ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ మరోసారి ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ ఇజ్రాయెల్‌న హెచ్చరించారు. మూడు రోజుల పాకిస్తాన్ పర్యటనలో ఉన్న రైసీ మంగళవారం మాట్లాడుతూ.. ఇరాన్ భూభాగంపై దాడి తీవ్రమైన మార్పులకు దారి తీస్తుందన్నారు. ఇజ్రాయెల్ దాడులకు తెగపడితే.. పరిస్థితి మరింత తీవ్రంగా ఉంటుందన్నారు రైసీ.
‘పవిత్రమైన ఇరాన్ భూభాగంపై ఇజ్రాయెల్ దాడులకు దిగి తప్పు చేస్తే.. పరిస్థితి చేయిదాటి చాలా తీవ్ర అవుతుంది. ఇజ్రాయెల్‌లో ఏమైనా మిగులుతుందా అనేదిపై కూడా స్పష్టంగా ఉండదు’ అని రైసీ అన్నారు. సిరియాలోని ఇరాన్ రాయబార కార్యాలయంపై ఇజ్రాయెల్ దాడికి ప్రతీకారంగా ఇరాన్ ఏప్రిల్ 13న దాడి చేసిందన్నారు. ఇది అంతర్జాతీయ చట్టలకు వ్యతిరేకంగా ఉందని పేర్కొన్నారు. పాలస్తీనా ప్రజలను ఇరాన్, పాకిస్తాన్ దేశాలు రక్షిస్తాయన్నారు. అణచివేతకు గురవుతున్న పాలస్తీనాకు రక్షణ చర్యలు కొనిసాగుతాయని రైసీ స్పష్టం చేశారు.
ఇజ్రాయెల్ సైన్యం గాజాలో కొసాగిస్తున్న దాడులు మానవహక్కుల ఉల్లంఘన అని తీవ్రంగా మండిపడ్డారు రైసీ. ఇప్పటివరకు దాదాపు 34 వేల మంది పాలస్తీనా పౌరులు మృతి చెందారు. గాజాపై ఇజ్రాయెల్ చేస్తున్నదాడులను వ్యతిరేకిస్తు యూఎస్‌లో పలు ప్రతిష్టాత్మకమై విశ్వవిద్యాలయాల విద్యార్థులు నిరసన వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment