చండీగఢ్: హరియాణాలోని రోహ్‌తక్ జిల్లా టిటోలి గ్రామంలో 28 అనుమానాస్పద మరణాలు సంభవించడంతో జిల్లా యంత్రాంగం గ్రామాన్ని సీజ్ చేసింది. పొరుగు గ్రామాల్లో వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండటానికి బుధవారం మొత్తం గ్రామాన్ని కంటైన్‌మెంట్ జోన్‌గా ప్రకటించారు అధికారులు.
గ్రామంలో ఇద్దరు యువకులతో సహా రెండు డజన్ల మంది మరణించారు. వీరిలో యువకులకు మరణించడానికి ముందు రెండు రోజుల పాటు జ్వరం వచ్చినట్లు నివేదికలు సూచిస్తున్నాయి. ఇంత భారీ ఎత్తున మరణాలు సంభవించడంతో గ్రామస్తులు ఆందోళనకు గురయ్యారు. కోవిడ్ వల్లనే వీరంతా మరణించినట్లు అధికారులు భావిస్తున్నారు.
టిటోలి గ్రామాన్ని కంటెమెంట్ జోన్‌గా ప్రకటించిన తరువాత, జిల్లా యంత్రాంగం గ్రామంలోకి ఎవరిని అనుమతించడం లేదు.. ఊరి వారిని బయటకు వెళ్లనివ్వడం లేదు. గ్రామ సరిహద్దులో పోలీసులను మోహరించారు. బుధవారం 80 నమునాలను పరీక్షించగా.. వీరిలో 21 మందికి పాజిటివ్‌గా తేలింది.గ్రామంలో 25 శాతం మందికి కోవిడ్ సోకినట్లు అధికారులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment