mysterious deaths
-
Russia: రష్యాలో మరో ప్రముఖుడి అనుమానాస్పద మృతి
మాస్కో: రష్యాలో మరో ప్రముఖ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మరణించడం కలకలం రేపుతోంది. ఉక్రెయిన్‌తో 2022లో యుద్ధం మొదలైనప్పటి నుంచి దేశంలో ప్రముఖులు, ధనవంతులు, జర్నలిస్టులు, ప్రతిపక్షనేతలు వరుసగా అనుమానాస్పద స్థితిలో మరణిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా రష్యాలో అతిపెద్ద ఆయిల్ కంపెనీ అయిన ల్యూక్ఆయిల్ వైస్ ప్రెసిడెంట్ రాబర్ట్స్(53) మార్చ్ 12న ఆఫీసులోనే ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. అయితే ఆత్మహత్య చేసుకునే కొద్దిసేపటి ముందు తనకు తలనొప్పిగా ఉందని, మాత్రలు కావాలని ఆయన అడిగినట్లు మీడియా కథనాలు వెలువడ్డాయి. రాబర్ట్స్‌తో కలిపి ఉక్రెయిన్‌తో యుద్ధం నాటి నుంచి ఇప్పటివరకు కేవలం ల్యూక్ ఆయిల్ కంపెనీకి చెందిన టాప్ ర్యాంకు అధికారులు నలుగురు మరణించడం గమనార్హం. ఇదీ చదవండి.. కేరళలో రష్యా ఎన్నికల పోలింగ్ -
Mystery: ఆ కుటుంబాన్ని కడతేర్చిందెవరు..?
ఆకస్మిక అదృశ్యాలను, అసహజ మరణాలను తిరగదోడేటప్పుడు.. ప్రతి కోణం ఉత్కంఠగానే ఉంటుంది. కానీ కొన్నింటికి ముగింపే ఉండదు. ఎంత వెతికినా దొరకదు. ఎందుకంటే అవి కల్పితాలు కావు, నిజ జీవిత కథలు. పైశాచికత్వం ముందు ఓడిపోయిన బతుకులు. అలాంటి మరో మిస్టరీనే ఇది.. 48 ఏళ్ల క్రితం.. పిక్నిక్కి వెళ్లిన కూతురు, అల్లుడు, పిల్లలు.. తన ఇంటి దగ్గర ఆగి, డిన్నర్ చేసి వెళ్తారని ఆశపడింది ఆ తల్లి. ఎందుకంటే అమెరికాలోని ఒరెగన్ రాష్ట్రం, కాపర్లోని తనింటికి.. 2 కిలో మీటర్లలోపే ఉన్న సిస్కియో పర్వతాల్లో క్యాంప్గ్రౌండ్కే వాళ్లు వెళ్లింది. రుచికరమైన వంటకాలు సిద్ధం చేసి, ఎదురు చూడసాగింది. ఎంతకూ రాకపోయేసరికి మనసెందుకో కీడు శంకించింది. దగ్గరే కావడంతో ధైర్యం చేసి క్యాంప్‌గ్రౌండ్‌కి నడిచేసింది. అక్కడ క్రీక్ రోడ్ సమీపంలోని క్యాంప్‌గ్రౌండ్‌కి వెళ్లి, తనవాళ్ల టెంట్‌ని గుర్తుపట్టింది. తీరా లోపలికి వెళ్తే అందులో ఎవ్వరూ లేరు. చిన్న టేబుల్ మీద సగం ఖాళీ చేసిన పాలడబ్బా, వెహికిల్ తాళం చెవి, అల్లుడు రిచర్డ్ కౌడెన్(28) పర్స్ కనిపించాయి. రిచర్డ్.. కూతురు బెలిండా(22), మనవడు డేవిడ్(5), ఐదు నెలల మనవరాలు మెలిసా సహా ఎవ్వరూ కనిపించలేదు. వాళ్ల వెంటవెళ్లిన పెంపుడు కుక్కలు కూడా కనిపించలేదు. దాంతో ఆ పెద్దావిడకు టెన్షన్ పెరిగిపోయింది. పైగా ఆ టెంట్లో వస్తువులన్నీ చెల్లాచెదురుగా కనిపించాయి. పర్స్‌లో 21 డాలర్లు సురక్షితంగా ఉన్నాయి. వెంటనే కూతురు, అల్లుడు వచ్చిన వాహనం కోసం వెతకడం మొదలుపెట్టింది బెలిండా తల్లి. క్రీక్ రోడ్‌పై పార్క్ చేసి ఉన్న ట్రక్కులో బాతింగ్ సూట్లు తప్ప అన్ని బట్టలూ ఉన్నాయి. బహుశా వాగుల్లో స్నానానికి వెళ్లినప్పుడు ఏదైనా ప్రమాదం జరిగిందా? ఆ ఆలోచనే ఆమెను కుదురుగా ఉండనివ్వలేదు. వెంటనే పోలీస్ స్టేషన్ కి పరుగుతీసింది. పాలడబ్బా సాక్ష్యం సంఘటన స్థలానికి అధికారులు వచ్చారు. అక్కడ ఎలాంటి హింసాత్మక వాతావరణం కనిపించకపోవడంతో ఆ రాత్రి విచారణను అశ్రద్ధ చేశారు. మరునాడు వాళ్ల పెంపుడు కుక్కలైన బాసెట్ హౌండ్, డ్రూపీలు ‘కాపర్ జనరల్ స్టోర్’ ముందు తచ్చాడుతూ కనిపించాయి. సెప్టెంబర్ 1న ఉదయం 9 గంటలకు రిచర్డ్, కొడుకు డేవిడ్ కలసి వచ్చి.. తమ స్టోర్‌లో పాల ప్యాకెట్ కొనుక్కుని వెళ్లారని ఆ స్టోర్ యజమాని చెప్పాడు. దానికి టెంట్లో టేబుల్ మీదున్న సగం పాలడబ్బానే సాక్ష్యం. చరిత్రలోనే.. కౌడెన్ కుటుంబం వైట్ సిటీలో ఉండేవారు. 1974 ఆగస్టు 30న వీకెండ్ ట్రిప్ అంటూ ఓరెగన్ లోని అత్తగారి ఇంటి నుంచే క్యాంప్‌గ్రౌండ్‌కి వెళ్లారు. సెప్టెంబర్ 1 సాయంత్రానికల్లా అత్తగారి ఇంటికి చేరుకుని, అటు నుంచి తిరిగి వైట్ సిటీకి వెళ్లాలనేది వారి ప్లాన్. కానీ అలా జరగలేదు. వాళ్లు వెళ్లిన చోటికి పర్యాటకులు వస్తూపోతూ ఉంటారు. రిచర్డ్ ఫ్యామిలీ మిస్ అవడంతో ఆ ప్రాంతం నిఘా నీడలోకి చేరింది. జాతీయ మీడియా దీనిపై కవరేజ్ ఇవ్వడంతో కౌడెన్ కుటుంబం పట్ల సానుభూతి మొదలైంది. హైకర్స్ వల్ల.. స్థానిక వాలంటీర్లు, ఎక్స్‌ప్లోరర్ స్కౌట్స్, ఫారెస్ట్ సర్వీస్ అధికారులు, ఒరెగన్ నేషనల్ గార్డ్స్ విచారణాధికారులకు గట్టి సహకారమే అందించారు. ఫారెస్ట్ సర్వీస్ క్యాంప్ సైట్ చుట్టూ అణువణువూ గాలించారు అధికారులు. హెలికాప్టర్ల సాయంతో క్షుణ్ణంగా పరిశీలించినా ఫలితం లేదు. 1975 ఏప్రిల్ 12న ఒరెగన్ లోని ఫారెస్ట్ గ్రోవ్ నుంచి ఇద్దరు హైకర్స్ కొండపైన ఓ చెట్టుకు కట్టేసిన వ్యక్తి శవాన్ని చూశారు. అది బాగా కుళ్లిపోయింది. రంగంలోకి దిగిన పోలీసులు సమీపంలోని గుహలో ఒక మహిళ, ఇద్దరు పిల్లల శవాలను గుర్తించారు. ఆ మృతదేహాలు కౌడెన్ కుటుంబానివేనని పరీక్షల్లో తేలింది. నిజానికి ఆ ప్రదేశం వారి క్యాంప్‌సైట్ నుంచి దాదాపు 11 కిమీ దూరంలో ఉంది. శవపరీక్షల్లో బెలిండా, డేవిడ్‌లను తుపాకీతో కాల్చి, మెలిసాను బండకు బాది చంపారని తేలింది. చెట్టుకు కట్టిన తర్వాతే రిచర్డ్ చనిపోయాడని, బెలిండాతో పాటు ఇద్దరు పిల్లల్నీ వేరే చోట చంపి, గుహలో పడేశారని వైద్యులు భావించారు. అతనే.. సెప్టెంబర్ 1న క్యాంప్‌గ్రౌండ్‌లో ఉన్న పర్యాటకుల్ని విచారించినప్పుడు ‘ఓ లాస్ ఏంజెలెస్ ఫ్యామిలీ ఆ రోజు సాయంత్రం 5 గంటలకు పార్కులో నడుచుకుంటూ వెళుతుండగా ఇద్దరు మగవారు, ఒక మహిళ పికప్ ట్రక్‌లోంచి దిగడం చూశాం. వారు మమ్మల్ని భయాందోళనకు గురిచేశారు. అక్కడి నుంచి మేమెప్పుడు కదులుతామా అన్నట్లు ప్రవర్తించారు. అందుకే జనావాసం ఉండే చోటికి వెళ్లిపోయాం’ అంటూ చెప్పారు. అప్పుడే ఓ స్థానికుడు మరో షాకింగ్ విషయాన్ని బయటపెట్టాడు. ‘సెప్టెంబరులో కౌడెన్ కుటుంబం కోసం శోధించినప్పుడు ఆ గుహ మొత్తం నేను వెతికాను. అప్పుడు అక్కడ ఏ మృతదేహాలు లేవు’ అంటూ. ఈ క్రమంలోనే రూష్కు చెందిన డ్వైన్ లీ లిటిల్(25) అనే ఖైదీని నిందితుడిగా భావించారు. అతడు పదహారేళ్ల వయస్సులో ఓ యువకుడిపై అత్యాచారం, హత్య చేసిన నేరంపై శిక్షను అనుభవిస్తూ, కౌడెన్స్ కుటుంబం అదృశ్యానికి 3 నెలల ముందే పెరోల్ మీద విడుదలయ్యాడు. మిస్ అయిన రోజు అతడు కాపర్లోనే ఉన్నట్లు పోలీసులు నిర్ధారించారు. పైగా 1975 జనవరిలో లిటిల్ దగ్గర తుపాకీ ఉందని తేల్చుకున్న పోలీసులు పెరోల్ రద్దు చేశారు. మళ్లీ 1977 ఏప్రిల్‌లో బయటికి వచ్చిన లిటిల్.. ఓ గర్భవతిపై లైంగికదాడి చేసి, తీవ్రంగా కొట్టాడు. కొంచెంలో ఆ తల్లి, బిడ్డా ప్రాణాలతో బయటపడ్డారు. ఆ కేసులో కోర్టు లిటిల్‌కి 3 జీవిత ఖైదులను విధించింది. అంగీకరించలేదు విచారణలో లాస్ ఏంజెలెస్ ఫ్యామిలీ చెప్పినట్లుగా పార్క్ సమీపంలో ట్రక్‌లో వచ్చిన ఇద్దరు మగవారు, ఒక మహిళ ఎవరో కాదని.. లిటిల్, అతని తల్లిదండ్రులేనని పోలీసులు బలంగా నమ్మారు. కానీ సాక్ష్యాలే లేవు. 1974 సెప్టెంబర్ 2 సోమవారం నాడు లిటిల్ కుటుంబం క్యాంప్ గ్రౌండ్ సమీపంలోనే ఉన్నారని, గెస్ట్ బుక్‌లో సంతకం కూడా చేశాడని ఓ మైనర్ సాక్ష్యమిచ్చాడు. అయితే లిటిల్ కుటుంబం ఆ ఆరోపణలను అంగీకరించలేదు. మరోవైపు లిటిల్‌తో సెల్ పంచుకున్న ఓ ఖైదీ.. కౌడెన్ కుటుంబాన్ని చంపింది తనేనని లిటిల్ తన ముందు ఒప్పుకున్నట్లుగా చెప్పాడు. కానీ నేరం రుజువు కాకపోవడంతో కౌడెన్ కుటుంబాన్ని హతమార్చింది ఎవరో? నేటికీ మిస్టరీనే. -సంహిత నిమ్మన -
‘గంగాధర’ మరణాల మిస్టరీ.. ఆ చావులు హత్యలేనా?
సాక్షి ప్రతినిధి, కరీంనగర్/గంగాధర: కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలో ఇటీవల కలకలం రేపిన అనుమానాస్పద మరణాల మిస్టరీ త్వరలోనే వీడనుంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వేముల శ్రీకాంత్ శనివారం మరణించడంతో అసలేం జరుగుతోందన్న గందరగోళం నెలకొంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. శ్రీకాంత్ విషం తీసుకున్నాక వాంతులయ్యాయి. గమనించిన కుటుంబ సభ్యులు అతన్ని ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు విషయం తెలియకుండా వైద్యం చేయడం కష్టమని తేల్చిచెప్పారు. దీంతో తాను సోడియం హైడ్రాక్సైడ్ తీసుకున్నానని వెల్లడించాడు. వెంటనే వారు చికిత్స ప్రారంభించినా శ్రీకాంత్‌ను కాపాడలేకపోయారు. ఈ విషయాన్ని దర్యాప్తు అధికారి ఎస్సై రాజు కూడా ధ్రువీకరించారు. శ్రీకాంత్ భార్యా పిల్లలు కూడా ఇదే లక్షణాలతో మరణించారు. ముగ్గురు కూడా రక్తపు వాంతులు, విరేచనాలతో మరణించడంతో వారి శరీరంలోనూ ఇదే విషం కలిసిందా? అన్న సందేహాలు మొదలయ్యాయి. శ్రీకాంత్ ఎమ్మెస్సీ బయోటెక్నాలజీలో పీజీ చేశాడు. కరీంనగర్‌లోని ఓ ప్రముఖ కాలేజీలో ఫుడ్ సైన్స్‌లో లెక్చరర్‌గా పనిచేస్తున్నాడు. రసాయనాల గుణగణాలపై పూర్తి అవగాహన ఉండటంతో తాను సోడియం హైడ్రాక్సైడ్ తీసుకుని ఉంటాడని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. కానీ.. అతనికి ఇది ఎక్కడ నుంచి వచ్చింది? అన్న ప్రశ్నకు ఇంకా సమాధానాలు దొరకాల్సి ఉంది. విద్యార్థులకు ప్రయోగాలు చేయించే ల్యాబ్ నుంచి తీసుకువచ్చి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. 33 రోజుల్లో ముగ్గురి ఆకస్మిక మరణాలు..! తొలుత కుమారుడు అద్వైత్ (20నెలలు) బా బు వాంతులు, విరేచనాలతో అనారోగ్యానికి గురయ్యాడు. తొలుత కరీంనగర్‌కు, ఆ తరువాత హైదరాబాద్ తరలించి చికిత్స అందించినా బాబు ప్రాణాలు నిలవలేదు. చివరికి నవంబరు 16న అద్వైత్ కన్నుమూశాడు. అద్వైత్ మరణించాక నవంబరు 29న అవే లక్షణాలతో కూతురు అమూల్య (6) అనారోగ్యానికి గురై చికిత్స పొందుతూ.. డిసెంబరు 1న ప్రాణాలు విడిచింది. ఈ రెండు మరణాలకు వైద్యులు కారణాలు చెప్పలేకపోయారు. ఈ మరణాలపై రకరకాల ఊహాగానాలు ప్రచారంలోకి వచ్చాయి. కుటుంబానికి చేతబడి చేశారని కొందరు, అంతుచిక్కని వ్యాధి వచ్చిందని రకరకాలుగా చెప్పుకున్నారు. తన పేగు తెంచుకుని పుట్టిన ఇద్దరు బిడ్డలు రెండువారాల వ్యవధిలో దూరమై తల్లడిల్లుతున్న శ్రీకాంత్ భార్య మమత (26) కూడా డిసెంబరు 15న ఆసక్మికంగా అనారోగ్యానికి గురై చికిత్స పొందుతూ.. డిసెంబరు 18న మరణించింది. దీంతో మమత కుటుంబ సభ్యుల్లో అనుమానాలు మొదలయ్యాయి. కేవలం 33 రోజుల్లో ఒకే కుటుంబంలో మూడు మరణాలు సంభవించడం జిల్లా వ్యాప్తంగా కలకలం రేపింది. తమ మనవలు, కూతురు అనుమానాస్పద మరణాల వెనక అల్లుడి పాత్ర ఉందని మమత తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. శ్రీకాంత్ ఇంటి సమీపంలోని బావి నీళ్లను, బంధువుల రక్త నమూనాలను పరీక్షిస్తే వాటిలో ఏమీ తేలలేదు. పోలీసుల వినతి మేరకు మమత పోస్టుమార్టం సమయంలో వైద్యులు విస్రా (శరీరంలోని కీలక అంతర్భాగాలు)ను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు. ఈ వివరాలు వచ్చేందుకు దాదాపు నెలరోజులు పట్టే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు దర్యాప్తు వేగవంతం చేశారు. శ్రీకాంత్ పనిచేస్తున్న కాలేజీకి వెళ్లారు. అతని ప్రవర్తన గురించి స్నేహితులను ఆరా తీశారు. ఇదే క్రమంలో ఆకస్మికంగా డిసెంబరు 30 అర్ధరాత్రి శ్రీకాంత్ విషం తీసుకున్నాడు. ఆసుపత్రిలో తాను సోడియం హైడ్రాక్సైడ్ తీసుకున్నానని వైద్యులతో చెప్పినట్లు సమాచారం. ఈ క్రమంలో 31 తెల్లవారుజామున చికిత్స పొందుతూ మరణించాడు. అత్తామామ ఆరోపిస్తున్నట్లుగా శ్రీకాంత్ తన భార్యాపిల్లలను ఎందుకు చంపాల్సి వచ్చింది? అన్న కోణంలోనూ పోలీసులు ఆరా తీస్తున్నారు. ఆస్తి గొడవలు, వరకట్నం, వివాహేతర సంబంధం కారణాలు అయి ఉ ంటాయా? అన్న కోణంలో దర్యాప్తు సాగుతో ంది. ప్రస్తుతం పోలీసుల దృష్టి అంతా అసలు శ్రీకాంత్‌కు సోడియం హైడ్రాక్సైడ్ ఎక్కడిది? ఎలా వచ్చింది? ఎప్పుడు ఇంటికి తె చ్చాడు? అన్న విషయాలపైనే కేంద్రీకతమైంది. ల్యాబ్ నుంచి తెచ్చాడా? బయట కొనుగోలు చేశాడా..? అన్న విషయాలు పోలీసులు తెలుసుకోగలిగితే.. అంతుచిక్కని మరణాల మిస్టరీ వీడినట్లే. సోడియం హైడ్రాక్సైడ్ తీసుకువచ్చిన తేదీకి ముందు వెనకా జరిగిన మరణాలను పోల్చి చూస్తే శ్రీకాంత్ పాత్ర తేటతెల్లమవుతుందని ఓ సీనియర్ పోలీసు అధికారి అభిప్రాయపడ్డాడు. ఫోరెన్సిక్ రిపోర్టు రావాల్సి ఉంది: ఎస్సై రాజు వేముల శ్రీకాంత్ కుటుంబం విషయంలో ప్రస్తుతం దర్యాప్తు నడుస్తోంది. శ్రీకాంత్ ఆసుపత్రిలో వైద్యులకు తాను సోడియం హైడ్రాక్సైడ్ తీసుకున్నానని వెల్లడించాడు. పిల్లల ఆకస్మిక మరణాల తరువాత, శ్రీకాంత్ భార్య మమత కూడా మరణించడంతో ఆమె తల్లిదండ్రులు శ్రీకాంత్‌పై అనుమానాలు వ్యక్తం చేశారు. దీంతో మమత పోస్టుమార్టం సమయంలో విస్రా (శరీర అంతర్భాగాలు)ను ఫోరెన్సిక్ సైన్స్ లాబోరేటరీ (ఎఫ్ఎస్ఎల్) హైదరాబాద్ పంపాం. ఆ నివేదిక ఇంకా రావాల్సి ఉంది. ఏంటి సోడియం హైడ్రాక్సైడ్? స్కూళ్లు, కాలేజీల్లో రసాయన ప్రయోగాలు చేసేందుకు సోడియం హైడ్రాక్సైడ్ (ఎన్‌ఏఓహెచ్)ను వాడుతారు. దీన్ని కాస్టిక్ సోడా అని కూడా పిలుస్తారు. మామూలుగా ఇండ్లలో జామైన సింకులు, పైపులైన్లు క్లియర్ చేసేందుకు వాడుతుంటారు. స్పటికాల రూపంలో కర్పూరాన్ని తలపించేలా ఉంటుంది. ఇది మనుషులకు చాలా ప్రమాదకరమైన రసాయన సమ్మేళనం. పొరపాటున చేతులపై పడినా.. చర్మం పగిలి రక్తస్రావం జరుగుతుంది. ఇది నీటిలో సులువుగా కరుగుతుంది. కనీసం 10 గ్రాముల సోడియం హైడ్రాక్సైడ్ ద్రావణం మనిషి శరీరంలోకి వెళితే.. వెంటనే అది జీర్ణాశయం, కిడ్నీలు, కాలేయం, రక్తం ద్వారా ఊపిరితిత్తులు, మెదడుకు చేరిపోతుంది. శరీర అంతర్భాగాల ఉపరితాలు పగిలి రక్తస్రావం జరుగుతుంది. అందుకే.. శ్రీకాంత్ కుటుంబంలోని నలుగురు రక్తపు వాంతులు, విరేచనాలు చేసుకుని ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. శ్రీకాంత్ విద్యార్హతలు, ప్రస్తుతం చేస్తున్న పని, అన్నీ వెరసి అతని భార్య మమత, కూతురు అమూల్య, కుమారుడు అద్వైత్ మరణాలు ఒకే విధానంలో సంభవించడంతో అందరి చావుకు ఇదే రసాయనం కారణమన్న కోణంలో ప్రస్తుతం దర్యాప్తు సాగుతోంది. అత్తింటి వేధింపులే కారణం..!? మరోవైపు వేముల శ్రీకాంత్ ఆత్మహత్యకు అతని అత్తింటి వేధింపులే కారణమని శ్రీకాంత్ తరఫు బంధువులు ఆరోపిస్తున్నారు. మమత మరణానంతరం వివాహం సమయంలో ఇచ్చిన కట్నం ఇవ్వాలని వేధించారని, అతను పనిచేసే కాలేజీకి వెళ్లి నానా యాగీ చేశారని ఆరోపించారు. మరోవైపు ఈ విషయంలో రాజకీయ నేతల వద్ద పంచాయితీ పెట్టడంతో శ్రీకాంత్ మనస్తాపంతోనే విషం తీసుకున్నాడని ఆరోపిస్తున్నారు. -
అగ్రతారల షాకింగ్ అండ్ మిస్టీరియస్ మరణాలు
తొమ్మిది నెలలముందే కమింగ్ సూన్ అంటూ ఈ ప్రపంచానికి చెప్పేస్తాం.. కానీ కాలం ఎప్పుడు ఎలా మారుతుందో తెలీదు. కరియర్లో ఒక వెలుగు వెలుగుతూ నిశ్శబ్దంగా నిష్క్రమించిన తారలు చాలామందే ఉన్నారు. విధి లిఖితమో, రాజీపడలేకో, ఇంకేముందీ జీవితంలో అన్న వైరాగ్యమో , ధైర్యమో , ఆత్మహత్యలో, హత్యలో , ఏమాయో ఏమో తెలియదు గానీ, అర్థాంతరంగా ఈ ప్రపంచాన్ని వీడటం విషాదం నింపింది. ఈ రోజు సిల్క్ స్మిత పుట్టిన రోజు సందర్భంగా చిన్న వయసులోనే ఈ లోకాన్ని వీడిన సినీ తారల జీవితం మరోసారి చర్చకు వచ్చింది. ముఖ్యంగా టాలీవుడ్, బాలీవుడ్లో స్టార్ హీరోయిన్గావెలుగొందిన శ్రీదేవి ఆకస్మిక మరణం యావత్ సినీ ప్రపంచాన్ని షాక్‌కు గురిచేసింది. కార్డియాక్ అరెస్ట్‌తో మరణించినట్టు ప్రకటించినప్పటికీ 2018 ఫిబ్రవరి 24న దుబాయ్‌లోని ఓ హోటల్లో బాత్‌టబ్‌లో మునిగిపోయివిగతజీవిగా కనిపించిన తీరు అభిమానులను శోక సంద్రంలో ముంచేసింది. బాలీవుడ్ నటి కమ్ మోడల్ కుల్జీత్ రాంధావా (28)జుహులోని తన ఇంట్లో శవమై కనిపించింది. తన జీవితంలో ఎదురైన అనేక సంక్లిష్టతలను తట్టుకోలేక జీవితాన్ని ముగిస్తున్నట్టు ఆమె సూసైడ్ నోట్ రాసింది. 1997లో మిస్ ఇండియా, వీజే బాలీవుడ్ నటి, నఫీసా జోసెఫ్ (26) అనుమానాస్పదమరణం కూడా మిస్టరీగానే మిగిలిపోయింది. తీవ్ర ఒత్తిడితో 2004లో ముంబైలోని తన అపార్ట్మెంట్లో ఆత్మహత్యకు పాల్పడిందని కుటుంబ సభ్యులు తెలిపారు. -
28 అనుమానాస్పద మరణాలు.. గ్రామం సీజ్
చండీగఢ్: హరియాణాలోని రోహ్తక్ జిల్లా టిటోలి గ్రామంలో 28 అనుమానాస్పద మరణాలు సంభవించడంతో జిల్లా యంత్రాంగం గ్రామాన్ని సీజ్ చేసింది. పొరుగు గ్రామాల్లో వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండటానికి బుధవారం మొత్తం గ్రామాన్ని కంటైన్మెంట్ జోన్‌గా ప్రకటించారు అధికారులు. గ్రామంలో ఇద్దరు యువకులతో సహా రెండు డజన్ల మంది మరణించారు. వీరిలో యువకులకు మరణించడానికి ముందు రెండు రోజుల పాటు జ్వరం వచ్చినట్లు నివేదికలు సూచిస్తున్నాయి. ఇంత భారీ ఎత్తున మరణాలు సంభవించడంతో గ్రామస్తులు ఆందోళనకు గురయ్యారు. కోవిడ్ వల్లనే వీరంతా మరణించినట్లు అధికారులు భావిస్తున్నారు. టిటోలి గ్రామాన్ని కంటెమెంట్ జోన్‌గా ప్రకటించిన తరువాత, జిల్లా యంత్రాంగం గ్రామంలోకి ఎవరిని అనుమతించడం లేదు.. ఊరి వారిని బయటకు వెళ్లనివ్వడం లేదు. గ్రామ సరిహద్దులో పోలీసులను మోహరించారు. బుధవారం 80 నమునాలను పరీక్షించగా.. వీరిలో 21 మందికి పాజిటివ్‌గా తేలింది.గ్రామంలో 25 శాతం మందికి కోవిడ్ సోకినట్లు అధికారులు తెలిపారు. చదవండి: కరోనాపై కేంద్ర ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు -
మిస్టరీ మరణాలు..
సాక్షి, హైదరాబాద్: తల్లిదండ్రులు లేని సమయంలో యువతి ఇంటికి వెళ్లాడో యువకుడు.. ఏం జరిగిందో ఏమో యువతితో పాటు ఆ యువకుడూ వేర్వేరుగా ఉరి వేసుకున్న స్థితిలో చనిపోయారు. అనుమానాస్పద స్థితిలో యువతీయువకులు మరణించిన ఈ ఘటన శుక్రవారం ఖైరతాబాద్‌లో చోటు చేసుకుంది. వీరిద్దరూ స్నేహితులని, ఇద్దరి మధ్యా తీవ్ర స్థాయిలో ఘర్షణ జరిగిందని స్థానికులు చెప్తున్నారు. అయితే యువకుడిది హత్యేనని అతడి కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా, యువతి కొన ఊపిరితో ఉన్నట్టు ఘటనాస్థలికి వచ్చిన ‘108’ సిబ్బంది గుర్తించలేకపోయారు. దీంతో గంటన్నర పాటు మృత్యువుతో పోరాడిన ఆమె చివరికి తనువు చాలించింది. కుటుంబీకులు శుభకార్యానికి వెళ్లడంతో.. ఖైరతాబాద్ న్యూ సీఐబీ క్వార్టర్స్‌కు చెందిన ఆకుల శ్రీనివాస్ బీఎస్ఎన్ఎల్ ఉద్యోగి. తెల్లవారుజామున న్యూస్ పేపర్ హాకర్‌గా వ్యవహరిస్తుంటారు. ఈయన భార్య అనిత గృహిణి. వీరికి వెంకట సుమన్, వర్షశ్రీ(22) సంతానం. గురువారం నల్లకుంటలోని సమీప బంధువు ఇంట్లో పెళ్లి ఉండటంతో అంతా వెళ్లారు. శ్రీనివాస్ తల్లి శంకరమ్మ(80) ఇంట్లోనే ఉన్నారు. శుక్రవారం తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో వర్షశ్రీ, శ్రీనివాస్ ఇంటికి వచ్చేశారు. ఉదయం 10:30కి శ్రీనివాస్ విధులకు వెళ్లగా.. వర్షశ్రీ, శంకరమ్మ ఇంట్లో ఉన్నారు. వర్షశ్రీకి పరిచయ స్తుడైన బడంగ్‌పేటకు చెందిన మహేశ్వర్‌రెడ్డి శుక్రవారం మధ్యాహ్నం 2:15కి ఆమె ఇంటికి వచ్చాడు. పనిమనిషని చెప్పిన వర్షశ్రీ.. మహేశ్వర్‌రెడ్డి స్వీట్ బాక్స్‌తో పాటు మద్యం బాటిల్ తీసుకువచ్చాడు. అతడు ఇంట్లోకి వస్తున్న సమయంలో ముందు గదిలో ఉన్న శంకరమ్మ అలికిడి గమనించింది. కంటి చూపు సరిగా లేక ఎవరు వచ్చారని వర్షను అడగ్గా.. పని మనిషి వచ్చిందని చెప్పింది. సుమారు 2:30కి మహేశ్వర్‌రెడ్డి, వర్షశ్రీ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ గొడవ నేపథ్యంలో శంకరమ్మ మరోసారి ఎవరని ప్రశ్నించినా వర్షశ్రీ బదులివ్వలేదు. ఆ సమయంలో వారి మధ్య ఘర్షణ జరిగినట్లు పెద్ద శబ్దాలు వినిపించాయని స్థానికులు చెప్తున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు వర్షశ్రీ సోదరుడికి ఫోన్ చేసి ఏడుస్తూ అస్పష్టంగా మాట్లాడింది. సుమన్ హుటాహుటిన నల్లకుంట నుంచి ఇంటికి చేరుకున్నాడు. వేర్వేరు గదుల్లో ఉరి వేసుకున్నట్లు.. ఇంట్లోకి ప్రవేశించిన సుమన్ మొదటి బెడ్రూమ్లో ఫ్యాన్‌కు చీరతో ఉరి వేసుకుని వేలాడుతున్న మహేశ్వర్‌రెడ్డిని గమనించాడు. వర్షశ్రీ ఆచూకీ లేకపోవడం, మరో బెడ్రూమ్ లోపల నుంచి గడియ పెట్టి ఉండటంతో తలుపులను గట్టినా తన్నడంతో గడియ విరిగి అవి తెరుచుకున్నాయి. అక్కడ బెడ్‌పై వర్షశ్రీ పడి ఉండటాన్ని గమనించాడు. మంచం పక్కనే ఉన్న కిటికీ గ్రిల్స్‌కు చీర కట్టి... అది ఆమె మెడకు చుట్టి ఉంది. ముక్కులో నుంచి రక్తం కారడంతో పాటు నుదుటిపై కమిలిన గాయాలున్నాయి. ఇద్దరి మెడలకు ఉన్న చీరల్ని కట్ చేసిన సుమన్ ‘108’కి సమాచారం ఇచ్చాడు. 3.30 గంటల ప్రాంతంలో ఘటనాస్థలికి వచ్చిన అంబులెన్స్ సిబ్బంది మహేశ్వర్‌రెడ్డి, వర్షశ్రీలను పరిశీలించి ఇద్దరూ మృతి చెందినట్లు నిర్ధారించి వెళ్లిపోయారు. సాయంత్రం 5 గంటల ప్రాంతంలో మృతదేహాలను పోస్టుమార్టం పరీక్షలకు తరలించడానికి పోలీసులు సిద్ధమయ్యారు. వర్షశ్రీని ఓ దుప్పటిలో పెట్టి మొదటి అంతస్తు నుంచి కిందికి తీసుకువస్తుండగా.. ఆమెలో కదలికల్ని కుటుంబీకులు గుర్తించారు. అప్రమత్తమైన వారు సమీపంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకువెళ్లారు. దాదాపు గంటన్నర పాటు మృత్యువుతో పోరాడిన ఆమె ఆస్పత్రికి తరలించే లోగా కన్నుమూసింది. ఆచూకీ లభించని మద్యం బాటిల్.. మహేశ్వర్‌రెడ్డి, వర్షశ్రీ మధ్య కొంతకాలంగా స్నేహం ఉందని యువతి కుటుంబీకులు చెప్తున్నారు. ఇద్దరి మధ్యా వాగ్వాదం జరిగి ఉంటుందని, ఆవేశానికి లోనైన మహేశ్వర్‌రెడ్డి ఆత్మహత్య చేసుకుని ఉంటా డని పోలీసులు భావిస్తున్నారు. ఇది చూసి భయపడిన వర్షశ్రీ మరో గదిలోకి వెళ్లి గడియ పెట్టుకుని తలను గోడకు బాదుకోవడంతో పాటు సోదరుడికి ఫోన్ చేసి ఉంటుందని, ఆ తర్వాత కిటికీ గ్రిల్‌కు ఉరి వేసుకుని ఉంటుందని అంచనా వేస్తున్నారు. మహేశ్వర్‌రెడ్డి తీసుకువచ్చిన స్వీట్ బాక్స్ అతడి మృతదేహం వద్దే ఉన్నా.. మద్యం బాటిల్ ఆచూకీ లభించలేదు. మరోవైపు మహేశ్వర్‌రెడ్డి ఆత్మహత్య చేసుకునేప్పుడు వర్షశ్రీ ఏం చేస్తోంది? ఆపే ప్రయత్నం ఎందుకు చేయలేదు? అనేది అంతుచిక్కట్లేదు. వర్షశ్రీపై మహేశ్వర్‌రెడ్డి చేయి చేసుకున్నాడా? ఈ కారణంగానే ఆమె ఉన్న గదిలోంచి బయటకు వచ్చి మరో గదిలో ఆత్మహత్య చేసుకున్నాడా? అనే సందేహాలను పోలీసులు వెలిబుచ్చుతున్నారు. హత్యే అంటున్న యువకుడి కుటుంబీకులు.. మహేశ్వర్‌రెడ్డి మృతిపై సమాచారం అందుకున్న అతడి కుటుంబీకులు వర్షశ్రీ ఇంటికి చేరుకున్నారు. అప్పటికే ఆమె కుటుంబీకులంతా వచ్చేశారు. ఈ సమయంలో రెండు కుటుంబాల మధ్యా ఘర్షణ జరగడంతో ఓ దశలో యువకుడి కుటుంబీకులపై యువతి కుటుంబ సభ్యులు దాడికి ప్రయత్నించారు. దీన్ని అడ్డుకున్న పోలీసులు వారిని ఠాణాకు తరలించారు. ఘటనాస్థలికి చేరుకున్న సైఫాబాద్ ఏసీపీ వేణుగోపాల్‌రెడ్డి, ఇన్స్పెక్టర్ వెంకట్‌రెడ్డి పరిస్థితిని పర్యవేక్షించారు. పోస్టుమార్టం పరీక్షల నిమిత్తం మహేశ్వర్‌రెడ్డి మృతదేహాన్ని ఉస్మానియా, వర్షశ్రీ మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రి మార్చురీలకు తరలించారు. మహేశ్వర్‌రెడ్డిది ముమ్మాటికీ హత్యేనంటూ అతడి కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మహేశ్వర్‌రెడ్డి తీసుకొచ్చిన స్వీట్స్‌లో ఏమైనా కలిపాడా? అనే అనుమానంతో వాటిని ఫోరెన్సిక్ పరీక్షలకు పంపారు. పోస్టుమార్టం నివేదికలు వచ్చిన తర్వాతే ఈ ఉదంతంపై స్పష్టత వస్తుందని అధికారులు చెపుతున్నారు. -
హాస్టల్లో ఇద్దరు పిల్లల అనుమానాస్పద మృతి
తమిళనాడులోని విలుపురంలో ప్రభుత్వ ఎయిడెడ్ హాస్టల్లో చదువుకుంటున్న ఇద్దరు పిల్లలు అనుమానాస్పద పరిస్థితిలో మరణించారు. సర్వశిక్షాభియాన్ పథకం కింద తిరుకోవిలూర్ గ్రామంలో ఓ స్వచ్ఛంద సంస్థ నడిపిస్తున్న ఉండు ఉరైవిడిపల్లి స్కూల్లో ఆ పిల్లలు చదువుతున్నారు. అక్కడ దాదాపు 92 మంది పిల్లలు ఉంటారు. అయ్యనార్ (8) అనే విద్యార్థి టాయిలెట్ల వద్ద మరణించి పడి ఉండగా మిగిలిన విద్యార్థులు చూశారు. అతడి మృదదేహాన్ని ఆస్పత్రికి తరలించేలోపే.. అతడి అక్క సుబ్బులక్ష్మి (11) కూడా కుప్పకూలిపోయింది. అతడితో పాటు మరో విద్యార్థి రాజదురై (11) కూడా కుప్పకూలాడు. ఏం జరిగిందో అర్థం కాని అధికారులు.. వెంటనే ఆస్పత్రికి తరలించినా, వాళ్లలో రాజదురై మరణించాడు. సుబ్బులక్ష్మి మాత్రం కొన్ని గంటల పాటు మృత్యువుతో పోరాడి బయటపడింది. ఇలా ఉన్నట్టుండి ఇద్దరు పిల్లలు ఎందుకు మరణించారో అధికారులకు అర్థం కావట్లేదు. ప్రత్యేక వైద్య బృందాన్ని హాస్టల్‌కు పంపి, అక్కడున్న పిల్లలందరికీ వైద్యపరీక్షలు చేయించారు. అయితే, హాస్టల్లో కనీసం పారిశుధ్య సదుపాయాలు కూడా సరిగా లేవని, పిల్లలకు రక్షిత మంచినీరు కూడా అందడం లేదని వీఏఓ నేతృత్వంలోని బృందం తేల్చింది. పోలీసులు స్కూలు యాజమాన్యంపై కేసు నమోదు చేశారు. -
ఇద్దరు వైద్యుల మిస్టీరియస్ మరణాలు!
ఉత్తర కొరియా నుంచి వచ్చే వార్తలను ఒక పట్టాన నమ్మడానికి కుదరదు. 1953 నుంచి ఈ దేశం ఒక గాలి బుడగ మాదిరిగా తనలో తాను ఉంటూ బయటి ప్రపంచంతో సంబంధాలు పూర్తిగా తెంచుకుంది. అయినా, ఉత్తర కొరియా అధినాయకుడు కిమ్ జాంగ్ ఉన్ గురించి ఎన్నో వార్తలు, ఊహాగానాలు ఎప్పటికప్పుడు హల్ చల్ చేస్తూనే ఉంటాయి. తాజాగా ఉత్తర కొరియాకు చెందిన ఇద్దరు వైద్యుల మిస్టీరియస్ మరణం గురించే కూడా కథనాలు చాలా వెలుగులోకి వస్తున్నాయి. కాంబోడియాలోని నామ్ పెన్ లో ఇద్దరు వైద్యులు అనుమానాస్పదంగా మృతి చెందారు. శనివారం రాత్రి వారు క్లినిక్ లో బాగా మద్యం సేవించి.. భోజనం చేసి ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చిన తర్వాత వారి పరిస్థితి విషమంగా కనిపించడంతో వృత్తిరీత్య వైద్యులైన వారి భార్యలు వారికి ఇంజెక్షన్ చేశారు. అయినా పరిస్థితి అదుపులోకి రాలేదు. వారు గుండెపోటుతో మృతిచెందారు. మృతిచెందిన వారిని డాక్టర్ ఆన్ హ్యోంగ్ చాన్ (56), డాక్టర్ రిమున్ చోల్ (50) గా గుర్తించారు. వీరి మృతి ఘటనలో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వీరు శనివారం రాత్రి గుండెపోటుతో చనిపోతే.. వారి భార్యలు తెల్లారే వరకు పోలీసులకు సమాచారం ఇవ్వలేదు. వారి మరణాలు గురించే తెలుసుకునేందుకు క్లినిక్ కు వెళ్లిన విలేకరులను నలుగురు ఉత్తర కొరియన్ వైద్యులు బయటకు గెంటేశారు. ఉత్తర కొరియాకు చెందిన దాదాపు 50వేల మంది విదేశాల్లో పనిచేస్తూ తమ అధినేత కింగ్ జాంగ్ కు అవసరమైన విదేశీ మారక ద్రవ్యాన్ని సమకూరుస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల విదేశాల్లో ఉత్తర కొరియా వైద్యుల మరణాల గురించి వార్తలు తరచూగా వినిపిస్తున్నాయి. ఈ కథనాల్లోనూ వాస్తవాస్తవాలు ఎంతనేది సరిగ్గా నిర్ధారించడానికి లేదు. నిజానికి ఉత్తర కొరియా నుంచి బయటి ప్రపంచానికి అందే వార్తలు చాలా వికృతంగా ఉంటాయని అపవాదు ఉంది. చాలా సందర్భాల్లో ఆ దేశానికి సంబంధించిన సంచలనాలు, వికృత కథనాలు, అసత్య ప్రచారాలు వెలుగులోకి వస్తుంటాయి. ఇందులో ఎక్కువశాతం దేశాధినేత కిమ్ జాంగ్ ఉన్ చుట్టే తిరుగుతాయి. తుమ్మినందుకు ప్యాంగ్యాంగ్లో ఓ ట్రాఫిక్ మహిళా కానిస్టేబుల్ ను కిమ్ ఉరితీశారని, ఆయన 2012లో 'సెక్సీయెస్ట్ మ్యాన్ అలైవ్'గా నిలిచారని, పోర్న్ సినిమాలో నటించినందుకు తన ప్రియురాలు, పాప్ సింగర్ హ్యోన్ సాంగ్ వోల్ ను హత్య చేయించారని, తన అత్త కిమ్ క్యోంగ్ హుయిని విషం పెట్టి చంపేశారని, రగులుతున్న అగ్నిపర్వతాన్ని కిమ్ స్వయంగా ఎక్కారని ఇలా ఎన్నో వార్తలు ఇప్పటివరకు చక్కర్లు కొట్టాయి. -
మన శాస్త్రవేత్తలు చనిపోయారా.. చంపేశారా!
న్యూఢిల్లీ: దేశ అభివృద్ధికి బాటలు వేసిన ఎందరో గొప్పగొప్ప వ్యక్తుల మరణాలు వీడని మిస్టరీలుగా మిగిలిపోయాయి. అందులో శాస్త్రవేత్తల మరణాలు కూడా.. భారత అణుశాస్త్ర పితామహుడుగా పేర్కొనే హోమీ జహంగీర్ బాబా మరణం కూడా ఇదే కోవలోకి వెళ్లిపోయింది. టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రిసెర్చ్ వ్యవస్థాపక డైరెక్టర్‌గా ఉన్న ఆయన అందులోనే ఫిజిక్స్ ప్రొఫెసర్‌గా కూడా పనిచేశారు. ఓ విమాన ప్రమాదంలో మోమీ జే బాబా 1966 జనవరి 24న ప్రాణాలు కోల్పోయారు. ఆ సమయంలో ఆయనతోపాటు వందలమంది కూడా ఉన్నారు. అయితే, ఈ ఘటన ప్రమాదావశాత్తు జరిగిందా.. లేక ఇందులో మరేదైన కుట్ర ఉందా అనే అనుమానాలు తాజాగా కలుగుతున్నాయి. ఎందుకంటే ఇలాంటి మరణానికి గురైంది ఒక్క హోమీ బాబానే కాదు. ఇటీవల కాలంలో.. గతంలో కూడా ఎందరో ప్రముఖ శాస్త్రవేత్తలు విమాన ప్రమాదాలు ఇతర ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయారు. అయితే, వీరి మృతిపట్ల ప్రభుత్వాలు మాత్రం ఎలాంటి ఆరా తీయకపోవడం, సాధారణ మరణాలుగానే పరిగణించడంపట్ల తాజాగా పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
విద్యార్ధిని అనుమానాస్పద మృతి