే. తాజాగా పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రావిన్స్ ప్రభుత్వం అంతకుమించి కితకితలను నెటిజన్లకు పంచింది. ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రావిన్స్ కేబినెట్ సమావేశం శనివారం జరిగింది. కేబినెట్ సమావేశం అనంతరం ఆ ప్రావిన్స్ సమాచార మంత్రి షౌకత్ అలీ యూసఫ్జాయి విలేకరులతో మాట్లాడారు. ఈ విలేకరుల సమావేశాన్ని ఫేస్బుక్లో లైవ్ స్ట్రీమింగ్ చేశారు. ఇంతవరకు బాగానే ఉంది కానీ.. లైవ్ స్ట్రీమింగ్ ఇచ్చేటప్పుడు క్యాట్ ఫిల్టర్స్‌ను ఆన్ చేశారు. అంతే, మంత్రి, ఇతర అధికారులు మాట్లాడుతుండగా.. వాళ్ల ముఖాల మీద ‘డిజిటల్ పిల్లి స్టిక్కర్లు’ దర్శనమిచ్చాయి. లైవ్ ప్రసారాన్ని వీక్షించిన నెటిజన్లు వెంటనే దీనిని గుర్తించి.. కామెంట్లు కూడా చేశారు. కొంతసేపటివరకు ఇది సాగింది. ఏకంగా మంత్రి లైవ్‌లో డిజిటల్ స్టిక్కర్లతో పిల్లిలాగా కనిపించడంతో నెటిజన్లు జోకుల మీద జోకులు వేశారు. ఈ కామెడీ చూడలేక నవ్వి నవ్వి చచ్చిపోయామంటూ కామెంట్ చేశారు. ఫిల్టర్ తీసేయండి.. మంత్రిగా పిల్లిగా మారిపోయాడని ఒకరు కామెంట్ చేస్తే.. పిల్లి డిజిటల్ మాస్క్ల్లో వాళ్లు భలే క్యూట్‌గా ఉన్నారని, కామెడీలో దీనిని బీట్ చేసే వారే లేరని, కేబినెట్లో పిల్లి కూడా ఉందని నెటిజన్లు సెటైర్లు పేల్చుతున్నారు. You can't beat this! Khyber Pakhtunkhwa govt's live presser on Facebook with cat filters.. 😹 pic.twitter.com/xPRBC2CH6y — Naila Inayat नायला इनायत (@nailainayat) June 14, 2019 According to KP government’s social media team we now have a cat in the cabinet #Filter pic.twitter.com/LNl7zwOfLU — Mansoor Ali Khan (@_Mansoor_Ali) June 14, 2019 🤣🤣❤️Cutest politician pic.twitter.com/3ToUEAFPDM — Manas 🇮🇳 মানস (@ManasBose_INDIA) June 14, 2019 -
‘ఆ పాకిస్తాన్ వ్యక్తిని కిరాతకంగా చంపేశారు’
ఇస్లామాబాద్ : పాకిస్తాన్లో సంచలనం సృష్టించిన గిరిజన బాలికల హత్యలను వెలుగులోకి తెచ్చిన అఫ్జల్ కోహిస్తానీ అనే యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. బుధవారం రాత్రి ఎనిమిది గంటల ప్రాంతంలో గుర్తు తెలియని దుండగులు అతడిని అత్యంత కిరాకతకంగా కాల్చి చంపేశారు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యారు. ఖైబర్ ఫంక్తువాలో ప్రావిన్స్‌లోని అబోటాబాద్ పట్టణంలో ఈ దారుణం చోటుచేసుకుంది. స్థానిక మీడియా కథనం ప్రకారం... 2012లో ఓ వివాహ వేడుకకు ఐదుగురు గిరిజన బాలికలతో పాటు అఫ్జల్ సోదరులు కూడా హాజరయ్యారు. వీరంతా కలిసి పాటలు పాడుతూ సందడి చేశారు. అయితే ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో స్థానిక ఖాప్ పంచాయతీ పెద్దలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆచారాలను మంట కలిపారనే కారణంతో బాలికలతో పాటుగా యువకులను కూడా చంపేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో వీడియోలో కనిపించిన ఐదుగురిని 2012లో వారి కుటుంబ సభ్యులు, తోబట్టువులే హత్య చేశారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. వీరి హత్యలు జరిగిన ఏడాది తర్వాత గుర్తు తెలియని వ్యక్తులు అఫ్జల్ సోదరులను హతమార్చారు. అప్పటి నుంచి అఫ్జల్ కూడా ప్రాణ భయంతో వివిధ ప్రాంతాలు మారుతూ ఉన్నాడు. కాగా పాకిస్తాన్లో సంచలనం సృష్టించిన ఈ పరువు హత్యలను వెలుగులోకి తేవడంతో అఫ్జల్ కోహిస్తానీ అంతర్జాతీయ మీడియా దృష్టిని ఆకర్షించాడు. అమెరికాకు చెందిన వైస్ న్యూస్ ఈ ఉదంతంపై డాక్యుమెంటరీ రూపొందించింది. దీంతో నిజానిజాలు నిగ్గు తేల్చాల్సిందిగా పాకిస్తాన్ ప్రధాన న్యాయమూర్తి నిజనిర్ధారణ కమిటీ వేశారు. పరువు హత్యలు జరగనేలేదని ఈ కమిటీ నివేదిక ఇచ్చింది. అంతేకాదు ఇందుకు ఆధారంగా వీడియోలోని బాలికలు వీరే అంటూ ఇద్దరిని ప్రవేశపెట్టింది కూడా. అయితే మానవ హక్కుల కార్యకర్తలు మాత్రం వీటిని ఖండించారు. రాజకీయ ఒత్తిళ్లతోనే బాధితులకు అన్యాయం చేశారని ఆరోపించారు. ఈ ఘటన జరిగిన దాదాపు ఏడేళ్ల తర్వాత అఫ్జల్ కూడా హత్యకు గురవడంతో అతడి కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
ఎమ్మెల్యే దారుణ హత్య
ఇస్లామాబాద్ : పాకిస్థాన్‌లోని పెషావర్‌లో కైబర్ పక్తున్వ ప్రావిన్స్ ఎమ్మెల్యే సర్దార్ సోరన్ సింగ్ శుక్రవారం దారుణ హత్యకు గురయ్యారు. సోరన్ సింగ్ ప్రయాణిస్తున్న కారుపై దుండగులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఆయన అక్కడికక్కడే మరణించారు. సోరన్ సింగ్ వైద్యుడిగా, టీవీ యాంకర్‌గా, రాజకీయ నాయకుడిగానే కాకుండా ఖైబర్ ఫక్త్వవా మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రిగా ఆయన ఉన్నారు. -
యూనివర్సిటీలోకి చొరబడ్డ ఉగ్రవాదులు, కాల్పులు
-
యూనివర్సిటీలోకి చొరబడ్డ ఉగ్రవాదులు, కాల్పులు
ఇస్లామాబాద్: పాకిస్థాన్ లో ఉగ్రవాదులు మరోసారి తెగబడ్డారు. వాయవ్య పాకిస్థాన్ లోని ఛార్ సదా ప్రాంతంలో యూనివర్సిటీలోకి చొరబడి విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఖైబర్ పక్తున్ ఖ్వా ప్రావిన్స్ లోని బచా ఖాన్ యూనివర్సిటీలోకి 12 మంది సాయుధ ఉగ్రవాదులు చొరబడ్డారు. తరగతులు, హాస్టళ్లలోని విద్యార్థులు, అధ్యాపకులపై విచక్షణారహితంగా కాల్పులు, బాంబు పేలుళ్లకు తెగబడ్డారని వార్తా చానళ్లు వెల్లడించాయి. 25 మంది మృతి చెందారు. 60 మందిపైగా గాయపడినట్టు సమాచారం. వర్సిటీలో మొత్తంలో 600 మంది విద్యార్థులు ఉన్నట్టు తెలుస్తోంది. ఈ దాడికి తామే బాధ్యులమని తాలిబాన్ ప్రకటించుకుంది. విద్యార్థులు తల్లిదండ్రులు, వర్సిటీ సిబ్బంది కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. వీరంతా వర్సిటీ వెలుపల గుమిగూడారు. ఉగ్రవాదులను మట్టుబెట్టేందుకు సైనిక బలగాలు రంగంలోకి దిగాయి. వీరికి సాయంగా హెలికాప్టర్లను రప్పించారు. పొగమంచు దట్టంగా అలముకోవడంతో వర్సిటీలోకి ఎంతమంది ఉగ్రవాదులు చొరబడ్డారనేది తెలియడం లేదు. కాగా, నలుగురు ఉగ్రవాదులను హతమార్చినట్టు పోలీసులు వెల్లడించారు. సైనిక ఆపరేషన్ కొనసాగుతోంది. పెషావర్ సైనిక స్కూల్ పై తాలిబాన్ ఉగ్రవాదులు 134 విద్యార్థులను కాల్చివేసిన సంఘటన మర్చిపోకముందే విద్యాలయంపై మరో దాడి జరగడం పట్ల భయాందోళన వ్యక్తమవుతోంది. -
తుపాకులు పట్టిన టీచర్లు!
ఇస్లామాబాద్: పాకిస్థాన్ లో టీచర్లు తుపాకులు పట్టారు. తమను తాము కాపాడుకోవడంతో పాటు విద్యార్థులనూ రక్షించేందుకు తుపాకులను తమ చేతుల్లోకి తీసుకున్నారు. ఉగ్రమూకల దాడులను కాచుకునేందుకు ఆయుధాలు ధరించారు. పెషావర్ సైనిక పాఠశాలలో ఉగ్రవాదులు సాగించిన రాక్షస క్రీడలో 140 మందిపైగా ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో ఖైబర్ ఫఖ్తున్వా ప్రావెన్స్ లోని స్కూల్స్ కు భద్రత కట్టుదిట్టం చేయాలని పాకిస్థాన్ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా టీచర్లకు తుపాకులిచ్చారు. అంతేకాదు వాటిని ఎలా వాడాలో కూడా శిక్షణనిచ్చారు. ఫ్రంటీరియల్ కాలేజీలో 8 మంది మహిళా ఉపాధ్యాయులు ఇప్పటికే శిక్షణ తీసుకున్నారు. రిటైర్డ్ ఆర్మీ అధికారి, మహిళా అధికారి ఆధ్వర్యంలో ఈ శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. పిస్టోలు, ఏకే-47 తుపాకులు ఎలా పేల్చాలో ఇందులో నేర్పించారు. భద్రతా చర్యల్లో భాగంగా పాఠశాలల్లో సీసీ కెమెరాలు, ముళ్లకంచె పెన్సింగ్ ఏర్పాటు చేయాలని కూడా నిర్ణయించారు. అయితే టీచర్ల తుపాకులు ఇవ్వడాన్ని కొంత మంది వ్యతిరేకిస్తున్నారు. ఇది గన్ కల్చర్ కు దారితీసే అవకాశముందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
పాకిస్థాన్‌లో ఆత్మాహుతి దాడి:15 మంది మృతి
వాయువ్య పాకిస్థాన్‌లోని పెషావర్ నగరం మరోసారి రక్తమోడింది. పెషావర్ నగరంలో గురువారం ఉదయం తాలిబన్లు చెలరేగిపోయారు. తాలిబన్‌కు చెందిన ఆత్మాహుతి జరిపిన దాడిలో 15 మంది మరణించారని ఉన్నతాధికారులు వెల్లడించారు. ఆ ఘటనలో మరికొంత మంది గాయపడ్డారని, వారు నగరంలో ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. గత రెండు వారాల కాలంలో తాలిబాన్లు జరిపిన నాలుగో ఘాతుక చర్య అని వారు పేర్కొన్నారు. గత ఆదివారం పెషావర్‌లోని అత్యంత రద్దీగా ఉండే మార్కెట్ వద్ద కారు బాంబు పేలుడు సంభవించి 50 మందికి పైగా మరణించారని గుర్తు చేశారు. అలాగే మరో అదివారం నగరంలోని చర్చ వద్ద తీవ్రవాదులు జరిపిన దాడిలో దాదాపు 80 మందికిపైగా మృతి చెందారని వివరించారు. వీటితోపాటు ప్రభుత్వ ఉద్యోగులతో వెళ్తున్న బస్సుపై చేసిన దాడిలో 17 మంది మరణించారని చెప్పారు. గత కొద్ది కాలంగా తాలిబాన్లు పాకిస్థాన్ రాజ్యాంగాన్ని రద్దు చేయాలని, పాకిస్థాన్‌లో మోహరించిన ఆర్మీ దళాలను వెంటనే ఉపసంహరించాలని డిమాండ్ చేస్తున్నారు. అందులో భాగంగానే తాలిబాన్లు ఆ దాడులు చేస్తున్నారని అధికారులు భావిస్తున్నారు.