సాక్షి,ముంబై: భారీ కుంభకోణంతో మల్లగుల్లాలుపడుతున్న పంజాబ్ నేషనల్ బ్యాంకుకు దర్యాప్తు సంస్థ సీబీఐ షాక్ ఇచ్చింది. వేలకోట్ల రూపాయల మెగా స్కాంలో సీబీఐ విచారణ నేపథ్యంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. మోసపూరిత లావాదేవీలుచోటు చేసుకున్న ముంబై బ్రాడీ హౌస్ బ్రాంచుకు సీబీఐ తాళం వేసింది. తదుపరి ఆదేశాలు వరకు అధికారులకు కార్యాలయంలోకి ప్రవేశం లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు పీఎన్‌బీ ముంబై బ్రాంచ్ కార్యాలయం ఎదుట నోటీసులు అతికించింది.
మరోవైపు దేశంలో అతిపెద్ద బ్యాంకు కుంభకోణంలో పీఎన్‌బీ మాజీ డిప్యూటీ జనరల్ మేనేజర్ గోకుల్‌నాథ్ శెట్టి, సింగిల్ విండో క్లర్క్ మనోజ్ కరత్‌లను శనివారం సీబీఐ అరెస్ట్ చేయగా స్పెషల్ కోర్టు వీరిని 14 రోజుల పోలీస్ కస్టడీకి తరలించింది. ఈ విచారణలో నిందితులు భారీ కమిషన్లకు బ్యాంకు సంబంధించిన కీలక పాస్‌వర్డ్‌లను నీరవ్‌మోదీ బృందానికి చేరవేసినట్టు అంగీకరించారు.
Comments
Please login to add a commentAdd a comment