two students died
-
ఈతకు వెళ్లి ఇద్దరు విద్యార్ధులు మృతి
-
సర్టిఫికెట్లకని వెళ్లి కానరానిలోకాలకు!
ఇబ్రహీంపట్నంరూరల్: ఇద్దరు భాబి ఇంజనీర్ల రోడ్డుప్రమాదంలో మృతిచెందారు. బీటెక్ పూర్తి చేసుకొని సర్టిఫికెట్లు తెచ్చుకోవడానికి వెళ్లి.. కానరాని లోకాలకు పోయారు. టిప్పర్ రూపంలో వచ్చిన మృత్యువు వారిని బలితీసుకుంది. రంగారెడ్డి జిల్లా ఆదిబట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలో సోమవారం జరిగిన ఈ ప్రమాదం వివరాలు ఇలా ఉన్నాయి.. సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలం మాలిపురం గ్రామానికి చెందిన శీల రామచందర్, ఎల్లమ్మ దంపతుల కుమారుడు మహేష్(22), రంగారెడ్డి జిల్లా బడంగ్పేట్ నగర పంచాయతీకి చెందిన గూడురూ రాంబాబు కుమారుడు లోకేష్ దుర్గా ప్రసాద్(22)లు ఇబ్రహీంపట్నం మండలం మంగళ్‌పల్లి సమీపంలోని భారత్ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ (ఈఈఈ) పూర్తి చేశారు. శీల మహేష్, దుర్గాప్రసాద్ ఇద్దరు కలిసి సోమవారం సర్టిపికెట్లు తెచ్చుకోవడానికి కళాశాలకు వెళ్లారు. తిరుగు ప్రయాణంలో ఆదిబట్ల టీసీఎస్ రోడ్డు వైపు వస్తుండగా.. బొంగ్లూర్ ఔటర్ రింగ్ రోడ్డు నుంచి ఆదిబట్ల గ్రామం వైపు వెళ్తున్న టిప్పర్ వీరి బైక్‌ను ఢీకొట్టింది. దీంతో వీరు టిప్పర్ వెనక చక్రాల కింద పడిపోయారు. మహేష్, లోకేష్కుమార్లపై నుంచి టిప్పర్ వెళ్లడంతో అక్కడికక్కడే మృతిచెందారు. మృతదేహాలు చెల్లా చెదురుగా పడి ఉన్నాయి. విషయం తెలుసుకున్న ఆదిబట్ల పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాలను ఇబ్రహీంపట్నం మార్చురీకి తరలించారు. మహేష్ బ్యాగులో భారత్ ఇంజనీరింగ్ కళాశాల ఐడీ కార్డు లభించడంతో వీరు భారత్ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులుగా గుర్తించారు. కళాశాలకు చెందిన రిజిస్ట్రార్, ఈఈఈ హెచ్ఓడీలు వచ్చి మార్చురీ వద్ద మృతదేహాలను పరిశీలించగా భారత్ కళాశాల పూర్వ విద్యార్థులగా నిర్ధారించారు. సర్టిఫికెట్ల కోసం వచ్చినట్లు తెలియజేశారు. ప్రస్తుతం వీరిద్దరు నగరంలోని దిల్‌సుఖ్‌నగర్‌లో విశ్వ కోచింగ్ సెంటర్లో గేట్ కోచింగ్ తీసుకున్నట్లు వారి వద్ద ఉన్న ఐడీ కార్డుల ఆధారంగా తెలిసింది. మహేష్ తండ్రి చిన్నప్పుడే మరణించడంతో తల్లి కష్టపడి చదివించినట్లు తెలిసింది. ప్రస్తుతం మృతుడు మహేష్ సోదరుడు కూడా భారత్ కళాశాలలోనే ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం చదువుతున్నట్లు తెలిసింది. మృతదేహాలను ఇబ్రహీంపట్నం ఆస్పత్రి మార్చురీలో భద్రపరిచారు. టిప్పర్ డ్రైవర్ పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలిసింది. ఘటనా స్థలాన్ని ఆదిబట్ల సీఐ గోవింద్‌రెడ్డి, ఎస్ఐ మోహన్‌రెడ్డి పరిశీలించారు. -
హాస్టల్లో ఇద్దరు పిల్లల అనుమానాస్పద మృతి
తమిళనాడులోని విలుపురంలో ప్రభుత్వ ఎయిడెడ్ హాస్టల్లో చదువుకుంటున్న ఇద్దరు పిల్లలు అనుమానాస్పద పరిస్థితిలో మరణించారు. సర్వశిక్షాభియాన్ పథకం కింద తిరుకోవిలూర్ గ్రామంలో ఓ స్వచ్ఛంద సంస్థ నడిపిస్తున్న ఉండు ఉరైవిడిపల్లి స్కూల్లో ఆ పిల్లలు చదువుతున్నారు. అక్కడ దాదాపు 92 మంది పిల్లలు ఉంటారు. అయ్యనార్ (8) అనే విద్యార్థి టాయిలెట్ల వద్ద మరణించి పడి ఉండగా మిగిలిన విద్యార్థులు చూశారు. అతడి మృదదేహాన్ని ఆస్పత్రికి తరలించేలోపే.. అతడి అక్క సుబ్బులక్ష్మి (11) కూడా కుప్పకూలిపోయింది. అతడితో పాటు మరో విద్యార్థి రాజదురై (11) కూడా కుప్పకూలాడు. ఏం జరిగిందో అర్థం కాని అధికారులు.. వెంటనే ఆస్పత్రికి తరలించినా, వాళ్లలో రాజదురై మరణించాడు. సుబ్బులక్ష్మి మాత్రం కొన్ని గంటల పాటు మృత్యువుతో పోరాడి బయటపడింది. ఇలా ఉన్నట్టుండి ఇద్దరు పిల్లలు ఎందుకు మరణించారో అధికారులకు అర్థం కావట్లేదు. ప్రత్యేక వైద్య బృందాన్ని హాస్టల్‌కు పంపి, అక్కడున్న పిల్లలందరికీ వైద్యపరీక్షలు చేయించారు. అయితే, హాస్టల్లో కనీసం పారిశుధ్య సదుపాయాలు కూడా సరిగా లేవని, పిల్లలకు రక్షిత మంచినీరు కూడా అందడం లేదని వీఏఓ నేతృత్వంలోని బృందం తేల్చింది. పోలీసులు స్కూలు యాజమాన్యంపై కేసు నమోదు చేశారు. -
అనుమానాస్పద స్థితిలో ఇద్దరు విద్యార్థినుల మృతి
వేలూరు: కాట్పాడి సమీపంలో ఇద్దరు విద్యార్థినులు రైలు పట్టాలపై అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. కాట్పాడి తాలుకా లత్తేరి సమీపంలోని కాగుంట గ్రామానికి చెందిన మణి కుమార్తె పుణిదవల్లి(19) జంగాలపల్లిలోని ప్రభుత్వ పాఠశాలలో ప్లస్‌టూ చదువుతోంది. ఈమె పక్కనున్న ఇంటికి చెందిన అరుల్ కుమార్తె సౌందర్య(15) అదే పాఠశాలలో టెన్త్ చదువుతుంది. సోమవారం సాయంత్రం పాఠశాల ముగించుకొని ఇంటికి వచ్చిన ఇద్దరూ పుణిదవల్లి, సౌందర్య కలిసి బయటకు వెళ్లారు. అయితే రాత్రి అయినప్పటికీ ఇద్దరూ ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు సమీపంలోని అన్ని ప్రాంతాల్లో గాలించినా ఆచూకీ తెలియరాలేదు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం కరశమంగళం రైలు పట్టాల పక్కన రెండు మృతదేహాలు ఉన్నట్లు స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందజేశారు. వెంటనే పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకొని విచారించగా మృతి చెందిన వారు పుణిదవల్లి, సౌందర్యగా గుర్తించారు. వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం అందజేశారు. అక్కడికి చేరుకుని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. విషయం తెలిసి జోలార్‌పేట రైల్వే పోలీసులు కరశమంగళం వద్దకు చేరుకొని మృతదేహాలను పోస్ట్‌మార్టంకు తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ఈతకు వెళ్లి ఇద్దరు విద్యార్థుల దుర్మరణం
చివ్వెంల: సరదాగా ఈతకు వెళ్లిన ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. ఈ సంఘటన నల్లగొండ జిల్లా చివ్వెంల మండలం పాశ్చ్యానాయక్ తండా గ్రామ ఆవాసం భోజ్యతండాలో ఆదివారం చోటుచేసుకుంది. తండాకు చెందిన భానోతు కౌసల్య, పాపల కుమారుడు ఆనంద్(7).. మోతె మండలం ఉర్లుగొండలోని రావికుంట తండాకు చెందిన గుగులోతు కిషన్, మంగమ్మ కుమారుడు సిద్ధూ(7) ఆదివారం సెలవు దినం కావడంతో గ్రామశివారులోని కోమటికుంట చెరువులోకి ఈతకు వెళ్లారు. ఈత రాకపోవడంతో చెరువులోకి దిగిన ఇద్దరు చిన్నారులు మృత్యువాత పడ్డారు. సిద్ధూ భోజ్యతండాలో అమ్మమ్మగారి ఇంటి వద్ద ఉంటూ సూర్యాపేటలో చదువుకుంటున్నాడు. ఇరు కుటుంబాల్లో ఒక్కొక్కరికి ఒకే కుమారుడు కావడంతో కుటుంబ సభ్యులు రోదిస్తున్న తీరు అందరినీ కంటతడి పెట్టించింది. -
ఇద్దరు విద్యార్థుల ప్రాణం తీసిన ఈత సరదా
రుద్రంపూర్(ఖమ్మం): ఖమ్మం జిల్లా కొత్తగూడెం సమీపంలోని రుద్రంపూర్‌లో ఆదివారం మధ్యాహ్నం ఈతకు వెళ్లి ఇద్దరు బాలురు మృత్యువాతపడ్డారు. రుద్రంపూర్‌లోని సుభాష్‌చంద్రబోస్ నగర్‌కు చెందిన సొహైల్(14), సమీర్(12) స్థానిక పాఠశాలలో తొమ్మిది, ఏడో తరగతులు చదువుతున్నారు. ఆదివారం సెలవు కావటంతో స్నేహితులతో కలసి సమీపంలోని గోధుమ వాగులో ఈత కొట్టేందుకు వెళ్లారు. ప్రమాదవశాత్తు సమీర్ మునిగిపోతూ కేకలు వేయటంతో అతనిని రక్షించే క్రమంలో సొహైల్ కూడా మునిగిపోయాడు. ఇది గమనించిన మిగతా బాలురు భయంతో ఆ కాలనీలోని వారికి చెప్పేందుకు పరుగు తీశారు. అక్కడి వారు వచ్చేలోగానే ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. -
మృత్యువులోనూ వీడని స్నేహబంధం
ఈతకు వెళ్లిన ఇద్దరు విద్యార్థుల మృతి ఈ ఇద్దరు స్నేహితులను మృత్యువు ఒకేసారి మింగేసింది. కష్టాలే తోడుగా సాగిన వారి బాల్య ప్రయాణం క్షణాల తేడాలోనే ముగిసింది. ఒకరు తల్లీతండ్రి లేని అనాథ అయితే.. మరొకరిది కడుపేద కుటుంబ నేపథ్యం. ఇద్దరూ ఈతకు వెళ్లి మరిక తిరిగి రాలేదు. మరణంలోనూ వీడని స్నేహ బంధానికి నిర్వచనం చెప్పారు. స్నేహమేరా శాశ్వతం.. అంటూ శాశ్వతంగా దూరమయ్యారు. వూచవరం : వూచవరంలోని సెయింట్‌ఆన్స్ లయోల ప్రేమ నివాస్ హాస్టల్లో ఉంటున్న రమేష్(13), ఏసుబాబు(11) ఈతకనివెళ్లి మృత్యువు బారినపడ్డారు. వీరిద్దరిదీ వేర్వేరు తరగతులు.. వేర్వేరు గ్రామాలు.. అయితేనేం మంచి స్నేహితులు. కష్టాలే వీరిని స్నేహితులుగా చేశాయని స్థానికులు చెబుతున్నారు. వివరాల్లోకి వెళితే.. పిడుగురాళ్ల వుండలం, జూలకల్లుకు చెందిన దానియేలు, ఏసువురియువ్ము కూలిపనులు చే సేవారు. వీరికి రమేష్(13), రాజేష్ అనే ఇద్దరు కుమారులు. అనారోగ్య కారణంగా దానియేలు, ఏసువురియువ్ము నాలుగేళ్ల కిందట వుృతిచెందారు. రమేష్ గ్రావుంలో ఉన్న మేనత్త వద్ద, రాజేష్ బ్రాహ్మణపల్లిలో ఉంటున్న అవువ్ము, తాతయ్యుల వద్ద పెరుగుతున్నారు. 2010లో వూచవరంలోని సెరుుంట్ ఆన్స్ లయోల ప్రేవు నివాస్ హాస్టల్లో రమేష్ చేరాడు. హాస్టల్లో ఉంటూ జిల్లా పరిషత్ హైస్కూల్లో ఎనిమిదో తరగతి చదువుకుంటున్నాడు. ప్రకాశం జిల్లా, అద్దంకి వుండలం, వేలమూరిపాడు గ్రావూనికి చెందిన గోపనబోరుున సామియేలు, రాహేలు వ్యవసాయు పనులకు వెళ్తూ జీవిస్తున్నారు. వీరికి కువూరులు ఏసుబాబు(11), యోహాన్, వెంకట్, గేషంత్రాజ్. ఆర్థిక ఇబ్బందుల వల్ల పెద్ద కువూరుడు ఏసుబాబు, రెండో కువూరుడు యోహాన్ను వూచవరంలోని సెరుుంట్ఆన్స్ లయోల ప్రేవు నివాస్ హాస్టల్లో 2009లో చేర్చారు. జిల్లా పరిషత్ హైస్కూల్లో ఏసుబాబు 6వ తరగతి చదువుతున్నాడు. తరగతులు వేరైనా ఏసుబాబు, రమేష్‌లు వుధ్య స్నేహబంధం ఏర్పడింది. శనివారం ఉదయుం హైస్కూల్‌కు వెళ్లిన వీరు వుధ్యాహ్నం హాస్టల్‌కు వచ్చి భోంచేశారు. ఇద్దరు స్నేహితులు సరదాగా ఈతకని హైస్కూల్ సమీపంలో ఉన్న కూర వెంకటేశ్వర్లుకు చెందిన వ్యవసాయు బావి వద్దకు వెళ్లారు. ఏసుబాబు, రమేష్ ఈతకొట్టేందుకు బావిలోకి దిగడంతో లోతు ఎక్కువగా ఉండి ప్రవూదవశాత్తు వుునిగిపోయూరు. రాత్రరుునా వారు హాస్టల్‌కు రాకపోవడంతో హాస్టల్ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆదివారం పోలీసులు విచారించగా వ్యవసాయు బావి వద్ద దుస్తులు ఉన్నాయుని తెలిసింది. గజఈతగాళ్లను బావిలోకి దించి విద్యార్థుల మృతదేహాల కోసం గాలింపు చేపట్టారు. నీరుఎక్కువగా ఉండటంతో ఐదు ఆరుుల్ ఇంజిన్ మోటార్లు, అగ్నివూపక సిబ్బంది సాయుంతో నాలుగు గంటలపాటు నీటిని బయుటకు తోడారు. గజఈతగాళ్లు మొదట ఏసుబాబు మృతదేహాన్ని బయుటకు తీశారు. తర్వాత అరగంటపాటు వెతగ్గా రమేష్ వుృతదేహం కూడా లభ్యమైంది. ఈతకెళ్లి ప్రవూదవశాత్తు పడి విద్యార్థులు వుృతిచెందారని, కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ ఆవుల హరిబాబు తెలిపారు. తోటి విద్యార్థులు, హాస్టల్ సిస్టర్స్ ఘటనా స్థలం వద్దకు చేరుకుని విలపించిన తీరు చూపరులను కంటతడి పెట్టించింది. -
రాలిన విద్యా కుసుమాలు
కూలి పనిచేస్తూ చదువుతున్న అజయ్ పెళ్లి పీటలు ఎక్కబోయి పాడెక్కిన హంస చిత్తూరు నగరంలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు దుర్మరణం పాలయ్యారు. విగత జీవులుగా పడి ఉన్న విద్యార్థులను చూసి ఆస్పత్రికి వచ్చిన వారు చలించిపోయారు. వారి తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితులు.. కుటుంబ నేపథ్యం చూస్తే మృత్యువు కూడా ఎందుకు వీరిపై యమపాశాన్ని విసిరామా..? అని కన్నీరు పెట్టకతప్పదు. చిత్తూరు (అర్బన్): యాదమరి మండలం కొట్టాలకు చెందిన శ్రీనివాసులు, కమలమ్మ రెండో కుమారుడు అజయ్ (16). ఊహ తెలిసిన నాటికే నాన్న చనిపోయాడు. నిరుపేద కుటుంబం. ఉండడానికి సొంత ఇళ్లు లేకపోవడంతో బంధువుల ఇంట్లో తలదాచుకుంటున్నారు. తల్లి కూలి పనిచేస్తేనే ఇల్లు గడుస్తుంది. కొట్టాల ప్రభుత్వ పాఠశాలలో 9.2 మార్కులతో పదో తరగతి పాసయిన అజయ్ పెద్దయితే ఇంజనీరయ్యి పేదరికాన్ని జయించాలని ఎంపీసీలో చేరాలనుకున్నాడు. కానీ దానికి డబ్బులు ఎక్కువవుతుందని తెలుసుకుని రాజీపడి సీఈసీ చదవడానికి చిత్తూరు నగరంలోని ఓ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఇక్కడా పేదరికం వెక్కిరించడంతో రెండు నెలలుగా కళాశాల ఫీజు కట్టలేక కూలి పనికి వెళుతూ మంగళవారం రూ.1,500 ఫీజు చెల్లించాడు. బుధవారం మరో రూ.వెయ్యి చెల్లించి హాల్‌టికెట్టు తీసుకోవడానికి కళాశాలకు వచ్చాడు. రూ.200 చెల్లిస్తే కళాశాల వార్షికోత్సవానికి అనుమతిస్తామని యాజమాన్యం చెప్పడంతో వార్షికోత్సవానికి వెళ్లలేక బయట తిరుగుతూ ఉన్నాడు. గురువారం వచ్చి రూ.1,500 చెల్లించి హాల్‌టికెట్టు తీసుకుంటానని స్నేహితులకు చెప్పి బస్టాండులో బస్సు ఎక్కడానికి వెళుతున్నాడు. దీంతో ఒక్కసారిగా వాహనం రూపంలో వచ్చిన మృత్యువు అజయ్‌ను ఢీ కొట్టింది. రక్తస్రావం మధ్య అజయ్‌ను స్థానికులు ఆటోలో ఆస్పత్రికి తీసుకెళుతుండగా. ‘ నేను బతుకుతానా..? మా అమ్మను చూడాలి...’ అంటూనే కళ్లుమూశాడు. ఆస్పత్రిలో నిర్జీవంగా పడివున్న అజయ్ మృతదేహాన్ని చూసిన ఇతని తల్లి గుండెలు పగిలేలా రోదించడం పలువురిని కలచివేసింది. ఇక చిత్తూరు గ్రామీణ మండలం మర్రికుంటకు చెందిన నాగరత్నరాజు, రత్నమ్మ రెండో కుమార్తె హంస (21) నగరంలోని ఓ కళాశాలలో ఎంబీఏ రెండో సంవత్సరం చదువుతోంది. తాను.. తన చదువు.. కొందరు స్నేహితులు తప్ప హంసకు మరే ప్రపంచం తెలియదు. నెల రోజులుగా జ్వరంతో కళాశాలకు వెళ్లని హంస బుధవారం కళాశాకని చెప్పి ఇంటి నుంచి బయలుదేరింది. తిరుపతిలో క్యాంపస్ సెలక్షన్ జరుగుతోందని తెలుసుకుని అక్కడి వెళ్లి ఇంటర్య్వూకు హాజరయ్యి చిత్తూరుకు చేరుకుంది. స్నేహితులతో కలిసి ఊరికి వెళ్లడానికి రైల్వే స్టేషన్ నుంచి నడుచుకుంటూ వస్తూ వ్యాన్ కింద పడి అక్కడిక్కడే మృత్యుఒడికి చేరుకుంది. ‘ ఇన్ని రోజులూ ఇంటి దగ్గరే ఉండి ఈ రోజనంగా కాలేజీకని చెప్పి మమ్మల్ని వదిలివెళ్లిపోయావా చెల్లీ...’ అంటూ మృతురాలి అక్క గీత, ‘నెల రోజుల్లో పెళ్లి పందిరి ఎక్కాల్సిన దానివి పాడె ఎక్కావమ్మా...?’ అంటూ మృతురాలి తండ్రి నాగరత్నరాజు ఆర్తనాదాలు చూస్తూ గుండెలు అవిసేలా రోదించడం చూపరులకు కంటతడి పెట్టించింది. రోడ్డు ప్రమాదం దోషులు పోలీసులే ఈ ప్రమాదానికి కారణమైన వాహనాన్ని నడిపింది గంగాధరనెల్లూరు పోలీసు స్టేషన్లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న పీ.పురుషోత్తం. విషయాన్ని బుధవారం రాత్రి వరకు పోలీసుశాఖ గోప్యంగా ఉచింది. అప్పటికే విషయం బయటకు పొక్కడంతో దిద్దుబాటు చర్యల్లో భాగంగా వాహనం నడిపిన పురుషోత్తంను సస్పెండ్ చేస్తూ ఎస్పీ శ్రీనివాస్ ఆదేశాలు జారీ చేశారు. అయితే ప్రమాదానికి కారణమైన కేఏ 01-బీ 2141 వాహనం ఎర్రచందం తరలించే దొంగల నుంచి సీజ్ చేసిందని కొందరు, రికార్డులు సరిగా లేకపోవడంతో రవాణాశాఖ అధికారులు సీజ్ చేశారని మరికొందరు చెప్పుకుంటున్నారు. పోలీసు స్టేషన్లో నెలల తరబడి కండిషన్లో లేనివాహనాన్ని కానిస్టేబుల్ పురుషోత్తంతో పాటు మరో ఇద్దరు కానిస్టేబుళ్లు చిత్తూరుకు తీసుకొచ్చినట్లు విశ్వశనీయంగా తెలిసింది. పరారీలో ఉన్న కానిస్టేబుల్‌ను అరెస్టు చేయడానికి తూర్పు సీఐ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఓ బృందాన్ని, వాహనం పోలీసు స్టేషన్ నుంచి ఎలా బయటకు వచ్చిందనే విషయాన్ని తెలుసుకోవడానికి విచారణ అధికారిగా ఏఎస్పీ అన్నపూర్ణారెడ్డిని నియమిస్తూ ఎస్పీ ఆదేశాలు జారీ చేశారని చిత్తూరు ట్రాఫిక్ డీఎస్పీ శ్రీకాంత్ పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు రూ.3 లక్షల ఎక్స్‌గ్రేషియా మృతుల కుటుంబాలను జిల్లా కలెక్టర్ సిద్ధార్థ్‌జైన్, ఎస్పీ శ్రీనివాస్ పరామర్శించారు. స్థానిక ప్రభుత్వాస్పత్రిలో ఉన్న హసం, అజయ్ కుటుంబీకులను ఓదార్చారు. గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను పరామర్శించారు. అవసరమైతే వేలూరు, తిరుపతి ఆస్పత్రులకు తరలించి చికిత్స డాక్టర్లను ఆదేశించారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తరపున ఒక్కొక్కరికీ రూ.1.50 చొప్పున ఎక్స్‌గ్రేషియా చెక్కును ఎమ్మెల్యే సత్యప్రభ చేతులుమీదుగా అందజేశారు. -
రోడ్డు ప్రమాదం:ఇద్దరు విద్యార్థుల మృతి
హైదరాబాద్: నగరంలోని చాదర్ ఘాట్ వద్ద గురువారం ఉదయం చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు దుర్మరణం చెందారు. టిప్పర్ ను తప్పించబోయిన ఓ కారు విక్టరీ ప్లే గ్రౌండ్స్ దగ్గర గోడను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. అతి వేగంగా కారును నడపడమే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. ప్రమాదంలో గాయపడిన వారికి ఉస్మానియాకు తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతిచెందిన విద్యార్థులను వరుణ్, నరేందర్ గా పోలీసులు గుర్తించారు.