ఇస్లామాబాద్: పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌కు ఊరట లభించింది. గత ఏడాది మే నెలలో సైనిక స్థావరాలపై దాడులకు సంబంధించిన 12 కేసుల్లో ఇమ్రాన్ ఖాన్ సహా పాక్ మాజీ విదేశాంగ మంత్రి షా మెహమూద్ ఖురేషీలకు ఉగ్రవాద నిరోధక కోర్టు బెయిల్ మంజూరు చేసింది. పాకిస్థాన్ ఎన్నికల ఫలితాల్లో ఇమ్రాన్ వర్గీయులైన స్వతంత్ర అభ్యర్థులు ఎక్కవ మంది గెలిచిన తర్వాత ఈ పరిణామం చోటుచేసుకుంది.
ఇమ్రాన్‌ఖాన్‌ను అరెస్టు చేసిన నేపథ్యంలో ఇస్లామాబాద్‌లో అప్పట్లో నిరసనలు చెలరేగాయి. ఆ హింసాత్మక ఘటనల్లో రావల్పిండిలోని ఆర్మీ ప్రధాన కార్యాలయంతో సహా 20కి పైగా సైనిక స్థావరాలు, రాష్ట్ర భవనాలు దెబ్బతిన్నాయి. ఈ నిరసనలకు సంబంధించిన కేసులో ఇమ్రాన్ ఖాన్, ఆయన పార్టీ పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పిటిఐ)కి చెందిన పలువురు నాయకులపై కేసులు నమోదయ్యాయి.
ఇమ్రాన్ ఖాన్ ప్రస్తుతం జైలు శిక్ష అనుభవిస్తున్నారు. ప్రభుత్వ రహస్యాలను లీక్ చేసిన కేసులో ఇమ్రాన్‌ఖాన్‌కు కోర్టు పదేళ్ల జేలు శిక్ష విధించిన విషయం తెలిసిందే. ఇమ్రాన్ ఖాన్‌తో పాటు పాక్ విదేశాంగ మంత్రి మహమూద్ ఖురేషీకి కూడా కోర్టు పదేళ్ల జైలు శిక్షవిధించింది. ఈ క్రమంలో ఫిబ్రవరి 8న పాక్‌లో సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో ఇమ్రాన్ ఖాన్ వర్గీయులకు ఊహించని ప్రజా మద్దతు లభించింది.
మెజారిటీ మార్కు 133 కాగా పీటీఐ 97 సీట్లు నెగ్గి ఏకైక పెద్ద పార్టిగా నిలిచింది. ఇమ్రాన్ జైలుపాలై పోటీకే దూరమైనా, ఎన్నికల గుర్తు రద్దై అభ్యర్థులంతా స్వతంత్రులుగా నానారకాల గుర్తులపై పోటీ చేయాల్సి వచ్చినా దేశవ్యాప్తంగా వారి జోరు కొనసాగడం విశేషం. నవాజ్ పార్టికి 66, బిలావల్ భుట్టో సారథ్యంలోని పాకిస్తాన్ పీపుల్స్ పార్టికి 51 స్థానాలు దక్కాయి. మిగతా పార్టిలకు 24 సీట్లొచ్చాయి.
ఇదీ చదవండి: Pakistan Elections 2024: ‘పాక్’ ఫలితాల మధ్య ఇమ్రాన్ ‘విక్టరీ స్పీచ్’
Comments
Please login to add a commentAdd a comment