
వాషింగ్టన్:అమెరికాలో ప్రభుత్వ ఉద్యోగులకు డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియెన్సీ (డీవోజీఈ) చీఫ్ ఇలాన్ మస్క్ పెద్ద షాక్ ఇచ్చారు. ఈ మేరకు మస్క్ శనివారం(ఫిబ్రవరి22) ఎక్స్(ట్విటర్)లో ఒక షాకింగ్ పోస్టు చేశారు. అధ్యక్షుడి ఆదేశాల మేరకు ఫెడరల్ ఉద్యోగులందరికీ ఒక మెయిల్ వస్తుందని, గత వారం వారంతా ఏం పనిచేశారో రిపోర్ట్ ఇవ్వాలన్నారు. ఎవరైతే ఈ మెయిల్‌కు స్పందించరో వారు రాజీనామా చేసినట్లుగా భావించాల్సి వస్తుందని బాంబు పేల్చారు.
Consistent with President @realDonaldTrump’s instructions, all federal employees will shortly receive an email requesting to understand what they got done last week.
Failure to respond will be taken as a resignation.— Elon Musk (@elonmusk) February 22, 2025
మస్క్ తన ట్వీట్‌లో చెప్పినట్లుగానే ఉద్యోగులకు శనివారం రాత్రి మెయిల్స్ అందాయి. ఈ మెయిల్‌లో ఐదు బుల్లెట్ పాయింట్లలో ప్రశ్నలు అడిగారు. గత వారం మీరు మీ పనిలో ఏం సాధించారనేది ఆ ప్రశ్నల సారాంశం.ఈ మెయిల్‌కు సమాధానమిచ్చేందుకు ఉద్యోగులకు సోమవారం రాత్రి దాకా సమయమిచ్చారు. అయితే మెయిల్‌కు సమాధానమివ్వని వారిపై ఏం చర్య తీసుకుంటారన్నది ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా మారింది.
మస్క్ నేతృత్వంలోని ఉద్యోగుల సంఖ్య తగ్గించడంలో డీవోజీఈ మరింత దూకుడుగా వెళ్లాలని అధ్యక్షుడు ట్రంప్ ఆదేశించిన గంటల్లోనే ఉద్యోగులకు మెయిళ్ల రూపంలో షాక్ తగలడం గమనార్హం. అయితే మస్క్ మెయిళ్లపై ఫెడరల్ ఉద్యోగుల యూనియన్ తీవ్రంగా స్పందించింది. చట్టవ్యతిరేకంగా ఉద్యోగులను తొలగిస్తే కోర్టులో సవాల్ చేస్తామని స్పష్టం చేశారు. తాము ఎంతో కష్టపడి ముఖ్యమైన విభాగాల్లో ప్రజలకు సేవ చేస్తుంటే ట్రంప్ మరోసారి తమను అగౌరవపరుస్తున్నారని మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment