
రాజమండ్రి టీడీపీ మహానాడులో నారా లోకేష్‌కు కార్యకర్త షాకిచ్చాడు.
సాక్షి, తూర్పుగోదావరి: రాజమండ్రి టీడీపీ మహానాడులో నారా లోకేష్‌కు కార్యకర్త షాకిచ్చాడు. పార్టీలో తనకు అన్యాయం జరుగుతుందని లోకేష్‌ను నిలదీశాడు. తన 400 గజాల భూమిని కేఎల్ నారాయణ ఆక్రమించాడని ఆరోపించారు.
తనకు న్యాయం చేయాలంటూ లోకేష్‌ను కార్యకర్త వెంకటేశ్వరరావు అడ్డుకున్నాడు. కార్యకర్తను పట్టించుకోకుండా లోకేష్ వెళ్లిపోయారు. దీంతో మహానాడు ప్రాంగణంలోనే వెంకటేశ్వరరావు నిరసనకు దిగాడు.
చదవండి: పచ్చి రాజకీయ రాక్షసుడిగా మారిపోయిన రామోజీ