తమిళనాడులోని విలుపురంలో ప్రభుత్వ ఎయిడెడ్ హాస్టల్లో చదువుకుంటున్న ఇద్దరు పిల్లలు అనుమానాస్పద పరిస్థితిలో మరణించారు. సర్వశిక్షాభియాన్ పథకం కింద తిరుకోవిలూర్ గ్రామంలో ఓ స్వచ్ఛంద సంస్థ నడిపిస్తున్న ఉండు ఉరైవిడిపల్లి స్కూల్లో ఆ పిల్లలు చదువుతున్నారు. అక్కడ దాదాపు 92 మంది పిల్లలు ఉంటారు. అయ్యనార్ (8) అనే విద్యార్థి టాయిలెట్ల వద్ద మరణించి పడి ఉండగా మిగిలిన విద్యార్థులు చూశారు. అతడి మృదదేహాన్ని ఆస్పత్రికి తరలించేలోపే.. అతడి అక్క సుబ్బులక్ష్మి (11) కూడా కుప్పకూలిపోయింది. అతడితో పాటు మరో విద్యార్థి రాజదురై (11) కూడా కుప్పకూలాడు. ఏం జరిగిందో అర్థం కాని అధికారులు.. వెంటనే ఆస్పత్రికి తరలించినా, వాళ్లలో రాజదురై మరణించాడు. సుబ్బులక్ష్మి మాత్రం కొన్ని గంటల పాటు మృత్యువుతో పోరాడి బయటపడింది.
ఇలా ఉన్నట్టుండి ఇద్దరు పిల్లలు ఎందుకు మరణించారో అధికారులకు అర్థం కావట్లేదు. ప్రత్యేక వైద్య బృందాన్ని హాస్టల్‌కు పంపి, అక్కడున్న పిల్లలందరికీ వైద్యపరీక్షలు చేయించారు. అయితే, హాస్టల్లో కనీసం పారిశుధ్య సదుపాయాలు కూడా సరిగా లేవని, పిల్లలకు రక్షిత మంచినీరు కూడా అందడం లేదని వీఏఓ నేతృత్వంలోని బృందం తేల్చింది. పోలీసులు స్కూలు యాజమాన్యంపై కేసు నమోదు చేశారు.
హాస్టల్లో ఇద్దరు పిల్లల అనుమానాస్పద మృతి
Published Mon, Sep 5 2016 12:59 PM | Last Updated on Mon, Sep 4 2017 12:25 PM
Advertisement