
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి కార్యాలయంలోని ఉన్నతాధికారుల బదిలీలు షురూ అయ్యాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బాధ‍్యతలు స్వీకరించిన అనంతరం సీఎంవో అధికారులపై బదిలీ వేటు పడింది. గత సీఎంకు ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న సతీష్ చంద్ర, ముఖ్య కార‍్యదర్శి సాయి ప్రసాద్, సీఎం కార్యదర్శిలు గిరిజా శంకర్, రాజమౌళిని బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.. వీరంతా సాధారణ పరిపాలనా శాఖకు రిపోర్టు చేయాలని ఆదేశాలు వెలువడ్డాయి. ఒకేసారి నలుగురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. మరోవైపు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అదనపు కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారి ధనుంజయ్ రెడ్డి నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన ఆంధ్రప్రదేశ్ టూరిజం అభివృద్ధి కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు.
సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి :
ముఖ్యమంత్రి అదనపు కార్యదర్శిగా ధనుంజయ్ రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment