పాకిస్తాన్‌లో వరుస ఉగ్రదాడులు చోటుచేసుకున్నాయి. వాయువ్య పాకిస్తాన్‌లోని పోలీస్ స్టేషన్‌పై ఉగ్రవాదులు జరిపిన దాడిలో స్టేషన్ ఇన్‌ఛార్జ్‌తో సహా ఇద్దరు పోలీసులు మరణించారు. ఖైబర్ పఖ్తున్‌ఖ్వా ప్రావిన్స్‌లోని లక్కీ మార్వాట్ జిల్లాలోగల బర్గాయ్ పోలీస్ స్టేషన్‌పై సాయుధ ఉగ్రవాదులు దాడి చేశారు.
మీడియాకు పాక్ పోలీసులు అందించిన వివరాల ప్రకారం ఈ దాడిలో ఒక పోలీసు అక్కడికక్కడే మృతిచెందగా, గాయపడిన పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. వాయువ్య పాకిస్థాన్‌లో జరిగిన మరో దాడిలో, ఉగ్రవాదులు ఫ్రాంటియర్ కానిస్టేబులరీ వాహనాలను లక్ష్యంగా చేసుకున్నారు. ఈ దాడుల్లో ఇద్దరు సైనికులు మృతిచెందగా, మరో ముగ్గురు గాయపడ్డారు. ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లోని డేరా ఇస్మాయిల్ ఖాన్ జిల్లాలోని మద్ది ప్రాంతంలో భద్రతా బలగాల కాన్వాయ్‌పై ఉగ్రవాదులు మెరుపుదాడి చేశారు.
ఈ దాడిలో ఇద్దరు జవాన్లు మృతి చెందగా, మరో ముగ్గురు జవాన్లు గాయపడ్డారు. వారు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇటీవల ఖైబర్ పఖ్తున్‌ఖ్వా ప్రావిన్స్‌లో భద్రతా దళాలు- ఉగ్రవాదుల మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో తెహ్రీక్-ఈ-తాలిబాన్ పాకిస్తాన్ (టీటీపీ)కి చెందిన ఏడుగురు ఉగ్రవాదులు హతమయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment