వారసత్వ కట్టడంగా ధవళేశ్వరం బ్యారేజ్‌ | Dowleswaram Barrage Is Heritage Building | Sakshi
Sakshi News home page

వారసత్వ కట్టడంగా ధవళేశ్వరం బ్యారేజ్‌

Published Fri, Oct 7 2022 8:21 AM | Last Updated on Fri, Oct 7 2022 8:48 AM

Dowleswaram Barrage Is Heritage Building - Sakshi

అవార్డు అందుకుంటున్న మంత్రి అంబటి రాంబాబు

సాక్షి, అమరావతి/సత్తెనపల్లి/ధవళేశ్వరం: గోదావరి డెల్టాను 160 ఏళ్లుగా సస్యశ్యామలం చేస్తూ.. భారతదేశపు ధాన్యాగారంగా నిలిపిన ధవళేశ్వరం బ్యారేజ్‌ (సర్‌ ఆర్ధర్‌ కాటన్‌ ఆనకట్ట) మణిహారంలో మరో కలికితురాయి చేరింది. ప్రపంచ సాగునీటి వారసత్వ కట్టడంగా బ్యారేజ్‌ను ఐసీఐడీ(ఇంటర్నేషనల్‌ కమిషన్‌ ఆన్‌ ఇరిగేషన్‌ అండ్‌ డ్రైనేజ్‌) గుర్తించింది.
చదవండి: డాక్టరమ్మ గొప్ప మనస్సు.. రూ.20 కోట్ల భారీ విరాళం 

ఇందుకు సంబంధించిన గుర్తింపు పత్రాన్ని ఆ్రస్టేలియాలోని అడిలైడ్‌లో జరుగుతున్న ఐసీఐడీ 24వ కాంగ్రెస్‌లో గురువారం రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు, వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డిలకు ఆ సంస్థ చైర్మన్‌ ప్రొ.ఆర్‌. రగబ్‌ రగబ్‌ అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ వర్సిటీ వీసీ విష్ణువర్థన్‌రెడ్డి, వ్యవసాయ శాస్త్రవేత్తలు, నీటిపారుదలరంగ నిపుణులు, అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్‌ పాల్గొన్నారు. దీంతో ధవళేశ్వరం బ్యారేజ్‌కు అసలైన గుర్తింపు దక్కినట్లయిందని నిపు ణులు హర్షం వ్యక్తంచేస్తున్నారు.

దేశంలో నాలుగు కట్టడాలకు గుర్తింపు 
పురాతన కాలం నుంచి ఆయకట్టుకు సాగునీరు, ప్రజలకు తాగునీరు అందిస్తున్న కట్టడాలను ప్రపంచ వారసత్వ సాగునీటి కట్టడాలుగా ఐసీఐడీ గుర్తిస్తోంది. ఈసారి అడిలైడ్‌లో జరుగుతున్న 24వ కాంగ్రెస్‌లో ప్రపంచవ్యాప్తంగా 22 ప్రాజెక్టులను గుర్తించగా.. ఇందులో దేశంలోని నాలుగు ప్రాజెక్టులకు స్థానం దక్కింది. వీటిలో రాష్ట్రంలో ధవళేశ్వరం బ్యారేజ్, తమిళనాడులోని లోయర్‌ ఆనకట్ట, ఒడిశాలోని బైతరణి, రుషికుల్య ప్రాజెక్టులున్నాయి. ఇక 2019లో ఇండోనేషియాలో జరిగిన 23వ కాంగ్రెస్‌లో రాష్ట్రంలోని కేసీ (కర్నూల్‌–కడప) కెనాల్‌ (కర్నూల్‌ జిల్లా), కంబం చెరువు (ప్రకాశం జిల్లా), పోరుమామిళ్ల చెరువు (వైఎస్సార్‌ జిల్లా)లను ప్రపంచ సాగునీటి వారసత్వ కట్టడాలుగా ఐసీఐడీ గుర్తించింది.

ధవళేశ్వరం బ్యారేజ్‌కు అసలైన గుర్తింపు
గోదావరి డెల్టాకు 160 ఏళ్లుగా సాగు, తాగునీరు అందిస్తూ దేశ ధాన్యాగారంగా గోదావరి డెల్టా భాసిల్లడానికి కారణమైన ధవళేశ్వరం బ్యారేజ్‌ను మంత్రి అంబటి రాంబాబు, కార్యదర్శి శశిభూషణ్‌కుమార్, ఈఎన్‌సీ సి. నారాయణరెడ్డిల సూచనల మేరకు ప్రపంచ సాగునీటి వారసత్వ కట్టడంగా గుర్తించాలని ఐసీఐడీకి పంపాం. ప్రపంచ వ్యాప్తంగా జరిగిన పోటీలో ధవళేశ్వరం బ్యారేజ్‌ను ఐసీఐడీ ఎంపిక చేసింది.

దీంతో ధవళేశ్వరం బ్యారేజ్‌కు అసలైన గుర్తింపు లభించింది. శతాబ్దాల క్రితం రాజులు నిరి్మంచిన చెరువులు, ఆనకట్టలు ఇప్పటికీ చెక్కుచెదరకుండా.. ఆయకట్టుకు సాగునీరు, తాగునీరు అందిస్తున్నాయి. అందులో  పెద్దతిప్పసముద్రం, వ్యాసరాయసముద్రం, రంగరాయ  సముద్రం, బుక్కపట్నం, రాయల చెరువులు ప్రధానమైనవి. వాటికి కూడా ప్రపంచ వారసత్వ సాగునీటి కట్టడాలుగా గుర్తింపు తేవడానికి ప్రయత్నిస్తాం. 
– వాసుదేవరెడ్డి, డీఈ, జలవనరుల శాఖ  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement