సాక్షి, తూర్పుగోదావరి: రాజమండ్రిలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. టీడీపీ మహానాడు ప్రాంగణం వద్ద గాలి దుమారంతో టెంట్లు కూలిపోవడంతో పాటు, ఫ్లెక్సీలు ఎగిరిపోయాయి. నేతలు మాట్లాడుతుండగానే వర్షం కురుస్తుండటంతో ప్రాంగణం నుంచి కార్యకర్తలు వెళ్లిపోతున్నారు.
కాగా, నిన్న(శనివారం) మహానాడు ప్రాంగణంలో ఆ పార్టీకి చెందిన నాయకుడు ఆకుల వెంకటేశ్వరరావు కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. గతంలో తిరుపతి ఉప ఎన్నిక సందర్భంగా ఒక హోటల్‌లో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, వెంకటేశ్వరరావు మధ్య జరిగిన సంభాషణలో ‘పార్టీ లేదు.. బొక్కా లేద’ని అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించిన విషయాన్ని పలువురు గుర్తు చేసుకున్నారు.
అదే వెంకటేశ్వరరావు.. మహానాడుకు హాజరై కార్యకర్తల మధ్య నుంచి లోకేశ్‌ను పిలిచి తిట్టడం చర్చనీయాంశమైంది. కొందరు కార్యకర్తలు ఆయన్ను అడ్డుకునే ప్రయత్నం చేయగా.. ‘నా జీవితం నాశనమైంది. మీవి కూడా అలా కాకుండా చూసుకోండి’ అని ఆవేదన వ్యక్తం చేశాడు. తన 400 గజాల భూమిని కేఎల్ నారాయణ ఆక్రమించాడని, న్యాయం చేయమని అడిగితే లోకేశ్ పట్టించుకోలేదన్నాడు.
చదవండి: చంద్రబాబు వల్ల ఎన్టీఆర్‌కు మూడు సార్లు గుండెపోటు : పోసాని
Comments
Please login to add a commentAdd a comment