తొమ్మిది నెలలముందే కమింగ్ సూన్ అంటూ ఈ ప్రపంచానికి చెప్పేస్తాం.. కానీ కాలం ఎప్పుడు ఎలా మారుతుందో తెలీదు. కరియర్‌లో ఒక వెలుగు వెలుగుతూ నిశ్శబ్దంగా నిష్క్రమించిన తారలు చాలామందే ఉన్నారు. విధి లిఖితమో, రాజీపడలేకో, ఇంకేముందీ జీవితంలో అన్న వైరాగ్యమో , ధైర్యమో , ఆత్మహత్యలో, హత్యలో , ఏమాయో ఏమో తెలియదు గానీ, అర్థాంతరంగా ఈ ప్రపంచాన్ని వీడటం విషాదం నింపింది. ఈ రోజు సిల్క్ స్మిత పుట్టిన రోజు సందర్భంగా చిన్న వయసులోనే ఈ లోకాన్ని వీడిన సినీ తారల జీవితం మరోసారి చర్చకు వచ్చింది.
ముఖ్యంగా టాలీవుడ్, బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గావెలుగొందిన శ్రీదేవి ఆకస్మిక మరణం యావత్ సినీ ప్రపంచాన్ని షాక్‌కు గురిచేసింది. కార్డియాక్ అరెస్ట్‌తో మరణించినట్టు ప్రకటించినప్పటికీ 2018 ఫిబ్రవరి 24న దుబాయ్‌లోని ఓ హోటల్‌లో బాత్‌టబ్‌లో మునిగిపోయివిగతజీవిగా కనిపించిన తీరు అభిమానులను శోక సంద్రంలో ముంచేసింది.
బాలీవుడ్ నటి కమ్ మోడల్ కుల్జీత్ రాంధావా (28)జుహులోని తన ఇంట్లో శవమై కనిపించింది. తన జీవితంలో ఎదురైన అనేక సంక్లిష్టతలను తట్టుకోలేక జీవితాన్ని ముగిస్తున్నట్టు ఆమె సూసైడ్ నోట్ రాసింది.
1997లో మిస్ ఇండియా, వీజే బాలీవుడ్ నటి, నఫీసా జోసెఫ్ (26) అనుమానాస్పదమరణం కూడా మిస్టరీగానే మిగిలిపోయింది. తీవ్ర ఒత్తిడితో 2004లో ముంబైలోని తన అపార్ట్‌మెంట్‌లో ఆత్మహత్యకు పాల్పడిందని కుటుంబ సభ్యులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment